Somebody are trying to kill me: Karate Kalyani - Sakshi
Sakshi News home page

Karate Kalyani: నన్ను చంపేందుకు ప్లాన్‌ చేశారు.. కరాటే కల్యాణి షాకింగ్‌ కామెంట్స్‌

Published Wed, Jun 7 2023 10:54 AM | Last Updated on Wed, Jun 7 2023 11:25 AM

Some One Will Kill Me Karate Kalyani - Sakshi

ఏదో ఒక విధంగా ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది నటి కరాటే కల్యాణి. గత కొద్ది కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో సంచలనంగా మారిన కళ్యాణి మరో సారి వార్తల్లో నిలిచారు.  ఖమ్మంలో ఏర్పాటు చేయాలనుకున్న దివంగత ఎన్టీఆర్ విగ్రహంపై కరాటే కల్యాణి  చేసిన వ్యాఖ్యల వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని ఇప్పటికే రద్దు చేసింది. తాజాగా ఓ  ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్యాణి తనకు ప్రాణ హాని ఉన్నట్లు  సంచలన వ్యాఖ్యలు చేశారు. 

(ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్‌ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్‌)

ఈ మధ్యనే తన కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని, ఆ విషయాన్ని గమనించకండా అదే కారులో  ప్రయాణించినట్లు తెలిపింది. ఆపై కొంత దూరం వెళ్లిన తర్వాత  కారు టైర్లు పేలిపోయి స్వల్ప ప్రమాదంతో భయటపడినట్లు తెలిపింది. అదే హైవే మీద ప్రయాణించి ఉంటే తన పరిస్థితి వేరేలా ఉండేది అని వాపోయింది.

అనంతరం మెకానిక్‌ వద్దకు వెళ్తే.. ఎవరో కావాలనే కారు టైర్లను కోసేశారని తేలడంతో ఖంగుతిన్నట్లు తెలిపింది. ఖమ్మంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం .. కృష్ణుడి రూపంలో ఉంది అని ఆమె రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. చివరకు కోర్డు నుంచి స్టే కూడా తీసుకువచ్చింది. ఈ కోపంతోనే  ఎవరో కావాలని టైర్లు కోసేసి ఉంటారని ఆమె ఆరోపించింది.
(ఇదీ చదవండి: ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తా, పెళ్లి తిరుపతిలోనే : ప్రభాస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement