విశ్వంభర.. రామరామ సాంగ్‌ ప్రోమో చూశారా? | Raama Raama Song Promo Out from Chiranjeevi Starrer Vishwambhara Movie | Sakshi
Sakshi News home page

Vishwambhara Movie: విశ్వంభర నుంచి భక్తి పాట.. ప్రోమో చూశారా?

Published Fri, Apr 11 2025 11:38 AM | Last Updated on Fri, Apr 11 2025 12:06 PM

Raama Raama Song Promo Out from Chiranjeevi Starrer Vishwambhara Movie

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా రామ రామ పాట ప్రోమో విడుదలైంది. చిరంజీవి నోటి నుంచి వచ్చిన జై శ్రీరామ్‌ నినాదంతో పాట మొదలవుతుంది. ఇందులో బాల హనుమాన్‌లు ముందు నడుచుకుంటూ వస్తుంటే అందులో ఒకరిని చిరు తన భుజాలపై ఎత్తుకుని నడుస్తున్నాడు. ప్రోమో అయితే అదిరిపోయింది. పూర్తి పాటను హనుమాన్‌ జయంతి (ఏప్రిల్‌ 12) రోజు ఉదయం 11.12 గంటలకు విడుదల చేయనున్నారు.

అప్పుడే ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌..
కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. శంకర్‌ మహదేవన్‌, లిప్సిక ఆలపించారు. ఫుల్‌ సాంగ్‌ వినాలంటే రేపటివరకు ఆగాల్సిందే! విశ్వంభర విషయానికి వస్తే.. ఆంజనేయ స్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్రిష, ఆషిక రంగనాథ్‌ హీరోయిన్లుగా, కునాల్‌ కపూర్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. వాసుదేవ్‌ డైలాగ్స్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని జూలై 24న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

 

చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement