
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవిని యుకెకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా ఘనంగా సత్కరించారు. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలనుగానూ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో చిరు అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేశారు.
ReelN Ltd Founder Aman Dhillon with @BridgeIndiaOrg Founder bestows megastar #Chiranjeevi at @UKParliament amidst high-profile consulates and MPs. Truly, a great honour! @KChiruTweets @PratikEPG pic.twitter.com/SsNUVH29ES
— ReelN (@ReelnUK) March 19, 2025
Comments
Please login to add a commentAdd a comment