DEE
-
ఇరిగేషన్ డీఈఈ బలవన్మరణం
నవీపేట: ఆర్మూర్ ఇరిగేషన్ డీఈఈ జోరుపల్లి వెంకట రమణారావు (47) నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం మండలంలోని పోతంగల్ గ్రామంలో తల్లిదండ్రులను కలిసి బయటకు వెళ్లిన డీఈఈ శుక్రవారం గోదావరి నదిలో శవమై కనిపించారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. నిజామాబాద్‌లోని మారుతి నగర్లో వెంకట రమణారావు.. భార్య చందన, కూతురు మనస్వినిలతో కలిసి నివాసముంటున్నారు. ఆర్నెల్ల కిందట కూతురు చదువు కోసం నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చారు. మనస్విని ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రెండ్రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన రమణారావు తల్లిదండ్రులు చంద్రకళ, గంగాధర్‌రావు, తమ్ముడు మధుకర్‌రావుతో కాసేపు మాట్లాడి నిజామాబాద్ వెళ్తానని చెప్పి తన మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. అదే రోజు రాత్రి యంచ శివారులోని గోదావరి నది బ్రిడ్జి దగ్గరకు వెళ్లారు. అక్కడే వాహనాన్ని నిలిపి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అన్నయ్యకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోందని, ఆయన ఆచూకీ కనిపించడం లేదని మధుకర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నదిలో మృతదేహం దొరికిందంటూ యంచ గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లు శుక్రవారం పోలీసులకు సమాచారమందించారు. ఆ మృతదేహాన్ని రమణారావుగా గుర్తించారు. 11 నెలల నుంచి సెలవులో... నిజామాబాద్ డివిజన్లో డీఈఈగా పని చేసిన రమణారావు రెండేళ్ల కిందట ఆర్మూర్ డీఈఈగా బదిలీపై వెళ్లారు. దీనికంటే ముందే ఆయన కామారెడ్డి జిల్లాకు వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఆర్మూర్‌లో ఓ కీలక ప్రజాప్రతినిధి బలవంతంగా సంతకాలు పెట్టించినట్లు రమణారావు గతంలోనే పలువురి వద్ద వాపోయినట్లు తెలిసింది. ఆయన 11 నెలల నుంచి సెలవులో ఉన్నారు. హైదరాబాద్‌కు మకాం మార్చడంతో కామారెడ్డికి కాకుండా హైదరాబాద్‌కు బదిలీ కోసం ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తాను చదువుకున్న రోజుల్లో రూమ్మేట్ అయిన మంత్రి హరీశ్‌రావును కూడా ఈ విషయమై కలిసినట్లు తెలిసింది. రమణారావు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమీప బంధువు. ఆమె భర్త అనిల్‌కు బాబాయ్ వరుస అవుతారు. రమణారావు అంత్యక్రియల్లో జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కవిత భర్త అనిల్, మామ రాంకిషన్‌రావు పాల్గొన్నారు. బదిలీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. -
డీఈఈ.. లంచావతారం
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్) : పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖలో డీఈఈగా విధులు నిర్వర్తిస్తున్న రవికాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలో చెరువుల్లో మట్టి తరలింపు వ్యవహారంపై ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేన స్థానిక ఇరిగేషన్ శాఖ ఈఈ రవికుమార్‌ను 15రోజలు క్రితమే ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన రవికాంత్ రెండు వారాలకే చేతివాటం ప్రదర్శించాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిప కాంట్రాక్టర్ కావటి రాజు ఇటీవల మిషన్‌కాకతీయలో రూ.కోటి పనులు చేశాడు. రెండేళ్ల కాలంలో రూ.60 లక్షల మేరకు బిల్లులు తీసుకున్న రాజుకు ఇరిగేషన్‌శాఖ నుంచి మరో రూ.30 లక్షలు రావాల్సి ఉంది. వీటికోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరగగా ఇరిగేషన్ డీఈఈ రవికాంత్ రూ.లక్ష డిమాండ్ చేయడంతో చివరికి ఏసీబీని ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు. పథకం ప్రకారం రూ.లక్ష ఏకకాలంలో చెల్లిస్తే సదరు అధికారికి అనుమానం కలుగుతుందని రాజు తనవద్ద రూ.80 వేలు ఉన్నాయంటూ శుక్రవారం మధ్యాహ్నం అధికారి వద్దకు వెళ్లాడు. అయితే బిల్లు చెల్లింపునకు ఒకే చెప్పిన డీఈఈ రవికాంత్ తన సొంత డ్రైవర్ రాజుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా సైగా చేశాడు. దీంతో బాధితుడు డ్రైవర్ రాజుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని డీఈఈ రవికాంత్‌తో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఈసందర్భంగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య మాట్లాడుతూ ఈనెల 8న కాంట్రాక్టర్ రాజు తమకు ఫిర్యాదు చేశాడని, విచారణ పూర్తిచేసి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే నిఘా ఏర్పాటు చేసి రవికాంత్‌ను పట్టుకున్నామన్నారు. నిందితులను ఏసీబీ కోర్టులో శనివారం హాజరుపరుస్తామని పేర్కొన్నారు. దాడిలో సీఐలు సంజీవ్, వేణుగోపాల్, రాములు తదితరులు పాల్గొన్నారు. నరకం చూశాకే ఏసీబీని కలిశా.. కొన్నేళ్లుగా కాంట్రాక్టరుగా పనిచేస్తున్నా. నా పేరు, నా భార్య పేరుతో నిబంధనల మేరకు కాంట్రాక్టు పనులు పూర్తి చేశా. అయినా బిల్లు చెల్లించడానికి అధికారులు నానా రకాలుగా బాధలకు గురిచేశారు. బిల్లు కోసం తిరిగితిరిగి నరకం చూశా. ఇచ్చిన కాడికి తీసుకుంటే ఎవరికీ బాధ ఉండేది కాదు. డిమాండ్ చేయడం వల్లే విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించా. – కావటి రాజు, ఓదెల మండలం డ్రైవర్ రాజు, పక్కన డీఈఈ రవికాంత్ సీఐలతో మాట్లాడుతున్న డీఎస్పీ భద్రయ్య -
డీఈఈ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ర్యాంక్
కదిరి అర్బన్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఈ) ఫలితాల్లో ఉర్దూ మీడియం విభాగంలో కదిరి పట్టణానికి చెందిన మదనపల్లి ముస్కాన్ 74 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచింది. ఈమె ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీయట్ ఎంహెచ్సీ గ్రూపులో 1000 మార్కులకు 918 సాధించింది. ముస్కాన్ తండ్రి ఇర్షాద్ బీడీ కార్మికుడు. ఈయనకు ముగ్గురు కూతుర్లు. పెద్దకూతురు ఆలియాజ్ గతేడాది ఉర్దూమీడియం డీఈఈ ఫలితాల్లో స్టేట్ 2వ ర్యాంకు సాధించి కర్నూలోని డైట్ కళాశాలలో ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తోంది. పట్టుదలతో విద్యార్థినులు చదివి స్టేట్‌ర్యాంకులు సాధించారు. -
అక్రమార్జనలో రారాజు
విశాఖ క్రైం: మున్సిపాలిటీలో వెలుగులు నింపాల్సిన ఆ అధికారి అవినీతి మురుగులో పీకల్లోతున కూరుకుపోయాడు. ఉద్యోగంలో చేరింది మొదలు... అందినకాడికి వెనకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగడంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టేశాడు. ఎట్టకేలకు పాపం పండడంతో అక్రమార్జనలో రారాజుగా వెలుగొందిన శ్రీకాకుళం మున్సిపాలిటీ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజుతోపాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పది చోట్ల ఏకకాలంలో సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు వెనకేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర వెల్లడించారు. గుర్తించిన అక్రమాస్తులివీ... విశాఖ నగర పరిధిలోని సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్స్న్ దరి పాపాహోం సమీపంలో గల ఆర్.ఆర్.రెసిడెన్సీలోని ప్లాట్ నెంబర్ 302లో శ్రీనివాసరాజు నివాసముంటున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి పలు అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామంలో ఎక్కువగా శ్రీనివాసరాజు భూమి కొనుగోలు చేశారు. తొలిసారిగా ఈ గ్రామంలో 6.82 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు.∙అదే గ్రామంలో 7.2 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తల్లి జి.స్వరాజ్యం పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 417/1, 418/1లో 3.19 ఎకరాలు భూమి కోనుగోలు చేశారు.\∙ అదే గ్రామంలో తండ్రి జి.కృష్ణంరాజు పేరు మీద సర్వే నెంబర్ 417/2, 449/2లలో వ్యవసాయ భూమి 2.69 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాస రాజు మామయ్య వి.నారాయణరాజు పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 416/1లో 2.49ఎకరాల వ్యవసాయ భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో సర్వే నెంబర్ 416/52, 416/3, 417 – 1,418 లో 4.71 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాసరాజు అత్తమ్మ వి.వరలక్ష్మి పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 887/1, 887/2లో 3.6ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నర్శింహపురం గ్రామంలో భార్య పేరిట సర్వే నెంబర్ 75/2లో 697.44 గజాల స్థలం. అదే గ్రామంలోని సర్వే నెంబర్ 75/2లో ఖాళీ స్ధలం 7.20 ఎకరాలను కుమార్తె జి.మౌనిక పేరు మీద కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరాం గ్రామంలో భార్య రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 487/1, 487/2, 487/2బిలలో 697.44 గజాల స్థలం. విశాఖ జిల్లా అడవివరం గ్రామంలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 275 / 30 – ఎలో 183 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అలాగే శ్రీనివాస రాజు రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బంగారమే బంగారం శ్రీనివాసరాజు ఇంటిలో సోదాల సమయంలో 423.3గ్రాముల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అక్కయ్యపాలెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని లాకర్లో భార్య పేరు మీద 151.78గ్రాములు బంగారు వస్తువులు, డాబాగార్డెన్స్‌లో గల బ్యాంకు ఆఫ్ ఇండియాలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద లాకర్లో 221.970 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 795 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు గుర్తించారు. 1548 గ్రాముల వెంటి వస్తువులు లభ్యమయ్యాయి. అదేవిధంగా నగదు రూ.12 లక్షల 27వేలు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.5లక్షల 45 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం ధర ప్రకారం రూ.1.64కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ మాత్రం రూ.30 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. సర్వీసులో 25 ఏళ్లకుపైగా జీవీఎంసీలోనే అవినీతి ఊబిలో కూరుకుపోయిన శ్రీనివాసరాజు తన సర్వీసులో ఎక్కువ కాలంలో జీవీఎంసీలోనే తిష్ట వేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ మళ్లీ వెంటనే వెనక్కు వచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని వెంప గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు జీవీఎంసీలో 1988లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. అనంతరం 2000వ సంవత్సరంలో ఏఈగా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి 2012 వరకు జీవీఎంసీలో ఏఈగా పనిచేశారు. 2012లో బొబ్బిలి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. అక్కడ 18 నెలలు పని చేసి మళ్లీ ఏఈగా జీవీఎంసీకి బదిలీపై వచ్చారు. అనంతరం 2017çలో ఉద్యోగోన్నతి రావడంతో శ్రీకాకుళం మున్సిపాలిటీకి డీఈఈగా వెళ్లారు. అయితే జీవీఎంసీలో పనిచేసిన కాలంలో కొందరు అధికారులతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధితో కలిసి బినామీల పేరున భారీగా పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బినామీల గుట్టు విప్పేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
అక్రమార్జనలో రారాజు
సాక్షి, విశాఖ క్రైం : మున్సిపాలిటీలో వెలుగులు నింపాల్సిన ఆ అధికారి అవినీతి మురుగులో పీకల్లోతున కూరుకుపోయాడు. ఉద్యోగంలో చేరింది మొదలు... అందినకాడికి వెనకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగడంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టేశాడు. ఎట్టకేలకు పాపం పండడంతో అక్రమార్జనలో రారాజుగా వెలుగొందిన శ్రీకాకుళం మున్సిపాలిటీ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజుతోపాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకకాలంలో సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు వెనకేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర వెల్లడించారు. బంగారమే బంగారం శ్రీనివాసరాజు ఇంటిలో సోదాల సమయంలో 423.3గ్రాముల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అక్కయ్యపాలెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని లాకర్లో భార్య పేరు మీద 151.78గ్రాములు బంగారు వస్తువులు, డాబాగార్డెన్స్‌లో గల బ్యాంకు ఆఫ్ ఇండియాలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద లాకర్లో 221.970 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 795 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు గుర్తించారు. 1548 గ్రాముల వెంటి వస్తువులు లభ్యమయ్యాయి. అదేవిధంగా నగదు రూ.12 లక్షల 27వేలు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.5లక్షల 45 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం ధర ప్రకారం రూ.1.64కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ మాత్రం రూ.30 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. గుర్తించిన అక్రమాస్తులివీ... విశాఖ నగర పరిధిలోని సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్స్న్ దరి పాపాహోం సమీపంలో గల ఆర్.ఆర్.రెసిడెన్సీలోని ప్లాట్ నెంబర్ 302లో శ్రీనివాసరాజు నివాసముంటున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామంలో ఎక్కువగా శ్రీనివాసరాజు భూమి కొనుగోలు చేశారు. తొలిసారిగా ఈ గ్రామంలో 6.82 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అదే గ్రామంలో 7.2 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తల్లి జి.స్వరాజ్యం పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 417/1, 418/1లో 3.19 ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో తండ్రి జి.కృష్ణంరాజు పేరు మీద సర్వే నెంబర్ 417/2, 449/2లలో వ్యవసాయ భూమి 2.69 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాస రాజు మామయ్య వి.నారాయణరాజు పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 416/1లో 2.49ఎకరాల వ్యవసాయ భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో సర్వే నెంబర్ 416/52, 416/3, 417 – 1,418 లో 4.71 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాసరాజు అత్తమ్మ వి.వరలక్ష్మి పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 887/1, 887/2లో 3.6ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నర్శింహపురం గ్రామంలో భార్య పేరిట సర్వే నెంబర్ 75/2లో 697.44 గజాల స్థలం. అదే గ్రామంలోని సర్వే నెంబర్ 75/2లో ఖాళీ స్ధలం 7.20 ఎకరాలను కుమార్తె జి.మౌనిక పేరు మీద కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరాం గ్రామంలో భార్య రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 487/1, 487/2, 487/2బిలలో 697.44 గజాల స్థలం. విశాఖ జిల్లా అడవివరం గ్రామంలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 275 / 30 – ఎలో 183 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అలాగే శ్రీనివాస రాజు రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సర్వీసులో 25 ఏళ్లకుపైగా జీవీఎంసీలోనే అవినీతి ఊబిలో కూరుకుపోయిన శ్రీనివాసరాజు తన సర్వీసులో ఎక్కువ కాలంలో జీవీఎంసీలోనే తిష్ట వేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ మళ్లీ వెంటనే వెనక్కు వచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని వెంప గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు జీవీఎంసీలో 1988లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. అనంతరం 2000వ సంవత్సరంలో ఏఈగా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి 2012 వరకు జీవీఎంసీలో ఏఈగా పనిచేశారు. 2012లో బొబ్బిలి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. అక్కడ 18 నెలలు పని చేసి మళ్లీ ఏఈగా జీవీఎంసీకి బదిలీపై వచ్చారు. అనంతరం 2017లో ఉద్యోగోన్నతి రావడంతో శ్రీకాకుళం మున్సిపాలిటీకి డీఈఈగా వెళ్లారు. అయితే జీవీఎంసీలో పనిచేసిన కాలంలో కొందరు అధికారులతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధితో కలిసి బినామీల పేరున భారీగా పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బినామీల గుట్టు విప్పేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
ట్రైబల్ వెల్ఫేర్ డీఈఈ ఇంటిపై ఏసీబీ దాడి
శ్రీకాకుళం: జిల్లాలోని సీతంపేట ఐ.టి.డి.ఏ పరిధిలోని పాతపట్నం ట్రైబల్ వెల్ఫేర్ డీఈఈ బలివాడ కృష్ణకుమార్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళంలోని ఆయన స్వగృహంలో, సీతంపేట కార్యాలయంలో, రాజాంలోని ఆయన బంధువుల ఇంట్లో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏకకాలంలో ఆరుచోట్ల అధికారులు తనిఖీలు చేశారు. రూ.2 లక్షల నగదు, రాజాంలో 9 ప్లాట్లు, వైజాగ్‌లో 1 ఫ్లాట్‌ను గుర్తించారు. -
డీఈఈసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకు 432 మంది హాజరు
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో డీఈఈసెట్–2016లో అర్హత సాధించి డీఎడ్ కోర్సుల్లో చేరే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. 432 మంది సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఆన్లైన్లో నిర్దేశించిన ఫీజులు చెల్లించిన తరువాత కళాశాల అడ్మిషన్ లేఖలు అందజేసినట్టు ప్రిన్సిపాల్ జయప్రకాశరావు తెలిపారు. -
జీహెచ్ఎంసీ డీఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: నగరంలోని 12వ సర్కిల్ డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న పీర్సింగ్ ఇంట్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామునే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నారు. నగరంలో మాదాపూర్, శ్రీసాయినగర్లతో పాటు 12 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ గోడలు.. ఈ కిటికీలు చూడు..
* 4 రోజులకే కూలితే ఎవరు బాధ్యత వహిస్తారు.. * డీఈఈపై ఎంపీ సీతారాంనాయక్ ఆగ్రహం * సస్పెండ్ చేస్తే గానీ పరిస్థితిలో మార్పురాదని హెచ్చరిక ఏటూరునాగారం : ఆ గోడలకు పగళ్లు ఏంటి... ఈ కిటికీలకు సందులు ఏంటి అని అధికారులపై మహబూబాబాద్ ఎంపీ సీరియస్ అయ్యారు. ములుగు నియోజకవర్గంలో సోమవారం ఆయన రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌తో కలిసి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరశీలించడంతోపాటు ప్రారంభించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఉప కార్యనిర్వాహక ఇంజనీరు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన భవనాన్ని చూసి అవాక్కయ్యూరు. నాణ్యత లోపంతో చేపట్టిన పనులకు సంబంధించి డీఈఈ సత్యనారాయణపై మండిపడ్డారు. నూతనంగా నిర్మించిన భవనం నాలుగు రోజులకే కూలితే ఎవరు బాధ్యత వహిస్తారని డీఈని ప్రశ్నించారు. కార్యాలయం నుంచి వెనుదిరిగి పోతుం డగా అధికారులు బతిమాలాడి మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌ను లోనికి పిలుచుకురావడం గమనార్హం. దీనికి సంబంధించి బిల్లులు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, ఈఈ గోపాల్‌రావు, డీఈఈ సత్యనారాయణ, ఏఈఈ భద్రం, జేఈఈ పాల్గొన్నారు. అదేవిధంగా ములుగు మండలం జాకారం పరిధిలో ఐటీడీఏ నిధులతో నిర్మించిన బాలికల బయోమెట్రిక్ నూతన భవనాన్ని మంత్రి చందూలాల్‌తో పాటు ఎంపీ సీతారాం నాయక్ ప్రారంభించారు. ఓ గదిలో ఏర్పాటు చేసిన కిటికీల మధ్య అధికంగా ఖాళీ ప్రాంతం ఎక్కువ ఉండడాన్ని గమనించిన ఎంపీ ఐటీడీఏ ఏఈ రాంరెడ్డిపై ఫైర్ అయ్యూరు. ఏఈ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కలెక్టర్‌తో మాట్లాడమని ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావును సీతారాం నాయక్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులు ప్రభుత్వానికి అవసరం లేదని, ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చని నాయక్ ఈ సందర్భంగా అన్నారు. సస్పెండ్ చేస్తే గానీ అధికారుల తీరులో మార్పు రాదని పేర్కొన్నారు. ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణం పూర్తయినా నిరుద్యోగులకు శిక్షణా కార్యక్రమాలను చేపట్టకుండా ఎందుకు కాలం గడుపుతున్నారని ఐటీడీఏ ఏపీఓ వసంతరావును ఎంపీ ప్రశ్నించారు. భవనం పూర్తయి నెలలు గడుస్తున్నా... ఇప్పటివరకు నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి సరైన సామగ్రిని ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో శిక్షణ ఇవ్వడానికి కావలసిన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
హౌసింగ్ డీఈఈ ఆస్తులు కోట్లలో..
సామర్లకోట హౌసింగ్ కార్యాలయంలో డీఈఈగా పని చేస్తున్న పల్లా నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. కాకినాడలోని ఆయన ఇంట్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఉభయ గోదావరి, హైదరాబాద్‌లో ఉన్న ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :గృహనిర్మాణ సంస్థలో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. కాకినాడకు చెందిన పల్లా నాగేశ్వర రావు సామర్లకోట హౌసింగ్ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆయనపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఉభయ గోదావరి, హైదరాబాద్‌లలోని ఆయన కుటుంబ సభ్యు లు, బంధువులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. వెదికే కొద్దీ ఆస్తులు బయటపడుతుండడంతో ఏసీబీ అధికారులు సైతం విస్మయానికి గురవుతున్నారు. కాకినాడలోని నాగేశ్వరరావు నివాసంలోనే సుమారు రూ. ఐదు కోట్ల ఆస్తులు ఏసీబీ అధికారులకు చిక్కాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లతో పాటు, బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎన్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలాఉన్నాయి. కాకినాడ శశికాంత్‌నగర్‌లోని శ్రీదేవి అపార్ట్మెంట్ బీ-1 ఫ్లాట్‌లోని అతని నివాసంలో మంగళవారం నిర్వహించిన దాడులలో రూ. 3.50 లక్షల నగదు, 3.5 కేజీల వెండి, 3.5 లక్షల విలువైన ఎల్ఐసీ బాండ్లు, ఎనిమిది స్థలాలకు సంబంధించిన పత్రాలు, 13 ఎకరాల పొలాల డాక్యుమెంట్లు, 770 గ్రాముల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. గొల్లబాబు అనే కాంట్రాక్టర్‌తో రూ. 50 లక్షల కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. దీంతో గొల్లబాబు ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వరరావు, అతడి తండ్రి పల్లా సత్యానందం బ్యాంకు లాకర్లను ఇంకా పరిశీలించాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. భీమవరం, కత్తిపూడి, ఏలూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో వీరికి స్థలాలు కూడా ఉన్నాయని గుర్తించారు. నాగేశ్వరరావు తమ్ముడు పల్లా ఏసుబాబు నివాసంలో, ఇతర కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు ఏసీబీ డీఎస్పీలు, సీఐలు దాడులలో పాల్గొన్నారు. హౌసింగ్ డీఈఈ పల్లా నాగేశ్వరరావు ఆస్తులపై ఏసీబీ దాడుల వ్యవహారం గృహనిర్మాణ సంస్థ వర్గాలలో కలకలం రేపింది. ఆయనతో సన్నిహితంగా ఉండే ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. తమపై కూడా ఏసీబీ దాడులు జరుగుతాయనే అనుమానంతో వారు అప్రమత్తం అయ్యారు. కాకినాడ, సామర్లకోటల్లోని హౌసింగ్ కార్యాలయాల సిబ్బంది, పలువురు కాంట్రాక్టర్లు కూడా కలవరానికి గురవుతున్నారు. తనిఖీలు మరో రెండురోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.