సాక్షి, తాడేపల్లి: నాయకుడు అంటే అందలం ఎక్కి అధికారాన్ని అనుభవించేవాడు కాదు. తనను నమ్ముకున్న వారిని ముందుండి నడిపించేవాడు.. అండగా ఉండేవాడు.. కష్టంలో ఆదుకునేవాడు.. సేవకు వెనకడుగు వేయనివాడు. ఈ లక్షణాలన్ని పుణికి పుచ్చుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయనలో సీఎం అనే గర్వం ఇసుమంత కూడా ఉండదు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం తండ్రి, మహానేత వైఎస్సార్ నుంచి అలవర్చుకున్నారు సీఎం జగన్. ఆయన మాటతీరు, చెరగని చిరునవ్వు.. చూడగానే మన మనిషి అనిపిస్తాయి. ఏమాత్రం బేషజాలు చూపని వ్యక్తి సీఎం జగన్. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
(చదవండి: YSR Awards: ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సం)
వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చూపిన హుందాతనం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రచయిత కత్తి పద్మారావుకు అవార్డ్ అందజేశారు జగన్.
ఆ సమయంలో పద్మారావు వీల్‌చైర్ ఫుట్‌స్టెప్స్‌ని సరి చేశారు సీఎం జగన్. అంతేకాక పద్మారావు చేయి పట్టుకుని.. ఆయన నిల్చోడానికి సాయం చేశారు. అవార్డు గ్రహీతకు ఎంతో గౌరవం ఇచ్చి.. సామాన్య వ్యక్తిలా ప్రవర్తించిన సీఎం జగన్ హుందాతనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.
చదవండి: సీఎం జగన్ చర్యలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
Comments
Please login to add a commentAdd a comment