
నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో గతంలో ప్రారంభమైన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’. ఈ సినిమాలో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల సన్నివేశాలను శ్రేయాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఎన్‌బీకే థియేటర్‌లో ఈ నెల 24న తిలకించే అవకాశం కల్పిస్తున్నారు బాలకృష్ణ. ఈ చిత్రంలో బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నాం. మరో పౌరాణిక పాత్రలో బాలయ్యని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment