సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ నటి హేమ కూడా ఈ పార్టీలో భాగమైందని వార్తలు వైరలవుతుండటంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేసింది.
చదవండి: Payal Rajput: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు
బెంగళూరులో రేవ్‌పార్టీ కలకలం.. పట్టుబడ్డ టాలీవుడ్ ప్రముఖులు!
Comments
Please login to add a commentAdd a comment