
‘‘చిన్నతనంలో మన బర్త్ డేని తల్లిదండ్రులు ఓ ఎమోషనల్‌లా ఫీలై సెలబ్రేట్ చేస్తారు. తల్లిదండ్రుల బర్త్ డేలను పిల్లలు గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేయడం కూడా ఓ మంచి ఎమోషన్స్ . ఇదే ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ కథాంశం’’ అని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి అన్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా, విజయశాంతి లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’(2016) సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఇద్దరు పెద్ద హీరోల కోసం రెండు కథలు సిద్ధం చేశాను. కానీ, ఆ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లలేదు. అలా దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చింది. కల్యాణ్‌రామ్‌గారితో మాట్లాడినప్పుడు ఓ మాస్ ఫిల్మ్ చేద్దామన్నారు. ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’లోని తల్లి పాత్రని విజయశాంతిగారు చేస్తేనే చేద్దామని ఆయన స్పష్టంగా చెప్పారు. విజయశాంతిగారికి కథ చెప్పగా కొన్ని మార్పులు సూచించారు.
యూపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే కొడుకు అర్జున్స్ పాత్రలో కల్యాణ్‌రామ్, ఐపీఎస్ వైజయంతి పాత్రలో విజయశాంతి నటించారు. ఈ మూవీలో ఆమె యాక్షన్స్ సీక్వెన్స్ లు అద్భుతంగా చేశారు. ఎన్టీఆర్‌గారు సినిమా చూసి, బాగుందని చెప్పడం సంతోషం. అజనీష్ లోకనాథ్ అదిరిపోయే ఆర్‌ఆర్ ఇచ్చారు. ఓ దర్శకుడిగా భావోద్వేగాలను ప్రజెంట్ చేయడమే నా బలం’’ అని తెలిపారు.