సౌత్‌ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్న సల్మాన్‌ ఖాన్‌! | Salman Khan Cameo In Sivakarthikeyan's Movie | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ గెస్ట్‌ రోల్‌! ఏ హీరో సినిమాలో అంటే?

Published Fri, Jun 7 2024 10:24 AM | Last Updated on Fri, Jun 7 2024 10:45 AM

Salman Khan Cameo In Sivakarthikeyan's Movie

బాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారిస్తున్నారు. జాకీష్రాఫ్‌, సంజయ్‌దత్, బాబీ డియోల్‌ వంటి స్టార్‌ నటులు దక్షిణాదిలో విలన్‌గా లేదంటే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కూడా దక్షిణాది తెరపై మెరవబోతున్నట్లు ఓవార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఓ తమిళ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాక్‌.

దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ తన 23వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు  బిజుమీనన్, తుపాకీ చిత్రం ఫేమ్‌ విద్యుత్‌ జమ్వాల్‌ ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీ లక్ష్మీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ హిందీలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా సిఖిందర్‌ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే సల్లూభాయ్‌ను తమిళంలో శివకార్తికేయన్‌తో చేస్తున్న చిత్రంలో అతిథి పాత్రలో నటింపజేస్తున్నట్లు టాక్‌. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.

చదవండి: ‘సత్యభామ’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement