సాక్షి, హైదరాబాద్: బహుముఖ ప్రజ్ఞావంతుడు, ప్రజ్ఞాభారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరికి ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. 49వ వార్షికోత్సవాల్లో భాగంగా ‘ది హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’ 2021–22 సంవత్సరానికిగాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసింది. ఇటీవల నగరంలోని నోవాటెల్‌లో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీఓ చైర్మన్ జి.సతీష్‌రెడ్డి, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొని, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
‘మేనేజర్ ఆఫ్ ది ఇయర్’అవార్డును జయతీర్థ్ ఆర్.జోషి (డిఫెన్స్ ఆర్ అండ్ డీ ల్యాబ్), ‘హెచ్‌ఆర్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’అవార్డు ప్రవీణ్ తివారీ(పల్స్ ఫార్మా), ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’అవార్డు దేశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (ఆప్టిమస్ డ్రగ్స్)లు అందుకున్నారు. ‘సీఎస్‌ఆర్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్’చిన్నబాబు సుంకవల్లి(గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్)కి, మంజూష కొడియాల(ఫార్మా ఆర్ అండ్ డీ)కి ‘యంగ్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’, ఉమ కాసోజి(ది స్టార్ ఇన్‌మి)కి ‘ఉమెన్ అచీవర్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్’, ప్రొఫెసర్ రామచంద్ర(జేఎన్‌టీయూ)కు ‘అకడమీషియన్ ఎక్సలెన్స్’పి.కృష్ణ చైతన్య(మోటివేషనల్ స్పీకర్)కు ‘మెంబర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment