morphed pictures
-
హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు : నటి
గురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ రితిక సింగ్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రితిక సింగ్ మెయిన్ లీడ్‌లో ఇన్కార్ అనే తమిళ సినిమాలో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 3నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రితిక సింగ్ మాట్లాడుతూ హీరోయిన్లపై వచ్చే మీమ్స్, ట్రోల్స్‌పై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీకే కాదు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నా ఫోటోలు అలా చూసి నా పేరెంట్స్ ఏమనుకుంటారు? వాళ్ల గుండె బద్దలవుతుంది అలాంటివి చూసినప్పుడు. అందుకే ఇలాంటి చెత్త మీమ్స్, ట్రోల్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం అంటూ రితిక భావోద్వేగానికి లోనైంది. -
మార్ఫ్డ్ చిత్రాలతో.. 100 మంది మహిళలను
న్యూఢిల్లీ: మహిళల సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్ ఫోటోలను డౌన్లోడ్ చేసి.. వాటిని మార్ఫ్ చేసి.. ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోన్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నోయిడాకు చెందిన సుమిత్ ఝా(26) అనే వ్యక్తి మహిళల సోషల్ మీడియా అకౌంట్ నుంచి వారి ప్రొఫైల్ పిక్చర్స్ డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫ్ చేసేవాడు. తర్వాత సేమ్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. ఆ ఫోటోలను సదరు మహిళలకి పంపి.. అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు. ఇలా దాదాపు 100 మహిళలను బ్లాక్మెయిల్ చేశాడు. ఈ క్రమంలో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఓ మహిళను కూడా బెదిరించేందుకు ప్రయత్నించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంతో మిగతా బాధితుల గురించి తెలిసింది. (చదవండి: ఉరితాడు కోసి.. ఊపిరి పోసి) ఈ సందర్భంగా ఓ పోలీసాఫీసర్ మాట్లాడుతూ.. ‘నిందితుడు పోలీసులకు దొరకకుండా ఉండటం కోసం వాట్సాప్ ద్వారా వీఓఐపీ కాల్స్, వేరే యాప్స్ ద్వారా బెదిరింపులకు దిగేవాడు. ఇక సదరు బ్యాంక్ ఎంప్లాయ్ ఫిర్యాదుతో సర్వీస్ ప్రొవైడర్ రిపోర్ట్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సేకరించి నిందితుడిని గుర్తించగలిగాము. మంగళవారం అతడిని అరెస్ట్ చేశాం ’ అని తెలిపారు. ఇక నిందితుడిని గతంలో ఇదే నేరం కింద చత్తీస్‌గఢ్, నోయిడాలో రెండు సార్లు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
21 ఏళ్ల యువతికి ఆరో తరగతి బాలుడి వేధింపులు
లక్నో: పిదప కాలం.. పిదప బుద్ధులు అంటే ఇవే. ఆరో తరగతి చదివే పిల్లాడు.. 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడంటే.. ఏమనుకోవాలి. యువతి మార్ఫ్డ్ చిత్రాలను ఉపయోగించి డబ్బులు ఇవ్వు.. లేదంటే సెక్స్ చాట్ చేయాలంటూ వేధింపులుకు గురి చేస్తున్నాడో పిల్లాడు. ఆ వివరాలు.. ఘజియాబాధ్‌కు చెందిన బాధిత యువతి, సదరు పిల్లాడు విద్యార్థులు క్రియేట్ చేసిన ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో మెంబర్లు. ఈ గ్రూప్‌లో అన్ని వయసులు విద్యార్థులు ఉంటారు. జూనియర్లకు, సీనియర్ విద్యార్థులు అనుమానాలు నివృత్తి చేస్తూ.. బాగా చదువుకునేందుకు సాయం చేస్తూంటారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ పూర్తి చేసి.. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న యువతి ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. 6వ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా ఈ గ్రూప్‌లో మెంబర్.(ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం) అలా ఇద్దరికి పరిచయం. తొలుత పిల్లాడు, బాధిత యువతితో చదువుకు సంబంధించిన విషయాలు చర్చించేవాడు. అలా కొద్ది రోజుల పాటు చదువు గురించి మాట్లాడి మంచి వాడిగా నమ్మకం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న ఉదయం 3.30గంటలకు సదరు పిల్లాడు, యువతి మొబైల్‌కు ఆమె మార్ఫ్డ్ చిత్రాలు పంపించాడు. ఇవి చూసి సదరు యువతి ఒక్కసారిగా బిక్క చచ్చిపోయింది. అంత చిన్న పిల్లాడు ఇలాంటి పాడు పనులు చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. ఈ మెసేజ్ గురించి ఆలోచిస్తుండగానే ఆ పిల్లాడు ఫోన్ చేసి.. ఆమె సోషల్ మీడియా అకౌంట్నుంచి ఫోటోలను తీసుకున్నాని.. తాను అడిగినంత డబ్బైనా ఇవ్వాలి.. లేదా తనతో సెక్స్ చాట్ చేయాలన్నాడు. లేదంటే యువతి మార్ఫ్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. అంతేకాక ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశానని చెప్పాడు. దాంతో భయపడిన యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంది. అనంతరం ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు సదరు పిల్లాడిని పిలిపించి మాట్లాడారు. కానీ వాడిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.(ఆ హీరోయిన్‌కు సైబర్ షాక్) పిల్లాడిని, అతడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించగా.. మెసేజ్‌ల గురించి తనకు ఏం తెలియదని.. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు సదరు సోషల్ మీడియా కంపెనీతో మాట్లాడి యువతి, పిల్లాడి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని పంపాల్సిందిగా కోరారు. సైబర్ టీం ఐపీ అడ్రెస్‌ను ట్రేస్ చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో పోలీసులు చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవద్దని.. ఇచ్చినా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. -
ఆ ఫోటోలు చూసి చనిపోవాలనుకున్న : జయప్రద
లక్నో : ‘అమర్ సింగ్‌ను నా గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్నాను. కానీ జనాలు మాత్రం మా ఇద్దరి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు’ అంటూ ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. క్వీన్స్‌లైన్ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరైన జయప్రద, రచయిత రామ్ కమల్‌తో మాట్లాడుతూ.. ‘సినీ రంగం నుంచి వచ్చాను.. ఎంపీగా గెలిచాను. కానీ సాధరణ మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను నేను ఎదుర్కొంటున్నాను. ఈ రోజు నేను రాజకీయాల్లో ప్రవేశించి.. రాణించగల్గుతున్నానంటే అందుకు కారణం అమర్ సింగ్. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఒకవేళ నేను ఆయనకు రాఖీ కట్టినా జనాలు తప్పుడు ప్రచారం మాత్రం ఆపరు. అందుకే వాటి గురించి పట్టించుకోవడం మానేశాను’ అని తెలిపారు. జయప్రద తొలుత సమాజ్‌వాదీ పార్టీలోనే ఉండేవారు. కానీ విబేధాల కారణంగా ఎస్పీ నుంచి బయటకు వచ్చి ఆమర్ సింగ్‌తో కలిసి ‘రాష్ట్రీయ్ లోక్ మాంచ్ పార్టీ’ స్థాపించారు. అప్పటి నుంచి వీరిద్దరి బంధం గురించి పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ ఎస్పీ నాయకుడు, రామ్‌పుర్ ఎమ్మెల్యే అజామ్ ఖాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తన మీద యాసిడ్ పోస్తానంటూ అజామ్ ఖాన్ తనను బెదిరించారని తెలిపారు. కానీ ఈ బెదిరంపులకు తాను భయపడలేదన్నారు. ఈ విషయం గురించి చెప్తూ ‘నా ప్రాణానికి ప్రమాదం ఉందని నాకు తెలుసు. నేను ఇంటి నుంచి బయటికి వెళితే క్షేమంగా తిరిగి వస్తానో? లేదో కూడా మా అమ్మకు చెప్పలేకపోతున్నాను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు నాకు మద్దతుగా నిలవలేదు. ములాయం సింగ్ కూడా ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేదని విచారం వ్యక్తం చేశారు. అంతేకాక తన ఫోటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రోజున తాను చనిపోవాలని నిర్ణయించకున్నట్లు జయప్రద తెలిపారు. ఆ సమయంలో అమర్‌సింగ్ డయాలసిస్ చికిత్సలో ఉన్నారని, ఏం చేయాలో పాలుపోక తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని చెప్పారు. ఆ సమయంలో ఎవరూ తనకు అండగా నిలవలేదన్నారు. డయాలసిస్ చేయించుకుని తిరిగి వచ్చిన అమర్‌సింగ్ మాత్రమే తనకు చేయూతనిచ్చారని ఆమె వివరించారు. అలాంటి వ్యక్తిని తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్నానని.. అందుకే పనికిమాలిన పుకార్లను పట్టించుకోవడం మానేసానని తెలిపారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో రాజకీయాలనే కాదు ఏ రంగంలోనైనా రాణించడం మహిళలకు నిజంగా ఓ యుద్ధంతో సమానమని ఆమె వర్ణించారు. అంతేకాక ఇటీవలే విడుదలైన మణికర్ణిక సినిమాలో కంగనా పాత్రలో తనను తాను చూసుకున్నానని చెప్పారు. అవసరాన్ని బట్టి ప్రతి మహిళ ఓ దుర్గాదేవిగా మారాలని పిలుపునిచ్చారు. -
సినీ తారల ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్
సాక్షి, హైదరాబాద్: సినిమా నటుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న బొమ్మ రాహుల్ అనే బీటెక్ స్టూడెంట్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ అమీర్‌పేట్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ హీరోయిన్ల ఫొటోలను అప్లోడ్ చేస్తున్నట్టుగా సీఐడీ గుర్తించి అతడిని పట్టుకుంది. కొంతకాలంగా రాహుల్ ఇలాంటి ఫొటోలను వెబ్ సైట్ లలో పెడుతున్నట్టుగా తేల్చారు. ఈ విషయంపై ఇటీవల స్పందించిన మా అసోషియేషన్ తారల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీఐడీకి ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల నుంచి వెబ్ సైట్లను కొందరు వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన సీఐడీ చర్యలు చేపట్టింది. -
అబ్బాయి ఫొటో మార్ఫింగ్.. ఫేస్బుక్లో అసభ్య చిత్రాలు!!
సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి వాళ్ల ఫేస్బుక్ ప్రొఫైళ్లలోను, ఇతర పోర్న్ వెబ్సైట్లలోను అసభ్యంగా పోస్ట్ చేయడం చూస్తుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సరిగ్గా ఇందుకు వ్యతిరేకంగా జరిగింది. తన బోయ్‌ఫ్రెండ్ మీద ప్రతీకారం తీర్చుకోడానికి అతడి ఫొటోను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసిన యువతి.. వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దేవేశ్ శర్మ అనే వ్యక్తి ఇప్పుడిప్పుడే వ్యాపార రంగంలో కాస్త కుదురుకుంటున్నాడు. '20 సమ్‌థింగ్ గాళ్' అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ఓ యువతి అతడికి పరిచయం అయ్యింది. వాళ్లిద్దరూ ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్లు. 23 ఏళ్ల వయసున్న ఆమె సోదరికి తన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చేందుకు కూడా అతడు ఒప్పుకొన్నాడు. తర్వాత బయటకు పార్టీలకు వెళ్దామని అతడిని పిలవసాగింది. ఈలోపు ఆగస్టు మూడోతేదీ.. స్నేహితుల దినోత్సవం వచ్చింది. ఆరోజు బయటకు పార్టీకి వెళ్దామని, తనకు రూ. 4,500 పెట్టి హ్యాండ్‌బ్యాగ్, రూ. 9వేలు పెట్టి మినీస్కర్టు కొనివ్వాలని, అవి వేసుకుని పార్టీకి వస్తానని చెప్పింది. ఇలా మొదలుపెడితే ఇక తన పని అంతేనని అర్థం చేసుకున్న దేవేష్ శర్మ.. ఆమెను కలవకుండా ఊరుకున్నాడు. అప్పటికి వాళ్లు ఒకసారి కూడా కలవలేదు. అయితే ఇంటర్నెట్లోను, ఫోన్లో మాత్రం ఆమె అతడిని పలకరిస్తూనే ఉంది. మళ్లీ ఖరీదైన బహుమతులు అడగడంతో దేవేష్ ఎందుకొచ్చిందని ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆ తర్వాతి రోజు ఏకంగా వంద సార్లు ఫోన్ చేసి, 50 ఎస్ఎంఎస్లు ఇచ్చింది. తన డిమాండ్లను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఎస్ఎంఎస్లలో బెదిరించింది. అయినా దేవేష్ పట్టించుకోలేదు. దాంతో అతడి ఫొటోలను ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి సంగ్రహించి, వాటిని మార్ఫింగ్ చేసి అతడి పేరుమీద తప్పుడు ప్రొఫైల్ సృష్టించి, అందులో అతడి ఫొటోలను అత్యంత అసభ్యంగా పోస్ట్ చేసింది. దాంతోపాటు బూతు వెబ్సైట్లలో కూడా ఆ ఫొటోలను, అతడి ఫోన్ నెంబరును పోస్ట్ చేసింది. దేవేష్ స్వలింగ సంపర్కుడని అందులో రాసింది. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న కుర్రాడు.. చేసేదేమీ లేక సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు ఆమె ఐపీ అడ్రస్‌ను బట్టి ఆమె మానక్నగర్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దాంతో ఆమె దేవేష్కు క్షమాపణ చెప్పి, ఆ ప్రొఫైల్ డిలిట్ చేసింది. ఇలాంటి కేసు ఇదే మొదటిసారని, అబ్బాయిలు కూడా ఇలా ఇబ్బంది పడటం ఇంతకుముందెప్పుడూ లేదని సైబర్ సెల్ పోలీసులు అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)