
మంచు విష్ణు (Vishnu Manchu) హిట్ అందుకుని చాలాకాలమే అయింది. ఈసారి హిట్ కాదు ఏకంగా బ్లాక్‌బస్టర్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు. అందుకోసం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie)ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇందులో మంచు విష్ణు కన్నప్పగా నటించాడు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్‌బాబు నిర్మించాడు. అక్షయ్‌కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుటుంబ నియంత్రణ?
దీంతో ప్రమోషన్స్ షురూ చేశాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడికి కుటుంబ నియంత్రణ గురించి ప్రశ్న ఎదురైంది. అందుకు మంచు విష్ణు స్పందిస్తూ.. అది వ్యక్తిగత అభిప్రాయం. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నాకు నలుగురు పిల్లలున్నారు. ఇంకా పిల్లలు కావాలన్నాను. దానికి నా భార్య విరానిక (Viranica Manchu) అలాగైతే వేరొకరిని వెతుక్కుపో.. అంది.
విరానిక బెదిరింపులు
అయితే సరేనన్నాను. అవునా.. అయితే వెతికి చూడు అని విరానిక బెదిరించింది.. అందుకే ఆగిపోయాను అన్నాడు మంచు విష్ణు. విష్ణు.. 2009లో విరానికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2011లో కవలలు జన్మించారు. వారికి అరియానా, వివియానా అని నామకరణం చేశారు. 2018లో కుమారుడు అవ్రమ్ పుట్టాడు. 2019లో కూతురు ఐరా జన్మించింది. కన్నప్ప సినిమాలో అవ్రమ్.. బాల తిన్నడు/కన్నప్పగా నటించాడు.
చదవండి: మొదటి భార్యకు విడాకులు.. దేవదాసులా తాగుడుకు బానిసయ్యా..: హీరో
Comments
Please login to add a commentAdd a comment