ఈ ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సినీ ఇండస్ట్రీనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసింది. జనరల్ ఎలక్షన్స్ తలపించే విధంగా మా ఎన్నికలు వాడివేడిగా జరిగాయి. ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ అంటూనే ప్రత్యక్ష ఆరోపణలకు తెరదీశారు. ఇక అధ్యక్ష పదవికి పోటీ పడ్డ ప్రకాశ్ రాజ్, మంచు విష‍్ణుల మధ్య జరిగిన మాటల యుద్దం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి ఈ ఎన్నికలో మంచు విష్ణు గెలిచి మా అధ్యక్ష పీటాన్ని కైవసం చేసుకున్నాడు.
చదవండి: ఘనంగా ప్రారంభమైన విశ్వక్ సేన్-అర్జున్ మూవీ, క్లాప్ కొట్టిన పవన్
దీంతో ప్రకాశ్ రాజ్‌తో సహా అతడి ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు మా అసోసియేషన్‌కు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎదురు పడిని దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరు ఒకే ఫ్రేంలో కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా యాక్షన్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్, ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లుగా రాబోతున్న మూవీ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యాక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హజరై హీరోహీరోయిన్ల తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టాడు.
చదవండి: హమ్మయ్యా.. షూటింగ్ పూర్తయింది: పూజా హెగ్డే
అయితే పవన్ కల్యాణ్‌తో పాటు ఈ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు కూడా హజరైనట్లు తెలుస్తుంది. ఈ మూవీ లాంచింగ్ వేడుకలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎదురుపడి మాట్లాడుకుంటున్న ఫొటో బయటకు వచ్చింది. వారి మధ్యలో హీరో విశ్వక్ సేన్ కూడా కనిపించాడు. అయితే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు సీరియస్‌గా ఎదో మాట్లాడుకోవడం చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె గురించే వీరిద్దరు చర్చించుకుంటున్నారా? అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment