మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రెసిండెంట్, నటుడు మంచు విష్ణు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య విరాక నలుగురు పిల్లలతో కలిసి సోమవారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా మొక్కులు చెల్లించుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు వారిని ఆశ్వీర్వాదించిన స్వామివారి తీర్థాప్రసాదాలు అందజేశారు.
అలాగే మరో హీరో విశ్వక్‌సేన్ కూడా నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించని ‘దాస్ కా ధమ్కీ’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ స్వామివారిని దర్శించుకున్నట్లు విశ్వక్ మీడియాతో పేర్కొన్నాడు. ఈ మూవీ విశ్వక్ సేన్ తొలిసారి మెగాఫోన్ పట్టాడు. తానే దర్శకత్వం వహించిన నటించిన ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment