సాక్షి, అమరావతి: తెలుగు, ఉర్దూ భాషల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్బంగా రెండవ అధికార భాషగా ఉర్దూ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ... టీడీపీ హయాంలో అధికార భాష సంఘాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. దీనికి సాహిత్యవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను చైర్మన్‌గా, పలువురు భాషావేత్తలను సభ్యులుగా నియమించారని పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో ఇప్పటికే అయిదు జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తున్నట్లు మంత్రి అవంతి తెలిపారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా ఉర్దూ మీడియంను కోరుతున్నారని.. కాబట్టి అక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉర్దూ మీడియం అమలును పరిశీలిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment