
కదిరి అర్బన్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఈ) ఫలితాల్లో ఉర్దూ మీడియం విభాగంలో కదిరి పట్టణానికి చెందిన మదనపల్లి ముస్కాన్ 74 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచింది. ఈమె ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీయట్ ఎంహెచ్‌సీ గ్రూపులో 1000 మార్కులకు 918 సాధించింది. ముస్కాన్ తండ్రి ఇర్షాద్ బీడీ కార్మికుడు. ఈయనకు ముగ్గురు కూతుర్లు. పెద్దకూతురు ఆలియాజ్ గతేడాది ఉర్దూమీడియం డీఈఈ ఫలితాల్లో స్టేట్ 2వ ర్యాంకు సాధించి కర్నూలోని డైట్ కళాశాలలో ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తోంది. పట్టుదలతో విద్యార్థినులు చదివి స్టేట్‌ర్యాంకులు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment