
సాక్షి, హైదరాబాద్: సినిమా నటుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న బొమ్మ రాహుల్ అనే బీటెక్ స్టూడెంట్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ అమీర్‌పేట్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ హీరోయిన్ల ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నట్టుగా సీఐడీ గుర్తించి అతడిని పట్టుకుంది. కొంతకాలంగా రాహుల్ ఇలాంటి ఫొటోలను వెబ్ సైట్ లలో పెడుతున్నట్టుగా తేల్చారు. ఈ విషయంపై ఇటీవల స్పందించిన మా అసోషియేషన్ తారల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీఐడీకి ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల నుంచి వెబ్ సైట్లను కొందరు వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన సీఐడీ చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment