Chiranjeevi
-
చిరంజీవి సినిమాలో అతిథి?
చిరంజీవి, వెంకటేశ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే... అవుననే సమాధానమే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ఈ సినిమాలోని అతిథి పాత్రలో వెంకటేశ్ నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు... సో.. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
చిరు సినిమా: అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక పారితోషికం!
అనిల్ రావిపూడి(Anil Ravipudi ).. టాలీవుడ్లో హిట్ సినిమాకు ఈ పేరు కేరాఫ్‌గా మారింది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాడు. రీసెంట్గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో విక్టరీ వెంకటేశ్‌కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న MEGA157(వర్కింగ్ టైటిల్) మూవీ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ కంటే ముందే ప్రమోషనల్ వీడియోని వదిలాడు అనిల్. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీమ్‌ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని క్రియేట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ తన ఫోకస్ అంతా చిరు సినిమాపైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భారీగానే పారితోషికం పుచ్చకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు రూ.10-12 కోట్లు తీసుకున్న అనిల్.. ఈ చిత్రం భారీ హిట్ కావడంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. మెగాస్టార్ సినిమాకు అత్యధికంగా రూ.20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. కెరీర్ ప్రారంభంలో పటాస్ చిత్రానికి అనిల్ రూ.50 లక్షలు మాత్రమే తీసున్నాడు. ఇప్పుడు రూ. 20 కోట్లకు ఎగబాకాడు. సూపర్ హిట్ ఇచ్చి భారీగా వసూళ్లను రాబట్టే సత్తా ఉండడంతో రూ.20 కోట్లే కాదు అంతకంటే కాస్త ఎక్కువ అయినా ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. -
'Mega157' రఫ్ఫాడించే గ్యాంగ్ ఇదే.. వీడియోతో పరిచయాలు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'Mega157' నుంచి 'రఫ్ఫాడిద్దాం' పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల సమయంలో వెంకటేష్‌తో అనిల్ చేసిన ప్రమోషన్స్ కార్యక్రమాలన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సినిమాను ప్రతి ఇంటికి తీసుకెళ్లాయి. దీంతో ఈ ఏడాదిలో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పుడు ఆ ఫార్మూలానే చిరంజీవి సినిమాకు ఇంకాస్త డిఫరెంట్‌గా అనిల్ ప్లాన్ చేస్తున్నాడు.సంక్రాంతి-2026లో రఫ్ఫాడిద్దాం పేరుతో ఒక వీడియోను అనిల్ రావిపూడి క్రియేట్ చేశాడు. Mega157 ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న తన గ్యాంగ్ మొత్తాన్ని మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్‌తో చిరంజీవికి పరిచయం చేశాడు. డైరెక్షన్ టీమ్ నుంచి నిర్మాతల వరకు అందరినీ పరిచయం చేశారు. సుమారు రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో చాలా ఫన్నీగా ఎంటర్టైన్ చేసేలా ఉంది. ఇదే వీడియోను చిరంజీవి కూడా తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు అంటూ ఆయన్ను చిరంజీవి ప్రశంసించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అనిల్‌ను మెచ్చుకుంటూ కాంమెంట్లు చేస్తున్నారు. అనిల్ రావిపూడి తనదైన మార్క్‌తో అప్పుడే మొదలెట్టేశాడు రా బాబూ.. అంటూ ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు.సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. త్వరలో షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో చిరంజీవి తన సొంత పేరైన శివ శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.What better way to introduce our team to the legendary Megastar @KChiruTweets Garu than by paying tribute to his timeless dialogues 😍❤️🔥Let’s celebrate MEGASTAR in his forte in #Mega157 🥳— https://t.co/KpR65ACX9L SANKRANTHI 2026 - రఫ్ఫాడిద్దాం 😎#ChiruAnil @sahugarapati7… pic.twitter.com/xGhSLaIstr— Anil Ravipudi (@AnilRavipudi) April 1, 2025 -
#MEGA157 చిరంజీవి,అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
Mega 157: ఉగాదికి స్టార్ట్.. సంక్రాంతికి రిలీజ్!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో ఇది 157వ సినిమా. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది సందర్భంగా నేడు (మార్చి 30) రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా జరిగాయి. హీరో వెంకటేశ్, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు.సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనుందని, చిరంజీవి కొత్త గెటప్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ఒక పాత్ర కోసం ఇప్పటికే అదితిరావు హైదరిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ని ఇంకా ఫైనల్ చేయలేదు. చిరంజీవి సినిమాల విషయాలకొస్తే..ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు ‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
చిరంజీవిని కలిసిన 'కోర్ట్' మూవీ టీమ్ (ఫొటోలు)
-
సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో వాళ్లవి ఎగబడి చూస్తాం: సల్మాన్
దక్షిణాది చిత్రాలను మనం ఆదరిస్తాం కానీ.. మన సినిమాలను సౌత్‌లో ఆదరించరు అంటున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan). సౌత్ హీరోల అభిమానులు హిందీ సినిమాలు చూసేందుకు థియేటర్‌కు రారు అని చెప్తున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన సికందర్ సినిమా ఈవెంట్లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. దక్షిణాదిలో కథలు కాపీ కొట్టరు. సొంత ఐడియాతో స్క్రిప్టు రాసుకుని సినిమా తీస్తారు. సౌత్‌లో ప్రతి సినిమా అద్భుతమేమీ కాదుఅలా అని అక్కడ తెరకెక్కిన ప్రతి సినిమా అద్భుతం అని కాదు. సౌత్‌లో వారానికి రెండుమూడు సినిమాలు రిలీజవుతాయి. అవన్నీ సక్సెస్ అందుకోవు. అక్కడైనా ఇక్కడైనా మంచి సినిమా మాత్రమే హిట్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. ఇదే నియమం సౌత్కూ వరిస్తుంది. అలాగే సౌత్ సినిమాలను నార్త్‌లో ఎంతగానో ఆదరిస్తాం. కానీ వాళ్లు మాత్రం హిందీ చిత్రాలను పెద్దగా పట్టించుకోరు. మన సినిమాలు చూడరునన్ను చూసి భాయ్ అని గుర్తుపడతారు, మాట్లాడతారు.. థియేటర్‌కు వెళ్లి నా సినిమాలు మాత్రం చూడరు. సౌత్ సినిమాలను నార్త్‌లో ఆదరించినంతగా.. బాలీవుడ్ చిత్రాలను దక్షిణాదిలో ఆదరించరు. రజనీకాంత్, సూర్య, చిరంజీవి, రామ్‌చరణ్ వంటి స్టార్ సినిమాలు రిలీజవుతున్నాయంటే మనమంతా వెళ్లి చూస్తాం.. కానీ వారి అభిమానులు మాత్రం ఆ హీరోలకే కట్టుబడి ఉంటారు. మన సినిమాల్ని చూడరు అని సల్మాన్ చెప్పుకొచ్చాడు.సికందర్ రిలీజ్సికందర్ సినిమా విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ మార్చి 30న విడుదలైంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, షరీబ్ హష్మి కీలక పాత్రలు పోషించారు.చదవండి: హీరామండి తర్వాత అవకాశాలు రావట్లేదు: అదితిరావు హైదరి -
చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) మార్చి 27న 40వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈసారి బర్త్‌డేను మెగా ఫ్యామిలీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో పాటు దగ్గరి ఫ్రెండ్స్ సమక్షంలో చరణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలను చరణ్ భార్య ఉపాసన (Upasana Konidela) సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎంతో ప్రత్యేకం: ఉపాసనమార్చి 27.. ఎప్పటికీ గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా మలిచిన అందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది. మొదటి ఫోటోలో చిరంజీవి- సురేఖ, రామ్ చరణ్ -ఉపాసనతో పాటు సుష్మిత కొణిదెల ఉంది. తర్వాతి ఫోటోల్లో చరణ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫోటోలో అయితే చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఉన్నాడు. ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు.పార్టీలో కనిపించని 'అల్లు' కుటుంబంచరణ్ బర్త్‌డేరోజు మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం చరణ్ కోసం సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టు పెట్టలేదు. ఇప్పుడు బర్త్‌డే పార్టీలో కూడా అల్లు ఫ్యామిలీ లేకపోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం అలాగే కొనసాగుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.చరణ్ సినిమాలురామ్చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రంగస్థలం తర్వాత చరణ్- సుకుమార్ కాంబినేషన్లో ఇది రెండో సినిమాగా తెరకెక్కనుందన్నమాట! రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్బస్టర్లు అందించిన సుకుమార్ ఈసారి అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్‌ను చూపించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: 'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?' -
అనిల్- చిరంజీవి సినిమా ముహూర్తం తేదీ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ రంగంలోకి దిగుతోంది. దర్శకుడు అనిల్ ఇప్పటికే స్క్రిప్టు వినిపించడం పూర్తయింది. ఆపై మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభవ అవుతాయి అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా చిరు-అనిల్ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో చిరు నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం చుట్టనున్నారు. రామానాయుడు స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమంలో వెంకటేష్‌తో పాటు పలువురు స్టార్స్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మూవీలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరంజీవి సందడి చేయనున్నారు. ఇందులో చిరంజీవి తనలోని కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, భావోద్వేగాలతో మంచి వినోదాన్ని పంచుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్టు టాక్ ఉంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్‌ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆపై ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నారు. -
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది: మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
డైరెక్టర్ మెహర్ రమేశ్ సోదరి మరణం పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. నా తమ్ముడు మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తాను నాకు కూడా సోదరేనని ఎమోషనల్ అయ్యారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి, నా తమ్ముడు మెహర్ రమేశ్‌కు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు.(ఇది చదవండి: టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం)మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ.. నా సోదరి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు.తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, నా సోదరి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025 -
రామ్ చరణ్ బర్త్‌డే నాడు చిరంజీవి, ఎన్టీఆర్ విషెస్.. 'పెద్ది'పై కామెంట్స్
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. చరణ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని ఆయన మిత్రులు కూడా విషెష్ తెలిపారు. చిరుత నుంచి తన జర్నీని ప్రారంభించిన ఈ మగధీర బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్తో రచ్చ చేశాడు. తాజాగా గేమ్ ఛేంజర్‌గా విఫలం అయినప్పటికీ మరోసారి దర్శకుడు బుచ్చి బాబుతో రంగస్థలంపైకి 'పెద్ది' చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. నేడు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌పై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి కూడా ఇలా స్పందించారు.‘నా ప్రియమైన రామ్ చరణ్‌కు హ్యాపీ బర్త్‌డే.. ‘పెద్ది’ ఫస్ట్ లుక్ చాలా బాగుంది. నటుడిగా మరో కొత్త కోణం తెరపైకి రానుంది. సినిమా ప్రేమికులు, అభిమానులకు ఇది కనులపండుగ కానుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను'... చిరంజీవినా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు. ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని.. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.. ఎన్టీఆర్నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడు మరింత ప్రేమతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. పెద్ది పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది.... దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ రామ్ చరణ్.. క్లీంకారతో పాటు ఉపాసనతో ప్రతిరోజు మీకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నా... కాజల్ అగర్వాల్ -
శంకర్ వరప్రసాద్‌గా చిరంజీవి.. మెగా అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి (Anil Ravipudi) అంటేనే హాస్యానికి, విజయానికి చిరునామా. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మామూలు సక్సెస్ అందుకోలేదు. ఎవరూ ఊహించనంతగా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ సంతోషంలో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్నామని మాటిచ్చేశాడు. కాకపోతే ఈసారి వెంకీమామతో కాదు.. చిరంజీవి (Chiranjeevi Konidela)తో! ఇందుకోసం వైజాగ్ వెళ్లి సినిమా కథ సిద్ధం చేసుకున్నాడు. కథకు పచ్చజెండా ఊపిన చిరుగ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్లో చిరంజీవిని చూస్తారని అభిమానులకు మాటిచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా అప్డేట్ ఇచ్చాడు. 'కథ పూర్తయింది. చిరంజీవిగారికి ఫైనల్ స్క్రిప్ట్ చదివి వినిపించాను. నా కథలోని శంకర్ వరప్రసాద్ పాత్రను పరిచయం చేశాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు.. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకు శ్రీకారం చుట్టేద్దాం' అని ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశాడు.చిరంజీవి ఒరిజినల్ పేరుతో..షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ సినిమా నిర్మితం కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. ఇది చూసిన అభిమానులు ఉగాదికి ముందు ఎంత మంచి శుభవార్త చెప్పారు.. ఇంకో బ్లాక్‌బస్టర్ తథ్యం అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఇందులో శివ అనే పదాన్ని తీసేసి మిగతాది యథాతథంగా వాడేశారు. మెగాస్టార్ అసలు పేరును వాడేస్తున్న అనిల్ రావిపూడి సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే వచ్చే సంక్రాంతిదాకా ఆగాల్సిందే! Final script narration done & locked 📝☑️🔒 చిరంజీవి గారికి నా కధ లో పాత్ర“శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. 😄He loved & enjoyed it thoroughly ❤️🔥ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో… ‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం 🥳#ChiruAnil MegaStar @KChiruTweets garu…— Anil Ravipudi (@AnilRavipudi) March 26, 2025 చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. శోభిత హర్ట్ -
చీరుకు యూకే పార్లమెంట్ అవార్డ్ ఇచ్చిందా ?
-
బెట్టింగ్ యాప్స్ కేసు.. చిరు ప్రస్తావన తెచ్చిన సీపీఐ నారాయణ
న్యూఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. చేతి నిండా అవకాశాలు ఉన్నవాళ్లు కూడా తప్పుడు పనులతో డబ్బు సంపాదించుకోవడం ఎందుకు? అని ప్రశ్నించారాయన.సినీ నటులను ప్రజలు అనుసరిస్తుంటారు. ఆ విషయం వాళ్లు గమనించాలి. కళామతల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేయవద్దు. సినీ నటులు ఇప్పటికే చేతినిండా సంపాదించుకుంటున్నారు. సినిమా అవకాశాలు రాకపోతే.. ఓటీటీ సహా ఎన్నో అవకాశాలు ఉండనే ఉన్నాయి. అలాంటప్పుడు సినిమావాళ్లకు ఈ పాడు సంపాదన దేనికి? గుట్కా విషయంలో అప్పట్లో ఒక పనికిమాలిన తీర్పు వచ్చింది. దాన్ని ఆసరా చేసుకుని కొందరు పాన్ పరాగ్ పేరుతో అనైతిక వ్యాపారం చేస్తున్నారు అని మండిపడ్డారాయన. ఈ క్రమంలో గతంలో మెగాస్టార్ చిరంజీవికి తాను రాసిన ఓ లేఖ సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో చిరంజీవి ఓ శీతల పానీయం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటనలు ఇచ్చారు. అప్పుడు ఆయనకు నేనొక లేఖ రాశాను. ఓవైపు రక్తదానం చేస్తూ.. మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారు? అని ఆయన్ని ప్రశ్నించా. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ప్రకటనలు చేయనని ఆయన చెప్పారు. ఆ తర్వాత చెయ్యలేదు కూడా’’ అని నారాయణ అన్నారు. -
చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ప్రదానం
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవిని యుకెకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా ఘనంగా సత్కరించారు. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలనుగానూ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో చిరు అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేశారు. ReelN Ltd Founder Aman Dhillon with @BridgeIndiaOrg Founder bestows megastar #Chiranjeevi at @UKParliament amidst high-profile consulates and MPs. Truly, a great honour! @KChiruTweets @PratikEPG pic.twitter.com/SsNUVH29ES— ReelN (@ReelnUK) March 19, 2025 -
మీకు ఎవరూ సాటిలేరు.. సునీతా విలియమ్స్ రాకపై చిరు ట్వీట్
దాదాపు 9 నెలల నుంచి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్.. తిరిగి సురక్షితంగా భూమిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీరికి స్వాగతం పలుకుతున్నారు. తాజాగా వీళ్లకు స్వాగతం పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. భగవంతుడు మీకు మరింత శక్తినివ్వాలి అని రాసుకొచ్చారు. 'సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కి స్వాగతం. ఇది చారిత్రక ఘట్టం. 8 రోజుల్లో తిరిగి రావాలని వెళ్లి 286 రోజుల తర్వాత భూమికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. మీరు గొప్ప ధైర్యవంతులు'(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?)'మీకు ఎవరూ సాటిలేరు. మీ (సునీతా విలియమ్స్) ప్రయాణం ఓ థ్రిల్లర్ అడ్వెంచర్ సినిమాలా అనిపిస్తోంది. ఇది గొప్ప సాహసం, నిజమైన బ్లాక్ బస్టర్' అని చిరంజీవి ట్విటర్ లో రాసుకొచ్చారు. బుధవారం తెల్లవారు జామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సునీతా, విల్మోర్ ఉన్న స్పేస్ ఎక్స్ క్యాప్సల్ ల్యాండ్ అయింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్) -
చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?
ఇప్పటి జనరేషన్ కి సరిగా తెలియకపోవచ్చు గానీ కొన్నేళ్లు వెనక్కి వెళ్తే చిరంజీవికి (Chiranjeevi) ఉన్న కల్ట్ ఫాలోయింగ్ ఏంటో తెలుస్తోంది. ఎన్నో అద్బుతమైన సినిమాలు, అంతకు మించిన కళ్లు చెదిరే డ్యాన్సులు.. ఇలా గత 40 ఏళ్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న చిరంజీవిని యూకే(యూనైటెడ్ కింగడమ్)కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా మార్చి 19న సన్మానించనున్నారు.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)ఈ సందర్భంగా చిరంజీవి సోమవారం లండన్ చేరుకున్నారు. పలువురు తెలుగు ఎన్నారైలు ఈయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఒకామె మాత్రం ఏకంగా చిరంజీవికి బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ ఫొటో వైరల్ అయింది. అయితే ఈ ఫొటో వెనక ఓ అభిమాని చిన్నప్పటి ఎమోషన్ ఉన్నట్లు తెలుస్తోంది.'చిన్నప్పుడు అమ్మని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లు అని అల్లరి చేసేవాడిని. ఇప్పుడు మా అమ్మనే చిరంజీవి గారి దగ్గరకు తీసుకెళ్లా. అమ్మ ఆనందానికి అవధులు లేవు' అని ఓ నెటిజన్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్)ఇక చిరంజీవిని యూకే పార్లమెంట్ లో సన్మానించిన తర్వాత బ్రిడ్జ్ ఇండియా సంస్థ తరఫున చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం' ప్రదానం చేయనున్నారు.బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ప్రముఖ సంస్థ. వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు.. తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండటం విశేషం. కానీ మెగాస్టార్ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందని వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్ పేర్కొంది.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
చిరు సినిమా: నో లవ్ ట్రాక్.. మెగాస్టార్‌తో అనిల్ మాస్టర్ ప్లాన్!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఇంకా సెట్‌పైకి వెల్లలేదు కానీ.. అనిల్ మాత్రం అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టేశాడు. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్‌లోనే చిరు సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఈ కథ కూడా కామెడీ పంథాలోనే సాగుతుందని హింట్ ఇచ్చేశాడు.అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్‌ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంద్ర తర్వాత చిరంజీవి రాయలసీమ నేపథ్యంలో సినిమా చేయలేదు. ఇంద్రలో కూడా సీమ యాసను పూర్తిగా వాడలేదు. కానీ ఈచిత్రంలో చిరంజీవి పూర్తిగా రాయలసీమ యాసలోనే మాట్లాడతారట. డైలాగుల విషయంలోనూ అనిల్ జాగ్రత్త పడుతున్నారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలకు భూమిక, మృణాల్ ఠాకుర్లను ఎంపిక చేసినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
లండన్ చేరుకున్న చిరంజీవి.. ఎయిర్‌పోర్ట్‌లో అభిమానుల సందడి (ఫోటోలు)
-
లండన్‌లో 'చిరు'కు సన్మానం.. తొలి అవార్డ్ మెగాస్టార్‌కే
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి లండన్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. భారీగా ఆయన అభిమానులు అక్కడికి చేరుకుని స్వాగతం పలికారు. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలనుగానూ యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. ఈమేరకు ఆయన అక్కడికి చేరుకున్నారు.సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంతుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి గారు అందుకోనుండటం విశేషం. కానీ, మెగాస్టార్ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందని వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్ పేర్కొంది.Megastar @KChiruTweets garu in UK to receive UK parliament “lifetime achievement award” 💥❤️🔥#MegaStarChiranjeevi #Chiranjeevi pic.twitter.com/pyegvIYFZR— Nikhil KS 🩷 (@NikhilKalyan88) March 17, 2025 -
వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం: అనిల్ రావిపూడి
‘‘మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. చిరంజీవి హీరోగా తాను తీయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ని స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్ హీరోగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇక చిరంజీవిగారితో చేయనున్న సినిమాకి సంబంధించిన కథని సిద్ధం చేసేందుకు వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్‌ని సెంటిమెంట్‌గా భావిస్తాను. ఇక్కడే నా సినిమాలకు సంబంధించిన కథలు రాసుకుంటుంటాను. ఆ స్క్రిప్ట్‌లను శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించడం సెంటిమెంట్‌గా భావిస్తాను. చిరంజీవిగారితో తీసే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. ‘గ్యాంగ్‌లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్’లో చిరంజీవిగారిని ఈ చిత్రంలో చూస్తారు. ఒక నెలలో మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది. మే ఆఖరిలో లేదా జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా పాల్గొన్నారు. – ‘సాక్షి’, సింహాచలం -
చిరుకు జోడీగా హైదరాబాద్ బ్యూటీ ?
-
మెగాస్టార్ చిరంజీవికి దక్కిన అరుదైన గౌరవం
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలనుగానూ యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.ఈ వార్త వెలువడిన వెంటనే ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మార్చి 19న ఈ అరుదైన గౌరవాన్ని చిరంజీవి అందుకుంటారు. సినీ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా చిరును అభినందిస్తున్నారు.బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంతుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి గారు అందుకోనుండటం విశేషం. -
హీరోల చేతిలో ముచ్చటగా మూడు
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, నాని, నితిన్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్ వంటి హీరోల చేతిలో ముచ్చటగా మూడు ప్రాజెక్టులున్నాయి. మరికొందరు నాలుగు సినిమాలు చేస్తున్నారు... ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.. చిరంజీవి... భలే జోరు తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి భలే జోరుమీదున్నారు. ఈ సీనియర్ హీరో వరుసగా ప్రతిభావంతులైన యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి వంటి స్టార్‌తో అందివచ్చిన అవకాశాన్ని నిరూపించుకుని, ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో దర్శకులు సైతం ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న వశిష్ఠ మల్లిడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధం అవుతోంది.చిరంజీవి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత ‘విశ్వంభర’తో రిపీట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ‘విశ్వంభర’ తర్వాత కూడా చిరంజీవి యంగ్ డైరెక్టర్స్‌తో పని చేయనున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నట్లు చిరంజీవి ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తొలి చిత్రం ‘దసరా’తో (నాని హీరో) సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి పచ్చజెండా ఊపారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ మూవీ రూపొందిస్తున్నారు. మరి చిరంజీవి ముందుగా అనిల్ మూవీని సెట్స్‌కి తీసుకెళతారా? శ్రీకాంత్ ఓదెల మూవీ చేస్తారా? అనేది వేచి చూడాలి. ఇక ‘వాల్తేరు వీరయ్య’ మూవీ దర్శకుడు బాబీ కూడా చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. పవన్ కల్యాణ్... తీన్మార్‘బ్రో’ (2023) సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరపై కనిపించలేదు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారాయన. ప్రస్తుతం ఆయన చేతిలో కూడా మూడు చిత్రాలున్నాయి. వాటిలో ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఒకటి. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్యప్రోడక్షన్స్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడనుందని టాక్. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ అనే ఓ మూవీ చేస్తున్నారు పవన్. అలాగే ‘గబ్బర్ సింగ్’ తర్వాత హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్... ఫుల్ స్వింగ్‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు హీరో ప్రభాస్. ఆ చిత్రాల తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారాయన. గత ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో (‘కన్నప్ప’ చిత్రంలో అతిథి పాత్ర) బిజీ బిజీగా ఉన్నారు.మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీని ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే విధంగా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. అలాగే మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా అతిథి పాత్ర చేశారు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్: పార్ట్ 1–సీజ్ఫైర్’కి కొనసాగింపుగా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే.హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ 2026లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’తో పాటు మరో రెండు సినిమాలు ప్రభాస్ తమ బ్యానర్లో చేయనున్నట్లు హోంబలే ఫిల్మస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027, 2028లో వరుసగా ఈ సినిమాలు విడుదలవుతాయి. నితిన్... జోరుగా‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ’ మూవీతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ 2024ని మిస్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో జోరుగా ఉన్నారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.అదే విధంగా ‘వకీల్ సాబ్’ మూవీ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నారు నితిన్. ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అక్కా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో నితిన్‌కి అక్కగా లయ నటిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా మే 9న విడుదల కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలానే తొలి మూవీ ‘బలగం’తో బంపర్ హిట్ సాధించిన వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేయనున్నారు నితిన్. ఏప్రిల్ లేదా మేలో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఎన్టీఆర్... యమా స్పీడు ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్ యమా స్పీడుమీదున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని ప్రెజంట్ చేయనున్నారు ప్రశాంత్ నీల్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. కాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘దేవర 2’ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు కొరటాల శివ. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. నాని... ఫుల్ జోష్హీరో నాని ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ వైపు హీరోగా రెండు మూడు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారాయన. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్ప్రోడక్షన్స్ తో కలిసి నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్‌గా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు నాని.‘హిట్’ సిరీస్‌లో మూడవ భాగంగా ఈ చిత్రం రానుంది. ఇదిలా ఉంటే... ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఫుల్ రా రస్టిక్ పాత్ర చేస్తున్నారు నాని.తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్, స్పానిష్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు నాని. భారీ యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీ నిర్మించనున్నారు. శర్వానంద్... బిజీ బిజీహీరో శర్వానంద్ బిజీ బిజీగా ఉన్నారు. ‘మనమే’ (2024) చిత్రంతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన ప్రస్తుతం మూడుప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్ టైటిల్). విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్న్స్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బేస్డ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారు. అదే విధంగా శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య, సంయుక్త కథానాయికలు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న 38వ చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ మూవీలో 60ల నాటి పాత్రను పోషించడానికి మేకోవర్ అవుతున్నారు శర్వానంద్. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సిద్ధు జొన్నలగడ్డ... హుషారుగా...‘డీజే టిల్లు’ (2022), ‘టిల్లు స్క్వేర్’(2024) వంటి వరుస హిట్స్‌తో జోరుగా హుషారుగా దూసుకెళుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ’జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘తెలుసు కదా’.ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు ‘టిల్లు క్యూబ్’ కూడా చేయనున్నారు సిద్ధు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే ప్రకటించారు ఆ చిత్రనిర్మాత నాగవంశీ.పైన పేర్కొన్న కథానాయకులే కాదు... మరికొందరు కూడా మూడుప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇంకొందరు హీరోల చేతిలో రెండు సినిమాలు ఉండగా మూడో సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – డేరంగుల జగన్ మోహన్ -
'విశ్వంభర'లో శ్రీలీల.. గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. లెక్క ప్రకారం సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పటికీ ఇంకా షూటింగ్ నడుస్తోంది. తాజాగా శ్రీలీల కూడా చిత్రీకరణలో పాల్గొంది. ఈ క్రమంలోనే చిరు.. యువ హీరోయిన్ కి క్యూట్ బహుమతి ఇచ్చారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)రీసెంట్ టైంలో సరైన హిట్స్ పడకపోవడంతో శ్రీలీల.. తెలుగు సినిమాలు తగ్గించేసింది. హిందీలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు ఈమెని చిరు 'విశ్వంభర' కోసం తీసుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోలతో ఈ క్లారిటీ వచ్చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీలీలకు దుర్గ దేవి ప్రతిమ గల శంఖాన్ని చిరంజీవి బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు చూస్తే చిరు-శ్రీలీల ఏదో పాట షూటింగ్ కోసం సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. మరి శ్రీలీల.. సినిమాలో ప్రత్యేక గీతం ఏమైనా చేస్తోందా? పాత్రలో నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ) -
సమ్మర్ కష్టమే.. ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చిన ‘మెగా’ బ్రదర్స్!
టాలీవుడ్‌కి సంక్రాంతి తర్వాత సమ్మర్ మంచి సీజన్. వేసవి సెలవుల్లో పలు పెద్ద సినిమాలతో పాటు మీడియం, చిన్న చిత్రాలు కూడా విడుదల అవుతుంటాయి. స్కూల్, కాలేజీ పిల్లలకు సెలవులు ఉండడంతో వారిని టార్గెట్ చేస్తూ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అయితే ప్రతి సమ్మర్‌కి కనీసం రెండు, మూడు పెద్ద సినిమాలైనా సందడి చేసేవి. కానీ ఈ సారి మాత్రం యావరేజ్ సినిమాలతోనే సరిపెట్టుకోవాలేమో. సమ్మర్లో సందడి చేస్తామని చెప్పిన మెగా హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చేలా కనిపిస్తోంది. వీరితో పాటు ప్రభాస్ కూడా వేసవి సీజన్‌కి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ‘విశ్వంభర’ మూవీ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ కొడుకు రామ్ చరణ్ కోసం చిరు వెనక్కి తగ్గాడు. దీంతో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’సంక్రాంతికి రిలీజైంది. కానీ చిరంజీవి చేసిన త్యాగానికి గేమ్ ఛేంజర్ న్యాయం చేయలేకపోయింది. అది పక్కన పెడితే.. విశ్వంభర సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ మేకర్స్ మళ్లీ మనసు మార్చుకున్నారట. సమ్మర్లో కాకుండా.. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే సమ్మర్లో చిరును తెరపై చూడడం కష్టమే.మరోవైపు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) ‘హరిహర వీరమల్లు’ కూడా రిలీజ్‌ని వాయిదా వేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ జరుగుతోంది. పవన్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉందట.ఈ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. వీఎఫెక్స్ వర్క్ కూడా పెండింగ్‌లోనే ఉంది. ఈ లెక్కన ఈ చిత్రం కూడా వేసవిలో రిలీజ్ అవ్వడ కష్టమే అంటున్నారు సినీ పండితులు.ఇక మెగా ఫ్యామిలీ హ్యాండిచ్చినా.. ప్రభాస్ అయినా సమ్మర్లో ఎంటర్టైన్ చేస్తారనుకుంటే.. అది కూడా కష్టమే అంటున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదట. ఈ చిత్రాన్ని ముందు చెప్పినట్లుగా ఏప్రిల్‌లో రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. జూన్ లేదా జులైలో ఈ చిత్రం రిలీజయ్యే అవకాశం ఉంది. ఇలా పెద్ద సినిమాలన్నీ తమ విడుదలను వాయిదా వేసుకుంటే.. యావరేజ్, చిన్న చిత్రాలు మాత్రం రిలీజ్‌కు రెడీ అంటున్నాయి. -
కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ ఇంటికి రావొద్దంది: చిరంజీవి సోదరి
పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే ఆ తల్లి అల్లాడిపోతుంది. అదే సమయంలో ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పుతుంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన కూతుర్లకు విలువైన సలహాలు ఇచ్చి వారిని బలంగా నిలబెట్టింది. ఏ కష్టం వచ్చినా సరే ఎవరి మీదా ఆధారపడకూడని, ఆధారపడితే నీ ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్లేనని చెప్పేదట. మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.కష్టాల్లో ఉన్నా ఒంటరిగా పోరాడాలందివిజయదుర్గ (Vijaya Durga) మాట్లాడుతూ .. ‘మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతంగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే పోరాడాలి. ఎవరి దగ్గరా ఉండకూడదు, మా దగ్గర కూడా ఉండొద్దు. నీ ఇద్దరు పిల్లలతో నువ్వే ఉండు అని చెప్పారు. ఎవరి దగ్గరైనా ఉంటే నీ గౌరవం తగ్గిపోతుందనేవారు.అమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే..ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు’ అని అన్నారు. మాధవి (Madhavi) మాట్లాడుతూ.. ‘నేను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మా అమ్మ నాకు అండగా నిలబడింది. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్‌గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు’ అని అన్నారు.శ్రీజ విషయంలో ఆమె వల్లే..చిరంజీవి మాట్లాడుతూ.. నా కూతురు శ్రీజ (వైవాహిక) జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు శ్రీజ (Sreeja Konidela) ఏమందంటే.. నేను నానమ్మ దగ్గరకు వెళ్లాను. తనిచ్చిన భరోసాతో నాలో ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. నానమ్మతో ఎప్పుడు కూర్చున్నా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అని నాతో షేర్ చేసుకుంది. అప్పుడు నేను శ్రీజతో ఒకటే చెప్పా.. ఏం పర్లేదమ్మా.. జీవితమంటే ఒక్కరితోనే అయిపోదు. ఆ ఒక్కరు మనల్ని నియంత్రించలేరు. నీ గురించి నువ్వు ఆలోచించుకో.. నీ మనసులో ఏదనిపిస్తే అది చేయు అని సూచించాను అని పేర్కొన్నారు. కాగా శ్రీజ.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులిచ్చింది.చదవండి: కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కల్పననా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి -
ఉమ్మడి కుటుంబంగా ఎందుకు ఉండాలంటే: చిరంజీవి
టాలీవుడ్లో ఎక్కువగా వినిపించే పదం 'మెగా బ్రదర్స్'.. దీనంతటికి కారణం వారందరూ కలిసి సినిమా రంగంలో రాణించడమే.. ఆపై చిరంజీవి మాటకు తన కుటుంబ సభ్యులు ప్రాధాన్యత ఇస్తారని చెబుతుంటారు. ఇప్పటికే వారి కుటుంబంలో చిరంజీవి హిట్లర్ సినిమాలో మెగాస్టార్‌లా ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతుంటాయి. అయితే, వారందరూ అలా కలిసి ఉండటానికి కారణాలు ఎంటి అనేది చిరు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి ఉమ్మడి కుటుంబం గురించి ఇలా చెప్పారు.. ‘ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, ఈ విలువలు అన్నీ కూడా తమకు అమ్మానాన్నల నుంచే సంక్రమించాయి. మా నాన్నకు చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. ఆ డబ్బుతోనే మా కుటుంబాన్ని పోషించారు. అమ్మ తరుఫున ఉండే ఫ్యామిలీని కూడా చూసుకున్నారు. అమ్మ కూడా మా నాన్నకు సంబంధించిన ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకునేవారు. అలా అప్పటి నుంచే మాకు ఉమ్మడి కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి తెలిసి వచ్చాయి. అందుకే మేం ఇప్పటికీ కలిసి కట్టుగా ఉంటాం. మేం ప్రేమ, ఆప్యాయతలు, బంధాల విషయంలో అందరి కంటే ధనికులం. ఒక్కో సారి డబ్బు అన్ని సమస్యల్ని తీర్చలేకపోవచ్చు. కానీ ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం, భరోసా వేరేలా ఉంటుంది. మా కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా.. మిగిలిన వారంతా వచ్చి కాపాడుకుంటాం. ఎప్పుడూ అందరూ కలిసి మెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి అనే మా అమ్మ చిన్నతనం నుంచి నేర్పారు. మా అమ్మ చుట్టూ ఎప్పుడూ ఓ పాజిటివిటీ ఉంటుంది. ఎవరికైనా సరే మా ఫ్యామిలీలో ఏ కష్టం వచ్చినా, కాస్త బాధల్లో ఉన్నా కూడా అమ్మే అందరికీ ధైర్యాన్ని ఇస్తారు. అందరికీ నైతికంగా భరోసానిస్తారు. చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతో పాటే ఉండేవాడిని. అమ్మకు సాయంగా అన్ని పనుల్లో తోడుండేవాడిని. నాగబాబు అసలు ఇంట్లో పనులు చేసే వాడు కాదు. ఇక కళ్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం. నా నిర్ణయానికి అమ్మానాన్నలు ఎంతో గౌరవాన్ని ఇస్తుండేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకో అని మాత్రమే చెప్పేవారు. అలా పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్చ ఇవ్వడం చాలా ప్రధానం. మా అమ్మానాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజుకీ మేం ఇలా ఉన్నామంటే మా అమ్మ గారే కారణం’అని చిరు అన్నారు. -
నా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఉమెన్స్ పేరుతో మెగాస్టార్ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. చిరంజీవి అమ్మగారు అంజనాదేవితో పాటు ఆయన సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలతో పాటు పలు సరదా విషయాలను వారు పంచుకున్నారు. అయితే, చిరు సోదరీమణులలో మాధవి రావు కూడా ఈ ఇంటర్వ్యూలో కనిపించడం విశేషం. వాస్తవంగా ఆమె మీడియాకు చాలా దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే.మెగా బ్రదర్స్‌తో పాటు ఇద్దరు సోదరీమణులు ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాము మొత్తం ఏనిమిది మంది అని చిరంజీవి తెలిపారు. చిన్న వయసులోనే తన సోదర,సోదరీమణులు ముగ్గురు చనిపోయారని ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'అమ్మకు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు రమా అని నాకొక సోదరి ఉండేది. నాగబాబు, కల్యాణ్‌ల కంటే పెద్దది. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పోన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మ, నేను కలిసి తీసుకువెళ్లాం. రెండురోజుల తర్వాత రమా చనిపోయింది. ఆ బిడ్డ శవాన్ని నా భుజాల మీద పెట్టుకొని రిక్షాలో అమ్మతో పాటు ఇంటికి వచ్చాను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నన్ను కలిచివేస్తుంటాయి. నాన్న ఉద్యోగరీత్యా అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఆయనకు ఎలా తెలపాలో కూడా మాకు తెలియలేదు. ఎదోలా తెలిసిన వారి ద్వారా విషయాన్ని నాన్నకు చేరవేశాం. ఇంతలో చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో అంత్యక్రియలు పూర్తిచేశాం. ఆపై నాన్న వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ రోజు జరిగిన ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. అది తలుచుకున్న ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది.' అని చిరు కంటతడితో ఈ మాటలు చెప్పారు. -
చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ ఫోటో షేర్ చేసిన చిరంజీవి
మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెబుతూ ఒక ప్రత్యేకమైన ఫోటోను తన షోషల్మీడయాలో పంచుకున్నారు. తనతో నటించిన హీరోయిన్లతో పాటు ఆయన సతీమణి సురేఖతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ' నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.' అని తెలిపారు. ఈ ఫోటోలో చిరుతో పాటు సురేఖ, నదియా, రాధిక, మీనా, జయసుధ, ఖుష్బూ,టబు ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు. 💐🙏#HappyWomensDay pic.twitter.com/j5qtSrtIAC— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2025 -
చిరు, వెంకీ రూట్లో నాగార్జున
-
టాలీవుడ్ సూపర్ హిట్ జోడీలు.. మళ్లీ రిపీట్..
చిత్ర పరిశ్రమలో హిట్ జోడీకి ఉన్న క్రేజే వేరు. ఓ హీరో, హీరోయిన్ కాంబినేషన్లో సినిమా విజయం సాధిస్తే మళ్లీ ఆ కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందా? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఉంటుంది. హిట్ జోడీ రిపీట్ అవుతోందంటే ట్రేడ్ వర్గాల్లో, బిజినెస్ సర్కిల్స్‌లో ఫుల్ క్రేజ్‌తో ΄ాటు అంచనాలు ఉంటాయి. అందుకే అలాంటి హిట్ జోడీని రిపీట్ చేసేందుకు దర్శక–నిర్మాతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇందుకు ఒక్కోసారి కొన్నేళ్లు కూడా పట్టొచ్చు. ప్రస్తుతం తెలుగులో రిపీట్ అవుతున్న జోడీలపై ఓ లుక్కేద్దాం...పద్దెనిమిదేళ్ల తర్వాత..హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జోడీగా నటించారు. 2006 సెప్టెంబరు 20న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి ‘విశ్వంభర’ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘బింబిసార’ వంటి హిట్ మూవీ తీసిన మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించింది చిత్రయూనిట్. కానీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ కోసం ‘విశ్వంభర’ సినిమా విడుదలని వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వేసవిలో సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. షష్ఠిపూర్తి కోసం 38 ఏళ్ల తర్వాత... నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి అర్చనల జోడీ 38 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. వీరిద్దరూ ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రెండో సారి కలిసి నటించారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన జోడీగా డైరెక్టర్ వంశీ తీసిన చిత్రం ‘లేడీస్ టైలర్’. 1986 నవంబరు 26న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించలేదు. తాజాగా పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ‘షష్ఠిపూర్తి’ కోసం వీరు 38 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా నటించారు. ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంట. అయితే ఈ కథ మొత్తం రాజేంద్ర ప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ‘షష్ఠిపూర్తి’ అనే టైటిల్ పెట్టారట. రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనే విషయంపై స్పష్టత లేదు. మధ్యతరగతి యువకుడి ప్రేమకథ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తొలి చిత్రం ‘బేబి’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 జూలై 14న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో ఆనంద్, వైష్ణవి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రత్యేకించి యువతరం ఈ సినిమాకి ఫుల్ ఫిదా అయ్యారు. ‘బేబి’ తర్వాత వీరు మరోసారి జోడీగా నటిస్తున్నారు. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్‌తో మంచి విజయం అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో 32వ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో ‘మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు.. మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.మాస్ జాతర రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. 2022 డిసెంబరు 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అందులోనూ ప్రత్యేకించి రవితేజ–శ్రీలీల డ్యాన్సులు, భీమ్స్ సంగీతం ఈ సినిమాకి ప్లస్‌గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి హిట్ జోడీ రెండేళ్ల తర్వాత ‘మాస్ జాతర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతోన్న ‘మాస్ జాతర’పై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. అందులోనూ రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం కూడా ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘మాస్ జాతర’ సినిమాకి కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటం మరో విశేషం. వేసవి కానుకగా మే 9న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. నాలుగోసారి...నటుడు శివాజీ, నటి లయది హిట్ జోడీ. ‘మిస్సమ్మ’ (2003), ‘అదిరిందయ్యా చంద్రం’ (2004), ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ (2006) వంటి సినిమాల్లో జంటగా నటించి, హిట్స్ అందుకున్నారు. తాజాగా వీరి జోడీ నాలుగోసారి రిపీట్ అవుతోంది. వివాహం తర్వాత సినిమాలకు కొన్నేళ్లు విరామం ఇచ్చిన లయ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రస్తుతం లయ, శివాజీ జోడీగా కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో సుధీర్ శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ జంట నటిస్తున్న నాలుగో చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. బ్యాక్ టు బ్యాక్హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ బ్యాక్ టు బ్యాక్ రిపీట్ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్’ సినిమాలో నితిన్, శ్రీలీల తొలిసారి జంటగా నటించారు. 2023 డిసెంబరు 8న విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. కానీ, నితిన్–శ్రీలీల జోడీ బాగుందనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ‘రాబిన్‌హుడ్’ సినిమాలో జంటగా నటించారు. ‘భీష్మ’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ఇదని, నితిన్ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రాబిన్‌హుడ్’లో తన పాత్ర, నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారంటూ శ్రీలీల కూడా స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా 2024 డిసెంబరు 25న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన తేదీకి విడుదలకాలేదు. మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అప్పుడు వినోదం.. ఇప్పుడు థ్రిల్లర్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన కెరీర్లో విజయవంతమైన చిత్రాల్లో ‘సామజవరగమన’ ఒకటి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ నటించారు. 2023 జూన్ 29న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ‘మృత్యుంజయ్’ మూవీ కోసం మరోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్.ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సామజవరగమన’తో వినోదం పంచిన శ్రీవిష్ణు, రెబా జాన్ ‘మృత్యుంజయ్’తో ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో చూడాలి. మరికొన్ని జోడీలు‘సీతా రామం’ సినిమాతో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రెండోసారి నటించనున్నారట. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమాలో సాయిపల్లవి లేదా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణ– ప్రగ్యాజైస్వాల్ జోడీ కూడా రిపీట్ కానుందని సమాచారం. ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాల తర్వాత ‘అఖండ 2’లో వీరిద్దరూ కలిసి నటించనున్నారట. అయితే ‘అఖండ 2’లో హీరోయిన్గా సంయుక్తని ప్రకటించారు మేకర్స్. మరి ప్రగ్యా జైస్వాల్ సెకండ్ హీరోయిన్గా కనిపిస్తారా? లేదంటే ముఖ్యమైన పాత్ర చేయనున్నారా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. మరికొన్ని జోడీలు కూడా రిపీట్ కానున్నాయని సమాచారం. – డేరంగుల జగన్ మోహన్ చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ఈ మధ్య ఇండియా-పాక్ మ్యాచ్ చూసి వచ్చారు. అంతకు తప్పితే పెద్దగా వార్తల్లో లేరు. అలాంటి ఈయనపై ఇప్పుడు ఓ రూమర్ వైరల్ అవుతోంది. గౌరవాన్ని వద్దనుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ అందులోనే)ఎన్నో అద్భుతమైన సినిమాలతో అలరించిన చిరంజీవి.. ఇప్పటికే పద్మ పురస్కారాల్ని కూడా అందుకుంది. అలాంటి ఈయనకు యూకే ప్రభుత్వం.. ఆ దేశ పౌరసత్వాన్ని గౌరవారర్ధంగా ఇచ్చిందని మాట వినిపించింది. అయితే ఇవన్నీ నిజం కాదని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.ఇదంతా పక్కనబెడితే యూకేలో చిరుని సన్మానించేందుకు మాత్రం ఓ కార్యక్రమం ప్లాన్ చేశారట. బహుశా అందువల్లే ఈ రూమర్స్ వచ్చినట్లున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం 'విశ్వంభర' పూర్తి చేసే బిజీలా ఉన్న చిరు.. తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ అనిల్ రావిపూడితో కలిసి పనిచేస్తారు.(ఇదీ చదవండి: నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్ రావిపూడి) -
మళ్లీ మెగా మల్టీస్టారర్
-
చిరు-అనిల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్..
-
చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
తారలు తరలి వెళ్లారు...
దుబాయ్: దాయాదుల దమ్మెంతో ప్రత్యక్షంగా చూసేందుకు తారలంతా దుబాయ్‌కి తరలి వెళ్లారు. ఏదో ఒక రంగమని కాకుండా... సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్ స్టేడియం ఓ తారాతీరమైంది. మైదానంలో భారత ఆటగాళ్లు, గ్యాలరీలో భారత అతిరథులతో స్టేడియం కళకళలాడింది.టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, టీమిండియా మాజీ సభ్యులు శిఖర్ ధావన్, వెంకటేశ్ ప్రసాద్... తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, ‘పుష్ప’ సీక్వెల్స్‌తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన సుకుమార్, బాలీవుడ్ నుంచి హీరోయిన్ సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి రాగా, వివేక్ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌కర్డ్ సంగ్మా, త్రిపుర వెస్ట్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు బిప్లాబ్ కుమార్ దేబ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బ్రిటన్ పాప్ సింగర్ జాస్మిన్ వాలియా, బాలీవుడ్ చిత్ర గీతాలతో పాపులర్ అయిన పాకిస్తాన్ సింగర్ అతీఫ్ అస్లామ్ తదితరులతో వీఐపీ గ్యాలరీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె భక్తావర్ భుట్టో జర్దారి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీమ్ ఖాన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు మ్యాచ్‌ను తిలకించిన వారిలో ఉన్నారు. -
IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన చిరంజీవి (ఫోటోలు)
-
చిరంజీవి, రజనీకాంత్.. హాలీవుడ్ సినిమాల్లో?
ఇటీవల మన తెలుగు హీరోలు గ్లోబల్ స్టార్లుగా మారుతున్నారు. ఇప్పటి దాకా చూస్తే హాలీవుడ్( Hollywood) సినిమాల్లో బాలీవుడ్ తారలకు వచ్చిన స్థాయిలో దక్షిణాదికి అవకాశాలు రాలేదు. అయితే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ.ఎన్టీయార్...లు ఇప్పుడు హాలీవుడ్లో సైతం చర్చకు వస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే... మరికొన్ని టాలీవుడ్ హీరోల చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో దుమ్ము రేపితే త్వరలోనే హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరోని చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్రెడీ మన జూనియర్ ఎన్టీయార్‌తో సినిమా తీయాలని ఉందని సూపర్ మ్యాన్ సినిమా దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మరోసారి దక్షిణాది హీరోలు హాలీవుడ్ తెరంగేట్రం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది. అయితే దక్షిణాది హీరోలు హాలీవుడ్ ని ఆకర్షించడం, అక్కడి సినిమాల్లో నటించే అవకాశం మరీ అంత అందని ద్రాక్ష ఏమీ కాదు. గతంలోనూ పలువురు దక్షిణాది హీరోలు నటించిన దాఖలాలు ఉన్నాయి. గత 2018లో దక్షిణాది స్టార్ ధనుష్ హాలీవుడ్ చిత్రంలో నటించాడు. ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ పేరుతో రూపొందిన ఆ చిత్రంతో పాటు ఆంథోనీ, జోయ్ రుస్సో దర్శకత్వం వహించిన ది గ్రే మ్యాన్ అనే చిత్రంలోనూ నటించాడు. సోనీ ప్రొడక్షన్స్ ఫిల్మ్ స్ట్రీట్ ఫైటర్‌లో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.ప్రముఖ దక్షిణాది నటుడు పలు తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించిన నెపోలియన్... గత 2019లో హాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆయన అతీంద్రీయ శక్తుల కధతో రూపొందిన థ్రిల్లర్ మూవీ డెవిల్స్ నైట్‌లో నటించాడు. అలాగే అమెరికన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ క్రిస్మస్ కూపన్లో కూడా ఆయన చేశారు. అచ్చ తెలుగు అమ్మాయి అవంతిక వందనపు... పలు తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించింది. మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాల్లో కనిపించిన అవంతిక... అమెరికాలో నివసించే హైదరాబాదీ యువతి. ఈమె కూడా మీన్ గాళ్స్ అనే హాలీవుడ్ మూవీలో నటించింది.తమిళ సూపర్ స్టార్ సీనియర్ నటడు రజనీకాంత్(Rajinikanth )... చాలా మందికన్నా ముందే... అప్పట్లో ఒక హాలీవుడ్ చిత్రంలో నటించాడు. అశోక్ అమృత్‌రాజ్, సునంద మురళీ మనోహర్‌లు రూపొందించిన బ్లడ్ స్టోన్ అనే సినిమాలో ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ పాత్ర పోషించాడు. మన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సైతం హాలీవుడ్ చిత్రంలో నటించిన విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన తన సమకాలీకుడైన రజనీకాంత్ కన్నా ఓ పదేళ్లు ఆలస్యంగా అంటే 1999లో హాలీవుడ్ లో రంగప్రవేశం చేశారు. థీఫ్ ఆఫ్ బాగ్థాద్ అనే సినిమాలో ఆయన చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ అర్థంతరంగా ఆగిపోయింది. -
'హిచ్ కాక్’పై తెలుగులో బుక్ రావడం అభినందనీయం: చిరంజీవి
ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'( Master Of Suspense Hitchcock) పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ - ఐఆర్టిఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. డిసెంబర్ 18న ఫస్ట్ కాపీ విడుదలైంది. ఐదు రోజుల్లో పుస్తకాలు అన్నీ అమ్ముడు కావడంతో సరికొత్త చేర్పులతో సెకండ్ ఎడిషన్ లాంచ్ చేశారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఈ పుస్తకం సెకండ్ ఎడిషన్ లాంచ్ చేస్తూ.. తెలుగులో ఇటువంటి పుస్తకం తీసుకు రావడం అభినందనీయం అని ప్రశంసించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''హిచ్ కాక్ సినిమాలు కొన్నిటిని నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చూశాను. ఈ పుస్తకాన్ని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పది పదిహేను రోజుల్లో చదివేస్తాను. ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో బుక్ రావడం అభినందనీయం. ఇలాంటి పుస్తకాలను పులగం చిన్నారాయణ, రవి పాడి మరిన్ని సంకల్పించాలి'' అని అన్నారు. ప్రసిద్ధ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ పుస్తకానికి ముందుమాట రాయడంతో పాటు ఆయన కెరీర్ లో తొలిసారి ఒక పుస్తకాన్ని ప్రశంసిస్తూ పాడ్ కాస్ట్ విడుదల చేశారు. అలాగే సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ కూడా ముందుమాట రాశారు.'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'లో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ (HLF)లో ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ ప్రశంసలను అందుకున్నారు పులగం చిన్నారాయణ, రవి పాడి. -
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు 'మెగా' ఆఫర్
'భోళాశంకర్' పరాజయం తర్వాత చిరంజీవి చాలా సినిమాలను లైన్లో పెట్టారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ కథలను ఎక్కువగా వింటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంభరతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, దసరా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్లో ఒకప్పుడు అందాలభామగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరుతో క్రేజీ కాంబోను హీరో నాని సెట్ చేశారని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి సమర్పకుడిగా నాని వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా గతంలో పంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆయన షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌లో హైప్ పెంచారు. అయితే, ఈ మూవీలో చిరు సరసన నటించే హీరోయిన్ పాత్ర కథకు చాలా ప్రాముఖ్యతను ఇస్తుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే సెట్ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిరుతో చెప్పగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టు సరిజోడీగా రాణీ ముఖర్జీ మంచి సెలక్షన్ అని చిరు కూడా అన్నారట. ఇదే వార్త బాలీవుడ్ సర్కిల్లో ట్రెండ్ అవుతుంది. -
చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత అంటూ రూమర్స్
మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అస్వస్థత చెందినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం. రెగ్యూలర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లినట్లు వారి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో ఈ విషయం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారంటూ నెట్టింట పలు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఆమె హెల్త్ చెకప్ కోసం మాత్రమే వెళ్లారని కొందరు చెబుతున్నా.. వారి కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, దీంతో చిరంజీవి అభిమానులు మాత్రం అంజనాదేవి క్షేమంగా ఉన్నారంటూ.. కేవలం హెల్త్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లారని తెలుపుతున్నారు.చిరంజీవి ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. తన సతీమణి సురేఖతో కలిసి పెళ్లిరోజు జరుపుకున్నారు. ఫ్టైట్‌లో దుబాయ్ వెళ్తూ.. ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. వారితో పాటు అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. -
'విశ్వంభర'లో ఇద్దరు మెగా వారసుల ఎంట్రీ
చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.ప్రోడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ శంకర్‌పల్లిలో వేసిన ఓ భారీ సెట్లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.ఇదిలావుంటే ఈ మూవీలో మెగా వారసులు నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. ముఖ్యంగా మెగా హీరోలు ఆయనతో పాటు కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. వారిని సంతోష పరిచేందుకు ఈ సినిమాలో నటుడు సాయధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు నిహారికా కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, చిరు కాంబినేషన్లో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని టాక్ ఉంది.టీజర్ విడుదలయిన తర్వాత సినిమాపై కాస్త నెగెటివిటీ వచ్చింది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేదంటూ విమర్శలు వచ్చాయి. దీంతో వాటి వర్క్ మళ్లీ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఎంతో ప్రతిభ ఉన్న కెమెరామెన్ చోటా కే నాయుడు విషయంలోనూ చిత్ర యూనిట్ కాస్త అసంతృప్తిగా ఉందని ఒక వార్త వైరల్ అయింది. చిరంజీవి నటించిన చాలా హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. వారిద్దరి కాంబో అంటే ఫ్యాన్స్‌కు పండగే.. తెరపై చిరును అద్భుతంగా చూపిస్తారని చోటా కే నాయుడుకు పేరుంది. బింబిసారకు కూడా చోటానే పనిచేయడంతో వశిష్టతో మంచి బాండింగే ఉంది. కానీ, విశ్వంభర విషయంలో కాస్త తేడా కొట్టినట్లు తెలుస్తోంది. అందుకే హాలీవుడ్ నుంచి మరో కెమెరామెన్‌ను లైన్లోకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. -
జూన్ లో పట్టాలపైకి చిరు-శ్రీకాంత్ ఓదెల యాక్షన్ ప్రాజెక్ట్
-
మీరు చాలా మారాలి సార్!
అంతరిక్షంలో చిక్కుకుపోయి, భూమికి చేరేమార్గం కోసం ధైర్యంగా ఎదురుచూస్తున్న సునీతా విలియమ్స్ (Sunita Williams) వంటి సాహసగత్తెల కాలంలో ఉన్నాము. అదే సమయంలో స్త్రీల మీద వివక్షలు మారకపోగా కొత్త రూపాలు తీసుకున్నాయని ఇటీవలి కొన్ని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రాబల్య స్థానాల్లో ఉన్న కొందరు పురుషులు బహిరంగంగా, ఎటువంటి సంకోచాలూ లేకుండా స్త్రీల గురించి చేస్తున్న వ్యాఖ్యలు పితృస్వామ్య సామాజిక స్థితిని దగ్గరగా చూపిస్తున్నాయి. ఈ పురుషుల్లో సినిమా నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, చివరికి న్యాయ, రక్షణ వ్యవస్థలు కూడా ఉండడం వివక్ష తీవ్రతను తెలుపుతున్నది.మాట, చూపు, హావభావ కవళికల్లో పెద్దమనిషితనం ఉట్టి పడుతున్నట్లు కనిపించేలా సవాలక్ష జాగ్రత్తలు తీసుకునే ‘మెగాస్టార్’ ఈసారి దొరికిపోయారు. ఆడపిల్లలతో నిండిన తన ఇల్లు లేడీస్ హాస్టల్లా, తను వార్డెన్‌లా ఆయనకి అనిపించింది. అయిదుగురు చెల్లెళ్లకి రక్షకుడిలా తను నటించిన ‘హిట్లర్’ సినిమా నిజం అనుకున్నారు కాబోలు! అంతేకాకుండా తమ లెగసీ కొనసాగించడానికి ఈసారైనా కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగా చమత్కారపూర్వక సలహా ఇచ్చారు. పసిబిడ్డ మొహాన్ని కూడా బహిరంగపరచకుండా తమ ప్రైవసీని కాపాడుకునే అతని కొడుకూ కోడలూ – తమ ఆడపిల్లకి ఎదురైన ఈ బహిరంగ వివక్షని ఎలా తీసుకుంటారో బహుశా అది వారి కుటుంబ విషయం. కానీ అనేకమంది ఆరాధకులని పెంచి పోషించుకునే ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించవలసినవి. రేపుమాపు ‘మెగా’ అభి మానులందరూ తమ ఇంటి స్త్రీలకి వార్డెన్లగానూ, లెగసీ కోసం కొడుకుల్ని కనమని వేధించేవారిగానూ ఉండడమే ఫ్యాషన్ అనుకుంటే అది ప్రమాదం కనుక ఈ వ్యాఖ్యలని కొందరైనా ఖండిస్తున్నారు. స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో సినీనటుడు బాలకృష్ణ ‘గాడ్ ఆఫ్ వల్గారిటీ’కి ప్రతీకగా మారిపోయారు. స్త్రీలను ఉద్దేశించి నర్మగర్భంగా తను ఎక్కని ఎత్తులు, దిగని లోతులు లేవని అనడం, వెంటపడే పాత్రలు చేస్తే తన ఫాన్స్ ఊరుకోరని, అమ్మాయిలు కనపడగానే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేసేయాలని కోరుకుంటారన్న అసభ్య వ్యాఖ్యలకి కోర్టుకేసులు ఎదుర్కున్నారు. ఒక నటిని పడిపోయేంతగా వేదిక మీద నెట్టడం దగ్గర్నుంచి తన చుట్టూ ఉండే స్త్రీలతో కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వేధింపు పరిధిలోకి వస్తుంది. ఇటీవల విడుదలైన చిత్రంలోని ఒక పాటకు ఆయన వేసిన స్టెప్పులు దిగజారడానికి పరిధులు ఏమీ లేనంత హీనమైనవి. అది కళారంగపు టేస్ట్ అనుకుని వదిలేయనివ్వలేదు బాలకృష్ణ (Balakrishna). అదే నటితో ఒక ప్రయివేట్ పార్టీలో అవే స్టెప్పులు వేస్తూ ఆమెని ఇబ్బంది పెట్టారు. వారికి లేని బాధ మీకేమిటనే అభిమానులకి కొరత లేదు. మగనటుల పవర్, స్త్రీ నటుల అవకాశాలను ప్రభావితం చేస్తుంది కనుక వారు ఊరుకుంటారు. కానీ సమాజం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగంగానే ఇలా ఉంటే కనపడని వేధింపులు ఎన్నో ఊహించలేము. నటుడిగా దాక్కోడానికి చోటు ఉన్నట్లు రాజకీయాల్లో ఉండదు కనుక ఇట్స్ టైమ్ టు స్టాపబుల్ మిస్టర్ ఎమ్మెల్యే!భార్యతో భర్త చేసే బలవంతపు అసహజ శృంగారం నేరం కాదని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (chhattisgarh high court) ఇచ్చిన తీర్పు ఇపుడు చర్చలోకి వచ్చింది. 2017లో జరిగిన ఘటన ఇది. భర్త చేసిన అసహజ లైంగికచర్యల కారణంగా భార్య అనారోగ్యానికి గురయి మరణించింది. మరణ వాంగ్మూలంలో ఆమె ఇదే చెప్పింది. కింది కోర్టు వేసిన పదేళ్ళ శిక్షని కొట్టేసి భర్తని నిర్దోషిగా తేల్చింది హైకోర్టు. మారిటల్ రేప్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతంగా ఆమె శరీరాన్ని తాకకూడదన్నది ఒక విలువగా, హక్కుగా సమాజానికి అలవాటు కావాల్సిన సమయంలో ఈ తీర్పు స్త్రీల లైంగిక స్థితిని కొన్ని రెట్లు వెనక్కి నెట్టేదిగా ఉంది. ఆ భర్త అసహజ లైంగిక చర్య చేయడం గురించి కొంతమంది తప్పు బడుతున్నారు. సహజమా, అసహజమా అన్నది కాదు ముఖ్యం. ఆమె సమ్మతి ముఖ్యం. స్త్రీని లైంగిక కోరికలు తీర్చే వస్తువుగా చూసే పాత ఆలోచనా విధానాన్ని అందరూ సవరించుకోవాల్సిన అవస రాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తోంది. పనిగంటల విషయంలో ఎల్ అండ్ టి ఛైర్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చాలా చర్చల్లోకి వచ్చాయి. వారానికి తొంభై పనిగంటలు పనిచేయాలని సూచిస్తూ ‘ఇంట్లో మీరు మీ భార్య మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలరు, మీ భార్య మీ మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలదు’ అని వ్యాఖ్యానించారు. పనిగంటల భారాన్ని వ్యతిరేకిస్తూ ఇంటిపనులు, బైటిపనులు, వ్యక్తిగత, మానసిక అవసరాల గురించి చాలామంది మాట్లాడారు. అయితే తక్కువగా చర్చకు వచ్చిన విషయం ఒకటి ఉంది. అది ఈ పనిగంటల సూచన కేవలం మగ ఉద్యోగులను ఉద్దేశించినట్లుగా ఉండడం. దాని ద్వారా ఇల్లు, పిల్లలు, వృద్ధుల బాధ్యతలు మగవారి టెరిటరీ కావు, అవి కేవలం స్త్రీలకి ఉద్దేశించినవి మాత్రమేనన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు! మగవారు తమ పూర్తికాలం ఉద్యోగంలో గడిపితే కుటుంబాల సమస్త బాధ్యతలు స్త్రీల మీద పడతాయి. ఉద్యోగం పురుష లక్షణం, ఇల్లు దిద్దుకోవడం స్త్రీ లక్షణంగా ఆ వ్యాఖ్యల అంతరార్థం స్ఫురిస్తోంది. చదవండి: ‘దంగల్’ చూడండి ‘మాస్టారు’పై నాలుగు ఘటనల్లో నాలుగు ప్రధానమైన సమస్యలు మన ముందుకు చర్చకు వచ్చాయి. ఆడశిశువుని పురిటిలోనే చంపేసిన సమాజాలు మనవి. ఆ దశ దాటి వస్తున్నాము. ఆకాశంలో సగాలకి తాము వార్డెన్లమని బాధపడటం కాకుండా– వారి పుట్టుక, ఎదుగు దల, విజయాలు సాధికారికంగా సెలెబ్రేట్ చేసుకోవడం మన వివేకంలో భాగం కావాలి. స్త్రీలకు సొంత లైంగిక వ్యక్తిత్వం ఉంటుంది. అధికారం, హోదా, పేరు ప్రఖ్యాతులతో మదించినవారు ఆ వ్యక్తిత్వం మీద దాడి చేస్తూనే ఉంటారు. చదవండి: దీపికా పదుకోన్ (బాలీవుడ్ నటి) రాయని డైరీధైర్యంగా వ్యతిరేకించే వారు పెరగాలి. న్యాయవ్యవస్థలు న్యాయసూత్రాల పరిధికి లోబడి పనిచేస్తాయి. న్యాయసూత్రాలు కాలం చెల్లినవిగా, స్త్రీలకి రక్షణ కల్పించలేనివిగా ఉన్నప్పుడు వాటిమీద పౌరసమాజం విస్తృత చర్చ చేయాలి. ఇంటిపనికి విలువ కట్టడం సరే, స్త్రీ పురుషుల మధ్య పని విభజనకి మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. వీటన్నిటితో పాటు లోకం తన చూపుకి మరికాస్త స్త్రీ తత్వాన్ని అద్దుకోవాలి.కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
‘దంగల్’ చూడండి ‘మాస్టారు’
‘మగ పిల్లాడు అయితేనే కుస్తీ పోటీల్లో గోల్డ్ మెడల్ తెస్తాడని ఆలోచిస్తూ ఉండేవాడిని..కానీ ఒక్క విషయం అర్థం కాలేదు. కొడుకు తెచ్చిన, కూతురు తెచ్చిన గోల్డ్ గోల్డే కదా’.. దంగల్ సినిమాలో ఆమిర్ ఖాన్ చెప్పే డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్‌తోనే అసలు కథంతా జరుగుతుంది. చివరికి తన కూతుర్ల ద్వారా మల్ల యుద్ధంలో బంగారు పతాకాలు సాధిస్తాడు. ఇది రియల్‌గా జరిగిన కథ. ఇలాంటి కథలు ప్రస్తుత సమాజంలో చాలా జరుగుతున్నాయి. అన్ని రంగాల్లోనూ మగవాళ్లతో సమానంగా రాణిస్తున్నారు. నిజం చెప్పాలంటే కొన్ని రంగాల్లో మగవాళ్లను మించి పోతున్నారు కూడా. అయినా కూడా కొన్ని చోట్ల లింగ వివక్ష కొనసాగుతుంది. వారసత్వం అంటే మగవాళ్లే అనే అపోహలు ఇంకా కొందరిలో ఉన్నాయి. అలాంటి వారికి బుద్ది చెప్పాల్సిన సినీ ‘పెద్ద’ చిరంజీవి(Chiranjeevi) కూడా ఇప్పుడు వారసత్వం కొనసాగించేందుకు కొడుకు కావాలంటున్నారు.కొడుకు ఉంటేనే వారసత్వమా? కూతురు లెగసీని కంటిన్యూ చేయలేదా? చిరంజీవికి సైతం ఈ వివక్ష ఎందుకు? ప్రపంచాన్ని పక్కకి పెట్టినా సరే.. ఆయన ఇంట్లోనే లెజండరీ లేడీస్ ఉన్నారు. కోడలు ఉపాసన వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. పెద్ద కూతురు నిర్మాతగా రాణిస్తోంది. తమ్ముడు కూతురు నిహారిక అటు యాక్టింగ్‌తో పాటు నిర్మాతగానూ దూసుకెళ్తోంది. సొంత ఇంట్లోనే ఇంతమంది సక్సెస్ సాధించిన ఆడవాళ్లు ఉంటే.. ‘ఒక్క మగపిల్లాడిని కనరా?’ అని చరణ్‌ని కోరాల్సిన అవసరమేంటి?ఆచి తూచి మాట్లాడాల్సిందే..సెలెబ్రిటీలు చేసే పనులు, మాట్లాడే మాటలను సామాన్యులు అనుసరిస్తారు. మంచి చేస్తే మెచ్చుకోవడం..చెడు చేస్తే ‘ఛీ’అని తిట్టడం కామన్. అందుకే సెలెబ్రిటీలు ఆకర్షనీయంగా మాట్లాడడం కాదు ఆచితూచి మాట్లాడాలి. లేదంటే చిరంజీవి లాగే అందరూ ట్రోల్ అవుతారు. వాస్తవానికి చిరంజీవి సరదగానే ఆ మాటలు అన్నాడు. అక్కడ విన్నవాళ్లు ఎవరీకి తప్పుగా అనిపించలేదు. కానీ నేషనల్ మీడియాలో సైతం చిరు వ్యాఖ్యలను తప్పుపట్టింది. పురుషాహంకారంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్స్ మెగాస్టార్‌పై ఫైర్ అయ్యారు. ఇక్కడ మీడియాను తప్పపట్టలేం. ఆయన అన్న మాటలనే వార్త రూపంలో ఇచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలే సామాన్యులు అంటే పెద్దగా పట్టించుకోరు. చిరంజీవి లాంటి ప్రముఖుల నోట ఇలాంటి మాటలు రావడం నిజంగా బాధాకరమే.మనవరాళ్లే మాణిక్యాలైతారేమో!చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు చరణ్ ఉన్నాడు. పెద్ద కూతురుకు సుష్మితాకు, చిన్న కూతురు శ్రీజకు ఇద్దరేసి చొప్పున కుమార్తెలు ఉన్నారు. ఇక చరణ్-ఉపాసన దంపతులకు కూడా కూతురే పుట్టింది. ఇంట్లో చరణ్ మినహా మిగతావాళ్లంతా ఆడ పిల్లలేకావడంతో చిరంజీవి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇక్కడ మెగాస్టార్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనవారాళ్లు కూడా ఆయనను మించి రాణిస్తారేమో. దంగల్ సినిమా మాదిరే వివిధ రంగాల్లో చరిత్ర సృష్టిస్తారేమో. కొడుకు ఉంటే లెగసీ కంటిన్యూ అవుతుందనే అపోహ నుంచి ‘మాస్టారు’ బయటకు రావాలి. -
మీ డ్రామాల్ని కట్టిపెట్టండి.. పవన్,చిరంజీవికి కేఏపాల్ చురకలు
సాక్షి,అమరావతి : ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏపాల్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస రాజకీయ పరిణామలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 70 ఏళ్ల వయస్సున్న చిరంజీవి మతి తప్పిందా. కొత్త వేషమా. ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారు. పవన్‌ను నమ్మి కుమారుడికే అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు. వాళ్ళకి ఓటు బ్యాంక్ లేదన్న వాస్తవం మీకు తెలియదా. న్యాయ వ్యవస్థల్ని వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో ఆధారాలు సరైన టైంలో బయటపెడతా.చిరంజీవి, పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్‌గా తీసుకోకండి. వాళ్ళ పదవుల విషయంలో డీల్ కుదరక ఈ డ్రామాలు. సనాతన ధర్మం టూర్ చేసే ముందు మీ భార్య కన్నీళ్లు పెడుతుంది గుర్తు చేసుకో. పవన్ మిమ్మల్ని వదిలేయక ముందే.. చంద్రబాబు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేస్తాడని, రేవంత్ రెడ్డి మోసాల గురించి నాకు ఎప్పుడో తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు..నేను సుప్రీం కోర్టులో కేసు వేస్తున్నా. దమ్ముంటే ఈవీఎం ఎన్నికలు కాకుండా బ్యాలెట్ ఎలెక్షన్స్ పెట్టండి’అని కేఏపాల్ డిమాండ్ చేశారు. -
చిరంజీవిని చుట్టుముట్టిన వివాదాలివే.. (ఫోటోలు)
-
మెగా వర్సెస్ అల్లు.. అసలేం జరుగుతుంది?
టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఇరు కుటుంబాల నుంచి స్టార్స్ ఉన్నారు. అయితే మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ అయినా అల్లు ఫ్యామిలీ అయినా ఒకటే అనే భావన అందరిలో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఇరు కుటుంబాల మధ్య మాత్రం కోల్డ్ వార్ నడుస్తోంది. ఆ విషయం ఇండస్ట్రీ వరకే పరిమితం కాకుండా అభిమానుల వరకు చేరింది. దానికి కారణం సోషల్ మీడియా అనే చెప్పాలి. మొన్నటి వరకు ట్విటర్, ఇన్‌స్టా గ్రామ్‌లో అల్లు అర్జున్(Allu Arjun)ని ఫాలో అయినా మెగా హీరోలు.. ఇప్పుడు వరుసగా అన్ ఫాలో అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా మేనల్లుడు సాయి దుర్గాతేజ్ బన్నీని అన్‌ఫాలో చేయడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా యుద్ధమే ప్రారంభించారు. ఒకరినొకరు ట్రోల్ చేస్తూనే ఉన్నారు.(చదవండి: మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్)ఇక పుష్ప 2 రిలీజ్ సమయంలో మెగా హీరోలెవరూ ఆ సినిమా గురించి మాట్లాడలేదు. ఏ చిన్న సినిమా విజయం సాధించినా మాట్లాడే చిరంజీవి.. పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డులను బద్దలు కొట్టినా.. స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చిరంజీవితో సహా సినీ ప్రముఖులంతా పరామర్శిస్తే.. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మాత్రం తమకు తెలియదన్నట్లుగానే ఉన్నారు. పవన్ కల్యాణ్ అయితే ‘సంధ్య థియేటర్’ ఘటనలో అల్లు అర్జున్‌దే తప్పు అన్నట్లుగా మాట్లాడాడు. అయితే అరెస్ట్ తర్వాత బన్నీ వెళ్లి చిరంజీవిని కలవడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు సమిసిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా రామ్ చరణ్(Ram Charan) ఇన్‌స్టాలో బన్నీని అన్ ఫాలో చేయడంతో అలు మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య ఏం జరుగుతుందనే చర్చలు మొదలయ్యాయి.బన్నీ మాత్రమే..రామ్ చరణ్- బన్నీల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వరుసకు బావ బామ్మర్దులు అయినా..అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్లు. చరణ్ కంటే ముందే బన్నీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనికి ఇన్‌స్టాలో 28.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే బన్నీ మాత్రం తన సతీమణి స్నేహరెడ్డిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా ఇన్‌స్టాలోకి వచ్చినా..26 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన 38 మందిని ఫాలో అవుతున్నాడు. (చదవండి: 'ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలా?'.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన శ్యామల)మొన్నటి వరకు ఆ లిస్ట్‌లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడెన్‌గా అన్ ఫాలో చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే అల్లు అర్జున్ ను చరణ్ అన్‌ఫాలో చేసినప్పటికీ, ఆయన తమ్ముడు అల్లు శిరీష్ ని మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం. మరోవైపు మెగా కోడలు ఉపాసన కొణిదెల మాత్రం బన్నీని ఫాలో అవుతోంది. దీంతో చరణ్ - బన్నీ మధ్యే ఏదో సమస్య ఉండి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.చరణ్ స్పందించేనా?ఈ మధ్య సోషల్ మీడియాలో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దం నడుస్తోంది. మెగా హీరోలు ఏం మాట్లాడినా.. దానికి అల్లు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అలాగే అల్లు ఫ్యామిలీ సరదాగా మాట్లాడినా సరే.. కావాలనే హేళన చేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్ గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజుపై అల్లు అరవింద్ సరదాగా పంచులేస్తే.. దాన్ని రామ్ చరణ్‌కి ఆపాదించి..అరవింద్‌ని ట్రోల్ చేశారు. అది భరించలేక చివరకు అరవింద్ వివరణ ఇచ్చాడు. తన మేనల్లుడు చరణ్‌తో మంచి రిలేషన్ ఉందని చెప్పాడు. ఇది చెప్పి వారం రోజులు కూడా దాటకముందే బన్నీని చరణ్ అన్‌ఫాలో చేయడం గమనార్హం. మరి ఇది పొరపాటున జరిగిందా లేదా కావాలనే అన్ ఫాలో చేశాడా అనేది తెలియాలి. ఒకవేళ దీనిపై చరణ్ స్పందించపోతే..ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మళ్లీ సోషల్ మీడియా వార్ జరుగడం ఖాయం. ఈ ‘అన్ ఫాలో’ గొడవకి ఫుల్ స్టాప్ ఎవరు పెడతారో చూడాలి. -
ఈసారైనా రామ్ చరణ్ కు కొడుకు పుడితే బాగుండు: చిరంజీవి
-
చరణ్‌కు ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉంది: చిరంజీవి
తనకు వారసుడు కావాలని మనసులో మాట బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈసారైనా రామ్‌చరణ్ (Ram Charan)కు కొడుకు పుడితే బాగుండు అని ఆకాంక్షించారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా అనిపించదు.ఒక్క మగపిల్లాడు లేడులేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగపిల్లాడు లేడు. చరణ్.. ఈసారైనా సరే ఒక మగపిల్లాడిని కనరా.. నా వారసత్వం ముందుకువెళ్లాలని కోరిక. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని నా భయం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం చెలరేగింది. చిరంజీవి వారసుడిని కోరుకోవడం తప్పు లేదు కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందనడం కరెక్ట్ కాదని పలువురూ అభిప్రాయపడుతున్నారు. కాగా రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు 2023లో క్లీంకార పుట్టింది.సినిమాబ్రహ్మా ఆనందం సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మానందం (Brahmanandam), ఆయన కుమారుడు గౌతమ్ తాతామనవడిగా నటించారు. వెన్నెల కిశోర్, ప్రియ వడ్లమాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్, సావిత్ర సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.రాజకీయాలపై చిరు కామెంట్స్ఈ క్రమంలో ఫిబ్రవరి 11న బ్రహ్మా ఆనందం ప్రీరిలీజ్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్లో చిరంజీవి రాజకీయాలు, సినిమాల గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని. రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు ఒత్తిడిగా ఫీలయ్యాను. ప్రతి ఒక్కరినీ ఏదో ఒకటి అనాలని తిట్లు రాసుకోవాల్సి వచ్చేది. అది నాకు మరింత ఒత్తిడిగా అనిపించింది. నవ్వడమే మర్చిపోయాను.ఆ సినిమాతో మళ్లీ నవ్వడం ప్రారంభించా..నాలో హాస్య గ్రంథులు పోయాయేమో అనుకున్నాను. సినిమాల్లోకి తిరిగివచ్చాకే మళ్లీ నా పెదాలపై చిరునవ్వు వచ్చింది. ఖైదీ నెంబర్ 150 మూవీతో నవ్వడం ప్రారంభించాను. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగానే ఉంటూ సినిమాలకు అత్యంత దగ్గరగా ఉంటాను. అయినా సరే చాలామందికి నాపై చాలా అనుమానాలు వస్తున్నాయి. కానీ నేను రాజకీయాల్లోకి వెళ్లను అని క్లారిటీ ఇచ్చారు.చదవండి: రామ్ చరణ్ ఇంటికి తిరిగొచ్చిన 'కుట్టి' -
రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ప్రచారంపై చిరంజీవి క్లారిటీ
-
చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్..
-
‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రాజకీయాలకు దూరంగా... సినిమాలకు దగ్గరగా ఉంటా: చిరంజీవి
‘‘బ్రహ్మానందం(Brahmaanandam)లో స్పార్క్‌ని గమనించి నేను తనని మద్రాసు తీసుకువెళ్లాను. మా ఇద్దరి మధ్య మంచి బంధం, ప్రేమానురాగాలు, గురు–శిష్యుల అనుబంధం ఉన్నాయి. ఓ రోజు బ్రహ్మానందం ఇంటికి వెళితే ఎన్నో అవార్డులు ఉన్నాయి. తన చరిత్ర అంతా ఓ గదిలో కనిపించింది. అలాంటి బ్రహ్మానందం కొడుకు చేసిన రెండు మూడు సినిమాలు అంతంతగా అలరించినా సరే... మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని హీరో చిరంజీవి(Chiranjeevi)అన్నారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధానపాత్రల్లో, ‘వెన్నెల’ కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలకపాత్రల్లో నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’.ఉమేష్ కుమార్, సావిత్ర సమర్పణలో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’(Brahmaanandam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(pre release event)కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై, అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు (బ్రహ్మానందం) పుత్రోత్సాహం కలుగుతుంది. నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ విధంగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో, అలానే నువ్వూ అనుభవించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అత్తిలిలో నేను లెక్చరర్‌గా చేస్తున్నప్పుడు భీమవరం వెళ్లి ‘ఖైదీ’ సినిమా చూశాను. చిరంజీవి ట్రెండ్ సెట్టర్. ఆయన చూడని చరిత్రా... చెప్పని చరిత్రా. చిరంజీవి కింగ్ ఆఫ్ వరల్డ్ సినిమా. ఈ వేడుకకు చిరంజీవిగారిని చీఫ్ గెస్ట్‌గా పిలవాలనుకుని కాస్త తటపటాయించాను. 9వ తారీఖు ఒక ఫంక్షన్. మళ్లీ 11న మరొక ఫంక్షన్ కదా అనుకున్నాను. ‘గౌతమ్ నీకు బిడ్డ. నాకూ బిడ్డలాంటి వాడే..’ అన్నారు. నన్ను తొలిసారి చెయ్యి పట్టుకుని విమానం ఎక్కించింది చిరంజీవిగారే. ఇప్పుడు నా బిడ్డ చేయిపట్టుకుని ఈ విమానం ఎక్కిస్తున్నారు.మంచి సినిమాలు తీయాలనే అభిరుచి ఉన్న కుర్ర నిర్మాతల్లో రాహుల్ ఒకడు. ఇది తాత–మనవడు గురించి చెప్పే కథ. ఈ సినిమా చాలా బాగుంటుంది’’ అన్నారు. ‘‘హీరో అనే పదానికి నాకు మీనింగ్ చిరంజీవిగారే. బ్యూటిపుల్ ఎమోషనల్ మూవీ ఇది. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్‌లో అందరూ హాయిగా చూడండి’’ అన్నారు రాజా గౌతమ్. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా అంటే బ్రహ్మానందంగారే. ఆయనతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. రాజా గౌతమ్‌గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఆర్వీఎస్ నిఖిల్. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చినందుకు ఈ వేదికపై ఆయన్ను బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ సన్మానించారు.అప్పుడు ఒత్తిడిగా ఉండేది సినిమాల్లో ఉండగా నేను ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని. పొలిటికల్ సైడ్ వెళ్లినప్పుడు కాస్త ఒత్తిడిగా ఉండేది. అన్నవాడిని, అననివాడిని కూడా ఏదో అనాలని తిట్లు రాసుకోవాల్సి వచ్చేది. ఒత్తిడిగా ఫీలయ్యేవాడిని. ఎందుకు స్పందించడం లేదని మా ఆవిడ నన్ను అడిగింది. నాలో హాస్య గ్రంథులు ΄ోయాయేమో అనుకున్నాను. ‘ఖైదీ నెంబరు 150’ తర్వాత మళ్లీ నవ్వడం ప్రారంభించాను. ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటాను. చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్లందరికీ దగ్గరవుతున్నాడు, వాళ్లందరూ దగ్గరకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా అటు (రాజకీయాలు) వెళ్తాడా అని. కాదు... మరో రకంగా సేవలు అందివ్వడం కోసమే తప్ప పొలిటికల్‌గా వెళ్లడం అనేది లేదు. – చిరంజీవి -
అలనాటి స్టార్ హీరోయిన్ కూతురి పెళ్లి.. చిరంజీవి సినిమాలో కూడా!
కన్నడ సినీ ఇండస్ట్రీలో జయమాల అప్పట్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కన్నడతో పాటు తెలుగు, తుళు, తమిళ భాషల్లో కూడా హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన జయమాల పెరిగింది మాత్రం చిక్మంగళూరు జిల్లాలోనే. ఆమె కాస్ దాయె కండన అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత నటిగా ఫేమ్ తెచ్చుకున్న ఆమె కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్(తెలుగు నాట కన్నడ ప్రభాకర్‌గా పాపులర్) వంటి సుప్రసిద్ధ కన్నడ స్టార్ హీరోల సరసన నటించింది.తాజాగా ఆమె కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు కన్నడ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. కిచ్చా సుదీప్, కేజీఎఫ్ హీరో యశ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చిరంజీవితో జయమాల..కాగా.. తెలుగులో జయమాల అర్జున గర్వభంగం (1979), భామా రుక్మిణి (1983), రాక్షసుడు (1986)(చిరంజీవి) చిత్రాల్లో నటించింది. రాక్షసుడు చిత్రంతో ఈమె తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలసి "నీ మీద నాకు ఇదయ్యో...అందం నే దాచలేను పదయ్యో.." అనే పాటతో మెప్పించింది. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో చిరంజీవితో పాటు తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మించగా.. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.కాగా.. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్‌ను వివాహం చేసుకుంది. అనేక తెలుగు చిత్రాల్లో విలన్‌గా బాగా పాపులరిటీ తెచ్చుకున్నారు. రాక్షసుడు చిత్రంలో కూడా ప్రధాన విలన్‌గా నటించడం విశేషం. అయితే కొన్ని కారణాల రీత్యా జయమాల అతడికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామెన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లాడింది. వీరిద్దరికి సౌందర్య అనే కుమార్తె ఉంది. తాజాగా తన కూతురి పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించింది జయమాల. -
బాలయ్య కాంపౌండ్‌లోకి చిరు?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సాధారణంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు. సందర్భం ఏదైనా సరే ఆయన ప్రసంగాలు ఎప్పుడూ చాలా సెన్సిబుల్‌గా, ఆలోచింపజేసేవిగా ఉంటాయి. తన వయసుకు తగ్గట్టుగా, సినీ పరిశ్రమలోని యువతరానికి దిశానిర్ధేశ్యం చేసే విధంగా మాట్లాడడానికే ఆయన ఇటీవల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన యువ హీరోల ప్రీ రిలీజ్లు, ఆడియో రిలీజ్లు, జర్నలిస్ట్‌ల బుక్ రిలీజ్లు... ఇలా వీలైనన్ని కార్యక్రమాలకు హాజరవుతూ వారిని ఆశీర్వదిస్తూ ప్రస్తుతం పరిశ్రమకు పెద్ద దిక్కు లేని లోటు తీరుస్తున్నారు. నిజానికి సుదీర్ఘ సినీ ప్రయాణం చేసిన చిరంజీవి లాంటి సీనియర్ నటులు ఎవరైనా చేయాల్సిన పని అదే. మరీ ముఖ్యంగా ఎవరి అండా లేకుండా ఎన్నో కష్టనష్టాలు, వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూసిన చిరంజీవి లాంటి వారి మార్గదర్శకత్వం యువ తరానికి ఎప్పుడూ కావాల్సిందే అనడంలో సందేహం లేదు.నిన్నటి తరం హీరోలు ఆ విధంగా నేటి తరాన్ని గైడ్ చేయడం ఎంతైనా అవసరం. అందుకు తగిన సత్తా, అందుకు తగినంత అనుభవం...వీటన్నింటినీ మించి నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా ఉండే స్వభావం వల్ల చిరంజీవి మాత్రమే అందుకు అర్హులు కూడా. ఆయనతో సమకాలీకుడైనప్పటికీ బాలకృష్ణ లో ఆ పాత్ర పోషించగల నేర్పు, ఓర్పు లేవు. ఆయనకు ఉన్న నోటి దురుసుతనం కావచ్చు, ప్రసంగాల్లో అపరిపక్వత కావచ్చు... ఆయన యువతరానికి మార్గదర్శకత్వం వహించడానికి నప్పరు. ఇక వెంకటేష్, నాగార్జునలకు సైతం ఆ శక్తి, ఆసక్తి కూడా లేవు కాబట్టి వారు చేయలేరు...చేయరు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు పెద్ద సంఖ్యలో వస్తున్న యంగ్ టాలెంట్‌కు చిరంజీవి మాటలు శిరోధార్యంగా అనిపిస్తాయి.అయితే ఇంతటి బాధ్యతను అప్రయత్నంగానే తలకెత్తుకున్న చిరంజీవి ప్రసంగాలు ప్రవర్తన ఇటీవల దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. తాజాగా లైలా(Laila Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు ఈయన చిరంజీవేనా లేక బాలయ్యగా మారిపోయారా అన్నట్టుగా ప్రవర్తించారు. సినిమాలో విష్వక్సేన్ పాత్ర గురించి చెబుతూ అమ్మాయి గెటప్‌లో అందంగా ఉన్నాడు అని చెప్పి సరిపెట్టకుండా పదే పదే భలే ఉన్నాడు బుగ్గ కొరికేయాలని అనిపించింది మగవాళ్ల మనసు దోచుకుంటాడు... అంటూ బబర్థస్త్ కామెడీకి తీసిపోకుండా మాట్లాడడం ఆశ్చర్యకరం. అలాగే ఆ సినిమా హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా చిరంజీవి స్పందించిన విధానం ఆయన నైజానికి విరుద్ధంగా కనిపించింది. ఆమెతో నాతో చేయి కలిపావుగా ఇక గుర్తుండిపోతావు, థాంక్యూ అంటూ అనడం, ఇక సుమను లండన్‌కు తీసుకెళతానంటూ సందర్భం లేకుండా మాట్లాడడం... ఆయన స్థాయికి తగ్గట్టుగా అనిపించదు.ఈ ఈవెంట్ ప్రారంభంలో తాను బాలయ్య కాంపౌండ్ హీరో అయిన విష్వక్సేన్ సినిమా వేడుకకు రావడం గురించి వినిపించిన వ్యాఖ్యానాలపై చిరంజీవి మాట్లాడారు. పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చారు. ఆ సంగతి ఎలా ఉన్నా... ఈ ఫంక్షన్లో ఆయన తీరు చూస్తే... ఆయన కూడా బాలయ్య కాంపౌండ్‌లో చేరిపోయారా అన్నట్టుగా ఉందని కొందరు సినీజీవులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి తాను పోషిస్తున్న పెద్దన్న పాత్రకు వన్నె తెచ్చే విధంగా తన ప్రవర్తనను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. -
‘లైలా’ మెగా మాస్ ఈవెంట్ ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్: చిరంజీవి
‘‘ఇండస్ట్రీలో అందరూ ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి, మంచి సుహృద్భావ వాతావరణంలో ఉన్నరోజున అందరూ ఆనందంగా, గొప్పగా చెప్పుకుంటారు. అందుకే సాహు, విశ్వక్ సేన్(Vishwak Sen) వచ్చి అడగ్గానే ‘లైలా’(Laila) ఫంక్షన్‌కి వచ్చాను. నాకు తెలిసి ఇకపై ఆ కాంపౌండ్.. ఈ కాంపౌండ్ అంటారని అనుకోవడం లేదు. ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్ అంతే’’ అని హీరో చిరంజీవి(Chiranjeevi) అన్నారు. విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లైలా మెగా మాస్ ఈవెంట్’కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘విశ్వక్ సేన్ ‘లైలా’ ఫంక్షన్‌కి నేను వెళుతున్నానని చెప్పినప్పుడు కొందరు.. ‘విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి వెళుతున్నావా? అతను మన మనిషి కాదు.. అవతల బాలకృష్ణ... అప్పుడప్పుడు తారక్ అంటాడు’ అన్నారు. మనుషులన్నాక వేరే వాళ్లమీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నామీద ఆ΄్యాయత ఉండకూడదా? ఇదేంటిది?. మా ఇంట్లోనే మా అబ్బాయికి(రామ్‌చరణ్) సూర్య అంటే చాలా ఇష్టం.అంత మాత్రాన వాడి ఫంక్షన్స్‌కి నేను వెళ్లకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా?. మా హీరోల మధ్య సఖ్యత ఉండదేమో అనుకుని గతంలో అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్లు. వాల్‌పోస్టర్లు చింపుకునేవాళ్లు. నెల్లూరులోని మా కజిన్స్లో ఇద్దరు సొంత అన్నదమ్ములైనా ఒకరు ఎన్టీఆర్, మరొకరు ఏఎన్ఆర్గార్లను అభిమానించే వాళ్లు. వాళ్లిద్దరూ ఓ రోజు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు.. అప్పుడు నేను వాళ్ల కంటే చిన్నవాణ్ణి కావడంతో కంగారు పడ్డాను. సినిమా హీరోలంటే బాగానే ఉంటారు.. కానీ వీళ్లు కొట్టుకుని చస్తారేంటి అని ఆరోజే అనిపించింది.నేను ఫిల్మ్ యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య ఓ సఖ్యత, సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను. మద్రాస్‌లో హనీ హౌస్‌లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్లం. ఈ రోజుకి నేను, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ అంతా కలిసికట్టుగా ఉంటాం. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. మన ఇమేజ్, ఫ్యాన్ బేస్ పెరగాలంటే మనం చేసే సినిమాలను బట్టి ఉంటుందే తప్ప మనం దూరంగా ఉండటం వల్ల కాదు. ‘పుష్ప 2’ సినిమా పెద్ద హిట్ అయినందుకు గర్విస్తాను.మన సినిమాలు ఆడొచ్చు, ఆడక పోవచ్చు కానీ, ఇండస్ట్రీలో ఓ సినిమా ఆడిందంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఎందుకంటే ఓ సినిమా మీద ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒక్క హిట్ ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఆనంద పడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్లీ ఇండస్ట్రీలోనే సినిమాలపైనే పెడతారు నిర్మాతలు. ‘లైలా’ ట్రైలర్ చూసిన తర్వాత విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయ్యుంటే గుండెజారి గల్లంతయ్యేది(నవ్వుతూ).. అంతగ్లామర్గా ఉన్నాడు. ‘లైలా’ బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ’’ అన్నారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ–‘‘నా సినిమాని సపోర్ట్ చేయడానికి చిరంజీవిగారు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. డైరెక్టర్ రామ్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌గారు ‘లైలా’ సినిమా కథ ఒప్పుకోవడమే నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్.. ఇది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అన్నారు. -
విశ్వంభరలో మరో సర్పైజ్
-
బోర్డులో భాగం కావడం సంతోషంగా ఉంది.. మోదీకి చిరంజీవి ధన్యవాదాలు
మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. భారతీయ సినీపరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులతో పాటు వ్యాపారవేత్తలను కలిపి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో పలు నిర్ణయాలను తీసుకోనుంది. అందుకు లక్ష్యంగా ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(వేవ్స్)’ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఎంతో ఘనంగా జరగనున్న ఆ సమ్మిట్ కోసం వారి నుంచి సలహాలు, సూచనలు ఆయన తీసుకున్నారు. ఇందులో తాను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని సోషల్‌మీడియా వేదికగా చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో మాట్లాడుతోన్న వీడియోను ఆయన షేర్ చేశారు. వేవ్స్ సమ్మిట్ కోసం అడ్వైజరీ బోర్డ్‌లో తాను భాగం కావడం సంతోషాన్ని ఇచ్చిందంటూ ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్,షారుఖ్‌ఖాన్,ఆమిర్‌ఖాన్,అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి, అక్షయ్‌కుమార్, హేమమాలినీ, దీపికా పదుకొణె ఉన్నారు. సౌత్ నుంచి రజనీకాంత్, నాగార్జున,ఎ. ఆర్. రెహమాన్మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. భారత ప్రముఖ వ్యాపార సంస్థల అధినేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా ఈ సమ్మిట్‌పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీ పూర్తి అయిన తర్వాత మోదీ కూడా తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు.Thank you Hon’ble Prime Minister Shri @narendramodi ji for this honor. 🙏🙏It was indeed a privilege to be part of the Advisory Board for WAVES ( World Audio Visual Entertainment Summit ) and share my two cents along with other esteemed members. I have no doubts that #WAVES,… https://t.co/zYxpiWVgli pic.twitter.com/VvFj0XGjzt— Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2025 -
వచ్చే సంక్రాంతి కోసం చిరు మెగా ప్లాన్
-
ఇండియాలో రిచ్ స్టార్ మన టాలీవుడ్ హీరోనే. .ఏ హీరో ఆస్తి ఎంతంటే..?
ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్ని విధాలుగా మన టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. వ్యక్తిగత సంపదలో సైతం అక్కడి అగ్రగామి నటులదే పైచేయిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఉత్తరాది చిత్రాల రికార్డ్స్‌ను మన టాలీవుడ్ తుడిచిపెడుతున్నట్టే... సంపద విషయంలోనూ వారిని మనవాళ్లు తోసిరాజంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది మనీ కంట్రోల్ అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ చెబుతున్న ప్రకారం చూస్తే... దక్షిణాదికి చెందిన అత్యంత సంపన్న తార వాస్తవానికి బాలీవుడ్లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీకంట్రోల్ తేల్చి చెప్పింది. సంస్థ విశ్లేషణ ప్రకారం, నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు (రూ.3572 కోట్లకు పైగా) కలిగి ఉన్నారు, తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్‌లో ఒకరుగా నిలిచారు. మన నాగ్ కన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ బచ్చన్ (రూ.3200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ3100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2700 కోట్లు) అమీర్ ఖాన్ (రూ1900 కోట్లు) వంటి ఎ–లిస్ట్ బాలీవుడ్ తారల కంటే నాగార్జున ముందున్నారు.నాలుగు దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో, నాగార్జున సమకాలీనుడైన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు, ఆయన నికర ఆస్తుల విలువ రూ1650 కోట్లు. ఇతర అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో రామ్ చరణ్ (రూ1370 కోట్లు), కమల్ హాసన్ (రూ600 కోట్లు), రజనీకాంత్ (రూ500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ500 కోట్లు), ప్రభాస్ (రూ250 కోట్లు)...గా ఉన్నారు. నిస్సందేహంగా నాగార్జున తెలుగు సినిమాలలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. కానీ, ఆయన సమకాలికులైన చిరంజీవి కన్నా అలాగే నేటి బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్ రామ్ చరణ్ కన్నా కూడా ఎలా సూపర్‌రిచ్ అయ్యారు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్‌ను సాధించారని సదరు మనీ కంట్రోల్ వెల్లడించింది.నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన దైన మార్క్‌ని చూపారు. టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ అయిన ఎన్3 రియల్టీ ఎంటర్‌ప్రైజెస్‌ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం, నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.900 కోట్లు. అలాగే నాగార్జునకు మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక థృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనార్హం. -
చిరంజీవితో 'మెగా' సినిమా ప్లాన్ చేస్తున్న హిట్ డైరెక్టర్
టాలీవుడ్లో వరుస హిట్ సినిమాలతో డైరెక్టర్ బాబీ కొల్లి స్పీడ్ పెంచాడు.. తాజాగా డాకు మహారాజ్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించాడు. 2023 సంక్రాంతి సమయంలో మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) వాల్తేరు వీరయ్య చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇలా భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన మరోసారి చిరంజీవితో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన కథను కూడా బాబీ రెడీ చేస్తున్నాడట. ఈ సారి మరింత బలమైన కథతో పాటు పాన్ ఇండియా రేంజ్లో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస సినిమాలతో వేగం పెంచుతున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ ముగింపు దశకు చేరుకుంది. 2025 సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఆ వెంటనే దర్శకులు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో మెగా సినిమాలను చిరు ప్లాన్ చేశారు. అయితే, వీరిలో మొదట అనిల్ సినిమానే ప్రారంభం అవుతుందని సమాచారం. ఇలా రెండు ప్రాజెక్ట్‌లు తన చేతిలో ఉండగానే బాబీ కొల్లికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశముంది. కమర్షియల్ చిత్రాల్ని తనదైన పంథాలో తెరకెక్కిస్తూ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా బాబీ పేరు తెచ్చుకున్నారు. చిరుతో వాల్తేరు వీరయ్యను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి వస్తున్నారనే వార్తలు రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. -
‘ఎక్స్పీరియం’ పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్,చిరంజీవి (ఫొటోలు)
-
తెలంగాణకు మణిహారంగా ఎక్స్పీరియం ఎకోపార్కు
శంకర్పల్లి: ‘ఎక్స్పీరియం ఎకోపార్కు’రాష్ట్రానికి మణిహారంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో 85 దేశాల నుంచి తెచ్చిన 25 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన ‘ఎక్స్పీరియం’ఎకో పార్కును ప్రముఖ సినీనటుడు చిరంజీవి, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పార్కు యజమాని రాందేవ్రావుతో కలిసి ఎలక్ట్రిక్ వాహనంలో తిరుగుతూ పార్కును పరిశీలించారు.మొక్కల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వనజీవి రామయ్య దంపతులు, ఇటీవల గవర్నర్ పురస్కారానికి ఎంపికైన దుశ్చర్ల సత్యనారాయణను సీఎం రేవంత్‌రెడ్డి, చిరంజీవి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎక్స్పీరియం ఎకోపార్కు లోగో, కాఫీ టేబుల్‌బుక్‌ను ఆవిష్కరించారు. అయితే కార్యక్రమ ప్రారంబోత్సవంలో వేదికపైకి వనజీవి రామయ్యను పిలవకపోవడాన్ని గమనించిన సీఎం..వారిని వేదికపైకి పిలిచి గౌరవించారు. టూరిజంతోనే గుర్తింపు, ఆదాయం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రాణించిందని, టూరిజంను అభివృద్ధి చేసేందుకు వనరులున్నా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. టూరిజం ద్వారానే రాష్ట్రానికి గుర్తింపు, ఆదాయం లభిస్తుందని తెలిపారు. త్వరలోనే నూతన టూరి జం (టెంపుల్, ఎకో, హెల్త్) పాలసీని తీసుకొచ్చేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. వికారాబాద్ ప్రాంతంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని, ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్‌గా మారుస్తామని, ఇందుకోసం పెద్ద పెద్ద పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. 25ఏళ్ల కలను సాకారం చేసుకున్న ఎక్స్పీరియం పార్కు యజమాని రాందేవ్‌రావును సీఎం ప్రత్యేకంగా అభినందించారు.ఈ పార్కు తెలంగాణ పర్యాటక రంగానికి ఎంతో దగ్గరగా ఉందని, ప్రస్తుతం 30 శాతం మాత్రమే పూర్తయిందని, ఏడాదిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీనికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు. వనజీవి రామయ్య జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీఎం రమేశ్, అనిల్‌కుమార్, శాసనమండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నా సంపాదన అంతంతే: చిరంజీవి ‘రాందేవ్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. దేశ, విదేశాల్లోని మొక్కలను తీసుకొచ్చి చూపిస్తూ తీసుకోండి సార్ అనేవారు. అప్పుడు రూ.వేలల్లో ఉన్న మొక్కలు ధరలు, ఇప్పుడు కోట్లలో ఉన్నాయి. ప్రస్తుతం నా సంపాదన అంతంత మాత్రమే ఉంది. తర్వాత కొనుగోలు చేస్తానంటూ’మెగాస్టార్ చిరంజీవి చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.ప్రొద్దుటూరులో రాందేవ్రావు నిర్మించిన ఎక్స్పీరియం పార్కును చూడాలంటే కళా హృదయం ఉండాలని చిరంజీవి అన్నారు. తనకు ఈ ప్రాంతంతో 25 ఏళ్ల క్రితం నుంచి అనుబంధం ఉందన్నారు. 2000లో జీవం ఉన్న మొక్కలను అందించి రాందేవ్ తననే ఆశ్చర్యపరిచారని, ఆ మొక్కలు నేటికి తన గార్డెన్లో ఉన్నాయని తెలిపారు. షూటింగ్‌లకు అనుమతి ఇస్తారా అంటే తనకే ఫస్ట్ ఇస్తానని రాందేవ్ చెప్పారని, రానున్న రోజుల్లో ఇక్కడ షూటింగ్ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపారు. -
సీఎం రేవంత్ కంటే నాకే ఎక్కువ నచ్చింది: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: ఎక్స్పీరియం పార్క్ హైదరాబాద్‌కు తలమాణికంగా మారుతుందన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఇక్కడ ఏర్పాటు చేసిన చెట్లు తనను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయన్నారు. చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాందేవ్ 2000వ సంవత్సరంలో ఈ పార్క్ మొదలు పెట్టారు. ఆయన చాలా రీసెర్చ్ చేసి విదేశాల నుంచి మొక్కలు తెచ్చి నాటారు. అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి ఈ పార్క్‌ను చూసి ముచ్చట పడ్డారు. అయితే ఈ పార్క్ మీకంటే ముందు నాకు చాలా బాగా నచ్చింది. ఈ పార్క్‌లో వెడ్డింగ్స్, ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యానవనం వల్ల చాలామంది ఉపాధి దొరుకుతుంది అని ఆకాంక్షించారు.చదవండి: ధనుష్ Vs నయనతార.. హీరోకు మద్దతిచ్చిన కోర్టు! -
షార్జా స్టేడియంలో చిరంజీవి సందడి (ఫోటోలు)
-
ట్రోలర్స్‌పై తమన్ ఆవేదన.. చిరంజీవి కామెంట్స్
డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ (Thaman) చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాను ట్రోల్ చేస్తున్న వారిని చూస్తుంటే భయంతో పాటు సిగ్గుగా ఉందని ఆయన అన్నారు. ట్రోల్స్ చేసుకుంటూ మన సినిమాను మనమే చంపేస్తున్నామని తమన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా సోషల్ మీడియా వేదికగా తమన్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు.'డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అనిపించింది. (ఇదీ చదవండి: కలిసి మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మనోజ్)విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఉచితమే, ఒక్కోసారి ఆ మాటలు కొందరికి స్ఫూర్తిగా నిలిస్తే.. మరొకరిని నాశనం చేస్తాయి. అయితే, ఆ మాటల ఎంపిక మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది' అని చిరు అన్నారు. ట్రోలర్స్‌పై తమన్ వ్యాఖ్యలుసినిమాలపై ట్రోలింగ్ గురించి తమన్ ఇంకా ఏమన్నారంటే.. జీవితంలో విజయం చాలా గొప్పది. అది లేకపోతే మనుషుల్ని తక్కువ చేసి చూస్తారు. మేమంతా కూడా ఆ విజయం కోసం పోరాడుతుంటాం. జీవితం ముందుకు సాగడానికి విజయం దోహదపడుతుంది. ప్రస్తుతం ఒక నిర్మాత విజయాన్ని అందుకుంటే దాని గురించి బహిరంగంగా మాట్లాడటం కష్టంగా మారింది. నిర్మాతలు మనకు దేవుళ్లతో సమానం. కాబట్టి హీరోలతో పాటు ఫ్యాన్స్, చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. అలాంటి వాటి వల్ల సినిమా చాలా నష్టపోతుంది. నేను బాలీవుడ్, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు అక్కడివారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని ఉందని నాతో అంటూ ఉంటారు. కానీ, మనవాళ్లు తెలుగు సినిమాలను చులకనగా చూస్తున్నారు. ఇది ఎంతో దారుణమైన విషయం. మనమే మన సినిమాని చంపేస్తుంటే ఎలా..? ఒక సినిమా విజయం గురించి కూడా బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మీకేవైనా ఇబ్బందులు ఉంటే.. వ్యక్తిగతంగా మీరు మీరు తిట్టుకోండి. కానీ, సినిమాను మాత్రం చంపొద్దు' అని అన్నారు.Dear @MusicThaman నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025"ఏం బతుకు బతుకుతున్నామో అర్థంకావట్లేదు... మనమే మన సినిమాని చంపేస్తున్నాం..." - Thaman pic.twitter.com/wmNpyakIf1— Aryan (@chinchat09) January 18, 2025 -
సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా: మెగాస్టార్ చిరంజీవి
-
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరగడం కలకలం రేపుతోంది. ముంబైలోని ఆయన ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి సైఫ్‌ను కత్తితో పలుమార్లు పొడిచి పారిపోయాడు. ఈ దాడిలో ఆయనకు ఆరుచోట్ల గాయాలయ్యాయి. అందులో రెండు చోట్ల లోతైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆనయ్ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెన్నెముక పక్కనే తీవ్రగాయం కావడంతో వైద్యులు నటుడికి సర్జరీ చేస్తున్నారు. దొంగతనం చేసే క్రమంలోనే..ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడు దొంగతనానికి వచ్చాడా? లేదా పక్కా మర్డర్ ప్లాన్‌తోనే సైఫ్‌పై దాడి చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనపై కరీనా కపూర్ (Kareena Kapoor) టీమ్ ఓ లేఖ విడుదల చేసింది. సైఫ్- కరీనా ఇంట్లో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. అతడిని అడ్డుకునే క్రమంలో సైఫ్ చేతికి గాయమైంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంట్లోని మిగతా సభ్యులు క్షేమంగానే ఉన్నారు. పోలీసుల విచారణ జరుగుతోంది అని లేఖలో పేర్కొన్నారు.షాక్‌కు గురయ్యాఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించాడు. సైఫ్ సర్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. చిరంజీవి (Chiranjeevi) సైతం సైఫ్ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశాడు. సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి నన్నెంతగానో కలిచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశాడు.హీరో నుంచి విలన్‌గా..సైఫ్ అలీఖాన్ ఒకప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. కానీ ఇటీవల మాత్రం ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే మెప్పిస్తున్నాడు. హీరోకి సమానంగా ఉండే విలన్ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించిన దేవర చిత్రంలో విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో యాక్ట్ చేశాడు. వచ్చాయి. ప్రస్తుతం సైఫ్ ఓ భారీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. Shocked and saddened to hear about the attack on Saif sir.Wishing and praying for his speedy recovery and good health.— Jr NTR (@tarak9999) January 16, 2025చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి! -
గతేడాది ఒకేచోట సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈసారి మాత్రం!
ఇంటిల్లిపాదీ కలిసి చేసుకునే పండగ సంక్రాంతి. ఈ పండక్కి ఎవరెక్కడ, ఏ మూలన ఉన్నా సరే ఎలాగోలా వీలు చేసుకుని మరీ ఇంటికి చేరుకుంటారు. అమ్మ చేసే అరిసెలు, చెల్లి వేసే ముగ్గులు, హరిదాసు కీర్తనలు, స్నేహితులతో గాలిపటాలు ఎగరేయడాలు.. కోడిపందేలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కుటుంబ బంధాల్ని రెట్టింపు చేస్తూ ఏడాదికి సరిపడా జ్ఞాపకాల్ని పోగుచేసిస్తుంది సంక్రాంతి.గతేడాది కన్నులపండగ్గా..ఈ పండగను మెగా ఫ్యామిలీ (Mega Family) కూడా ఎప్పుడూ ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరూ ఒక్కచోట చేరుతుంటారు. గతేడాదైతే మెగా కుటుంబమంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. బెంగళూరులోని ఫామ్ హోస్లో మెగా అల్లు ఫ్యామిలీ జాలీగా పండగను ఎంజాయ్ చేశారు. చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు కుటుంబంతో పాటు అల్లు అరవింద్ కుటుంబం కూడా అక్కడే ఉంది. అల్లు అర్జున్.. భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్‌తో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యాడు.గతేడాది మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అల్లు కుటుంబంచదవండి: గేమ్ ఛేంజర్ మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం: రామ్ చరణ్ఈసారి ఎవరింట్లో వారే..కానీ ఈసారి మాత్రం ఎవరింట్లో వారే పండగ జరుపుకున్నట్లు తెలుస్తోంది. అటు చిరంజీవి తన ఇంట్లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) తన కుటుంబంతో పండగ జరుపుకున్నాడు. ట్రెడిషనల్ డ్రెస్‌లో ముస్తాబైన దిగిన ఫ్యామిలీ ఫోటోను అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదంతా చూసిన అభిమానులు రెండు కుటుంబాలు కలిసి పండగ చేసుకుంటే ఎంత చూడముచ్చటగా ఉండేదోనని నిట్టూర్పు విడుస్తున్నారు.క్రిస్మస్ పార్టీకి చరణ్..గతంలో అల్లు అర్జున్ క్రిస్మస్ పార్టీ ఇస్తే దానికి రామ్‌చరణ్- ఉపాసన, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, శ్రీజ, నిహారిక, వైష్ణవ్‌తేజ్ ఇలా అందరూ హాజరయ్యారు. అలా ఎవరింట్లో ఏ పార్టీ ఉన్నా రెండు కుటుంబాలు కలుసుకునేవి. ఇప్పుడేమో వీరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ దూరం ఇలాగే కొనసాగుతుందా? అని పలువురూ చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ -
గురుభక్తి చాటుకున్న చిరంజీవి.. ఆ దర్శకుడి కోసం నిర్మాతగా తొలి సినిమా
చిరంజీవిని ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఎంపిక చేసే ముందు పరీక్షించిన వారిలో దర్శకులు కె.బాలచందర్ కూడా ఉన్నారట. అందుకే బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథకాదు, 47 రోజులు, ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ వంటి సినిమాల్లో చిరంజీవి విలక్షణమైన పాత్రలలో కనిపించారు. ఆ గురుభక్తితోనే చిరంజీవి నిర్మాతగా తన తొలి సొంత సినిమాకు బాలచందర్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారు. చిరంజీవి సమర్పకునిగా నాగబాబు నిర్మాతగా ఉన్న ఈ సినిమా (రుద్రవీణ)కు సహనిర్మాతగా పవన్ కల్యాణ్ వ్యవహరించారు. అందుకే టైటిల్స్‌లో ఆయన పేరు కొణిదల కల్యాణ్ కుమార్ అని కనిపిస్తుంది.అద్భుతమైన ప్రయత్నంనిజానికి అప్పటికే చిరంజీవి సినిమా అంటే బ్రేక్ డ్యాన్సులు, ఫైట్స్‌కు పెట్టింది పేరు. అటువంటిది ఆయన వాటిని పక్కన పెట్టి సాధారణ నటుడిలా సినిమా కథలో ఒదిగిపోయి చేసిన ఒక అసామాన్య చిత్రం ‘రుద్రవీణ’. మసిబట్టిన సాంప్రదాయాలకు, మసకబారిన సిద్ధాంతాలకు ఎదురొడ్డి నిలిచి చాందసాన్ని ఛేదించే అద్భుతమైన ఓ సామాజిక ప్రయత్నం ఈ సినిమా. అందుకే చిరంజీవికి నచ్చిన టాప్ టెన్ సినిమాల్లో ‘రుద్రవీణ’దే అగ్రతాంబూలం. వాస్తవానికి ఈ సినిమాకు పేరు పెట్టడానికంటే ముందు... గణపతి శాస్త్రి బిలహరి రాగంలో నిష్ణాతుడైనందున బిలహరి అని పేరు పెట్టాలనుకున్నారు. ఆ రోజుల్లో రాగాల పేర్లతో చాలా సినిమాలొచ్చాయి. ‘శివరంజని, శంకరాభరణం, ఆనంద భైరవి’ వంటివి అలా వచ్చినవే. అందువల్ల బిలహరి అని ముందుగా అనుకున్నా... చివరికి ఆ పేరు వద్దనుకుని గణపతి శాస్త్రి స్వభావం రుద్రావతారమే కాబట్టి ‘రుద్రవీణ’ అని పెట్టారు.జాతీయ అవార్డు సాధించిన సినిమా1988 మార్చి 4న రిలీజైన ఈ సినిమాలో ప్రతీ పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతీ వ్యక్తిని ప్రశ్నించే విధంగా ఉంటుంది. ‘రుద్రవీణ’ ఓ క్లాసిక్. 70 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను ఎక్కువగా మద్రాసు, కాంచీపురం, కుర్తాళం, శ్రీనగర్ పరిసరప్రాంతాల్లో చిత్రీకరించారు. అప్పట్లో ఈ సినిమాకు సుమారు 80 లక్షల వ్యయమైంది. ఆ సమయానికి చిరంజీవికి బీభత్సమైన మాస్ ఇమేజ్ ఉంది. చిరంజీవి అంటేనే మాస్కు మరో పేరులా సాగుతున్న రోజుల్లో ఆయన కమర్షియల్ సినిమాల నడుమ ‘రుద్రవీణ’ నిలబడలేకపోయింది.కానీ, జాతీయ స్థాయిలో జాతీయ సమైక్యతను ప్రబోధించే నర్గీస్ దత్ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుంది. ఇళయరాజాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం లభించింది. ఇది ఆయనకు మూడో జాతీయ పురస్కారం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుడిగా ఇది నాలుగో పురస్కారం. రాష్ట్ర స్థాయిలో నంది అవార్డుల్లో ఈ సినిమా ఉత్తమ నటుడిగా జ్యూరీ పురస్కారం దక్కించుకోగలిగింది. గణేశ్ పాత్రోకి మాటల రచయితగా నంది పురస్కారాన్ని తీసుకువచ్చింది ‘రుద్రవీణ’.వాణిజ్యపరంగా పరాజయం పాలైన ఈ సినిమాకు రూ. 6 లక్షలు నష్టం వాటిల్లిందట. కానీ ‘రుద్రవీణ’ పలికించిన రాగాలు మాత్రం సినీ ప్రియులను అలరించాయి. అదే సంవత్సరం బాలచందర్ ఈ సినిమాను తమిళంలో ‘ఉన్నాల్ ముడియుమ్ తంబి’గా కమల్‌హాసన్ , శివాజీ గణేశన్ తో రీమేక్ చేశారు. అయితే ‘రుద్రవీణౖ’పె అప్పట్లో చాలా వివాదాలు నడిచాయి. ముఖ్యంగా ఈ సినిమా 1984లో దర్శకుడు మాదాల రంగారావు తెరకెక్కించిన ‘జనం మనం’ సినిమా కథను యాజ్ ఇట్ ఈజ్‌గా తీశారని అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. తన చిత్రాన్ని కాపీ కొట్టి దర్శకుడు బాలచందర్ ‘రుద్రవీణ’ని తెరకెక్కించాడని... 13 రీళ్ల వరకు రెండు సినిమాలు ఒకేలా ఉంటాయని మాదాల రంగారావు ఆరోపించారు. ఈ విషయంపై ఆయన ప్రెస్‌మీట్ పెట్టి ‘రుద్రవీణ’ టీమ్‌కి వార్నింగ్ కూడా ఇచ్చారు. విషయాన్ని కోర్టు వరకు తీసుకెళ్లకుండా చిరంజీవిపై ఉన్న గౌరవం కారణంగా సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పారు. చివరికి ఈ వివాదం ఏమైందనే విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడున్నట్టు మీడియా ఆ రోజుల్లో ఉండి ఉంటే విషయం ఇంకెంత చర్చకు దారి తీసేదో.ఏది ఏమైనా ఆర్థికంగా ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించకపోయినా, వివాదాలు ఎదురైనా.. అవన్నీ పక్కనపెడితే ‘రుద్రవీణ’ ఓ క్లాసిక్. – దాచేపల్లి సురేష్‌కుమార్ -
అనంతపురం జిల్లాలో బరితెగించిన పచ్చ పార్టీ నేతలు
-
హైదరాబాద్ : ఆప్త బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
చిరంజీవితో ఫోటో దిగితే చాలనుకున్న 'దీప్తి'కి మెగా ప్రోత్సాహం
గతేడాదిలో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజీ దీప్తిని చిరంజీవి అభినందించారు. ఈ విషయన్ని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇలా తెలిపారు.'ఇటీవల మన తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ అనే చిన్న గ్రామంలో జన్మించిన జీవాంజీ దీప్తి దేశానికి ఎంతో పేరు తెచ్చింది. అయితే, ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన సందర్భంగా మీకేం కావాలని నేను ఆమెను అడిగినప్పుడు, చిరంజీవి గారిని కలవాలని ఉందని చెప్పారు. ఇటీవల నేను చిరంజీవిగారిని ఓ సందర్భంలో కలిసినప్పుడు దీప్తి జవాంజి గురించి చెప్పాను. ఆయన చాలా గొప్ప మనసుతో స్పందించారు. చాలా పెద్ద అచీవ్మెంట్ చేసినప్పుడు, ఆమె రావటం కాదు, నేను అకాడమీకి వస్తానని అన్నారు. అన్నట్లుగానే చిరంజీవిగారు మా అకాడమీకి వచ్చి, అక్కడున్న పిల్లలందరినీ కలిశారు. రెండు గంటల పాటు అక్కడే గడిపారు. అలాగే ప్రతి ప్లేయర్‌ని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆయన మూడు లక్షల రూపాయల చెక్‌ను దీప్తికి అందించటం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా క్రీడాకారులకు చిరంజీవిగారు ఇచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ ఇన్స్పిరేషన్తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను.' అని ఆయన అన్నారు.దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు రూ. కోటి2024లో పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో జీవాంజీ దీప్తి మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో దీప్తి కాంస్యం సాధించారు. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా చాలామంది ప్రశంసలు కురిపించారు. ఆమె విజయంలో పుల్లెల గోపీచంద్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ప్రకటించింది. ఆపై దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు వరంగల్‌లో 500 గజాల స్థలం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.కూతురి కోసం పొలం అమ్మేసిన తండ్రిజీవాంజీ దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మిల శ్రమ ఆమె విజయంలో ఎక్కువగా ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన దీప్తి మానసిక వైకల్యంతో చాలా ఇబ్బందులు పడింది. మేధోపరమైన బలహీనత ఉండడంతో ఆమె కోసం తండ్రి యాదగిరి చాలా తల్లడిల్లిపోయారు. చిన్నతనంలో కూతురుకు ఫిట్స్ వస్తే వారు విలవిలలాడిపోయేవారు. అయితే, దీప్తి క్రీడల్లో మాత్రం చాలా చురుకుగా ఉండేది. దీంతో ఆమె సంతోషం కోసం ఆ తండ్రి డబ్బులకు వెనకాడలేదు. తనకున్న ఎకరం పొలాన్ని కూతురి కోసం అమ్మేశారు. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దీప్తి తిరుగులేని విజయాన్ని దేశానికి అందించింది. -
టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ
తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి, బాలకృష్ణ ,నాగార్జున, వెంకటేష్ మూల స్థంబాలు అని చెప్పవచ్చు. ఇప్పటికే వారి వారసులు కూడా సినిమాలో ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ రేంజ్‌కు చేరిపోయాడు. నాగార్జున కుమారులు నాగ చైతన్య, అఖిల్ సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్‌తో రెడీగా ఉన్నాడు. అయితే, త్వరలో వెంకటేష్ కూడా తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.రామానాయుడి వారసులుగా వెంకటేష్, రానా, సురేష్ బాబు ఇండస్ట్రీలో రానిస్తున్నారు. ఇప్పుడు తర్వాతి జనరేషన్ నుంచి వెంకీ కుమారుడు అర్జున్ ఎంట్రీ గురించి తెరపైకి వచ్చింది. బాలకృష్ణ టాక్ షోలో తాజాగా పాల్గొన్న వెంకటేష్.. ఆయనతో అర్జున్ సినిమా ఎంట్రీ గురించి ఆఫ్‌స్క్రీన్‌లో చర్చించారట. తన కుమారుడిని కూడా త్వరలో సినిమా రంగానికి పరిచయం చేయాలని ఉన్నట్లు బాలయ్యతో వెంకీ తెలిపారట. అర్జున్ అమెరికాలో చదువుకొంటున్నాడని త్వరలో అక్కడి నుంచి ఇండియాకు రానున్నట్లు కూడా చెప్పాడని సమాచారం. ఈ క్రమంలో అర్జున్‌కు కూడా సినిమాలంటే ఆసక్తి ఉందని వెంకీ చెప్పుకొచ్చాడట. దీంతో వెంకటేష్ వారసుడిగా అర్జున్ ఎంట్రీపై వార్తలు నెట్టింట భారీగా వైరల్ అవుతున్నాయి. తొలి సినిమా తమ సొంత బ్యానర్లోనే తెరకెక్కించే అవకాశం ఉంది.వెంకటేష్ నలుగురు పిల్లల వివరాలు ఇవేవెంకటేష్కు ముగ్గురు కుమార్తెలు కాగా, అర్జున్ చివరి వాడు. పెద్ద కుమార్తె ఆశ్రిత అందరికీ సుపరిచితమే.. పెళ్లి తర్వాత ఫుడ్ వ్లాగర్‌గా ఆమె చాలామందికి తెలుసు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేతగా కొనసాగిన సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం 2019లో జరిగిన సంగతి తెలిసిందే. ఆశ్రిత మామయ్య రఘురాంరెడ్డి ఖమ్మం ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. ఇక వెంకటేష్ రెండవ కుమార్తె హయ వాహిని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేశారు. విజయవాడకు చెందిన డాక్టర్ కుమారుడితో ఆమె వివాహం కొద్దిరోజుల క్రితమే జరిగింది. మూడో కూతురు భావన హైదరాబాద్‌లోనే గ్రాడ్యువేషన్ చదువుతుంది. ఇక వెంకీ కుమారుడు అర్జున్ సినిమా ఎంట్రీ కోసం దగ్గుబాటి అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం.. మన్మోహన్ సింగ్ మృతిపై సినీ ప్రముఖులు
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు. నెహ్రూ, ఇందిర, మోదీ తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్తగా ఆయన పేరు పొందారు. ఆర్థిక మంత్రిగా దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావిగా ఎప్పటికీ గుర్తుంటారు. మన్మోహన్ సింగ్ మృతిపై సినీ ప్రముఖులు చిరంజీవి, కమల్ హాసన్ సంతాపం తెలిపారు. వారికి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు.చిరంజీవి తన ఎక్స్ పేజీలో ఇలా పంచుకున్నారు. 'మన దేశంలో గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్సింగ్ ఒకరు. ఆయన ఉన్నత విద్యావంతులు, అత్యంత మృదుస్వభావి, వినయపూర్వకమైన నాయకుడు మన్మోహన్ సింగ్. ఆర్థిక మంత్రిగా అతని దార్శనికత దేశానికి ఎంతో ఉపయోగపడింది. వరుసగా రెండు పర్యాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన చరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు. అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా, పర్యటక శాఖ సహాయ మంత్రిగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆయన మరణం మన దేశానికి తీరని నష్టం. మన్మోహన్సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి !!' అంటూ చిరు పేర్కొన్నారు.తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా మన్మోహన్‌సింగ్‌కు సంతాపం తెలిపారు. ' భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. నిశ్శబ్ద గౌరవం కలిగిన వ్యక్తి, అతను తన దూరదృష్టితో కూడిన ఆర్థిక, సామాజిక విధానాల ద్వారా దేశాన్ని పునర్నిర్మించారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మందికి ఉపయోగపడ్డాయి. భారతదేశం పురోగతి విషయంలో సమాజంలోని ప్రతి మూలకు ప్రభుత్వ లక్ష్యాలు చేరేలా నిర్ధారిస్తూ.. సమగ్రత, సామాజిక న్యాయం పట్ల లోతైన నిబద్ధతతో అతని పాలన కొనసాగింది. ఆయన వారసత్వం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' కమల్ హాసన్ పేర్కొన్నారు.మాజీ ప్రధానికి మోహన్ బాబు సంతాపం..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల టాలీవుడ్ నటుడు మోహన్ బాబు సంతాపం తెలిపారు. ఆయన గొప్ప దార్శనికత కలిగిన నాయకుడని కొనియాడారు. అసాధారణ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మరణించడం బాధాకరమని.. ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక రంగంపై చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. రాజ్యసభలో ఆయనతో కలిసి పనిచేసిన ఘనత నాకు దక్కడం అదృష్టమన్నారు. ఆయన తెలివితేటలు, రాజనీతిజ్ఞత అందరికీ స్ఫూర్తినిచ్చాయని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. -
సమావేశానికి చిరంజీవి దూరం.. కారణం ఇదే!
-
సీఎం రేవంత్‌తో భేటీ.. అందుకే చిరంజీవి రాలేదు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలుగు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు నాగార్జున, వెంకటేశ్, కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఈ విషయంలో సినీ హీరోలదే బాధ్యత: సీఎం రేవంత్)అయితే ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉండే చిరంజీవి(Chiranjeevi) మాత్రం సీఎం భేటీకి దూరంగా ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాడు. చిరంజీవి కావాలనే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి దూరంగా ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏంటంటే.. ప్రస్తుతం చిరంజీవి హైదరాబాద్‌లోనే లేరు. అందుకే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేదని ఆయన పీఆర్ వర్గాలు చెబుతున్నాయి.స్నేహం కోసం చెన్నై.. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా చిరంజీవి ముందు ఉండేవాడు. గతంలో అనేక సార్లు ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల టాలీవుడ్లో జరుగుతున్న పరిమాణాలు అందరికి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం..అసెంబ్లీలో సీఎం రేవంత్ సినీ స్టార్లపై కామెంట్స్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు రంగంలోకి దిగి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించాడు. అయితే ఈ భేటీలో చిరంజీవి కూడా పాల్గొంటారని ప్రచారం జరిగింది. నిన్నటి వరకు చిరంజీవి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం చిరంజీవి చెన్నై వెళ్లారు. అక్కడ తన స్నేహితుడి కొడుకు పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు. ఆ కారణంతోనే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేకపోయాడని ఆయన పీఆర్ టీమ్ చెప్పింది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం రేవంత్‌తో సినీ పెద్దల భేటీ.. దూరంగా చిరంజీవి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణం ఆపై అల్లు అర్జున్ అరెస్ట్ వంటి అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీంతో ముఖ్యమంత్రిని పులువురు సినీ ప్రముఖులు నేడు కలవనున్నడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం కలిగింది. అయితే, సీఎంతో భేటీ అయ్యే సినీ పెద్దలు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ విషయంలో నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) ఛైర్మన్ దిల్‌రాజు కీలకంగా వ్యవహరించనున్నారు. సీఎంతో భేటే అయేందుకు సినీ ప్రముఖులతో కూడా ఆయన ఇప్పటికే మాట్లాడారని తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌లో ఈ సమావేశం జరగనుంది. సుమారు 36 మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్,త్రివిక్రమ్, సురేష్‌బాబు,నితిన్,వరుణ్ తేజ్, శివ బాలాజీ, పలువురు నిర్మాతలు, దర్శకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సమావేశంలో చిరంజీవి పాల్గొనకపోవచ్చు అని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. పలు కారణాల వల్ల ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నారని నెట్టింట వైరల్ అవుతుంది. మెగాఫ్యాన్స్ కూడా నేడు జరిగే సమావేశంలో తమ బాస్ దూరంగానే ఉండబోతున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే 10 గంటల వరకు వేచి ఉండాల్సిందే.చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొనే ఛాన్స్ ఉంది. -
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటి.. ముహుర్తం ఫిక్స్!
సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్న సినీ పెద్దలు గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఈ భేటీకి టాలీవుడ్ తరఫున ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, హీరో వెంకటేశ్ కుడా హాజరు కానున్నారు.గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దిల్‌రాజుతో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా హాజరవుతారని సమాచారం. సంధ్య థియేటర్ ఘటనతో పాటు సినిమా పరిశ్రమ సమస్యలపై కూడా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు. -
చిరంజీవి హిట్ సినిమా.. 28 ఏళ్ల తర్వాత రీరిలీజ్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ సినిమా హిట్లర్ రీరిలీజ్ కానుంది. 1997లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలైంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రంభ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణ రావు, రామిరెడ్డి కీలకపాత్రలు పోషించారు. సుమారు 28 ఏళ్ల తర్వాత హిట్లర్ సినిమా రీరిలీజ్ కానున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు నటన హిట్లర్ చిత్రంలో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి కోటీ అందించిన సంగీతం చాలా హిట్ అయింది. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం విశేషం. 42 సెంటర్స్‌లలో హిట్లర్ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. చిరు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ సినిమా జనవరి 1న రీరిలీజ్ కానుంది. 'అంతొద్దు - ఇది చాలు' అన్న డైలాగు ఈ చిత్రం నుంచే ట్రెండ్ అయింది. ఇన్నేళ్లు అయినా ఈ డైలాగ్ మీమ్స్ రూపంలో ఇప్పటికీ సోషల్‌మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. 'నడక కలిసిన నవరాత్రి' అనే పాటకు చాలామంది అభిమానులు ఉన్నారు. అప్పట్లో ఆ సాంగ్ సూపర్ హిట్. ఇందులో 'అబీబీ.. అబీబీ.. అంటూ సాగే పాటకు చిరు ఎవర్గ్రీన్ స్టెప్ వేశారు. దీనికి లారెన్స్ నృత్యాలు సమకూర్చారు.చిరు సినిమాను రెండుసార్లు రిజెక్ట్ చేసిన ఇంద్రజ'యమలీల' సినిమా హిట్‌తో మంచి క్రేజ్‌లో ఉన్న నటి ఇంద్రజకు చిరుతో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే, దానిని ఆమె కాదనుకుంది. మొదట అల్లుడా మజాకా సినిమాలో మెగాస్టార్‌కు చెల్లిగా ఇంద్రజను అనుకున్నారు. కానీ, ఆమె నటించకపోవడంతో ఆ ఛాన్స్ నటి ఊహ దక్కించుకుంది. అలాగే హిట్లర్ సినిమాలో కూడా చిరు పక్కన మళ్లీ సోదరిగా నటించే అవకాశం దక్కింది. అప్పుడు కూడా తనకు డేట్స్ వీలు కాకపోవడంతో నో చెప్పింది. అలా రెంసార్లు చిరంజీవి ప్రాజెక్ట్‌లను ఆమె తిరస్కరించింది. అయితే, ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అసలు విషయం చెప్పింది. చిరు చెల్లిగా నటిస్తే ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఉండదని భావించి ఆ చిత్రాలను తిరస్కరించానని ఆమె పేర్కొంది. తాను చిరుకు అభిమానినని ఆయనతో కలిసి ఒక పాటకు అయినా డ్యాన్స్ చేయాలనేది తన కోరిక అని ఆమె పేర్కొంది. -
పీవీ సింధు రిసెప్షన్లో సినీ స్టార్స్.. చిరు, అజిత్‌తో పాటు
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu).. రీసెంట్గా వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుకని అంగరంగ వైభవంగా చేశారు. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. సినీ సెలబ్రిటీలు మాత్రం తెలుగు, తమిళ స్టార్స్ విచ్చేశారు.(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి(Chiranjeevi), నాగార్జునతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకుర్ (Mrunal Thakur).. సింధు రిసెప్షన్లో సందడి చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) ఏకంగా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లందరితో పాటు ఉపాసన కూడా సింధుని ఆశీర్వదించేందుకు రిసెప్షన్‌కి వచ్చింది.గత ఆదివారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో పీవీ సింధు వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. సింధు పెళ్లాడిన వెంకట్ దత్త సాయి (Venkat Datta Sai) బడా వ్యాపారవేత్త కావడం విశేషం.(ఇదీ చదవండి: ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్)Boss❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 at #PVSindhuWedding Reception 🥳 @KChiruTweets #MegaStarChiranjeevi Congratulations 💐@Pvsindhu1 pic.twitter.com/Vobmc1K8l1— Team Chiru Vijayawada (@SuryaKonidela) December 24, 2024#akkineninagarjuna at #pvsindhu wedding reception #nagarjuna #PVSindhuWedding pic.twitter.com/tTVQc3h6vs— Cinema Factory (@Cinema__Factory) December 24, 2024#MrunalThakur with #PVSindhu and #VenkatDatta at their wedding reception 💙 pic.twitter.com/vqh005nHlF— y. (@yaaro__oruvan) December 24, 2024AK Family ❤️#Ajith | #Ajithkumar | #AK | #VidaaMuyarchi | #GoodBadUgly | #PVSindhu pic.twitter.com/1i5hvSUWC2— vanakkam world (@VanakkamWorld) December 24, 2024 -
చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ
ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేసే నిర్మాత నాగవంశీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తనని తిట్టుకున్నా పర్లేదని అన్నారు. ఇదంతా కూడా బాలకృష్ణ 'డాకు మహారాజ్' మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)బాలకృష్ణ 'డాకు మహరాజ్'.. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే జనవరి 4న అమెరికాలో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. మరో ఈవెంట్ విజయవాడలో నిర్వహిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇతడి గత చిత్రం 'వాల్తేరు వీరయ్య'. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ.. హిట్ అయింది.అయితే బాబీ.. 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' సినిమాని బాగా తీశారని నిర్మాత నాగవంశీ అన్నారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ తనని తిట్టుకున్నా పర్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాతే కాదు గతంలో దర్శకుడు బాబీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరు-బాలయ్యతో సినిమాలు చేయడం గురించి చెప్పారు. చిరంజీవి అయితే స్ట్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తారని, బాలకృష్ణ మాత్రం డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోతారని అన్నాడు. అప్పుడు బాబీ.. ఇప్పుడు నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: సన్నీ లియోన్ పేరిట మోసం) -
అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే..!?
హైదరాబాద్: ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలుకొట్టడం కొందరికి కంటగింపుగా మారిందని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్ప–2 బ్లాక్ బస్టర్‌గా నిలిచి కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే.. ఆయనపై దుష్ప్రచారాలు సాగుతున్నట్టుగా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్లే దీని వెనుక సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో నేతలు, బాలీవుడ్ నటుల నుంచి సత్వరమే స్పందన వ్యక్తమైంది. ఒక రాత్రి జైలులో ఉండి మరునాడు విడుదల అయిన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆలస్యంగా తూతూ మంత్రంగా స్పందించడం.. అల్లు అర్జున్‌కు దగ్గరి బంధువైన ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ స్పందించకపోవడం.. అల్లు అర్జున్ అరెస్టైన రోజు, విడుదలైన రోజు కూడా హైదరాబాద్‌లోనే ఉన్న పవన్ కనీసం పరామర్శించకుండానే ఏపీకి వెళ్లిపోవడం వంటివి చూస్తుంటే.. ఈ వ్యవహారం వెనుక వీరి ఒత్తిడి ఉందనే అనుమానాలు వస్తున్నాయని సినీ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఎన్నో అనుమానాలు..వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయిన పుష్ప–2 జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, వేడుకగా జరుపుకోవాల్సిన సమయంలో... ఆ రికార్డులకు కారణమైన హీరో అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏముంటుందని సినీ పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా చర్యలు చేపట్టడం.. అదీ కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేకుండా.. రెండు, మూడు రోజులు జైలులో ఉండాల్సి వచ్చేలా శుక్రవారం అరెస్టు చేయడం.. హైకోర్టు సాయంత్రమే బెయిల్ మంజూరు చేసినా అర్ధరాత్రి వరకు పత్రాలు జైలుకు చేరకపోవడం.. రాత్రి జైలులోనే ఉండాల్సి రావడం వంటి ఘటనల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారనే చర్చ సినీ పరిశ్రమ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి పుష్ప–2 సినిమా విడుదలకు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్.. పవన్‌కు దగ్గరి బంధువని తెలిసీ కూడా జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పుష్ప–2 సినిమాను నడవనీయబోమని కూడా జనసేన, టీడీపీ నేతలు ప్రకటనలు చేశారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ముందు నుంచే దుష్ప్రచారం ‘అల్లు అర్జున్‌కు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య మరోమారు మొదలైంది. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలు పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు. ‘అల్లు అర్జున్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. వారిని కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతే వస్తా అంటే, మానేయ్ వెళ్లిపో.. ఎవడికి కావాలి?’ ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?’ అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ను ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (టీడీపీ) ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్‌ని కలిగి ఉన్నట్లుగా మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంట్మెంట్ మాకు చాలా బాగా పని చేసింది. ఆ సెంట్మెంట్ మాదిరిగానే మీ పుష్ప–2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. ‘అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా.. నువ్వు ఒక కమెడియన్. చిరంజీవి, పవన్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గం గన్నవరంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అని గన్నవరం నియోజకవర్గం జనసేన నేత రమేష్ బాబు వ్యాఖ్యానించారు. -
నా మిత్రుడు చిరంజీవితో నటించడం మరిచిపోలేనిది: మోహన్ బాబు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఇటీవల వరుసగా ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. గతంలో నటించిన తన ఫిల్మోగ్రఫీలోని సినిమాలను రోజు ఒకటి గుర్తు చేసుకుంటున్నారు. వాటిలో సూపర్ హిట్ చిత్రాలతో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఇవాళ పట్న వచ్చిన ప్రతివ్రతలు సినిమా గురించి తన అనుభవాన్ని పోస్ట్ చేశారు.1982లో నటించిన పట్నం వచ్చిన ప్రతివ్రతలు సినిమాకు నా ప్రయాణంలో ప్రత్యేకమైన స్థానం ఉందని మోహన్ బాబు అన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మౌలీ తన పాత్రను అద్బుతంగా తీర్చి దిద్దారని కొనియాడారు. అంతేకాకుండా నా మిత్రుడు చిరంజీవితో అన్నదమ్ములుగా నటించడం నా కెరీర్లోనే మరిచిపోలేని పాత్ర అని గుర్తు చేసుకున్నారు. నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని చిత్రాల్లో పట్నం వచ్చిన ప్రతివ్రతలు కచ్చితంగా ఉంటుందని మోహన్ బాబు ట్విటర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Patnam Vachina Pativrathalu (1982) holds a special place in my journey. Directed by the talented Sri. Moulee, I truly cherished portraying my role, especially sharing the screen with my dear friend, Sri. Chiranjeevi, as brothers. This movie remains one of the most unforgettable… pic.twitter.com/fBU68OVpR9— Mohan Babu M (@themohanbabu) December 20, 2024 -
చిరంజీవితో సినిమా.. అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు
-
చిరంజీవితో సినిమా.. అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు
డైరెక్టర్ అనిల్ రావిపూడి.. టాలీవుడ్లో ఈ పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు తన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.. పటాస్,రాజా ది గ్రేట్, ఎఫ్2,సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర'లో చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. త్వరలో ఈ చిత్రం విడుదలపై ప్రకటన రానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను నిర్మించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉండనుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. త్వరలో అధికారికంగా ఈ కాంబినేషన్‌పై ప్రకటన రానుంది.అనిల్ రావిపుడి కూడా ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన చిన్నతనం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వేంకటేశ్ చిత్రాలను చూస్తూ పెరిగానని అనిల్ గుర్తు చేసుకున్నారు. వాళ్లతో సినిమా చేయడం తన లక్ అని ఆయన అన్నారు. ఇప్పటికే బాలకృష్ణ, వేంకటేశ్లతో కలిసి సినిమా చేశాను. ఇప్పుడు చిరంజీవితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. 2025 ఏప్రిల్‌లో అనిల్- చిరుల సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఇక చిరు ఇటీవలే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనిల్ సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. -
తన మేనమామ, నటుడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్
-
చిరంజీవి ఇంటికి కుటుంబంతో పాటు వెళ్లిన 'అల్లు అర్జున్'
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సినీ హీరో అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ, పిల్లలతో కలిసి వెళ్లారు. తనతో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరు, సురేఖ ఇద్దరూ బన్నీ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్నేహకు వారు అధైర్య పడొద్దని చెప్పారు. ఈ కేసులో బెయిల్ ద్వారా అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. తన న్యాయవాది నిరంజన్‌రెడ్డితో చర్చించాక.. తన నివాసానికి వెళ్లారు. అనంతరం ఆయన్ను పరామర్శించేందుకు టాలీవుడ్ మొత్తం కదిలి ఆయన ఇంటికి వెళ్లింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. అయితే, తాజాగా అల్లు అర్జున్ తన మామయ్య చిరు ఇంటికి వెళ్లడంతో మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. Icon Star #AlluArjun is going to meet Mega Star #Chiranjeevi ...@KChiruTweets@alluarjun @AlwaysRamCharan#MegaFamily ❤️❤️❤️ pic.twitter.com/ELQDncYdI3— WC (@whynotcinemasHQ) December 15, 2024 -
మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న సురేఖ..
-
అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి దంపతులు
-
అల్లుడి కోసం రంగంలోకి మామ..
-
అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి దంపతులు
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను సుమారు రెండు గంటలకుపైగానే చిక్కడపల్లి పోలీసులు విచారించారు. అనంతరం వైద్యపరీక్షల కోసం ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, బన్నీకి మద్ధుతుగా టాలీవుడ్ ప్రముఖులు చాలామంది పోలీస్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండివైద్యపరీక్షల అనంతరం అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టుకు పోలీసులు తీసుకెళ్తారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ కొంత సమయం క్రితమే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో నాగబాబు కూడా అక్కడికి వెళ్లారు. వారు వెళ్లిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే బన్నీ కోసం చిక్కడిపల్లి పోలీస్టేషన్‌కు వెళ్లారు.అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి#AlluArjun #Chiranjeevipic.twitter.com/nkGq4iC1ug— Suresh PRO (@SureshPRO_) December 13, 2024 -
షల్ మీడియా యాక్టివిస్ట్ ల పై కొనసాగుతున్న కక్ష సాధింపు
-
స్పీడ్ పెంచిన మెగాస్టార్.. ‘యానిమల్’ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
హీరో చిరంజీవి మెగా స్పీడ్‌తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా ఆయన నెక్ట్స్ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుందని, షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించనున్నారని, వచ్చే ఏడాదిలో ఈ మూవీ సెట్స్‌కు వెళ్తుందని సమాచారం. ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోని సినిమా సెట్స్‌లో చిరంజీవి జాయిన్ అవుతారని తెలిసింది. అలాగే తనతో ‘గాడ్‌ఫాదర్’ సినిమా తీసిన దర్శకుడు మోహన్‌రాజాతో సినిమాకి కూడా చిరంజీవి పచ్చ జెండా ఉపారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇంకా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారని, ఆయన ప్రస్తుతానికి కమిటైన సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత, చిరంజీవి–సందీప్ కాంబో లోని సినిమా ప్రకటన ఉండొచ్చని సమాచారం. -
చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?
సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు కూడా.. అయితే, ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈమేరకు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.‘రాజాసాబ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 2025 జనవరి సమయానికి ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. కానీ, ఈ సినిమాలో ఎక్కువ సీన్స్‌కు VFX వర్క్‌తో లింక్ అయి ఉన్నాయట. దీంతో ఏప్రిల్ 10 నాటికి కూడా ఆ పనులు పూర్తి కావడం కాస్త కష్టమేనని తెలుస్తోంది. సమ్మర్‌కు విడుదల అవుతుందని అశించిన ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురుకానుందని తెలుస్తోంది. అయితే, సంక్రాంతి కానుకగా ఒక సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు సమాచారం.చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటూ గేమ్ ఛేంజర్‌కు ఛాన్స్ ఇచ్చారు. అయితే, విశ్వంభర ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం వారు ప్రకటించలేదు. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుందని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. అదే డేట్‌కు ప్రభాస్ రాజాసాబ్ వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కానీ, విశ్వంభర సినిమాను ప్రభాస్ అనుబంధ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో మెగాస్టార్‌కు పోటీగా ఆయన ఎట్టి పరిస్థితిల్లో బరిలోకి దిగడని తెలుస్తోంది. ఈ కారణం వల్ల రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చని కూడా సమాచారం. ప్రభాస్ లిస్ట్‌లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. కె.జి.ఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నారు. 'సలార్2'తో ఈ ప్రయాణం మొదలవుతోందని ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ఆ సినిమాలు రానున్నట్లు కూడా తెలిపింది. ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమాతో పాటు ప్రభాస్ - లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కించాలని ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా లైన్లో ఉన్న విషయం తెలిసిందే. -
ఎవరూ తీసుకోనంత పారితోషకం బన్నీ తీసుకున్నాడా..?
-
స్టార్ హీరోలను మెప్పిస్తున్న యంగ్ డైరెక్టర్స్
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా అనే తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. అలాగే కథలో బలం ఉందని హీరో–నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... నూటయాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి వంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. అలాగే ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. ‘ప్యారడైజ్’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరి చయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్‌గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇంకా నాగార్జున పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. అలాగే తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్‌చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించగా, శౌర్యువ్‌కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్‌ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్‌కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్–శౌర్యువ్‌ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్‌కెరీర్‌లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు. -
కథ రాశారు... స్టార్‌ని పట్టారు
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. కథలో బలం ఉందని హీరో నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి లాంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరిచయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్‌గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. నాగ్ పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్‌చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా.కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించగా, శౌర్యువ్‌కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్‌ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్‌కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్-శౌర్యువ్‌ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్ కెరీర్లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు -
నాగచైతన్య-శోభిత వివాహం.. నాగార్జున స్పెషల్ ట్వీట్
హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లు ప్రేమపక్షులుగా ఉన్న ఈ జంట నేడు (డిసెంబర్ 4న) భార్యాభర్తలుగా ప్రమోషన్ పొందారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో 8.13 గంటలకు చై.. శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరుకుటుంబ సభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి, టి సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రానా దగ్గుబాటి, సుహాసిని, అడివి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు హాజరయ్యారు.నా మనసు సంతోషంతో నిండిపోయిందికుమారుడి వివాహం గురించి నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పెళ్లి మా కుటుంబానికి చాలా గొప్ప క్షణం. చై, శోభిత అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారి ప్రయాణాన్ని ప్రారంభించడం.. కుటుంబం, స్నేహితుల ప్రేమతో నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతోంది. ఇది ప్రేమ, సాంప్రదాయం, ఐక్యత కలగలిపిన వేడుక, ఇది మా నాన్న కోసం నిలబడిన విలువలను ప్రతిబింబిస్తుంది. శోభితను మా కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నువ్వు ఆల్రెడీ మా జీవితాల్లో అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చావు అని రాసుకొచ్చాడు. Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐 This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024 చదవండి: ఆదిత్య 369 సీక్వెల్ ఫిక్స్.. హీరోగా బాలకృష్ణ కాదు! -
'దసరా' దర్శకుడితో చిరంజీవి సినిమా.. నిర్మాతగా హీరో నాని (ఫొటోలు)
-
18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష.. 38 ఏళ్ల తర్వాత రజనీ-సత్యరాజ్
‘దేవుడ దేవుడా తిరుమల దేవుడా... చూడర చూడరా కళ్లు విప్పి చూడరా...’ అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో జోరుగా స్టెప్పులేశారు రజనీకాంత్. ఆ పాటలో ‘రిపీట్టే’ అని ఉంటుంది. 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇలా లాంగ్ గ్యాప్‌తో ‘రిపీట్టే’ అంటూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన పద్దె నిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాలనుకున్నారు చిరంజీవి. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ చేంజర్’ కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. ఇక ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ యూనిట్ జపాన్‌లో ఉంది. అక్కడ చిరంజీవి–త్రిషపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. 38 ఏళ్ల తర్వాత...సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’కి దర్శకుడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కలిసి నటిస్తుండటం విశేషం. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’లో సత్యరాజ్ తండ్రి పాత్ర చేయగా, రజనీకాంత్ ఆయన కొడుకుగా నటించారు. అయితే కావేరీ జలాల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ కారణంగా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ (2007) చిత్రంలో సత్యరాజ్‌ని విలన్‌గా తీసుకోవాలకున్నారు దర్శకుడు శంకర్. అయితే సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్రని సుమన్ చేశారని కోలీవుడ్ టాక్. తాజాగా ‘కూలీ’ సినిమా కోసం రజనీకాంత్–సత్యరాజ్‌లను ఒప్పించారు లోకేశ్ కనగరాజ్. ఈ మూవీలో రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇరవై ఏళ్ల తర్వాత... మలయాళ చిత్ర పరిశ్రమలో హిట్ జోడీగా పేరొందిన మోహన్ లాల్, శోభన మరోసారి కలిసి నటిస్తున్నారు. అది కూడా దాదాపు ఇరవైఏళ్ల తర్వాత కావడం విశేషం. మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ‘ఎల్ 360’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతోంది. ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటిస్తున్నారు. 1985లో వచ్చిన ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు మోహన్ లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ యాభైకి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ చివరిగా నటించిన చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ 1994లో విడుదలైంది. ఆ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోని వీరు (‘సాగర్ ఆలియాస్ జాకీ రీ లోడెడ్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా, శోభన అతిథి పాత్ర చేశారు) ఇరవై ఏళ్ల తర్వాత ‘ఎల్ 360’ కోసం మరోసారి తెరని పంచుకుంటున్నారు. కాగా ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 56వ సినిమా కావడం విశేషం.పాన్ ఇండియా సినిమా కోసంమలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల కాంబినేషన్ ఓ పాన్ ఇండియా సినిమాకి కుదిరింది. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు వచ్చాయి. అయితే జోషి దర్శకత్వం వహించిన ‘ట్వంటీ 20’ (2008) చిత్రం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ మూవీ చేయలేదు. అయితే మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్ లాల్ ఓ అతిథి పాత్ర చేశారు. కాగా పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం శ్రీలంకలో ఘనంగా ప్రారంభమైంది. ‘‘మలయాళ సినిమా చరిత్రను తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. శ్రీలంక, అబుదాబీ, అజర్ బైజాన్, లండన్, థాయ్‌ల్యాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చితో సహా పలు ప్రాంతాల్లో 150 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరపనున్నాం’’ అని పేర్కొన్నారు మేకర్స్. 38 ఏళ్ల తర్వాత... హీరో రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘లేడీస్ టైలర్’కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అర్చన నటించారు. 1986లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రాజేంద్రప్రసాద్, అర్చన కలిశారు. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటిస్తున్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా నటిస్తున్నప్పటికీ ఈ కథ రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. రాజేంద్రప్రసాద్ భార్యగా అర్చన నటిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రూపేష్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాయే ‘షష్ఠిపూర్తి’కి కూడా స్వరాలు సమకూర్చడం విశేషం.పంతొమ్మిదేళ్ల తర్వాత... తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య, హీరోయిన్ త్రిషలది హిట్ జోడీ. వీరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా నాలుగో సినిమా రానుందని టాక్. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట ఆర్జే బాలాజీ. కథ, తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కోలీవుడ్ టాక్. ‘మౌనం పేసియదే’ (2002), ‘ఆయుద ఎళుత్తు’ (2004), ‘ఆరు’ (2005) వంటి చిత్రాల్లో నటించారు సూర్య, త్రిష. తాజాగా నాలుగోసారి ఆర్జే బాలాజీ సినిమా కోసం వీరిద్దరూ తెరని పంచుకోనున్నారట. ఈ వార్త నిజం అయితే 19 సంవత్సరాల తర్వాత వీరి జోడీ రిపీట్ అవుతుంది.టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధం హీరోలు మాధవన్–సిద్ధార్థ్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ది టెస్ట్’. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం కాగా, సింగర్ శక్తిశ్రీ గోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మాధవన్–సిద్ధార్థ్ ఈ సినిమాలో కలిసి నటించారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘యువ’ (2004). ఆ సినిమా తర్వాత మాధవన్–సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ‘ది టెస్ట్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించలేదు. అయితే 2025 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలుఉన్నాయని కోలీవుడ్ టాక్.– డేరంగుల జగన్ -
ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ
అల్లు vs మెగా అనేది ఏమవుతుందనేది ఎవరికీ తెలీదు. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయమై ఇరువురు హీరోల ఫ్యాన్స్ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. రీసెంట్గా 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ టైంలోనూ మెగా హీరోలు సైలెంట్‌గా ఉండటం హాట్ టాపిక్ అయింది. ఇలాంటి టైంలో చిరంజీవి గురించి అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'పుష్ప 2' ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్.. 'అన్‌స్టాపబుల్ 4' షోలో పాల్గొన్నాడు. గతవారం తొలిపార్ట్ రిలీజ్ కాగా.. ఇప్పుడు (నవంబర్ 22) ఇంటర్వ్యూలో రెండో పార్ట్‌ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్లో బన్నీ పిల్లలు అయాన్-అర్హ కూడా కాసేపు కనిపించారు. ఇక ఓ సందర్భంగా చిరంజీవి గురించి చర్చ రాగా.. అల్లు అర్జున్ డీటైల్డ్‌గా కొన్ని విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)'గత ఇరవై ఏళ్లుగా నాకు చిరంజీవితో ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. కానీ అంతకుముందు ఇరవై ఏళ్లు ఆయనతో నా బాండింగ్ ఎలా ఉందో ఎప్పుడూ చెప్పుకొనే సందర్భం రాలేదు. కాబట్టి ఇప్పుడు పంచుకుంటాను. ఓ మనిషిగా చిరు ఫ్యాన్ అయ్యాకే మెగాస్టార్‌కి అభిమానిగా మారాను. నేను చిన్నగా ఉన్నప్పుటి నుంచి మామయ్య ప్రభావం నాపై చాలా ఉంది. ఎందుకంటే అప్పట్లో విదేశాలకు వెళ్లాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఆ టైంలో చిరంజీవి ఆయన పిల్లలతో పాటు నన్ను, శిరీష్‌ని కలిసి మొత్తం 10 మందికి పైగా పిల్లల్ని ఫారిన్ ట్రిప్‌కి తీసుకెళ్లేవారు. అప్పట్లో అది చాలా గొప్ప విషయం' అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.ఇలా చిరంజీవి గురించి బన్నీ ఇంతలా చెప్పడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి అభిమానులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది పక్కనబెడితే ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: Zebra Movie Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ) -
చిరంజీవి, షారూఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెబుతూ నయనతార లేఖ
'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా తన అభిమానులను పలకరించింది. అయితే, ఈ డాక్యుమెంటరీ చిత్రకరణలో తనకు సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు మూడు పేజీల లేఖను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు సాయం చేసిన తెలుగు,తమిళ్,మలయాళ,హిందీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులతో పాటు నిర్మాణ సంస్థల పేర్లను తెలుపుతూ లేఖ రాశారు.నయనతార సౌత్ ఇండియా చిత్రసీమలో అగ్రనటి. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి 2022లో మామల్లపురంలో జరిగింది. ఈ సందర్భంలో నటి నయనతార వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహాన్ని కవర్ చేస్తూ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో ఆమె ఇంటర్వ్యూ, షూట్లో పాల్గొన్న దృశ్యాలు, ఆమె మేకప్‌తో సహా అనేక సన్నివేశాలు ఉన్నాయి.తన డాక్యుమెంటరీ నిర్మాణం కోసం నో హోల్డ్-బార్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నయన్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఇప్పటి వరకు నేను చాలా సినిమాల్లో నటించాను. అవన్నీ నాకు ప్రత్యేకమే, నా కెరీర్లో చాలా ముఖ్యమైన భాగం అయ్యాయి. ఇందులో చాలా సంతోషకరమైన క్షణాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమాల జ్ఞాపకాలను నా డాక్యుమెంటరీలో పొందుపరచాలని అనుకున్నాను. అందుకోసం ఆయా చిత్రాల నిర్మాతలను సంప్రదించినప్పుడు వారు వెంటనే ఒప్పుకోవడమే కాకుండా.. ఎలాంటి అభ్యంతరం చేయకుండా నాకు అన్హిండెర్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు. వారందరినీ ఎప్పటికీ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాను.' అని తెలిపింది.నయనతారకు సహకరించిన నిర్మాణ సంస్థల పేర్లతో పాటు నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ ఒక లిస్ట్ విడుదల చేసింది. బాలీవుడ్లో నటుడు షారూఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్ ఉంటే టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌లు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు
హీరోయిన్లు ఒకే భాషకు పరిమితం కారనే విషయం తెలిసిందే. హీరోలు, దర్శకులు మాత్రం దాదాపు ఒకే భాషలోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలకు, దర్శకులకు హద్దులు, సరిహద్దులు లేవని పాన్ ఇండియన్ సినిమాలు చెబుతున్నాయి. దర్శకులు, హీరోలు ఇప్పుడు ఏ భాషలో అయినా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. మరి... మన తెలుగింటి హీరోలు... ఏ పక్కింటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. కాంబో రిపీట్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హరీష్ శంకర్, మారుతి... ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన తర్వాతి చిత్రాల్లో ఒకటి చిరంజీవితో ఉంటుందని, సామాజిక నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని, రచయిత–దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మోహన్ రాజా తెలుగు అయినప్పటికీ చెన్నైలో సెటిల్ అయి, తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక హీరో చిరంజీవి–దర్శకుడు మోహన్‌రాజా కాంబినేషన్లో ఆల్రెడీ ‘గాడ్ ఫాదర్’ (2022) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ చిత్రం రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. నవీన్‌తో నెక్ట్స్ సోలో హీరోగా నాగార్జున నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తమిళంలో ‘మూడర్ కూడం, అగ్ని సిరగుగళ్’ సినిమాలు తీసిన దర్శకుడు నవీన్ గత ఏడాది నాగార్జునకు ఓ కథ వినిపించారట. ఈ మూవీకి నాగార్జున కూడా ఓకే చెప్పారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచే పనిలో నవీన్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం నాగార్జున తమిళ చిత్రం ‘కూలీ’లో ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కూలీ’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. అలాగే తమిళ హీరో ధనుష్‌తో కలిసి నాగార్జున ‘కుబేర’ చేస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. బిజీ బిజీ ప్రభాస్ చాలా చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ‘రాజా సాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి వెళ్తారు. కాగా ఇటీవల కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ చిత్రాల్లో ఒకటి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఉంటుందని తెలిసింది. మరోటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ అని ఊహించవచ్చు. ఇంకో సినిమాకు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా... ఓ తమిళ దర్శకుడు, ఓ కన్నడ దర్శకుడితో ప్రభాస్ సినిమాలు చేయనున్నారు. అంతేకాదు... ఇటీవల ప్రభాస్‌కు ఓ హిందీ దర్శకుడు కథ వినిపించారని, ఇప్పటికే ప్రభాస్ కమిటైన సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రకటిస్తారని బాలీవుడ్ భోగట్టా. ‘జైలర్’ దర్శకుడితో...ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్లో జాయిన్ అవుతారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమయ్యేలా ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించి, కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాల షూట్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలిసింది. 2026 జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అలాగే తమిళంలో ‘కోలమావు కోకిల, డాక్టర్, జైలర్’ సినిమాలను తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవల ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారని తెలిసింది. అయితే రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేస్తారు. కాబట్టి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది 2026లోనే అని ఊహింవచ్చు. కథ విన్నారా? రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్‌చరణ్ తర్వాతి చిత్రాలకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన, సుకుమార్ డైరెక్ట్ చేస్తారు. అయితే ఓ హిందీ దర్శకుడు రామ్‌చరణ్‌కు కథ వినిపించారనే టాక్ కొన్ని రోజులు క్రితం ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ వార్త నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహాభారతం దర్శకుడితో... హిందీ సీరియల్ ‘మహాభారతం’ చాలా ఫేమస్. ఈ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ‘కన్నప్ప’ కోసం టాలీవుడ్‌కు తెచ్చారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. జీబ్రా తమిళంలో కీర్తీ సురేష్‌తో ‘పెంగ్విన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జీబ్రా’. సత్యదేవ్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, కన్నడ నటుడు డాలీ ధనుంజయ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్‌కు తెలుగులో ఇదే స్ట్రయిట్ సినిమా. ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసే తెలుగు హీరోల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు.. ఫోటోలు వైరల్
-
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఒక పెళ్లి వేడుకలో సందడిగా కనిపించారు. తమ ఇంట్లో పెళ్లిలా వారందరూ పాల్గొనడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నూతన దంపతులను చిరంజీవితో పాటుగా అల్లు అర్జున్ ఆశీర్వదంచారు. దీంతో ఈ వివాహ వేడుక ఎవరిదై ఉంటుందని సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూస్తున్న బాబీ కుమారుడిదే ఈ వివాహ సందడి. తమ వద్ద ఎన్నో ఏళ్లుగా ఉంటూ కుటుంబ సభ్యుడిగా బాబీ ఉండటం వల్లే తన కుమారుడి పెళ్లి వేడుకలో వారందరూ పాల్గొన్నట్లు తెలుస్తుంది. బాబీ కుమారుడు రామకృష్ణ తేజ- సుజాతల పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అరవింద్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు, అల్లు శీరిష్ పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ)త్వరలో 'పుష్ప 2' మూవీతో అల్లు అర్జున్ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. 17వ తేదీన సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే హైప్ బోలెడంత ఉంది. ట్రైలర్ రిలీజైన తర్వాత అది ఇంకాస్త పెరగడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ) -
ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు
-
'అయితే ఏటంటావ్ ఇప్పుడు'.. అభిమానికి మెగాస్టార్ అదిరిపోయే రిప్లై!
చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో విలనిజంతో మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యం అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమానిని మెగాస్టార్ ఆటపట్టించారు. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో మనం ఓ లుక్కేద్దాం పదండి.చిరంజీవి వేదికపై మాట్లాతుండగా ఓ అభిమాని గట్టిగా అరిచాడు. మిమ్మల్ని చూసేందుకు వైజాగ్ నుంచి వచ్చానని అతను చెప్పాడు. దీనికి చిరు వెంటనే 'అయితే ఏటంటావ్ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే.. మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి.. భలేవాడివే.. మన హీరోలు కూడా అదే ఊరే.. కూసో కూసో రా కాసేపు' అంటూ వైజాగ్ యాసలోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు మెగాస్టార్. ఇది చూసిన నెటిజన్స్ మీరు టైమింగ్ సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ టైమింగ్‌లోనూ మీరు మెగాస్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు.Chiranjeevi timing 😂😂🤣🤣😭😭Cinemalo aina Offline lo aina Boss @KChiruTweets timing ni kottevadu inka puttaledu 💥💥😂😂🫶🏻#ZEBRA #Chiranjeevi pic.twitter.com/khp7QZvSwq— Vamc Krishna (@lyf_a_zindagii) November 12, 2024 -
బిజినెస్‌మ్యాన్ బర్త్ డే పార్టీలో చిరు-మహేశ్-వెంకటేశ్ ఫుల్ చిల్ (ఫొటోలు)
-
‘జీబ్రా’ మెగా ట్రైలర్ రిలీజ్ వేడుక..ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
అది మా తప్పు.. ప్రేక్షకులది కాదు: చిరంజీవి
‘‘నాలుగైదు పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన ఇండస్ట్రీ ఓహో అన్నట్లు కాదు. చిన్న సినిమాలు కూడా ఆడాలి. చిన్న, పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ కళకళలాడాలి అనుకునే మాలాంటి వాళ్లకి, నాకు ఒకరకమైన బెరుకు వచ్చింది. కరోనా తర్వాత ఏ సినిమాలు చేయాలి? ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి? అని. కానీ, అవన్నీ కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడూ తప్పు ఉండదు. ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు, రాణించలేదు అంటే అది వేదికపై ఉన్న మా అందరిదే తప్పు.. ప్రేక్షకుల తప్పు కానే కాదు’’ అని హీరో చిరంజీవి అన్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ట్యాగ్‌లైన్ . ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సునీల్, సత్యరాజ్, సత్య అక్కల కీలక పాత్రలు పోషించారు. పద్మజ ఫిల్మ్స్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జీబ్రా’ మెగా ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘2024 ‘హను–మాన్’ సినిమాతో శుభారంభం అయింది. అది తెలుగు సినిమా అనుకుంటే ఆల్ ఇండియా సినిమా అయిపోయింది. అక్కడి నుంచి చిన్న సినిమాల పట్ల ప్రారంభమైన ఈ ఆదరణ నిæ పెద్ద సినిమాల స్థాయికి మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత వచ్చిన చిన్న సినిమాలు ‘కమిటీ కుర్రోళ్లు’, ‘టిల్లు స్క్వేర్, ఆయ్, మత్తు వదలరా 2’ ఇలా వరుసగా హిట్లు వచ్చాయి. మొన్న దీపావళికి వచ్చిన ‘అమరన్, క, లక్కీ భాస్కర్’ సినిమాలు ఎంతో ఆదరణ పొందాయి. ఈ సినిమాలో స్టార్లు లేరు.. పెద్ద డైరెక్టర్లు లేరు.. కోట్ల బడ్జెట్ లేదు. కానీ, కంటెంట్ ఉంది. అది సినిమాలకి ఆయువుపట్టు. కంటెంట్ బాగుండి, వినోదాన్ని అందించగలిగితే ఆస్వాదించడానికి ఎప్పుడూ ప్రేక్షకులు రెడీగా ఉంటారు.‘జీబ్రా’లో కూడా మంచి కంటెంట్, వినోదం, ఫ్యామిలీ అంశాలతో పాటు భావోద్వేగాలు.. అద్భుతమైన నటీనటులు ఉన్నారు. కచ్చితంగా ‘జీబ్రా’ సూపర్‌హిట్టు అవుతుంది.. అవ్వాలి.. అవుతుంది’’ అని చెప్పారు. సత్యదేవ్ మాట్లాడుతూ–‘‘కెరీర్ పరంగా ఇండస్ట్రీలో నేను చాలా లోగా ఉన్నప్పుడు చిరంజీవి అన్నయ్యగారు పిలిచి ‘గాడ్ ఫాదర్’లో విలన్‌గా అవకాశం ఇచ్చారు. నా జీవితంలో పెద్ద హై ఇచ్చిన సినిమా అది. నా కెరీర్లో ‘జీబ్రా’ చాలా పెద్ద సినిమా. ఈ సినిమాని అన్నయ్యకి అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘వాల్తేరు వీరయ్య’ లో బాబీ చేసిన క్యారెక్టర్ని నేను చేయాల్సింది. కానీ, మిస్ అయ్యాను’’ అని తెలిపారు డాలీ ధనంజయ. ‘‘జీబ్రా’ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఈశ్వర్ కార్తీక్, ఎస్ఎన్ రెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి కథ ఉన్న సినిమాల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మా చిత్రం కూడా చాలా మంచి కంటెంట్‌తో రూపొందింది’’ అని దినేష్ సుందరం, బాల సుందరం చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత వై.రవి శంకర్, డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా, కెమెరామేన్ సత్య పొన్మార్, సంగీత దర్శకుడు రవి బస్రూర్, నటీమణులు అమృత అయ్యంగార్, జెన్నీఫర్ పిక్కినాటో, ఎడిటర్ అనిల్ క్రిష్, లిరిక్ రైటర్ పూర్ణాచారి మాట్లాడారు. -
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మల గ్రాండ్ రిసెప్షన్.. హాజరైన చిరంజీవి, నాగార్జున(ఫొటోలు)
-
ఒకే ఫ్రేమ్‌లో చిరు, నాగ్, మహేశ్.. ఇది కదా కావాల్సింది!
ఒకరిద్దరు స్టార్ హీరోలు ఒక చోట కనిపిస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది టాలీవుడ్ అగ్ర హీరోలందరూ ఒక్కచోట కనిపిస్తే ఇంకేమైనా ఉందా? సరిగ్గా అలాంటి అద్భుతమే జరిగింది.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, అఖిల్.. ఇలా అందరూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్స్ అంతా ఒకేచోటఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకకు వీళ్లంతా హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే హీరోలందరూ కలిసి భోజనం చేశారు. ఉపాసన, నమ్రత సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ అద్భుత కలయికకు మాల్దీవులు వేడుకగా నిలిచింది.సినిమా..సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. నాగార్జున కుబేర, కూలీ సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేశ్‌బాబు.. రాజమౌళి డైరెక్షన్లో సినిమా కోసం రెడీ అవుతున్నాడు.చదవండి: ఫైట్ యాక్షన్ సీక్వెన్స్.. సునీల్ శెట్టికి గాయాలు! -
చిరంజీవితో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: సినీహీరో చిరంజీవితో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. శనివారం చిరంజీవి నివాసానికి వెళ్లిన సందర్భంగా ఆయన్ను కిషన్‌రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. దీపావళి సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ‘ఎక్స్’ ద్వారా కిషన్‌రెడ్డి వెల్లడించారు.సినీపరిశ్రమతో పాటు సేవా కార్యక్రమాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ప్రభావితం చేసిన చిరంజీవిని కలుసుకోవడం ఎల్లప్పుడూ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే కిషన్‌రెడ్డి చిరంజీవిని మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీటీడీ చైర్మన్‌గా నియమితుడైన బీఆర్ నాయుడిని కూడా కిషన్‌రెడ్డి కలిసి అభినందించినట్లు పార్టీ నాయకుల సమాచారం. -
ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్‌గా నటించిన నటులెవరో తెలుసా?
హనుమాన్ను కేవలం దైవంగానే కాదు.. పిల్లల దృష్టిలో సూపర్ హీరోగానూ వెండి తెర ఆవిష్కరించింది. ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ చిత్రంలో కన్నడ నటుడు, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ లుక్ రివీల్ చేశారు. అయితే..గతంలోనూ కొందరు నటులు వెండి తెరపై హనుమంతుడి అవతారంలో ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నమూ చేశారు. వాళ్లెవరంటే..దేవ్‌దత్తా నాగేఆదిపురుష్(2023).. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను రాముడి(రాఘవ)గా చూపించిన ప్రయత్నం. అయితే ఆకట్టుకోని విజువల్స్, పైగా కంటెంట్ విషయంలోనూ ఆ చిత్రం తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ చిత్రంలో మరాఠీ నటుడు దేవ్‌దత్తా నాగే.. హనుమంతుడి(భజరంగ్) పాత్రలో నటించాడు. కానీ, ఆ క్యారెక్టర్ కూడా ఇంటర్నెట్లో నవ్వులపాలవ్వడంతో ఆయన కష్టం వృథా అయ్యింది.ఏ. జనార్ధన రావుతెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆంజనేయస్వామి పాత్రలకు రిఫరెన్స్‌గా ఈయన్ని చూపిస్తుంటారు. ఏకంగా 20 చిత్రాల్లో ఆ పాత్రలో నటించారాయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన జనార్ధన రావు.. 1955లో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు. కమలాకర కామేశ్వర రావు తీసిన వీరాంజనేయ (1968)చిత్రంలో తొలిసారి ఆయన హనుమాన్ పాత్రలో నటించారు. అయితే తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ ప్రభావంతో దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు హనుమంతుడి పాత్రల విషయంలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దర్శకనిర్మాతలు. అలా.. శ్రీ రామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ కృష్ణ సత్య, ఎన్టీఆర్ సూపర్‌మేన్.. చిత్రాలు ఈనాటికి ఆయన హనుమంతుడి రూపాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. రాజనాలతెలుగు విలన్లలో అగ్రతాంబూలం అందుకున్న తొలి నటుడు.. బహుశా ఇంటి పేరునే స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్న తొలి నటుడు కూడా ఈయనేనేమో!(రాజనాల కాళేశ్వర రావు). అయితే 1400కి పైగా అన్ని రకాల జానర్ చిత్రాల్లో నటించిన రాజనాల.. హనుమాన్‌గా కనిపించిన ఒకే ఒక్క చిత్రం ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’(1972). కానీ, ఆ పాత్రలో మరిచిపోలేని అభినయం కనబర్చారాయన.దారా సింగ్మల్లు యోధుడిగానే కాదు.. ఇటు నటుడిగా, దర్శకుడిగా.. అటు రాజకీయాల్లోనూ రాణించారీయన. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ఏళ్ల తరబడి రాణించిన దారా సింగ్.. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులేశారు. భజరంగబలి(1976) చిత్రంలో తొలిసారి హనుమాన్‌గా అలరించి.. ఆ తర్వాత రామానంద సాగర్ ‘రామాయణ్’లో హనుమాన్ క్యారెక్టర్లో జీవించి.. భారతీయ బుల్లితెర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారాయాన. చిరంజీవిఆంజనేయ స్వామికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఓ ఫైట్ పోర్షన్లో హనుమాన్‌గా అలరించారాయన. అంతేకాదు.. హనుమాన్(2005) యానిమేటెడ్ చిత్రంలో ఆ పాత్రకు తెలుగు వెర్షన్లో వాయిస్ ఓవర్ కూడా అందించారు.నిర్భయ్ వాద్వాతెలుగులో జనార్ధన రావుకు ఎలాగైతే హనుమాన్ క్యారెక్టర్లు గుర్తింపు తెచ్చి పెట్టాయో.. హిందీ టీవీ సీరియల్స్‌లో ఈ యువ నటుడికి అదే విధంగా ఆ పాత్ర మంచి గుర్తింపు ఇచ్చింది. సంకట మోచన్ మహాబలి హనుమాన్(2015-17)లో తొలిసారి హనుమంతుడి పాత్రలో నటించిన నిర్భయ్‌కు.. ఆ తర్వాత మరో రెండు సీరియల్స్‌లోనూ ఆ రోల్ దక్కింది. ఈ ఏడాది ప్రారంభమైన శ్రీమద్ రామాయణ్‌లోనూ ఆయన హనుమాన్ రోల్లోనే నటిస్తున్నారు.ప్రశాంత్ శెట్టిప్రశాంత్ శెట్టి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. రిషబ్ శెట్టిగా అప్పటిదాకా కన్నడ ఆడియొన్స్‌ను మాత్రమే అలరిస్తూ వచ్చిన ఈ మల్టీ టాలెంట్ పర్సన్(నటుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్).. కాంతారతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకట్టుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో కాంతారను తీసి.. జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులనూ దక్కించుకున్నాడు. బహుశా ఆ గుర్తింపే ఆయనకు జై హనుమాన్‌లో హనుమాన్ క్యారెక్టర్ దక్కడానికి ఓ కారణం అయ్యి ఉండొచ్చు కూడా!.ಕನ್ನಡ ನೆಲದ ವರಸುತ ಆಂಜನೇಯನ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಭಾರತ ಇತಿಹಾಸದ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಭಾವವೊಂದನ್ನು ತೆರೆಯ ಮೇಲೆ ತರಲಿದ್ದೇವೆ.ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ ಬೆಂಬಲ ಆಶೀರ್ವಾದ ಎಂದಿನಂತೆ ಸದಾ ಇರಲಿ - ಜೈ ಹನುಮಾನ್A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga🙏We bring forth an epic of loyalty, courage and… pic.twitter.com/Zvgnt1tGnl— Rishab Shetty (@shetty_rishab) October 30, 2024ఇంకా ఎవరైనా నటీనటులను మరిచిపోయి ఉంటే.. వాళ్లు ఏ భాషకు చెందిన వాళ్లైనా సరే కామెంట్ సెక్షన్లో వాళ్ల పేర్లను మీరు తెలియజేయొచ్చు. -
మోహన్ బాబుపై చిరు కామెంట్స్
-
Chiranjeevi:ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది
-
ANR అవార్డు అందుకున్న హీరో చిరంజీవి (ఫొటోలు)
-
కాబోయే కోడలు అంటూ.. శోభితను చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున (ఫొటోలు)
-
నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చిన అవార్డు ఇది: చిరంజీవి
‘‘సినీ పరిశ్రమను నా ఇల్లు అనుకుంటే... ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలప్పుడు (2007) వచ్చింది. అందరూ కలిసి నాకు లెజండరీ అవార్డు ప్రదానం చేస్తుంటే హ్యాపీ ఫీలై, ఎంత ధన్యుణ్ణి అనుకున్నా. కానీ... కొన్ని ప్రతికూల పరిస్థితులు... కొంతమంది హర్షించని ఆ సమయంలో ఆ అవార్డు తీసుకోవడం సముచితంగా అనిపించలేదు. అందుకే ఈ టైమ్ క్యాప్సూ్యల్లో అవార్డు ఉంచి, నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అన్నాను.ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డు్డను పుచ్చుకున్న రోజున... అదీ అమితాబ్‌గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున... నా మిత్రుడు... నా సోదరుడు నాగ్ మనస్ఫూర్తిగా ఈ అవార్డుకు మీకు అర్హత ఉంది... తీసుకోండి అని అన్న రోజున ఇప్పుడు ఇంట గెలిచాను... రచ్చా గెలిచాను’’ అని హీరో చిరంజీవి ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు. లెజండరీ నటుడు ‘ఏఎన్నార్’ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి ఈ విధంగా పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, పలువురు చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదగా ‘ఏఎన్నార్ అవార్డు’ అందుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పద్మభూషణ్‌లు, పద్మ విభూషణ్‌లు, పర్సనాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు... ఇలా ఎన్ని అవార్డులు వచ్చినా సరే... ఏఎన్ఆర్ అవార్డు నాకు ప్రత్యేకం. ఎందుకంటే నా వాళ్లు నన్ను గుర్తించి, ప్రశంసించి, ఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు అది నిజమైన అచీవ్మెంట్ అని ఫీలయ్యాను. అందుకే నాగ్‌తో ఇది ప్రత్యేకమైన అవార్డు అని చెప్పాను. అమితాబ్‌గారి మాటలు ఎనర్జీ ఇచ్చాయినాకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను సత్కరించింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి, అమితాబ్ బచ్చన్‌గారు ‘చిరంజీవి ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అన్నారు. నా హిందీ ‘ప్రతిబంథ్’ సినిమా చూసి, అమితాబ్‌గారు ‘పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్. డన్ ఏ గుడ్ జాబ్. ప్రయోజనాత్మక సినిమా’ అన్నారు. ఆ మాటలు ఎనర్జీ ఇచ్చాయి.నాన్న పొగడాలనుకున్నానుమా నాన్నగారికి నటనంటే చాలా ఇష్టం. కానీ నన్ను పొగిడేవారు కాదు... ఏంటమ్మా... నాన్నగారు ఏం అనరు.. మాట్లాడరు. బయట ఎంత గెలిచినా ఇంట గెలవమంటుంటారు కదా అనేవాడిని. ‘చాలా పొగుడుతారు... కానీ తల్లిదండ్రులు పిల్లలను పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’ అని మా అమ్మ అన్నారు. ఆ రోజు అనిపించింది... నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట. అలాగే రచ్చ కూడా గెలిచాను. మా అమ్మ ఏఎన్నార్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్ ఏఎన్నార్‌గారి ఫ్యాన్స్‌లో సీనియర్ మోస్ట్ ఫ్యాన్ మా అమ్మ. ఆమె నిండు గర్భిణీతో ఉన్నప్పుడు ఏఎన్నార్‌గారి ‘రోజులు మారాయి’ సినిమా చూడాలనుకుంది. అమ్మ తన పుట్టింట్లో మొగల్తూరులో ఉండేది. నర్సాపూర్ దాటి పాలకొల్లు వెళ్లి, సినిమా చూడాలి. నాన్న జట్కా బండి ఏర్పాటు చేశారు. గతుకుల రోడ్డు. మొగల్తూరు వైపు వెళుతున్న బస్సు ఈ బండికి ఎదురుగా వచ్చింది. దానికి దారి ఇచ్చే క్రమంలో జట్కా బండి పొలాల్లో దొర్లింది. బండిలో ఉన్న అందరూ కిందపడ్డారు. నాన్న కంగారుపడి, అమ్మతో ‘పద.. ఇంటికి వెళ్లిపోదాం’ అన్నా ‘సినిమా చూడాల్సిందే’ అని పట్టుబట్టి వెళ్లింది. ఆ తర్వాత రెండు నెలలకు నన్ను బయట పడేసింది. ఏఎన్ఆర్గారి మీద నాకు ఉన్న అభిమానం అమ్మ ద్వారా... ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో. చిరంజీవికి ఎముకలు లేవన్నారు ఏఎన్‌ఆర్‌గారు నాకు నాగేశ్వరరావుగారి సినిమాల్లో డ్యాన్సులంటే ఇష్టం. ఆయన పాటలకు నాకు తెలిసిన పద్ధతిలో డ్యాన్సులు వేసుకునేవాడిని. నాకు డ్యాన్సుల్లో ఇన్స్పిరేషన్ ఎవరంటే అక్కినేనిగారు. అయితే ఆయన నా గురించి ఓ ఇంటర్వ్యూలో ‘నాకు ఎముకలు ఉన్నాయి... కానీ చిరంజీవికి లేవు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి డ్యాన్సులు పరిచయం చేసింది నేనే. కానీ ఆ డ్యాన్సులకి స్పీడు పెంచింది, గ్రేసు పెంచింది చిరంజీవి’ అన్నారు. ‘ఇది గొప్ప గొప్ప అవార్డులతో సమానం’ అనిపించింది.అలాగే ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఇక్కడికి రావడానికి కృషి చేసిన మహానుభావుడు ఏఎన్‌ఆర్‌గారు. ‘కాలేజీ బుల్లోడు’ హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌కి నన్ను పిలిస్తే వెళ్లాను. అందరూ ఒకటే కేరింతలు... కేకలు. ఆయన పక్కకి తిరిగి, ‘ఎవరి కోసం అవన్నీ అనుకున్నావ్...’ అంటే ‘మీ కోసం’ అన్నాను. ‘మాది అయిపోయింది. నీ కోసమే’ అంటూ, నన్ను ఎంకరేజ్ చేశారు. అలా ప్రశంసించే గొప్ప మనసు చాలామందికి ఉండదు. ఆ తర్వాత ఆయనతో ‘మెకానిక్ అల్లుడు’ చేసే గొప్ప చాన్స్ వచ్చింది. ఆయన్ను చూస్తే నాకో ‘ఫాదర్లీ ఫీలింగ్’.నాగ్ నాకు డాక్టర్‌లాంటి వాడు ఆరోగ్య సూత్రాలు పాటించడం, ఎక్సర్సైజుల విషయంలో, యంగ్‌గా ఉండటానికి చూపించే శ్రద్ధలో నాగ్ నాకెంతో ఇన్స్పిరేషన్. నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్. ఇక దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబ్, బాలచందర్‌గార్లు... ఇలా గొప్ప గొప్పవారికి ఇచ్చిన ఏఎన్నార్ అవార్డు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఇచ్చిన అవార్డులా భావిస్తున్నాను’’ అన్నారు.ఏఎన్ఆర్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు: అమితాబ్ బచ్చన్ ‘‘ఇండియన్ సినిమాకు ఏఎన్నార్‌గారు చేసిన కాంట్రిబ్యూషన్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఈ సందర్భంగా నా తండ్రి రాసిన ఓ హిందీ పద్యంలోని ఓ లైన్‌ను ఇక్కడ ప్రస్తావించాలనుకున్నాను. ‘‘నా కుమారులైనంత మాత్రాన... నా కుమారులు నాకు వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో వారే కుమారులు’’ అని ఉంది. గొప్ప వ్యక్తి ఏఎన్నార్‌గారికి నిజమైన వారసులుగా, కుమారులుగా నాగార్జున ఆయన కుటుంబం నిరూపించుకుంది. నా ఫ్రెండ్ చిరంజీవికి ఈ అవార్డును అందించేందుకు నన్ను ఎంపిక చేసిన నాగ్‌కు థ్యాంక్స్.ఆ ఇద్దరూ ఏబీసీ ఆఫ్ ఇండియన్ సినిమా: నాగార్జున ‘‘ఏఎన్ఆర్... ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. ఏ లెజెండ్ లివ్స్ ఆన్. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్ అవార్డు ముఖ్యోద్దేశం. ఈ రోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు. ఇండియన్ సినిమాకు ఏబీ (అమితాబ్) సి (చిరంజీవి).. అమితాబచ్చన్‌గారు, మెగాస్టార్ చిరంజీవిగారు. చిరంజీవిగారికి అవార్డు ప్రదానం చేయడానికి అమితాబచ్చన్‌గారు రావడం ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం. అమితాబ్‌గారి సామాజిక బాధ్యతకు మేం సెల్యూట్చేస్తున్నాం. 1985లో నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవిగారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డాన్స్ చూడమని చెప్పారు. ఆ డాన్స్, గ్రేస్, కరిష్మా చూసి ఆయనలా డాన్స్ చేయగలనా అనిపించింది. చేయలేం... కెరీర్లో మరో దోవ వెతుక్కుంద్దామనుకుని బయటకు వచ్చాను. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని నాన్నగారు అనేవారు. చిరంజీవిగారు, అమితాబచ్చన్ గారు అదే చేసి చూపించారు. ఒకటే చెప్పగలను... ఈ ఇద్దరూ ‘ఏబీసీ ఆఫ్ ఇండియన్ సినిమా’. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ «థ్యాంక్స్. ‘ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్’. ఈ వేడుకలో కీరవాణి ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ హిట్ పాటలను పలువురు గాయనీ గాయకులు ఆలపించారు. ఇక ఆస్కార్ విజేత కీరవాణిని ఈ వేదికపై నాగార్జున ప్రత్యేకంగా సన్మానించారు. -
మెగాస్టార్‌కు ఏఎన్నార్ జాతీయ అవార్డ్.. హాజరైన టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
యాభైఏళ్ల రాజీనామా
కొణిదెల శివ శంకర వరప్రసాద్.... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరో చిరంజీవి అసలు పేరు ఇదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా శివ శంకర వరప్రసాద్‌గా రంగస్థలంపై ‘రాజీనామా’ అనే నాటకంతో మొదలైన ఆయన నట ప్రస్థానం యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘1974లో నర్సపూర్‌లోని వైఎన్ఎమ్ కళాశాలలో బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నప్పుడు రంగస్థలం మీద నేను వేసిన తొలి నాటకం ‘రాజీనామా’. కోన గోవిందరావుగారు రచించారు. నాకు నటుడిగా తొలి గుర్తింపు ఇచ్చింది ‘రాజీనామా’. అది కూడా బెస్ట్ యాక్టర్‌గా అవార్డు రావడం ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది. 1974–2024... యాభై సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది’’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్ళు’. ఈ సినిమాకి గూడ΄ాటి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ సినిమా మొదట రిలీజ్ అయింది. ప్రాణం ఖరీదు’ చిత్రం 1978 సెప్టెంబరు 22న విడుదల కాగా ‘పునాది రాళ్ళు’ 1979 జూన్ 21న రిలీజ్ అయింది. కాగా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. -
నటుడిగా 50 ఏళ్లు పూర్తి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చాలు తెలుగు ప్రేక్షకులకు, కొత్తగా ఏం చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 40 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటినుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ అనే రేంజ్ వరకు వచ్చారు. ఎంత ఎదిగినా మూలాలు, జ్ఞాపకాల్ని మర్చిపోకూడదని చాలామంది చెబుతుంటారు. ఇప్పుడు చిరు కూడా అదే చేశారు. స్పెషల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చారు. నలుగురు హీరోల్లో ఒకడిగా చేసిన 'పునాదిరాళ్లు' తొలి సినిమా. ఆ తర్వాత తనదైన యాక్టింగ్‌తో హీరోగా ఎదిగారు. అద్భుతమైన, టాలీవుడ్ గుర్తుంచుకునే సినిమాలు చేశారు. అయితే చిరంజీవికి నటుడిగా తొలి అడుగు పడింది మాత్రం డిగ్రీ రోజుల్లోనే. రెండో ఏడాది చదువుతున్నప్పుడు 'రాజీనామా' అనే నాటకాన్ని వేశారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)ఈ నాటకానికి గానూ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ ఆఫ్ కాలేజీగా అవార్డ్ వచ్చింది. ఇదంతా 1974-75 టైంలో జరిగింది. తొలి నాటకం వేసిన సందర్భంగా తీసుకున్న ఫొటోని చిరంజీవి ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్త మెగా అభిమానులకు చాలా స్పెషల్ అనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ చిరులో ఎంత మారిపోయారో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకుడు. అనుకున్న ప్రకారమైతే సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ కొడుకు రామ్ చరణ్ కోసం చిరు తన మూవీని వాయిదా వేసుకున్నారు. వేసవిలో 'విశ్వంభర' చిత్రం థియేటర్లలో రిలీజయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
ఈ సంవత్సరం మాకు ప్రత్యేకం: నాగార్జున
దివంగత ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఇస్తున్న ‘ఏఎన్ఆర్’ అవార్డు వేడుకని ఈ నెల 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20న ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘ఏఎన్ఆర్’ అవార్డుని హీరో చిరంజీవికి ఇవ్వనున్నట్లు నాగార్జున పేర్కొన్న విషయమూ తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం చిరంజీవిని కలిసిన నాగార్జున అవార్డు వేడుకకి రావాలంటూ ఆహ్వానించారు.‘‘మా నాన్న ఏఎన్ఆర్గారి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకమైనది. ఈ మైలురాయికి గుర్తుగా ఈ అవార్డు వేడుకకి అమితాబ్ బచ్చన్‌గారు, చిరంజీవిగారిని ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఫంక్షన్‌ను మరపురానిదిగా చేద్దాం’’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు నాగార్జున. ఈ అవార్డు ప్రదానోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఇప్పటివరకూ దేవానంద్, షబానా అజ్మీ, అంజలీ దేవి, వైజయంతీ మాల బాలి, లతా మంగేష్కర్, కె. బాలచందర్, హేమ మాలిని, శ్యామ్ బెనెగల్, అమితాబ్ బచ్చన్, ఎస్.ఎస్. రాజమౌళి, శ్రీదేవి, రేఖ వంటి దిగ్గజాలు ‘ఏఎన్ఆర్’ అవార్డును అందుకున్నారు. -
చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం
ఈ నెల(అక్టోబర్ 28)న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఎక్స్ వేదికగా నాగార్జున తెలియజేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2006లో ఏఎన్నార్ అవార్డులను ప్రారంభించారు. మధ్యలో రెండేళ్ల గ్యాప్ ఇచ్చి.. 2014 తిరిగి అమితాబ్ బచ్చన్‌కు ఈ అవార్డు అందజేశారు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2016లో జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరికి ఏఎన్నార్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి, శ్రీదేవి, రేఖలకు ఈ అవార్డులు అందుకున్నారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందజేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియో జరగబోతున్న ఈ వేడుకల్లో అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోబోతున్నారు. -
ప్రభాస్‌ను ఎవరైనా ప్రేమించాల్సిందే: చిరంజీవి
ప్రభాస్‌కు మాత్రమే డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వెండితెర రారాజుగా విలసిల్లుతున్న ప్రభాస్ మనసు కూడా ఎంతో ప్రత్యేకం. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితిలు వచ్చినా సరే తన వంతు సాయం చేసేందుకు ముందుకొస్తాడు. అలా తను మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూనే అభిమానుల గుండెలకు దగ్గరగా ఉంటాడు. అందుకే ఆయన్ను అభిమానించని వారంటూ ఉండరని చెప్పవచ్చు. సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. నేడు #Happybirthdayprabhas అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.ఆ కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డూడ్..! అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్ ప్రభాస్. ప్రేమ, సంతోషం, గొప్ప కీర్తి ఎల్లప్పుడు మీ వెంటే ఉంటాయని కోరుకుంటున్నాను..! ఈ అద్భుతమైన సంవత్సరం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది.. - చిరంజీవిభారతీయ సినిమా పవర్‌హౌస్, నా సోదరుడు ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రభాస్ తన అసమానమైన ప్రతిభ, అంకితభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృదయాలతో పాటు వెండితెరలపై జయిస్తూనే ఉన్నాడు. మరెన్నో సంవత్సరాల పాటు తన గొప్పతనం నిలిచిపోతుంది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్.. -మంచు విష్ణునిబద్ధత, కోరిక, ప్రతిభ, సంసిద్ధత, కఠోర శ్రమ, వినయం అన్నీ కలిస్తేనే గెలుపు ఖాయం . నువ్వే విజేత. జన్మదిన శుభాకాంక్షలు ప్రభాస్.. - త్రివిక్రమ్నా ప్రియమైన మిత్రుడు ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.. - రామ్ చరణ్అందరికి ప్రియమైన ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వినయం, నిబద్ధత,అంకితభావం ఇవన్నీ నేడు మిమ్మల్ని ఇంతటి స్థాయిలో ఉంచాయి. మీరు కేవలం నటుడిగానే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శక్తిగా మారారు. బాక్సాఫీస్ వద్ద మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా.. - ప్రశాంత్ వర్మ -
చిరంజీవి 'ఠాగూర్' వల్ల మా బతుకు నాశనం: ప్రముఖ డాక్టర్
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో 'ఠాగూర్' ఓ క్లాసిక్. మరీ ముఖ్యంగా ఇందులో హాస్పిటల్ సీన్‌కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఇదే సన్నివేశం వల్ల డాక్టర్ల బతుకులు సర్వనాశనం అయిపోయాయని ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి అంటున్నారు. డాక్టర్లని ఆ సన్నివేశంలో అత్యంత దారుణంగా చూపించారని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ ఇలా తన అభిప్రాయాన్ని చెప్పారు.(ఇదీ చదవండి: అల్లు స్నేహా అట్లతద్ది పూజ.. ఇది ఎందుకు చేస్తారంటే?)'ఆ సీన్ ఎవరు రాశారో తెలీదు గానీ వైద్య వృత్తికి చాలా నష్టం చేకూర్చారు. చెప్పాలంటే అది వరస్ట్ సీన్. అది చూసిన ఎవరైనా సరే పేషెంట్స్‌ని డబ్బుల కోసమే డాక్టర్లు ఐసీయూలోకి తీసుకెళ్తారని అనుకుంటారు. పొరపాటున పేషెంట్ చనిపోతే, దానికి తాము కారణం కాదని వైద్యులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి''చిరంజీవి నాకు క్లోజ్ ఫ్రెండ్. ఆయనతో చాలాసార్లు కలిసి భోజనం కూడా చేశారు. ఓ సందర్భంగా 'ఠాగూర్' సీన్ గురించి చెప్పా. డాక్టర్లకి మనశ్శాంతి లేకుండా చేసిందని చెప్పాను. అయితే అది ఇంకా దారుణంగా ఉందట. చిరంజీవిగారే దాన్ని కాస్త మార్పు చేశారు' అని డాక్టర్ గురవారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: దీపావళికి థియేటర్లలో అరడజను సినిమాలు.. కానీ!) -
పొంగల్ పోరు.. సీన్ మారుతోంది!
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే చాలా స్పెషల్. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి దాదాపు అన్ని సినిమాల వసూళ్లు బాగుంటాయి. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు, దర్శక – నిర్మాతలు వారి సినిమాలను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని పోటీ పడుతుంటారు. కానీ ఫైనల్‌గా బెర్త్ కొంతమందికే దొరుకుతుంది. 2025 సంక్రాంతి సమయం సమీపిస్తున్న తరుణంలో సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఆయా చిత్రబృందాలు రెడీ అవుతున్నాయి. కానీ ఆల్రెడీ సంక్రాంతికి ప్రకటించిన సినిమాలు థియేటర్స్‌లోకి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో వేరే సినిమాలు సంక్రాంతికి సై అంటున్నాయి. ఇలా సంక్రాంతి సినిమా సీన్ మారుతోంది. ఇక 2025 సంక్రాంతి బాక్సాఫీస్ పోరులోకి వెళదాం.సంక్రాంతికి వస్తున్నాం... కానీ! ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే వర్కింగ్ టైటిల్‌ని పెట్టుకుని మరీ వెంకటేశ్ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నారంటే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని యూనిట్ ఎంతటి కృతనిశ్చయంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, అతని భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మరో చిత్రం ‘గేమ్ చేంజర్’ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సంక్రాంతి పండక్కి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా స్పేస్ ఉంటుంది కాబట్టి తమ బేనర్లోని ఈ రెండు చిత్రాలనూ ‘దిల్’ రాజు పండగ బరిలో దింపుతారని ఊహించవచ్చు. ఆఫీసర్ వస్తారా? ఈ ఏడాది సంక్రాంతి సమయంలో రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్స్‌లోకి రావాల్సింది. కానీ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల నిర్మాతల రిక్వెస్ట్, వివిధ సమీకరణాల నేపథ్యంలో ‘ఈగల్’ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకుని, ఫిబ్రవరిలో విడుదలైంది. దీంతో 2025 సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని రవితేజ ప్లాన్ చేశారు. రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ, హీరో రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో రవితేజ భుజానికి గాయమైంది. దాంతో ఈ సినిమా చిత్రీకరణ సజావుగా సాగలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? లేదా అనే విషయంపై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. ‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరి పాత్రలో రవితేజ నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. గేమ్ చేంజర్ రెడీ సంక్రాంతి బరికి సిద్ధమయ్యారు రామ్‌చరణ్. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తొలుత 2024 క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు ‘దిల్’ రాజు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాల ట్రేడ్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ సూచనల మేరకు ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్‌ను 2024 క్రిస్మస్ నుంచి 2025 సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా నిర్మాత ‘దిల్’ రాజు ఇటీవల ఓ వీడియోలో వెల్లడించారు. 2025 జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక ‘గేమ్ చేంజర్’ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, నవీన్‌చంద్ర, ఎస్జే సూర్య, జయరాం, సునీల్, ప్రియదర్శి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ఇది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ల విధులు, హక్కులు, వారికి ఉండే ప్రత్యేక అధికారాలు వంటి అంశాల నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ ఉంటుందని టాక్.నార్త్ ఇండియాలో... ఈ సంక్రాంతి పండక్కి బాలకృష్ణ 109వ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. కేఎస్ రవీంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ దీపావళి సందర్భంగా టైటిల్, రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తారని, కథకు నార్త్ ఇండియా నేపథ్యం ఉంటుందని, విలన్‌గా బాబీ డియోల్, ఓ పోలీసాఫీసర్ పాత్రలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మజాకా ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌లో ‘మజాకా’ సెలబ్రేషన్స్ ఖాయం అంటున్నారు హీరో సందీప్ కిషన్. రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తీసిన నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్న చిత్రం ఇది. మహేంద్రగిరి దేవాలయం సంక్రాంతి వంటి పెద్ద పండక్కి మీడియమ్, స్మాల్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. ప్రతి సంక్రాంతికి ఇలాంటి చిత్రాలు రెండు అయినా వస్తుంటాయి. ఏ చిత్రం ఆడియన్స్‌కు నచ్చితే అది పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ కోవలో వస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సుమంత్ హీరోగా, బ్రహ్మానందం మరో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ఇది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు నిర్మిస్తున్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది.2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ కావాల్సింది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. కానీ ‘విశ్వంభర’ జనవరి 10న రిలీజ్ కావడం లేదు. ‘విశ్వంభర’ సినిమా వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని, రామ్‌చరణ్– ‘దిల్’ రాజుగార్ల కోసం చిరంజీవిగారితో మాట్లాడి ‘విశ్వంభర’ రిలీజ్‌ను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నారు. ఇక ‘విశ్వంభర’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది.అలాగే 2025 సంక్రాంతి సందర్భంగా తాను హీరోగా నటించే ఓ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందన్నట్లు నాగార్జున గతంలో పేర్కొన్నారు. కానీ ఇది సాధ్యపడేలా లేదు. అయితే నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ ఓటీటీ డీల్స్, పర్ఫెక్ట్ రిలీజ్ డేట్స్ వంటి అంశాలను పరిశీలించుకుని ‘తండేల్’ సినిమా సంక్రాంతి రిలీజ్‌పై చిత్రయూనిట్ ఓ స్పష్టతకు వస్తారట. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ బాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో స్ట్రయిట్ చిత్రాలతో పాటు ఒకటీ లేదా రెండు తమిళ హీరోల చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. ఇలా 2025 సంక్రాంతికి అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్స్‌లోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ క్యారెక్టర్లో మూడు వేరియేషన్స్ ఉంటాయి. – ముసిమి శివాంజనేయులు -
30 ఏళ్ల క్రితం ఫోటో.. చిరుతో ఉన్నదెవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఒక బాలుడి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతని పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇందులో ఉన్నది ఎవరో కనిపెట్టండి అంటూ ఒక క్యాప్షన్‌తో వారు షేర్ చేస్తున్నారు. గుర్తుపట్టిన అభిమానులు మాత్రం వెంటనే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇంతకు చిరు చేతిలో ఉన్న ఆ బాలుడు ఎవరంటే..? టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్.మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ అక్టోబర్ 15న తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సినిమాల పరంగా తన కెరీర్ ప్రారంభంలో వరస హిట్స్ కొట్టిన ఆయన ఆ తర్వాత రొటీన్ కమర్షియల్ సినిమాలతో ఘోరంగా దెబ్బతిన్నాడు. మధ్యలో 'రిపబ్లిక్' లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే, విరూపాక్ష, బ్రో చిత్రాలతో అభిమానులను మెప్పించాడని చెప్పవచ్చు.రాబోయే సినిమా విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్లో ‘గాంజా శంకర్’గా రానున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే, సినిమా టైటిల్ మార్చాలని పలు అభ్యంతరాలు వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
నాగబంధం ఆరంభం
‘పెదకాపు’ చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా ‘నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్’ అనే సినిమా ఆరంభమైంది. ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ తో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ ఇతర పాత్రలు పోషించనున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ ‡్ష నామా సమర్పణలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్‌పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్న ‘నాగబంధం’ సోమవారం హైదరాబాద్‌లోప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో చిరంజీవి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తొలి సన్నివేశానికి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. నిర్మాత సునీల్ నారంగ్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. ఈ సందర్భంగా నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని ఈ నెల 23 నుంచిప్రారంభిస్తున్నాం.2025లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయి. ఆ నేపధ్యంలో ఈ చిత్ర కధ ఉంటుంది’’ అని అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తారక్ సినిమాస్, కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అభే, సీఈఓ: వాసు పోతిని, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: అభినేత్రి జక్కల్. -
‘నాగబంధం’ సినిమాకు క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
దసరా సంబరాల్లో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున (ఫొటోలు)
-
ఒకే విమానంలో చిరంజీవి, నాగార్జున.. ఎక్కడికి వెళ్లారంటే..?
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఆదివారం వారిద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. దీంతో వారు ఎక్కడికి వెళ్తున్నారంటూ నెటిజన్లు ఆరా తీశారు. మెగాస్టార్, కింగ్ నాగార్జున నడుచుకుంటూ వెళ్తున్న వీడియో కూడా ఒకటి నెట్టింట వైరల్ అయింది. వారి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు కూడా.చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలిసి కేరళలోని త్రిశూర్ వెళ్లారు. కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత T. S. కళ్యాణరామన్ ఆహ్వానం మేరకు వారి ఇంట్లో జరుగుతున్న దసరా సంబరాల్లో పాల్గొన్నారు. త్రిశూర్‌లో దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని, ఈ క్రమంలో తమ ఇంట్లో కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తామని కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత ప్రత్యేక ఆహ్వానం పంపడంతో వారిద్దరూ వెళ్లారు. T. S. కళ్యాణరామన్ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర టీజర్ తాజాగానే విడుదలైంది. ఇప్పటి వరకు సుమారు 30 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక నాగార్జున కుబేర, కూలీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
'విశ్వంభర' టీజర్లో గ్రాఫిక్స్‌పై ట్రోల్స్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్ రిలీజైంది. ముందు నుంచే చెబుతున్నట్లు ఇది సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీతో తీస్తున్న సినిమా.. అందుకు తగ్గట్లే టీజర్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్‌కి చిరు గ్రేస్‌తో పాటు అన్నీతెగ నచ్చేస్తుంటే.. మిగిలిన వాళ్లలో కొందరు మాత్రం గ్రాఫిక్స్ షాట్స్ విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్)అలానే టీజర్ ప్రారంభంలో చూపించే అంతరిక్షం సీన్.. హాలీవుడ్ హిట్ సినిమా 'అవెంజర్స్' నుంచి తెచ్చి పెట్టారని ప్రూఫ్స్‌తో ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరైతే గ్రాఫిక్స్ నేచురల్‌గా లేవని అంటున్నారు. మూవీ రిలీజ్ టైంకి ఇవన్నీ కాస్త కరెక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చిరంజీవిని ఏం అనట్లేదు గానీ గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు వశిష్ఠ కేర్ తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఇతడిని 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్‌తో పోల్చి ట్రోల్ చేస్తున్నారు.చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాని లెక్క ప్రకారం సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయాలి. కానీ 'గేమ్ ఛేంజర్' కోసం దీన్ని వాయిదా వేశారు. ఈ విషయాల్ని అధికారికంగా ప్రకటించారు. అంటే 'విశ్వంభర' వచ్చేది వేసవికే అనమాట. ఏప్రిల్‌లో 'రాజా సాబ్' ఉంది కాబట్టి మేలోనే రిలీజయ్యే ఛాన్సులు ఎక్కువ. మరి చూడాలి ఏ డేట్ ఫిక్స్ చేస్తారో?(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)MEGA fans thappa andaru konchem disappointed feel lo ne unnaru ga teaser choosi 😴😴😴 Its nice that they postponed to Summer 2025 ..Work well on Vfx and bring out GRANDDD OUTPUT ..plz don't go PAN-INDIA with this movie @UV_Creations 🙏⭐️ @KChiruTweets⭐️ #ViswambharaTeaser 👎 pic.twitter.com/zOX9eJWOII— ★ Movie Monster ★ (@movie_monsterz) October 12, 2024#ViswambharaTeaser - Storyline definitely looks thrilling but VFX could have been better. Aa chota k naidu mida antha interest enti boss aadi cinematography outdated asalu, small range movies kuda adni consider cheyatle 🤦🏻♂️Btw, Boss in this frame 🔥 pic.twitter.com/CtYwzZZjMS— CK (@Chanti616) October 12, 2024 -
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' మూవీ HD స్టిల్స్ (ఫోటోలు)
-
'విశ్వంభర'తో యుద్ధాన్ని పరిచయం చేసిన మెగాస్టార్ (టీజర్)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. దసరా సందర్భంగా మెగా అభిమానుల కోసం చిత్ర యూనిట్ అదిరిపోయే కానుకను ఇచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు.చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించేలా ‘విశ్వంభర’ టీజర్ ఉంది. యు.వి.క్రియేషన్స్ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ గేమ్ ఛేంజర్ అనూహ్యంగా సంక్రాంతి రేసులోకి రావడంతో విశ్వంభర వాయిదా పడుతుంది. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.బాక్సాఫీస్‌ను షేక్ చేసేలాభోళా శంకర్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఎంపిక చేశారు. ఫ్యాన్స్ కూడా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. మెగాస్టార్ లుక్‌తో పాటు టీజర్లో కనిపిస్తున్న విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్ ఉంది. విశ్వంభరతో బాక్సాఫీస్ వద్ద మెగా యుద్ధం తప్పకుండా ఉంటుంది. -
సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'.. దిల్ రాజు ప్రకటన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, దసరా సందర్భంగా మెగా ఫ్యాన్స్‌లో నిర్మాత దిల్‌రాజు జోష్ నింపారు. గేమ్ ఛేంజర్ విడుదల తేదీని అయన అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు స్పష్టతనిచ్చారు.'గేమ్ ఛేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నప్పుడు క్రిస్మస్ కంటే సంక్రాంతి అయితే బావుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్ సీస్‌లోని ఇతర డిస్ట్రిబ్యూటర్స్ అందరం భావించాం. ఈ ఆలోచనను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ సంస్థకు తెలియజేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభర’ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అందువల్ల సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారితో పాటు యువీ క్రియేషన్స్ సంస్థను అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి విడుదలకు లైన్ క్లియర్ అయింది. విశ్వంభర సినిమా విషయంలో మరో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారు. విశ్వంభర సినిమా కూడా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా నిర్మాణ పనులన్నీ పూర్తి అయ్యాయి. కానీ, నా కోసం, మా సినిమా కోసం వాళ్ల మరో రిలీజ్ డేట్‌కు విశ్వంభర విడుదల చేయటానికి ఒప్పుకున్నారు. అందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి నా ధన్యవాదాలు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను సంక్రాంతి విడుదల చేస్తున్నాం. ఇటు అభిమానులకు, అటు సినీ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నాం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూ ట్యూబ్‌లో మారుమోగిపోతున్నాయి. తర్వాత టీజర్‌తో పాటు మరో మూడు సాంగ్స్ రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజయం సాధించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతికి కలుద్దాం.' అన్నారు.సంక్రాంతికి కలుద్దాం! ❤️🔥✊🏼#GameChanger Global Star @AlwaysRamCharan @shankarshanmugh @MusicThaman @advani_kiara @iam_SJSuryah @actorsrikanth @yoursanjali @Naveenc212@AntonyLRuben @DOP_Tirru @artkolla @HR_3555 @ZeeStudios_ @saregamaglobal @saregamasouth @PharsFilm… pic.twitter.com/57Ht1FRW8m— Sri Venkateswara Creations (@SVC_official) October 12, 2024 -
'విశ్వంభర' టీజర్ తేదీని ఫిక్స్ చేసిన మెగాస్టార్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. దసర సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఇదే విషయాన్ని తాజాగా ఒక పోస్టర్‌తో అభిమానులతో పంచుకున్నారు.దసర సందర్భంగా అక్టోబర్ 12న విశ్వంభర టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శనివారం ఉదయం 10:49 గంటలకు ప్రేక్షకులను విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేయనున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి కావస్తుంది.చిరంజీవి ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులను మెప్పించారు. క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి ‘విశ్వంభర’ రెడీ అవుతోంది. ఈ మూవీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. -
దిగ్గజ రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళి
మన దేశం మరో దిగ్గజాన్ని కోల్పోయింది. దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా.. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన ఇకలేరు అనే విషయాన్ని ఏ ఒక్కరూ తట్టుకోలేకపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, రాజమౌళి, నానితో పాటు బాలీవుడ్ వాళ్లు కూడా తమ బాధని ఆయన చేసి సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు.భారతీయ సినీ ప్రముఖుల ట్వీట్స్It’s a sad day for all Indians. For generations together there is not a single Indian whose life hasn’t been touched by his services one way or the other. One of the greatest visionaries our country has ever seen, a truly legendary industrialist, a philanthropist… pic.twitter.com/YHBiX00dNv— Chiranjeevi Konidela (@KChiruTweets) October 10, 2024Legends are born, and they live forever. It’s hard to imagine a day without using a TATA product… Ratan Tata’s legacy is woven into everyday life. If anyone will stand the test of time alongside the Panchabhootas, it’s him. 🙏🏻Thank you Sir for everything you’ve done for India…— rajamouli ss (@ssrajamouli) October 10, 2024End of an era. But the legacy is forever. Farewell sir 🙏🏼#RatanTata— Nani (@NameisNani) October 10, 2024India’s most valuable man, not necessarily for his vast wealth, but for his values.. largest being Integrity !! Never a show off but always the star ⭐️ The life #RatanTata ji led will always be an inspiration🙏 pic.twitter.com/yqbNTGWrT9— Randeep Hooda (@RandeepHooda) October 9, 2024Deeply saddened by the demise of Shri #RatanTata , a true icon of Indian industry. His remarkable vision, leadership, and compassion have inspired generations. As we bid farewell, his invaluable contributions to nation-building and philanthropy will be remembered forever. pic.twitter.com/bnpzPV4yax— Bobby (@dirbobby) October 10, 2024Deepest condolences for the 'Bharat Ratna' in true sense, finest human being, philanthropist business tycoon our very own #RatanTata is no more. His contributions to society/nation are enormous. Thoughts & prayers are with the family & friends in their hour of grief for their… pic.twitter.com/0g13H5QiOG— Shatrughan Sinha (@ShatruganSinha) October 10, 2024An icon. A legend. Thank you for inspiring us sir. You will be remembered forever 🙏🏻#RatanTata pic.twitter.com/1t7tBYuW4k— Anjali (@yoursanjali) October 10, 2024A inspiration to many of us🙏🏻 You will be greatly missed sir😇#RatanTata pic.twitter.com/XPIt6LVsHG— Nayanthara✨ (@NayantharaU) October 9, 2024Sad to hear that #RatanTata is no more. A legendary leader, visionary & philanthropist passes on, leaving behind a legacy of excellence & compassion. My deepest condolences to the Tata group & family. May his legacy continue to inspire us. #RIPRatanTataSir pic.twitter.com/snmejOwnjN— Sudheer Babu (@isudheerbabu) October 10, 2024It is with immense sorrow that we say goodbye to one of the most visionary leaders of our time, Ratan Tata. His extraordinary contributions to business, philanthropy, and society will leave a lasting legacy. May his soul rest in eternal peace.#RatanTata pic.twitter.com/JjCl8ZFiMa— Varun Tej Konidela (@IAmVarunTej) October 10, 2024Shri #RatanTata ji 🙏🏻You will be remembered for Ever sir..Thank You for the Inspiration 🙏🏻❤️A True Legend.. A True Icon 🙏🏻 pic.twitter.com/AVUkZmnGvB— DEVI SRI PRASAD (@ThisIsDSP) October 9, 2024असा माणूस पुन्हा होणे नाही. Deeply saddened to know that Shri #RatanTata ji is no more. Condolences to the family and loved ones. Rest In Glory Sir. 🙏🏽 pic.twitter.com/ldThYxUwJz— Riteish Deshmukh (@Riteishd) October 9, 2024The Icon of leadership, philanthropy, and ethics!! His legacy will continue to inspire generations. India has lost a giant today. #RIPRatanTata #RatanTata pic.twitter.com/c6qaZ75ykh— Rana Daggubati (@RanaDaggubati) October 9, 2024India bows in silence tonight. #RatanTata 🙏🏻🙏🏻 pic.twitter.com/hD3ACoB3iJ— DVV Entertainment (@DVVMovies) October 9, 2024A man who inspired and touched many lives.. Thank you #RatanTata sir 🙏🏿🙏🏿🙏🏿 will miss you RIP 💔💔💔💔 pic.twitter.com/ngAtEau9MR— Prakash Raj (@prakashraaj) October 10, 2024One Sun.One Moon.One Ratan Tata.The eternal. 🙏🏻🙏🏻#RatanTata pic.twitter.com/Kah9kGgnzQ— Sri Venkateswara Creations (@SVC_official) October 9, 2024The Titan and true icon, #RatanTata garu passing on . It's truly saddening.Your impact on me and the rest of the world will never be forgotten. History will remember you. Your words of wisdom have inspired and touched me deeply, Thank you for inspiring us with your humility… pic.twitter.com/0V8wImPeCE— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 9, 2024Om Shanti.. 🥺😢#RatanTata https://t.co/Y3LeM7204f— Shirley Setia (@ShirleySetia) October 9, 2024 -
మంత్రి కొండా సురేఖ Vs టాలీవుడ్.. ఎవరెవవరు ఏమన్నారంటే..? (ఫొటోలు)
-
చిరంజీవి కాదు.. చరణ్ వస్తున్నాడా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్లే షూటింగ్, గ్రాఫిక్స్ పనులన్నీ వేగంగా చేస్తున్నారు. ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నా సరే అనుకోని అవాంతరాలు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి.. చికెన్ గున్యా బారిన పడ్డారు. అయినా సరే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈవెంట్‌కి హాజరైన తనకు దక్కిన పురస్కారాన్ని అందుకున్నారు.(ఇదీ చదవండి: ప్రముఖ ఫోక్ సింగర్‌పై అత్యాచార కేసు.. యువతి ఫిర్యాదు)ప్రస్తుతం చిరంజీవి కోలుకుంటున్నారని, పూర్తిగా సెట్ అవడానికి మరికాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తోంది. దీంతో 'విశ్వంభర' సమాయానికి రెడీ అవ్వకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సంక్రాంతి రేసు నుంచి చిరు సైడ్ అవుతారు. ఇదే గనన జరిగితే 'గేమ్ ఛేంజర్'ని సంక్రాంతి రేసులోకి తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నారట.ఇప్పటికే సంక్రాంతి రేసులో బాలయ్య, వెంకటేశ్, రవితేజ ఉన్నారు. చిరంజీవి వస్తే ఓకే. లేదంటే మాత్రం చరణ్ రెడీగా ఉన్నాడు. అంతలో శంకర్ కూడా అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి టైమ్ దొరుకుతుంది. మరి సంక్రాంతికి చిరంజీవి వస్తాడా? రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్) -
ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్
బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ (ఐఫా) వేడుక అబుదాబిలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, కరణ్ జోహార్, విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటిరోజు దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు, సినీ ప్రముఖులకు అవార్డులు అందించారు. రెండోరోజు బాలీవుడ్ సినిమాలకు సంబంధించి అవార్డ్స్ అందించారు. అయితే, బాలీవుడ్ విభాగంలో తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా సత్తా చాటింది. కానీ, జవాన్ సినిమాకు గాను షారుక్ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది. అయితే, సౌత్ ఇండియా నుంచి ఉత్తమ చిత్రంగా జైలర్ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నాని (దసరా) అవార్డ్ అందుకున్నారు. అయితే, నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ చిత్రానికి పలు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి.ఐఫా 2024 విజేతలు (సౌత్ ఇండియా)ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- మెగాస్టార్ చిరంజీవిఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా – ప్రియదర్శన్ఐఫా వుమెన్ ఆఫ్‌ది ఇయర్ – సమంతఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు – బాలకృష్ణఐఫా ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టిఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరాఉత్తమ నటుడు (తెలుగు)- నాని (దసరా)ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – బ్రహ్మానందం(రంగమార్తాండ)ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్ (పీఎస్ 2)ఉత్తమ విలన్ (తెలుగు) - షైన్ టామ్ (దసర)ఉత్తమ విలన్ (తమిళం) - ఎస్జే సూర్య (మార్క్ ఆంటోనీ)ఉత్తమ విలన్ (కన్నడ) - జగపతి బాబుఉత్తమ విలన్ (మలయాళం) – అర్జున్ రాధాకృష్ణన్ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పీఎస్ 2)ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టిఉత్తమ నటి (కన్నడ) – రుక్మిణి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)ఉత్తమ నటుడు (కన్నడ) – రక్షిత్ శెట్టి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – జయరామ్ (పీఎస్ 2)ఉత్తమ లిరిక్స్ – జైలర్ (హుకుం)ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్ రెహమన్ (పీఎస్ 2)ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పీఎస్ 2)ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్ (పీఎస్ 2)ఐఫా 2024 విజేతలు (బాలీవుడ్)ఉత్తమ చిత్రం : యానిమల్ఉత్తమ దర్శకుడు: విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్)ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ (జవాన్)ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (యానిమల్)ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ )ఉత్తమ విలన్: బాబీ డియోల్(యానిమల్)ఉత్తమ సంగీతం: యానిమల్ ఉత్తమ లిరికల్స్: యానిమల్ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)ఉత్తమ గాయకుడు: భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్)ఉత్తమ గాయని: శిల్పారావు (చెలియా-జవాన్)ఉత్తమ కథ: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీఅచీవ్మెంట్ ఆన్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఇన్ సినిమా : కరణ్ జోహార్ -
మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డ్
సినిమా ఇండస్ట్రీలో బోలెడన్ని అవార్డులు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. అలాంటిదే ఐఫా. తాజాగా అబుదాబిలో ఐఫా అవార్డులు-2024 వేడుక గ్రాండ్‌గా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ స్టార్ సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. చిరంజీవి కూడా సతీమణితో కలిసి హాజరయ్యారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక 'ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారాన్ని బాలకృష్ణ-వెంకటేశ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని సమంత సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్)ఏయే విభాగాల్లో ఎవరికి అవార్డు?ఉత్తమ సినిమా - జైలర్ఉత్తమ నటుడు - నానిఉత్తమ నటుడు - విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ నటి - ఐశ్వర్యరాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ దర్శకుడు - మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ విలన్ - ఎస్జే సూర్య (మార్క్ ఆంటోని)ఉత్తమ విలన్ - షైన్ టాక్ చాకో (దసరా)ఉత్తమ సహాయ నటుడు - జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ సినిమాటోగ్రాఫీ - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిఉత్తమ సాహిత్యం - హుకుం (జైలర్)ఉత్తమ గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ గాయని - శక్తి శ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2)ఉత్తమ విలన్ - అర్జున్ రాధాకృష్ణన్ (మలయాళం)ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా - ప్రియదర్శన్ (దర్శకుడు)వుమెన్ ఆఫ్‌ది ఇయర్ - సమంతగోల్డెన్ లెగసీ అవార్డు - బాలకృష్ణఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?) -
#IIFAUtsavam2024 : అబుదాబిలో ఘనంగా ఐఫా.. మెరిసిన తారలు (ఫొటోలు)
-
చిరంజీవి తో విభేదాలు.. కొరటాల రియాక్షన్ వైరల్..
-
వీళ్లూ ఎక్కారు... గిన్నిస్ రికార్డుల్లోకి!
నాలుగు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. తన డ్యాన్స్, నటనతో కోట్లాదిమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. తన సినీ జర్నీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్ తాజాగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో రికార్డ్ బ్రేక్ చేశారు. దీంతో ఆయనకు ఈ రికార్డు దక్కింది. సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకుని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేతులు మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. అయితే, చిరు కంటే ముందే మన టాలీవుడ్ లెజెండ్స్ కొందరు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.దాసరి నారాయణరావుతెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి దాసరి నారాయణరావు రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో అత్యధిక చిత్రాల దర్శకుడుగా ఆయనకు గుర్తింపు రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడంతో పాటు 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలకు కథ, మాటల రచయితగా, గీత రచయితగా పనిచేశారు. తెలుగు సినీ దిగ్గజంగా కీర్తిని పొందిన ఆయన 2017 మే 30న మరణించారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంశ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. ఆయన్ను ఎస్పీ బాలు అని ఎంతోమంది ప్రేమతో పిలుస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠ,మలయాళం భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు బాలు పాడారు. ఇలా ఎక్కువ సంఖ్యలో పాటలు పాడిన ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. బాలు నేపథ్య గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 6 జాతీయ పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. 2020 సెప్టెంబరు 25న బాలు మరణించగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.దగ్గుబాటి రామానాయుడుదగ్గుబాటి రామానాయుడు.. మూవీ మోఘల్‌గా ఆయన అందరికీ దగ్గరయ్యారు. ఒకే వ్యక్తి 100 చిత్రాలకు పైగా నిర్మాతగా తెరకెక్కించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో రామానాయుడు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. బెంగాలీలో ఆయన నిర్మించిన అసుఖ్ (1999) ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కించుకుంది. 2015 ఫిబ్రవరి 18న క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించారు.విజయనిర్మల తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల దర్శకురాలుగా కూడా తన ప్రతిభను చాటారు. డైరెక్టర్‌గా 44 చిత్రాలను తెరకెక్కించి రికార్డ్ సెట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నీస్ బుక్‌లో ఆమె చోటు సంపాదించారు. 11 ఏళ్ల ప్రాయంలోనే ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఆమె.. 1971లో 'మీనా' చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆమె సుమారు 50కి పైగా సినిమాల్లో నటించారు. 2019లో విజయనిర్మల మరణించారు. పి. సుశీల ఆరు దశాబ్దాల పైగా భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురాలైన గానకోకిల పి. సుశీల పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. 12 భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ, సంస్కృత, సింహళ, పడుగు, తుళు, బెంగాలీ, పంజాబీ) సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 30 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా. అయితే, గిన్నీస్ బుక్ వారు మాత్రం 1960ల నుంచి 6కు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలను మాత్రమే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చారు. ఈ ఘనత సాధించిన ఏకైక ఫిమేల్ సింగర్‌గా ఈ ‘గాన సరస్వతి’కి దక్కింది. దీంతో ఆమెకు గిన్నీస్ బుక్‌లో చోటు దక్కింది. భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవించాయి.బ్రహ్మానందంకన్నెగంటి బ్రహ్మానందం.. ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒకే భాషలో 754 చిత్రాలలో నటించినందుకుగాను ఆయన పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చేరింది. ఒకే భాషలో ఇన్ని సినిమాలు నటించిన నటులు ఇంతవరకు ఎవరూ లేరు. అయితే, వాస్తవంగా బ్రహ్మానందం ఇప్పటి వరకు 1250 సినిమాలకు పైగానే నటించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌ను దక్కించుకున్నారు. రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా బ్రహ్మానందం సినీ రంగ ప్రవేశం చేశారు. -
గిన్నిస్‌బుక్‌లో చిరంజీవి.. ఎందుకో తెలుసా? (ఫొటోలు)