Life achievement award
-
ఘనంగా కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్.. సుమన్‌కు జీవనసాఫల్య పురస్కారం
కోడిరామకృష్ణ.. ఆయన ఒక లెజండరీ డైరెక్టర్. ఆయన తీసిన సినిమాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే సినిమాలెన్నో తీసి శతాదిక చిత్ర దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన తను జీవితంలో 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,2012 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులను స్వీకరించారు. లెజండరీ దర్శకుడు కోడిరామకృష్ణ జయంతిని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎబిసి ఫౌండేషన్ అండ్ వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నటుడు నిర్మాత, అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చికోటి ప్రవీణ్, బి. ప్రవీణ్ కుమార్ లతో చాలామంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవారంగం, నాటక రంగం, సినిమా రంగం ఇలా వివిధ రంగాలలో ప్రతిభను చూపిన సుమారు 30మందికి ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ అవార్డులను అందజేశారు. హీరో సుమన్‌కు కోడిరామకృష్ణ జీవన సౌఫల్య పురస్కారం అవార్డుతో పాటు లెజండరీ అవార్డు ను బహుకరించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమం అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. 'నాకు లైఫ్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే. ఈ రోజు తనపేరుతో జీవన సౌఫల్య పురస్కారం అవార్డును అందుకోవడం సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను' అని అన్నారు నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త మాట్లాడుతూ.. 'మనిషి బతికున్నప్పుడు అందరూ దగ్గరుంటారు. అయితే అయన లేకున్నా ఆయనతో ఏ విధమైన సహాయ సహకారాలు అందుకోక పోయినా ఆయన తీపి గుర్తులు ప్రేక్షకులకు తెలియజేయాలని అతని పేరు మీద కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తున్న రామ సత్యనారాయణ గ్రేట్' అని పేర్కొన్నారు. నటుడు నిర్మాత, అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను చెవిలో పువ్వు సినిమా కు నిర్మాతగా ఉన్నపుడు కోడిరామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు తను నాకు భారత్ బంద్ సినిమాలో మంచి వేషం ఇస్తాను చెయ్యమని చెప్పాడు. నేను చేయలేను నాకు భయం అన్నా వినకుండా నాతో చేయించడంతో నేను నటుడుగా పరిచయమయ్యాను. మహా దర్శకులైన కోడిరామకృష్ణ గారు ఎందరో ఆర్టిస్టులను తీర్చిదిద్దారు. యం.యస్. రెడ్డి, అంకుశం సినిమాలో రామిరెడ్డి, క్యాస్టూమ్ కృష్ణ వీరంతా నటులు కాదు వీరంతా వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా వారిని నటులుగా బిజీ చేసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు . అటువంటి మహానుభావుడి వల్లే నేను భారత్ బంద్ తరువాత నటుడుగా బిజీ అవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి లైఫ్ ను కెరియర్ ను ఎలా టర్న్ చెయ్యచ్చో తెలిసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు. ఆయన్ను ఇంకా గుర్తించుకొని మా రామ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను. మనిషి ఉన్నా లేకున్నా స్నేహం చిరకాలం ఉంటుంది అని గుర్తు చేసిన వ్యక్తి రామ సత్యనారాయణ' అని తెలిపారు. -
హనుమాన్ చౌదరికి జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: బహుముఖ ప్రజ్ఞావంతుడు, ప్రజ్ఞాభారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరికి ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. 49వ వార్షికోత్సవాల్లో భాగంగా ‘ది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్’ 2021–22 సంవత్సరానికిగాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసింది. ఇటీవల నగరంలోని నోవాటెల్‌లో జరిగిన కార్యక్రమంలో డీఆర్డీఓ చైర్మన్ జి.సతీష్‌రెడ్డి, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొని, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మేనేజర్ ఆఫ్ ది ఇయర్’అవార్డును జయతీర్థ్ ఆర్.జోషి (డిఫెన్స్ ఆర్ అండ్ డీ ల్యాబ్), ‘హెచ్ఆర్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’అవార్డు ప్రవీణ్ తివారీ(పల్స్ ఫార్మా), ‘ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’అవార్డు దేశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (ఆప్టిమస్ డ్రగ్స్)లు అందుకున్నారు. ‘సీఎస్ఆర్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్’చిన్నబాబు సుంకవల్లి(గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్)కి, మంజూష కొడియాల(ఫార్మా ఆర్ అండ్ డీ)కి ‘యంగ్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’, ఉమ కాసోజి(ది స్టార్ ఇన్మి)కి ‘ఉమెన్ అచీవర్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్’, ప్రొఫెసర్ రామచంద్ర(జేఎన్టీయూ)కు ‘అకడమీషియన్ ఎక్సలెన్స్’పి.కృష్ణ చైతన్య(మోటివేషనల్ స్పీకర్)కు ‘మెంబర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను ప్రదానం చేశారు. -
అవార్డు గ్రహీత వీల్‌చైర్ ఫుట్‌స్టెప్స్‌ని సరి చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: నాయకుడు అంటే అందలం ఎక్కి అధికారాన్ని అనుభవించేవాడు కాదు. తనను నమ్ముకున్న వారిని ముందుండి నడిపించేవాడు.. అండగా ఉండేవాడు.. కష్టంలో ఆదుకునేవాడు.. సేవకు వెనకడుగు వేయనివాడు. ఈ లక్షణాలన్ని పుణికి పుచ్చుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయనలో సీఎం అనే గర్వం ఇసుమంత కూడా ఉండదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం తండ్రి, మహానేత వైఎస్సార్ నుంచి అలవర్చుకున్నారు సీఎం జగన్. ఆయన మాటతీరు, చెరగని చిరునవ్వు.. చూడగానే మన మనిషి అనిపిస్తాయి. ఏమాత్రం బేషజాలు చూపని వ్యక్తి సీఎం జగన్. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: YSR Awards: ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సం) వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చూపిన హుందాతనం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రచయిత కత్తి పద్మారావుకు అవార్డ్ అందజేశారు జగన్. ఆ సమయంలో పద్మారావు వీల్‌చైర్ ఫుట్‌స్టెప్స్‌ని సరి చేశారు సీఎం జగన్. అంతేకాక పద్మారావు చేయి పట్టుకుని.. ఆయన నిల్చోడానికి సాయం చేశారు. అవార్డు గ్రహీతకు ఎంతో గౌరవం ఇచ్చి.. సామాన్య వ్యక్తిలా ప్రవర్తించిన సీఎం జగన్ హుందాతనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. చదవండి: సీఎం జగన్ చర్యలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం -
వైఎస్ఆర్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డ్: సి.పి. బ్రౌన్ లైబ్రరీ
-
నవంబర్ 1న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలను నవంబర్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రదానం చేస్తారు. విజయవాడలోని ఏ–1 కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, కలెక్టర్ జె.నివాస్ తదితరులు ఆదివారం సాయంత్రం పరిశీలించారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన రంగాల్లో అసమాన ప్రతిభ చాటిన 62 మందికి ఈ అవార్డులను అందచేయనున్నారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు రూ.10 లక్షల నగదు అందచేయనున్నారు. చదవండి: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక భరోసా -
సీమ నేలను కథగా చూపినవాడు
కేతు విశ్వనాథ రెడ్డికి 80 ఏళ్లు. తెలుగు కథా సాహిత్యంలో భీష్మ పితామహుడి వంటి ఆయనకు ఇప్పుడు సాహిత్య జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం విశేషం కాదు. కాని ఆయనను సత్కరించుకోకుండా ఎవరిని సత్కరించుకోగలం? తెలుగు కథను, రాయలసీమ కథను సగర్వంగా, సమున్నతంగా గౌరవించుకోవాలని అనుకున్న ప్రతిసారీ ఆ పూలహారం వెళ్లి పడేది కేతు విశ్వనాథరెడ్డి మెడలోనే. సీమ కథకు చేవ ఆయనది. చేర్పు ఆయనది. నేల మీద గట్టిగా నిలబడి చెప్పిన సాహిత్యమంతా నిలిచింది. కేతు విశ్వనాథరెడ్డి తన చూపును నేలన గుచ్చి కథలు రాశారు. నేల మీద తిరుగాడే మట్టి పాదాలు, రైతు పాదాలు, స్త్రీల పాదాలు, తెలియకనే బానిసలుగా బతుకుతున్నవారి పాదాలు... ఇవి ఆయన కథా వస్తువులు. రాయలసీమ కథలో మధురాంతకం రాజారాం గారిది ఒక కథాధోరణి అయితే కేతు విశ్వనాథ రెడ్డిది మరో కథాధోరణి. మధురాంతకం రాజారాం పాఠకుణ్ణి ఒప్పించడం కూడా అవసరమే అనుకుంటారు. కేతు విశ్వనాథ రెడ్డి ‘నేను జీవితాన్ని చూపుతాను... చూడగలిగిన వారంతా చూడండి’ అని ములాజా లేని ధోరణి పాటించారు. కఠిన సత్యాలను, నిష్టూర సత్యాలను సీమ ప్రజల తరఫున పాఠకుల ముందు పెట్టారు. రైతుకు, నేలకు ముడి తెగితే ఆ రైతు ఎలా గాలికి కొట్టుకుపోయి పతనమవుతాడో కేతు తన ‘నమ్ముకున్న నేల’ కథలో చూపుతారు. ఆ కథ రాసే సమయానికీ ఇప్పటికీ పరిస్థితి మారి ఉండొచ్చు. కాని ఆ సమయంలో ఆ కథ మొత్తం రాయలసీమ నేల పెట్టిన వెర్రికేక. కరువు నేలలో మనిషిలో జడలు విప్పే స్వార్థం పశుస్థాయి కన్నా ఘోరమైనది అని ‘గడ్డి’ కథలో ఆయన చూపుతారు. ప్రజలకు అందాల్సిన ఫలాలు ప్రజల వరకూ చేరడం లో, ఆఖరుకు గడ్డి పంపకంలో కూడా భాగాలుంటాయని కేతు చెప్తే పాఠకునికి కడుపు తరుక్కుపోతుంది. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలపై కేతు నిశితమైన వ్యాఖ్యానం వంటి కథలు రాశారు. ‘కూలిన బురుజు’ అందువల్లే గొప్ప కథగా నిలిచిపోయింది. ఆ కథలో ఒక డాక్టరు చేత ‘జబ్బు ఉంది అని కనిపెట్టడం గొప్ప కాదు. ఆ జబ్బుకు మందు కనిపెట్టడం గొప్ప’ అనిపిస్తారు. ఆ కథలో చాలా రోజుల తర్వాత తన ఊరికి వచ్చిన డాక్టరు పాత్ర ఊరిని చూసి దిగ్భ్రమ చెందుతుంది. ఊళ్లో ఎక్కడ చూడు కొట్లాటలూ కార్పణ్యాలే. తలాన్ని మార్చి చూస్తే సమస్య సరిగ్గా అర్థమవుతుంది. ఊరిలో ఉన్న వాళ్లకు తాము అలా ఎందుకున్నామో తెలియదు. ఊరు వదిలి వెళ్లిన డాక్టరుకు అర్థమవుతుంది. మగవాళ్ల పంతాలలో నలిగిపోయే స్త్రీలను ఈ కథలో కేతు గొప్పగా చూపుతారు. కేతు విశ్వనాథరెడ్డి రాయలసీమలోని ఆత్మీయ జీవనాన్ని మతాల మధ్య ఉండే సహనపూర్వకమైన జీవనాన్ని కథల్లో చూపారు. ‘పీర్లసావిడి’, ‘అమ్మవారి నవ్వు’ ఆ విషయాన్ని నిరూపిస్తాయి. ఆయన స్త్రీవాద దష్టితో రాసిన కథలూ విలువైనవి. స్త్రీలు చదువులో, ఉపాధిలో వివక్ష అవసరంలేని, లైంగిక వేధింపులకు తావు లేని జీవనం పొందాలని బలంగా కోరుకున్నారు. ‘రెక్కలు’ కథ అందుకు ఉదాహరణ. ‘సతి’, ‘ఇచ్ఛాగ్ని’... ఆ వరుసలో ఎన్నో. రాయలసీమ వాసికి వాన ఎంత ముఖ్యమో వాన కోసం ఎన్ని అగచాట్లు పడతాడో ‘వాన కురిస్తే’ కథలో దుఃఖం కలిగేలా చెబుతాడాయన. కేతు విశ్వనాథ రెడ్డి కేవలం కథకుడు కావడం వల్ల మాత్రమే తన సాహితీ జీవనాన్ని సాఫల్యం చేసుకోలేదు. అరసంలో పని చేశారు. కొ.కు. సంపుటాలకు సంపాదకత్వం వహించారు. వత్తి రీత్యా అధ్యాపకుడైనందున కథకునిగా కూడా శిష్యులను ప్రశిష్యులను తయారు చేశారు. కేతు ప్రోత్సాహంతో కథా సాహిత్యంలో కషి చేసిన, చేస్తున్న మేలిమి కథకులు ఇవాళ ఉన్నారు. హైదరాబాద్‌లో సుదీర్ఘకాలం నివసించి, తన నేల– కడపలో విశ్రాంత జీవనం గడుపుతున్న కేతు విశ్వనాథ రెడ్డి కథాలోకానికి ఒక పెద్ద దిక్కు. నేడు ఆయనకు జరుగుతున్న సత్కారం తెలుగు కథకు జరుగుతున్న సత్కారం. ఆ సభకు ఆయన కథలూ బారులు తీరుతాయేమో. పాఠకులమైన మనం ఆ సమూహంలో మెడ నిక్కించకుండా ఎలా ఉండగలం? కేతుగారికి హదయపూర్వక శుభాకాంక్షలు. డాక్టర్ తుమ్మల రామకృష్ణ వ్యాసకర్త, వైస్ చాన్సలర్, కుప్పం యూనివర్సిటీ (కేతు విశ్వనాథరెడ్డికి నేడు అనంతపురంలో ‘విమల సాహిత్య జీవిత పురస్కారం’ బహూకరిస్తున్న సందర్భంగా...) -
భగవంతుని ఆశీస్సుల వల్లే అవార్డు: పి.సుశీల
చెన్నై: జీవిత సాఫల్య అవార్డు భగవంతుని ఆశీస్సుల వల్లే తనకు లభించిందని ప్రఖ్యాత గాయని పి.సుశీల పేర్కొన్నారు. గాయని పి.సుశీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంగ్లాండ్ మగళీర్ నెట్వర్క్ అనే సంస్థ జీవిత సాఫల్య అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రిటన్ దేశానికి చెందిన ఈ సంస్థ ప్రతి ఏడాది ఆ దేశానికి చెందిన వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలకు జీవిత సాఫల్య అవార్డు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పురస్కారం వేడుకల కార్యక్రమం బ్రిటన్ పార్లమెంట్ సభలో సభ్యుల సమక్షంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ దేశేతర ప్రముఖ మహిళలనూ ఈ అవార్డుతో సహకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మన దేశానికి చెందిన ప్రముఖ గాయని పి.సుశీల, ఏఆర్ రెహమాన్ సహోదరి, మహిళా సంగీత దర్శకురాలు ఏ.ఆర్ రెహానాలకు జీవిత సాఫల్య అవార్డు ప్రకటించారు. కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవల ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ మగళీర్ నెట్వర్క్ సంస్థకు చెందిన చెన్నై నిర్వాహకులు నజ్రిన్, అష్రఫ్ శుక్రవారం చెన్నైలో గాయని పి.సుశీలను కలిసి జీవిత సాఫల్య అవార్డు అందించారు. ఈ సందర్భంగా పి.సుశీల మాట్లాడుతూ బ్రిటన్‌కు చెందిన సంస్థ ఇతర దేశాలకు చెందిన ప్రముఖులను జీవిత సాఫల్య అవార్డుతో సత్కరించాలని నిర్ణయించిన తొలి ఏడాదిలోనే తనకి అవార్డు రావడం సైతం భగవంతుని ఆశీస్సులుగా భావిస్తున్నాను అన్నారు. చదవండి: ఇది వీరప్పన్ కథ కాదు! -
సీకే నాయుడు అవార్డుకు ఎంపికైన శ్రీకాంత్, అంజుమ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మక సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఈ ఏడాదికి గానూ భారత దిగ్గజ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, భారత మహిళల జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రాలు ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డును వచ్చే నెల 12వ తేదీన ముంబైలో జరిగే బోర్డు వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఇవ్వనుంది. వీరిద్దరూ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ వారిని సీకే నాయుడు అవార్డుతో సత్కరిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చెన్నైకు చెందిన శ్రీకాంత్... భారత్‌కు 1981–1992 మధ్య ప్రాతినిధ్యం వహించాడు. 43 టెస్టుల్లో 2062 పరుగులు, 146 వన్డేల్లో 4091 పరుగులు చేసిన ఈ 60 ఏళ్ల కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్... భారత్ 1983లో తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యుడు. అంతేకాకుండా అతను చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలోనే భారత్ 2011లో రెండోసారి ప్రపంచ కప్‌ను గెల్చుకోవడం విశేషం. 1989లో ఇతని సారథ్యంలోనే సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 42 ఏళ్ల అంజుమ్ చోప్రా తన కెరీర్లో 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టి20లు ఆడింది. -
‘సాగుబడి’ రాంబాబుకు జీవన సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’డెస్క్ ఇన్చార్జ్, సీనియర్ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబుకు 2019 సంవత్సరానికి గాను ప్రతి ఏటా రైతు దినోత్సవం సందర్భంగా కర్షక సాధికార సంఘటన (కేఎస్ఎస్) అందించే మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జీవన సాఫల్య పురస్కారం లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విశిష్ట సేవలందించిన తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రైతులు, పాత్రికేయులు, శాస్త్రవేత్తలకు కె.ఎస్.ఎస్ ఈ పురస్కారాలను అందిస్తోంది. పంతంగితో పాటుగా పసుపు విత్తన రైతు పిడికిటి చంద్రశేఖర ఆజాద్ (తెలంగాణ), ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు అన్నే పద్మావతి (నూజివీడు), టీ న్యూస్ చేను–చెలక ఎడిటర్ విద్యాసాగర్, సైంటిస్ట్ డా.సురేంద్రరాజులకు ఈ అవార్డు లభించింది. ఈమేరకు కేఎస్ఎస్ అధ్యక్షుడు మారం కరుణాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలది పురుషోత్తంరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న రాజేంద్రనగర్‌లోని ‘వాలంతరి’లో జరిగే సభలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
మరో గౌరవం
కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు మరో జీవన సాఫల్య పురస్కార గౌరవం దక్కింది. ‘గామా’ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 6న దుబాయ్‌లో ఈ పురస్కారం అందించనున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు, గాయనీ గాయకులు, సంగీత దర్శకుల పాటల రచయితలు ఈ వేడుకలో పాల్గొననున్నట్లు ‘గామా’ (గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డు) వేడుకల చైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు. నిరుడు ప్రసిద్ధ దర్శకుడు బాపును ఈ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు.