
టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్‌లు అందుకున్న నాగశౌర్యకు గత కొంత కాలంగా సరైన హిట్ సినిమా పడలేదు. తాజాగా నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగబలి' టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తున్నంత సేపు ఎంతో ఫన్‌ను పంచుతుంది.
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' సెన్సార్ పూర్తి.. నైజాం రైట్స్ నుంచి తప్పుకున్న దిల్ రాజు)
సగటు కుర్రాడు. బాధ్యత లేకుండా తిరగడం, తండ్రి తిట్లు, తల్లి బాధ, ఫ్రెండ్స్‌తో సరదాలు, గొడవలు ఇలా అన్నీ టీజర్‌లో కనిపించాయి. ‘మన ఊరిలో మనర్నెవడురా ఆపేది’ అనే లోకల్ పాయింట్ అందరినీ మెప్పిస్తుంది. టీజర్‌ను కలర్ ఫుల్ గానే కట్ చేశారు మేకర్స్. పల్లెటూరును లీడ్‌గా తీసుకుని చేస్తున్న సినిమా కాబట్టి యూత్‌ను ఆకట్టుకోవచ్చు. ఈ చిత్రం జూలై 7, 2023న థియేటర్లలోకి రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
(ఇదీ చదవండి: ట్రోలర్స్‌కు ఫోటోలతో కౌంటర్ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ)
Comments
Please login to add a commentAdd a comment