
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ టీజర్ వచ్చేసింది. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న విజయశాంతి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రారంభం అవుతుంది. యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా టీజర్ ఉంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తల్లీకొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ‘యానిమల్’ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం అజనీష్ లోక్‌నాథ్ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment