హేమకు వైద్య పరీక్షలు.. అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి! | Tollywood Actress Hema Attended Medical Tests In Burkha | Sakshi
Sakshi News home page

Hema: హేమకు వైద్య పరీక్షలు.. అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి!

Published Mon, Jun 3 2024 8:36 PM | Last Updated on Mon, Jun 3 2024 8:55 PM

Tollywood Actress Hema Attended Medical Tests In Burkha

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ హేమను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలోనే ఆమెకు పాజిటివ్‌ రావడంతో పోలీసులు నోటీసులిచ్చారు. మొదటిసారి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు.  హేమకు పోలీసులు రెండోసారి నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులిచ్చారు. దీంతో ఇవాళ సీసీబీ పోలీసుల ఎదుట ఆమె హాజరయ్యారు. విచారణ పూర్తయిన అనంతరం హేమను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అనంతరం హేమకు ప్రభుత్వాస్పత్రిలో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షలకు హేమ బురఖా ధరించి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ కేసులో హేమను రేపు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచనున్నారు. రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 



అసలేం జరిగిందంటే..

బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్‌ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్‌ ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్నారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్‌, మహ్మద్‌ సిద్ధిఖి, వాసు, అరుణ్‌కుమార్‌, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement