‘నా కొడుకు గే నా’ | Naga Shourya Narthanasala Teaser Out | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 7 2018 6:26 PM | Last Updated on Tue, Aug 7 2018 6:44 PM

Naga Shourya Narthanasala Teaser Out - Sakshi

‘ఛలో’ లాంటి హిట్‌ తరువాత నాగశౌర్య తన సొంత బ్యానర్‌లో చేస్తోన్న సినిమా ‘నర్తనశాల’. లెజెండరీ చిత్రమైన ‘నర్తనశాల’ చిత్రం పేరు నిలబెట్టేలా తమ సినిమా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ ఆద్యంతం వినోద భరితంగా ఉంది.  నాగశౌర్య నటన, కామెడీ డైలాగ్‌లు అన్నీ ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ ఎండింగ్‌లో ‘నా కొడుకు గే నా’ అంటూ శివాజీ రాజా చెప్పే డైలాగ్‌ బాగుంది. ఈ మూవీకి మహతి స్వర సాగర్‌ అందించగా.. కష్మీర పరదేశి, యామిని భాస్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై శంకర్‌ మూల్పూరి, ఉషా మూల్పూరి నిర్మించగా.. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement