‘మా’లో హేమప్రాథమిక సభ్యత్వం సస్పెన్షన్‌ | Hema Suspended From MAA Association | Sakshi

‘మా’లో హేమప్రాథమిక సభ్యత్వం సస్పెన్షన్‌

Jun 7 2024 1:18 AM | Updated on Jun 7 2024 1:18 AM

Hema Suspended From MAA Association

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ఆమెప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసింది. హేమ సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసే విషయమై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ΄్యానెల్‌ సభ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారట. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ‘మా’ కార్యదర్శి రఘుబాబు ఓ లేఖ విడుదల చేశారు.

మే నెలలో బెంగళూరు రేవ్‌ పార్టీలో హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసుల నివేదికలో నిర్ధారణ కావడంతో ‘మా’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు ‘మా’ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె నుంచి స్పందన లేకపోవడంతో సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నట్లు, విచారణ తేలేవరకూ ఈ సస్పెన్షన్‌ కొనసాగుతుందన్నట్లు హేమకు ‘మా’ లేఖ పంపినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement