బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ కూడా ఉందంటూ తొలుత ఆమె పేరు బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన హేమ.. తూచ్, అంతా అబద్ధం, నేను హైదరాబాద్‌లో ఉన్నానని వీడియో రిలీజ్ చేసింది. అంతలోనే బెంగళూరు పోలీసులు తన ఫోటో మీడియాకు వదిలారు. అయినా ఒప్పుకోలేదు, ఇంట్లో బిర్యానీ వండుతున్నట్లు మరో వీడియో బయటకు వదిలింది.
ఎవరినీ క్షమించేది లేదని..
నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు శాంపిల్ టెస్ట్‌లో హేమ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోయింది. హేమ వ్యవహారంపై నటి కరాటే కల్యాణి తీవ్రస్థాయిలో స్పందించింది. 'సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ వాడినా.. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎవరినీ క్షమించొద్దని మా అధ్యక్షుడు మంచు విష్ణు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సూచించారు. తమవైపు పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
గొడవలు..
ఇంతలోనే హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని వార్తలు వచ్చాయి. రేవ్ పార్టీలో తన పేరు వినిపించగానే ఏంటక్కా, ఇది నిజమేనా? అని మెసేజ్ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో శివబాలాజీని కొరకడం.. రాజేంద్రప్రసాద్‌గారిని అడ్డగించడం, నా మీద కూడా కేసు పెట్టి ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటుంది. నేను సరదాగా పేకాట ఆడితే ఎవరో ఇరికించారు. అయినా దీన్ని పెద్ద తప్పన్నట్లుగా హడావుడి చేసిన ఈమెకు దేవుడు వెంటనే శిక్ష వేశాడు.
తన గోతి తనే తీసుకుంది
ఇప్పుడామె చేసిందే తప్పుడు పని.. తప్పుడు ప్లేస్‌లో దొరికి మళ్లీ బుకాయించడం దేనికి? హైదరాబాద్‌లో ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ సెల్ఫీ వీడియో తీసి పోలీసులను, మీడియాను తప్పుదోవ పట్టించావు. ఇది ఇంకో కేసు. నీ పాపులారిటీ ఇంకా తప్పుగా వాడుకుంటున్నావు. నీ గోయి నువ్వే తీసుకున్నావు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
చదవండి: డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment