
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా (Kannappa Movie) మరోసారి వాయిదా పడింది. వీఎఫ్‌ఎక్స్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందని విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించాడు. చెప్పిన సమయానికి రావడం లేదని, అందుకు మన్నించాలని కోరాడు. 'అత్యున్నత విలువలతో కన్నప్ప సినిమాను మీ ముందుకు తీసుకురావాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం.
త్వరలో కొత్త రిలీజ్ డేట్..
అయితే కొన్ని కీలక సన్నివేశాలకు ఇంకా వీఎఫ్‌ఎక్స్ చేయాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఫలితంగా సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుంది. మీరందరూ పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. శివ భక్తుడైన కన్నప్ప సినిమా చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ విశేషంగా కృషి చేస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని ఓ నోట్ షేర్ చేశాడు.
సినిమా
కన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు శివ భక్తుడు కన్నప్పగా నటించాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా యాక్ట్ చేశారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించారు. నిజానికి గతేడాది డిసెంబర్‌లో కన్నప్ప రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పుష్ప 2 ఆగమనంతో వెనకడుగు వేసి మార్చికి రిలీజ్ చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అనుకున్న సమయానికి రాలేమంటూ మరోమారు వాయిదా వేశారు.
My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq
— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025