
గురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ రితిక సింగ్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రితిక సింగ్ మెయిన్ లీడ్‌లో ఇన్‌కార్ అనే తమిళ సినిమాలో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 3నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రితిక సింగ్ మాట్లాడుతూ హీరోయిన్లపై వచ్చే మీమ్స్, ట్రోల్స్‌పై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను.
ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీకే కాదు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నా ఫోటోలు అలా చూసి నా పేరెంట్స్ ఏమనుకుంటారు? వాళ్ల గుండె బద్దలవుతుంది అలాంటివి చూసినప్పుడు. అందుకే ఇలాంటి చెత్త మీమ్స్, ట్రోల్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం అంటూ రితిక భావోద్వేగానికి లోనైంది.
Comments
Please login to add a commentAdd a comment