
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మదరాసి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్స్ . శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో శివ కార్తికేయన్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది.
‘‘హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘మదరాసి’. ఈ మూవీలో సరికొత్త ఎగ్జయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నారు మురుగదాస్’’ అని యూనిట్ పేర్కొంది. విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమేరా: సుదీప్ ఎలామోన్.