
మంచు విష్ణు కెరీర్‌లో ‘ఢీ’ సినిమాది ప్రత్యేకమైన స్థానం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్ తదితరులు నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.
కొంతకాలంగా ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతుంది. గతంలో సూపర్ హిట్ అందుకున్న చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ థియేటర్స్‌లలో సందడి చేసింది. ఇప్పుడు ఢీ సినిమాను మార్చి 28 రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ సమయంలో పెద్ద సినిమాలు ఉండటంతో వాటిని ఢీ కొట్టగలదా అనే సందేహాలు ఉన్నాయి.

మార్చి 28 రెండు కొత్త సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. నితిన్ ‘రాబిన్ హుడ్’ విడుదల కోసం మైత్రి మూవీస్ భారీ స్కెచ్ వేసి ఉంది. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అదే సమయంలో ‘మ్యాడ్ స్క్వేర్’ రంగంలోకి దిగుతుంది. సితార బ్యానర్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. మార్చి 27న విక్రమ్ ‘వీరధీర శూర పార్ట్ 2’ విడుదల కానుంది. అదే తేదీన మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ విడుదల కానుంది. ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి బజ్ ఉంది. ఇలాంటి సమయంలో 'ఢీ' కొట్టడం చాలా కష్టం అని నెట్టింట అభిమానులు చర్చించుకుంటున్నారు. మరో తేదీ చూసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి కలెక్షన్స్ తప్పకుండా రాబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment