Arjun Sarja Complaints To MAA President Manchu Vishnu On Vishwak Sen, Deets Inside - Sakshi
Sakshi News home page

Vishwak Sen- Arjun Sarja Controversy: విశ్వక్‌ సేన్‌పై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు అర్జున్‌ సర్జా ఫిర్యాదు?

Published Mon, Nov 7 2022 1:44 PM | Last Updated on Mon, Nov 7 2022 3:21 PM

Arjun Sarja Complaints To MAA President Manchu Vishnu On Vishwak Sen - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌-యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. విశ్వక్‌ సేన్‌ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్‌ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన కూతురిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్‌ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. అర్జున్‌ డైరెక్షన్‌లో రెండు షెడ్యూళ్ల షూటింగ్‌ కూడా పూర్తయ్యింది.

చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత

ఇలాంటి సమయంలో విశ్వక్‌ ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అర్జున్‌ సీరియస్‌ అయ్యాడు. షూటింగ్‌కి సమయానికి రాకుండా ఇబ్బందులు పెట్టాడని, విశ్వక్‌ కమిట్‌మెంట్ లేని యాక్టర్ అంటూ అర్జున్‌ ఫైర్‌ అయ్యాడు. అయితే అర్జున్‌ ఆరోపణలపై విశ్వక్‌ సేన్‌ సైతం స్పందించాడు. రాజయోగం టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న విశ్వక్‌ షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని ఒక్క లైట్ బాయ్ చెప్పిన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: చిక్కుల్లో షారుక్‌ చిత్రం, డైరెక్టర్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు

అంతేకాదు ఇందులో తన తప్పు ఉంటే క్షమించండి అర్జున్‌ సర్‌ అంటూ చివరిలో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్‌పై ‘మా’ అసోసియేషన్‌లో తాజాగా అర్జున్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వక్ సేన్ ప్రవర్తన సరిగా లేదని, షూటింగ్ సమయంలో ఇబ్బంది పెట్టాడని, తనను, తన యూనిట్‌ణి అవమానించాడంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణుకి ఫిర్యాదు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. కానీ, దీనిపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడు, విశ్వక్‌ సేన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనున్నాడనేది ఆసక్తిని సంతరించుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement