urdu medium
-
మైనారిటీ డిక్లరేషన్ అమలేది?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ‘మైనారిటీ డిక్లరేషన్’ఎప్పుడు అమలు చేస్తారని మైనారిటీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మైనారిటీల సంక్షేమం, అభివద్ధికి ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్ అమలు చేస్తుందని ప్రకటించింది. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీడబ్యుసీ సభ్యులు నాసీర్, షకీల్ అహ్మద్, కర్ణాటక మంత్రి జమీరుద్దీన్ అహ్మద్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీతో కలిసి హైదరాబాద్‌లో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మైనారిటీలపై హమీల వర్షం గుప్పించారు. అధికారంలోకి వచ్చి సరిగ్గా 11 నెలలు దాటినా.. ఏ ఒక్కటి కూడా ఊసెత్తక పోవడంతో మైనారిటీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ⇒ మైనారిటీ సంక్షేమ బడ్జెట్ రూ.4,000 కోట్లకు పెంచుతామని ప్రకటించినా.. మొదటి ఏడాది 2024–25లో కేవలం రూ. 3,003 కోట్లకు పరిమితమైంది. ⇒ నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడానికి సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తామని డిక్లరేషన్‌లో వెల్లడించినా మొత్తం బడ్జెట్లోనే వాటా కేవలం రూ.432 కోట్లకు పరిమితమైంది. ⇒ అబ్దుల్ కలాం తౌఫా–ఎ–తలీమ్ పథకం కింద ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ యువతకు అందించాల్సిన ఆర్థికసాయం కాగితాలకు పరిమితమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ ఉర్దూ డీఎస్సీ ప్రకటించండి కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ హమీ మేరకు ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ–2024లో ఉర్దూ మీడియానికి మొత్తం 1,183 పోస్టులు కేటాయించినా, ఎస్సీ, ఎస్టీ ఇతరత్రా రిజర్వేషన్ కేటగిరి కారణంగా అర్హులైన అభ్యర్ధుల లేక సుమారు 666 పోస్టులు భర్తీకి నోచుకోలేదని విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఎప్పటి మాదిరిగానే ఈసారి డీఎస్సీలో కూడా ఉర్దూ మీడియం రిక్రూట్మెంట్లో సగానికి పైగా పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పడిపోయాయి. ప్రభుత్వం డీఎస్సీలు నిర్వహిస్తున్నా, ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఖాళీల భర్తీ మాత్రం పూర్తిస్థాయిలో జరగడం లేదన్న విమర్శలు వ్యక్తవుతున్నాయి. దీంతో ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ పోస్టులన్నింటిని డీ–రిజర్వేషన్ ద్వారా ఓపెన్ కేటగిరీ కింద చేర్చి, ఖాళీలతో కలిపి స్పెషల్ డీఎస్సీ తక్షణమే ప్రకటించాలంటున్నారు. మరోవైపు డీఎస్సీ–2024 మెరిట్ అభ్యర్ధులు మాత్రం రెండవ జాబితా ప్రకటించి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు రవీంద్రభారతిలో అవార్డుల అందజేత భారతరత్న, తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబు ల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఉర్దూ అకాడమీ, టెమ్రీస్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో జరగనున్న మైనారిటీ సంక్షేమ దినోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ నేషనల్ అవార్డు 2019– 2023, మగ్దూమ్ అవార్డు–2024, లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021–23 లను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాల్గొంటారు. పెండింగ్‌లో గౌరవ వేతనాలు డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా మసీదుల ఇమామ్, మౌజమ్‌లు, దర్గాల ఖాదీమ్‌లు, చర్చిల పాస్టర్ల గౌరవ వేతనాల పెంపు సంగతేమోగానీ ...వేతనాల పెండెన్సీ పెరిగిపోతుందని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని ఇమామ్, మౌజమ్‌లు డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్‌బోర్డు పరిరక్షణ, ఆక్రమణకు గురైన ఆస్తుల స్వా«దీనం, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి కేటాయిస్తామన్న హాదమీ కనీసం ప్రణాళికలను కూడా నోచుకోలేదు. -
తొలి ముస్లిం మహిళా న్యూరోసర్జన్.. ‘హైదరాబాదీ’ విజయగాథ !
భారతదేశంలో ముస్లిం సముదాయం నుంచి తొలి మహిళా న్యూరోసర్జన్ అయిన ఘనత డాక్టర్ మరియమ్ హఫిఫా అన్సారీకి దక్కింది. ఆమె హైదరాబాదీ కావడంతో తెలంగాణకు కూడా ఈ ఖ్యాతి దక్కినట్లే. పదవ తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదివిన హఫిఫా ఆ తర్వాత నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనసాగించి అనేక రికార్డులు సాధించింది. ‘ఆడపిల్లలు తాము అనుకున్నది సాధించేవరకు ఓటమి అంగీకరించవద్దు’ అంటున్న హఫిఫా గురించి... కొన్ని అద్భుతాలు మన పక్కనే జరుగుతుంటాయి. అయితే అవి వినమ్రంగా ఉండటం వల్ల కూడా మనకు తెలియవు. చిన్న గెలుపుకు ఆకాశమంత ఆర్భాటం చేస్తారు కొందరు. పర్వాతాన్ని పిండి కింద కొట్టినా మెదలకుండా ఉంటారు మరి కొందరు. 28 ఏళ్ల మరియమ్ హఫిఫా అన్సారీకి తను సాధించిన విజయం పట్ల చాలా వినమ్రత ఉంది. ఎందుకంటే ఆమె అది తన గెలుపుగా భావించక ‘అల్లా మియా ఇచ్చిన కానుక’ అంటుంది కనుక. అదే ఆమె ఘనత డాక్టర్ మరియమ్ హఫిఫా అన్సారీ మన హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో న్యూరోసర్జరీ రెసిడెంట్‌గా ఉంది. న్యూరో సర్జరీ విభాగంలో చురుగ్గా పని చేస్తూ ఉంది. త్వరలో ఆమె పూర్తిస్థాయి న్యూరో సర్జన్‌గా విధులు నిర్వహించనుంది. అయితే ఏమిటి ఘనత అంటారా? భారతదేశంలో ముస్లింలలో న్యూరోసర్జన్ అయిన తొలి మహిళ మరియమ్ హఫిఫా. సాధారణంగా మహిళా డాక్టర్లు పిడియాట్రిషియన్లుగా, గైనకాలజిస్టులుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను ఎంచుకుంటారు. ఇతర ముఖ్య విభాగాలను ఎంచుకున్నా న్యూరోసర్జరీలోకి ప్రవేశించేవారు తక్కువ. ముస్లింలలో అసలు లేరు. ఆ అడ్డంకిని దాటి న్యూరోసర్జన్ అయ్యింది మరియమ్ హఫిఫా. తప్పు అని నిరూపించండి ‘ఆడపిల్లలు అది చేయలేరు.. ఇది చేయలేరు అని కొందరు విమర్శిస్తుంటారు. ఆడపిల్లలు వెనక్కి తగ్గకూడదు. అలా అనేవారి మాటలు తప్పు అని నిరూపించేలా విజయాలు సాధించాలి’ అంటుంది హఫిఫా. పెయింటింగ్‌లో హఫిఫాకు అభిరుచి ఉంది. కాలిగ్రఫీని కూడా సాధన చేస్తోంది. సర్జరీ చేస్తున్న హఫిఫా ఫొటోను షేర్ చేసి ‘భారతదేశపు తొలి ముస్లిం మహిళా న్యూరోసర్జన్’ అని గర్వపడింది ఆమె సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలోని ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎం.ఎస్.ఓ). కాని ఆమె ఆ ఘనత సాధించిందంతా ఇక్కడే కనుక నిజంగా గర్వపడాల్సింది తెలంగాణనే. ఉర్దూ మీడియమ్‌లో చదివి హఫిఫా మరియంది మహారాష్ట్రలోని మాలేగావ్. అక్కడే ఏడవ తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదువుకుంది. తల్లి ఉర్దూ టీచర్. ఆమె సింగిల్ పేరెంట్‌గా తన కుమార్తెను పెంచడానికి సిద్ధపడి హైదరాబాద్ వలస వచ్చింది. ఇక్కడే పదోతరగతి వరకూ మళ్లీ ఉర్దూ మీడియంలోనే చదివి టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది హఫిఫా. చిన్నప్పటి నుంచి డాక్టర్ కానీ, సైంటిస్ట్ కాని కావాలని ఆమె కల. నెమ్మదిగా సైంటిస్ట్‌ను పక్కన పెట్టి డాక్టర్ కలను గట్టిగా పట్టుకుంది. ‘నా ఒంటి మీద తెల్లకోటు, మెడలో స్టెతస్కోపు ఉండాలి. నన్ను అందరూ డాక్టర్ హఫిఫా అని పిలవాలి అనుకున్నాను’ అంటుందామె. కాని మెడిసిన్ చదివించే స్తోమత లేదు. బాగా చదువుకుంటే తప్ప ఉచిత సీటు రాదు. దాంతోపాటు ఉర్దూ మీడియంలో చదవడం వల్ల ఇప్పుడు ఇంగ్లిష్ మీడియమ్‌కు అలవాటు పడాలి. అందుకే రేయింబవళ్లు చదివేది హఫిఫా. టెన్త్ అయ్యాక హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థుల ఎంట్రన్స్ కోసం టాలెంట్ టెస్ట్ పెడితే టాపర్‌గా వచ్చింది హఫిఫా. దాంతో ఒక కాలేజీ వాళ్లు ఇంటర్లో ఫ్రీ సీట్ ఇచ్చారు. ఆ తర్వాత మెడికల్ ఎంట్రన్స్‌లో ఏకంగా 99వ ర్యాంకు సాధించింది. ఉస్మానియాలో ఎం.బి.బి.ఎస్. చదివింది. ఎం.బి.బి.ఎస్.లో ఆమెకు ఐదు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఆ తర్వాత ‘పోస్ట్ జనరల్ సర్జరీ’లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఎఫ్.ఆర్.సి.ఎస్. (లండన్) పూర్తి చేసింది. 2020లో మళ్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ రాసి 137వ ర్యాంకు సాధించి ‘న్యూరోసర్జరీ’ విభాగాన్ని తీసుకుంది. చదవండి: Lotus: నీటి తొట్లలో తామరల పెంపకం.. ధర 300 నుంచి 4 వేల వరకు! నెలకు 50 వేల దాకా మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ! ఈ పూలు వాడిపోవు.. ఆమె హాబీ.. ఆదాయ వనరుగా ఎలా మారిందంటే! -
హవ్వా.. స్కావెంజర్ పర్యవేక్షణలో పరీక్షలా..!
సాక్షి, బిచ్కుంద (జుక్కల్): ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగుపర్చి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం నిండా నిర్లక్ష్యం కనిపిస్తోంది. బిచ్కుందలోని ఉర్దూ మీడియం హైస్కూల్లో మంగళవారం పదో తరగతి విద్యార్ధులకు విద్యా నైపుణ్యం పెంచడానికి నెలవారీ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పర్వవేక్షణలో నిర్వహించాల్సి ఉండగా ఉదయం 11గంటలైనా ఒక్క ఉపాధ్యాయుడు రాలేదు. దీంతో స్కావెంజర్ ముజ్జు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు అందించి పరీక్ష నిర్వహించారు. పాఠశాలలో ముగ్గురు రెగ్యులర్, ముగ్గురు వీవీలు ఉండగా ఒక్కరు కూడా పాఠశాలకు రాకపోవడంతో స్కావెంజరే పరీక్ష నిర్వహించాడు. దీనిని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. పాఠశాల మరుగుదొడ్లు, తరగతి గదులను స్కావెంజర్ శుభ్రం చేయాలి. నీటివసతి కల్పించాల్సి ఉంటుంది. కాని తమకు ఆలస్యమవుతుందని ఉపాధ్యాయులు ఫోన్ చేసి పరీక్ష ప్రశ్నపత్రాలు ఇచ్చి పరీక్ష నిర్వహించాలని ఆదేశించడంతో పరీక్ష నిర్వహించానని స్కావెంజర్ ముజ్జు తెలిపారు. తల్లిదండ్రులు ఫిర్యాదు కోసం ఎంఈవో కార్యాలయానికి వెళ్లినప్పటికీ అక్కడ ఫిర్యాదు తీసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు రాకపోవడం స్కావెంజర్ పరీక్ష నిర్వహించడంపై ఎంఈవో రాములు నా యక్‌ను వివరణ కోరగా విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
వారు ఉర్దూ మీడియం కోరుతున్నారు: అవంతి
సాక్షి, అమరావతి: తెలుగు, ఉర్దూ భాషల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్బంగా రెండవ అధికార భాషగా ఉర్దూ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ... టీడీపీ హయాంలో అధికార భాష సంఘాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. దీనికి సాహిత్యవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను చైర్మన్‌గా, పలువురు భాషావేత్తలను సభ్యులుగా నియమించారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే అయిదు జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తున్నట్లు మంత్రి అవంతి తెలిపారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా ఉర్దూ మీడియంను కోరుతున్నారని.. కాబట్టి అక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉర్దూ మీడియం అమలును పరిశీలిస్తామని వెల్లడించారు. -
డీఈఈ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ర్యాంక్
కదిరి అర్బన్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఈ) ఫలితాల్లో ఉర్దూ మీడియం విభాగంలో కదిరి పట్టణానికి చెందిన మదనపల్లి ముస్కాన్ 74 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచింది. ఈమె ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీయట్ ఎంహెచ్సీ గ్రూపులో 1000 మార్కులకు 918 సాధించింది. ముస్కాన్ తండ్రి ఇర్షాద్ బీడీ కార్మికుడు. ఈయనకు ముగ్గురు కూతుర్లు. పెద్దకూతురు ఆలియాజ్ గతేడాది ఉర్దూమీడియం డీఈఈ ఫలితాల్లో స్టేట్ 2వ ర్యాంకు సాధించి కర్నూలోని డైట్ కళాశాలలో ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తోంది. పట్టుదలతో విద్యార్థినులు చదివి స్టేట్‌ర్యాంకులు సాధించారు. -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, సిటీబ్యూరో: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మజ్లిస్ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో శనివారం ఉర్దూ మీడియం విద్యార్థినిలకు ప్రతిభా పురస్కారాలు, పదవ తరగతి పరీక్ష ఫీజు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో విద్యతోనే అన్ని రంగాలు ముడిపడియున్నాయని, విద్యను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. బాలల కంటే బాలికలే అత్యధికంగా ప్రతిభ కనబర్చుతారని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో రాణించాలనే తపనకలిగిన ప్రతిభావంతులకు సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ టాపర్లుగా నిలిచిన 556 మంది విద్యార్ధులకు నగదు అవార్డులు అందజేశారు. నగరంలోని 86 ఉర్దూ మీడియం పాఠశాలకు సంబంధించి 2024 మంది విద్యార్థినిలకు పదవతరగతి పరీక్ష ఫీజును అందజేశారు. అదేవిధంగా ఎస్ఎస్సీలో వంద శాతం ఫలితాలు సాధించిన మూడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పాషాఖాద్రీ, ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, జాఫర్ హుస్సేన్, మౌజం ఖాన్, మొహీయెద్దీన్, బలాల, ఎమ్మెల్సీలు జాఫ్రీ, రజ్వీ తదితరులు పాల్గొన్నారు. -
తరగతులు పది.. టీచర్లు ముగ్గురే!
ఘట్కేసర్ టౌన్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతామని చెబుతున్న అధికారులు, ప్ర జాప్రతినిధుల మాటలు నీటిమూటలవుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించక పోవడంతో పేదల చదువుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పాఠాలు బోధించేవారు లే క విద్యార్థులు టీసీలను తీసుకొని ఇతర పాఠశాలల్లోకి వెళ్తున్నారు. అయినా విద్యాధికారుల్లో చలనం రావడం లేదు. ఒకే భవనంలో బోధన... ఘట్కేసర్ పట్టణం బాలాజీనగర్‌లోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను 2012లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేసినా ఒకే భవనంలో విద్యను బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 46 మంది, ఉన్నత పాఠశాలలో 34మంది కలిపి మొత్తం 80 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పదో తరగతిలో 9 మంది విద్యార్థులున్నారు. ఈడబ్ల్యూఎస్ కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయురాలు సురేఖ ప్రస్తుతం ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. హైస్కూలుగా ప్రమోట్ చేసినా ప్రైమరీ, హైస్కూల్ తరగతులు ఒకే భవనంలో నిర్వహించడంతో విద్యార్థులు, టీచర్లకు అగమ్యగోచరంగా ఉంది. ప్రాథమిక పాఠశాల రెగ్యులర్ టీచర్‌గా ఒకరు పనిచేస్తుండగా మూడు రోజుల క్రితం నారపల్లి నుంచి ఒక టీచర్ డిప్యూటేషన్‌పై వచ్చారు. ఇలా మొత్తం పది తరగతులకు ముగ్గురే టీచర్లు ఉన్నారు. అన్ని తరగతులకు వీరే బోధిం చడం సాధ్యం కాక విద్యార్థుల చదువు ముందుకు సాగడం లేదు. అనివార్య పరిస్థితుల్లో టీచర్లు రాకుంటే అంతే సంగతులు. ఉర్దూ మీడియం స్కూల్‌ను 2012లో అప్‌గ్రేడ్ చేసిన సర్కారు ఉపాధ్యాయులను మాత్రం ఇప్పటికీ కేటాయించలేదు. ఉర్దూ మీ డియం పాఠశాల కావడంతో ఐదో తరగతి ఉత్తీర్ణులు కాగానే విద్యార్థులు ఆరో తరగతికి ఆంగ్ల మాధ్యమం పాఠశాలలకు వెళ్తుండడంతో వారి సంఖ్య కూడా తగ్గుతోంది. -
కంకకర్ర విరిగేదాకా కొట్టిండ్రు
సాక్షి, కరీంనగర్: ‘నిజాం నింకుశపాలనలో రజాకార్ల మూక లు అకృత్యాలకు పాల్పడుతున్న రోజులవి. రజాకార్ల ఆగడాలను చూసి చలించిపోయాను. వాటికి వ్యతిరేకంగా పోరాడాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అప్పటికే తెలంగాణ సాయుధపోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. ఉద్యమకారుల స్ఫూర్తి, నిబద్ధత నన్ను కూడా అటువైపు ఆకర్షించాయి. దళాలకు కొరియర్‌గా పనిచేస్తూ సాయుధపోరాటంలో ముందున్నాను* అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. నా విద్యాభ్యాసం ఆలస్యంగా మొదలయ్యింది. మావాళ్లు నన్ను పదేళ్ల వయస్సులో బడిలో చేర్పించారు. ఉర్దూ మీడియంలో 7వ తరగతిలో ప్రవేశించడంతోనే చదువు ఆగిపోయింది. తండ్రి తాటిచెట్టు మీద నుంచిపడడంతో ఆయనకు బదులు గీతవృత్తి చేపట్టవలసి వచ్చింది. 1947లో ప్రైవేటు ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించాను. అదే సమయం లో వెట్టిచాకిరీ, బానిసత్వానికి వ్యతిరేకంగా సాయుధపోరా టం మొదలైంది. ఆ సమయంలో ఉద్యమంలోకి ప్రవేశించా ను. వెట్టి ఆపడం, కంట్రోలు నూలు చేనేత పనివారికి ఇప్పిం చడం, ఊరి పొలిమెరల్లో రజాకార్ల జాడలను పసిగట్టడం లాంటి పనులు చేసేవాళ్లం. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి మా సొంత గ్రామం. ఒకరోజు ఊరి పోలీసుపటేల్ ఒడ్డెర అతన్ని కోడిపిల్లకోసం కంకకర్ర విరిగేవరకు కొట్టడం ఆవేదన కలిగించింది. ఇలాంటి వాటిని ఎదుర్కోవాలనిపించింది. రేగొండకు పోయి సంఘం మేర మల్లేశం అనే సంఘం ఆర్గనైజర్‌ను కలిశాం. ఆయన చేప్పినట్టు వంద మంది యువకులను సమీకరించి ఊళ్లో ర్యాలీ తీశాం. వెట్టికి వ్యతిరేకంగా మాట్లాడాం. వెట్టి, అంటరానితనం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించాం. 1948 ఫిబ్రవరిలో గ్రామం నుంచి రైతులు పోలంపల్లిలో అనభేరి ప్రభాకర్‌రావు దళాన్ని కలిసేందుకు వెళ్తుంటే మేం కూడా పోయినం. ఆ రాత్రి ప్రభాకరరావుకు సాయుధపోరాటాల గురించి వివరించారు. దళానికి కొరియర్‌గా పని చేయాలని చెప్పారు. కొన్ని గ్రామాల భాద్యతలు ఇచ్చారు. ఆయా గ్రామాల్లో తిరిగి వివరాలు సేకరించడం, దళానికి చేరవేయడం నా పని. అలా 1948 వరకు కొరియర్‌గా వ్యవహరించాను. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం తరువాత కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతూ అనేక పోరాటాల్లో పాల్గొన్నాను. ప్రజాజీవితంలో వివిధ పదవులను బాధ్యతగా నిర్వహించాను. ఇది కొనసాగింపు... మలిదశ తెలంగాణ ఉద్యమం ఈ పోరాటానికి కొనసాగింపు. తెలంగాణ, ఆంధ్ర విలీనం సమయంలో జరిగిన షరతులు తర్వాత ఉల్లంఘించబడ్డాయి. అందుకే మలిదశ ఉద్యమ ప్రారంభంలో కీలకపాత్ర పోషించాను. తెలంగాణ ప్రాంత భూములు అమ్మరాదు, కొనరాదు అని షరతు ఉన్నా అమలు చేయలేదు. హైదరాబాద్ చుట్టు భూములు రియల్ ఎస్టేట్లు చేసి అమ్మేసుకున్నారు. 57 ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి పద్నాలుగేళ్లు కూడా ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ఒక్కరు కూడా ఐదేళ్ల పదవి పూర్తి చేసుకోలేదు. పీవీ.నర్సింహారావునయితే రాష్ట్రపతి పాలనపెట్టి దింపేశారు. ఉద్యోగాలు కొల్లగొట్టారు. విభజనతో సీమాంధ్ర బాగుపడుతుంది. అక్కడా ఇక్కడా అభివృద్ధి జరుగుతుంది. గుంటూరులోనో, విజయవాడలోనో రాజధాని వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్నారు. నిధులు తరలించుకుపోవడం తప్ప చేసిందేమీలేదు. నగరంలో 120 చేరువులు కుంటలు మాయం చేసి రియల్ వ్యాపారం చేశారు. కేంద్రం ముందుకొచ్చింది. ఇప్పుడు సీమాంధ్రులు అడ్డుపడడం సరికాదు. హైదరాబాద్ గురించి భయం అవసరం లేదు. ఇతర రాష్ట్రాల వాళ్లు బతుకుతున్నట్టు, మా పిల్లలు ఇతర ప్రాంతాల్లో బతుకుతన్నట్టే సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఉండవచ్చు. విడిపోవడానికి అంగీకరించకపోతే సెప్టెంబర్ 17 పునరావృతం కావచ్చు.