మృణాల్ అనుకుంటే రుక్మిణి బంపరాఫర్ పట్టేసింది! | Rukmini Vasanth In Sivakarthikeyan And Murugadoss Movie, Director Revealed His Thoughts On Choosing Her For SK23 - Sakshi
Sakshi News home page

Rukmini Vasanth In SK23: కన్నడ బ్యూటీ.. మరో రష్మిక అవుతుందా?

Published Fri, Feb 16 2024 3:55 PM | Last Updated on Fri, Feb 16 2024 4:09 PM

Rukmini Vasanth In Sivakarthikeyan And Murugadoss Movie - Sakshi

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరి దశ తిరుగుతుందో అస్సలు చెప్పలేం. అలా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లక్ మారేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ప్లానింగ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్-హీరో కాంబోతో కలిసి నటించేందుకు ఓకే చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

(ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

'సప్త సాగరాలు దాటి' సినిమాతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన భామ రుక్మిణి వసంత్. గతేడాది రెండు పార్టులుగా రిలీజైన ఈ సినిమాలో రుక్మిణి యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే తెలుగు నుంచి కూడా బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ వేటికి ఓకే చెప్పకుండా ఒక్కో అడుగు ఆచితూచి వేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా శివకార్తికేయన్ కొత్త మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎందుకంటే తొలుత ఈ సినిమాలో పూజాహెగ్డే లేదా మృణాల్ ఠాకుర్ హీరోయిన్లుగా నటిస్తారనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రుక్మిణి బంపరాఫర్ కొట్టేసింది. ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఈ బ్యూటీ ఓ సినిమా చేస్తోంది. తెలుగు నుంచి ఆఫర్స్ వస్తున్నా సరే ఏ మాత్రం తొందరపడకుండా మూవీస్ చేయాలని చూస్తోంది. ఈమె ప్లానింగ్ చూస్తున్న నెటిజన్స్.. మరో రష్మిక అవుతుందని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement