టాప్‌ డైరెక్టర్‌తో శివకార్తికేయన్‌.. హీరోయిన్‌గా సీతారామం బ్యూటీ! | Sivakarthikeyan, Mrunal Thakur Join Hands with AR Murugadoss | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: టాప్‌ డైరెక్టర్‌తో శివకార్తికేయన్‌.. హీరోయిన్‌గా సీతారామం బ్యూటీ!

Published Sun, Jun 25 2023 7:02 AM | Last Updated on Sun, Jun 25 2023 7:02 AM

Sivakarthikeyan, Mrunal Thakur Join Hands with AR Murugadoss - Sakshi

కోలీవుడ్‌లో వేగంగా ఎదిగిన హీరో శివకార్తికేయన్‌. ప్రారంభంలో కీర్తిసురేష్‌, ఆనంది వంటి వర్తమాన నటీమణులతో నటించిన ఈయన ఆ తర్వాత హన్సిక, నయనతార వంటి క్రేజీ హీరోయిన్లతో నటించే స్థాయికి ఎదిగారు. అదేవిధంగా శివకార్తికేయన్‌ ఇప్పటికి హీరోగా 19 చిత్రాలు చేశారు. వాటిలో అధిక భాగం హిట్‌ చిత్రాలే. ఆ మధ్య డాక్టర్‌, డాన్‌ వంటి చిత్రాలు వరుసగా సూపర్‌ హిట్‌ అయినా, ఆ తర్వాత వచ్చిన ప్రిన్స్‌ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం అశ్విన్‌ మడోనా దర్శకత్వంలో మావీరన్‌ చిత్రంలో నటిస్తున్నారు.

అదితిశంకర్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంపై శివకార్తికేయన్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కమల్‌ హాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో సాయిపల్లవి నాయకిగా నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. అయితే శివకార్తికేయన్‌ మరో చిత్రానికి కమిట్‌ అయినట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన దర్బార్‌ చిత్రం తర్వాత ఈ దర్శకుడు మరో చిత్రం చేయలేదు. అదేవిధంగా శివకార్తికేయన్‌, దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దానికి ఇప్పుడు టైమ్‌ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీలో శివకార్తికేయన్‌కు జంటగా మృణాల్‌ ఠాకూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమ్మడు తెలుగులో నటించిన సీతారామం చిత్రంతో బాగా పాపులర్‌ అయిందన్న విషయం తెలిసిందే. ఈమె శివకార్తికేయన్‌తో జతకట్టే విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

చదవండి: మెగా ప్రిన్సెస్‌కు ఘనస్వాగతం.. ఫోటో షేర్‌ చేసిన ఉపాసన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement