Tripuraneni Hanuman Chowdary
-
సమాఖ్య కాదు... యూనియన్!
మనకు స్వాతంత్య్రం వచ్చేనాటికి ఇప్పుడున్న రాష్ట్రాలు లేవు. అప్పట్లో మద్రాస్, బెంగాల్, బాంబే ప్రెసిడెన్సీలు; బిహార్, ఒరిస్సా, పంజాబ్ వంటి ప్రావిన్స్‌లు; వందలాది సంస్థానాలు ఉండేవి. 1949 నవంబర్‌లో మన రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత వీటి స్థానంలో పరిపాలక విభాగాలుగా ‘రాష్ట్రాలు’ ఉనికిలోకి వచ్చాయి. రాజ్యాంగంలోని మొత్తం 395 ఆర్టికల్స్‌లో ఎక్కడా ‘సమాఖ్య లేదా సమాఖ్య తత్వం’(ఫెడరల్ లేదా ఫెడరలిజం) ప్రస్తావనే లేదు. స్వాతంత్య్రం రాకముందు ఫెడరల్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ కోర్టులు ఉండేవి. ఆ తర్వాత వాటి స్థానే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సుప్రీంకోర్టులు వచ్చాయి. 1935 చట్టం ఒక విధమైన సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని పూర్తిగా సమాఖ్య అనలేం. రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ప్రకారం... పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా రాష్ట్రాలను విభజించడం కానీ, కలపడం కానీ, వాటి సరిహద్దులను మార్చడం కానీ చేయవచ్చు. ఉత్తరాఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాల ఏర్పాటు ఇందుకు మంచి ఉదాహరణ. అదేవిధంగా జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడమూ తెలిసిందే. సమాఖ్య రాజ్యంలో రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఉదాహరణకు అమెరికాలో ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక సంస్థ ఉంటుంది. అలాగే గవర్నర్లను ప్రజలే ఎన్నుకుంటారు. కానీ భారత్‌లో అలా కాదు. దీన్నిబట్టి మనది సమాఖ్య కాదు. బలమైన కేంద్రం ఉన్న యూనియన్ అని చెప్పవచ్చు. ఇటువంటి యూనియన్ ఉండాలనే అంబేడ్కర్, పటేల్ లాంటివారు వాంఛించారు. బలమైన కేంద్రం లేకపోతే రాష్ట్రాలు విడిపోయి దేశం ముక్కలవుతుందని వారు భావించారు. (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) అందుకే రాజ్యాంగంలోని 356, 360, 362 ఆర్టికల్స్ రాష్ట్రాలపై కేంద్రానికి ఆధిపత్యాన్ని కట్ట బెట్టాయి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించగలగడం ఈ ఆధిపత్యాన్నే సూచిస్తుంది. 6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వంద పర్యాయాలకు పైగా రాష్టపతి పాలన విధించడం తెలిసిందే. రాజ్యాంగం... కేంద్ర అధికారాలు, రాష్ట్ర అధికారాలు, ఉమ్మడి అధికారాలు అని పేర్కొంటున్నది. ఉమ్మడి జాబితాలో ఉన్న అధికారాలను ఉపయోగించి కేంద్రం, రాష్ట్రాలు... రెండూ విడివిడిగా చట్టం చేస్తే అంతిమంగా కేంద్ర చట్టానిదే పైచేయి అవుతుందని రాజ్యాంగం పేర్కొంటున్నది. పైన పేర్కొన్న అనేక నిబంధనలు మనది సమాఖ్య రాజ్యం కాదనీ, యూనియన్ అనీ స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞాభారతి చైర్మన్ -
హనుమాన్ చౌదరికి జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: బహుముఖ ప్రజ్ఞావంతుడు, ప్రజ్ఞాభారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరికి ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. 49వ వార్షికోత్సవాల్లో భాగంగా ‘ది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్’ 2021–22 సంవత్సరానికిగాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసింది. ఇటీవల నగరంలోని నోవాటెల్‌లో జరిగిన కార్యక్రమంలో డీఆర్డీఓ చైర్మన్ జి.సతీష్‌రెడ్డి, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొని, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మేనేజర్ ఆఫ్ ది ఇయర్’అవార్డును జయతీర్థ్ ఆర్.జోషి (డిఫెన్స్ ఆర్ అండ్ డీ ల్యాబ్), ‘హెచ్ఆర్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’అవార్డు ప్రవీణ్ తివారీ(పల్స్ ఫార్మా), ‘ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’అవార్డు దేశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (ఆప్టిమస్ డ్రగ్స్)లు అందుకున్నారు. ‘సీఎస్ఆర్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్’చిన్నబాబు సుంకవల్లి(గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్)కి, మంజూష కొడియాల(ఫార్మా ఆర్ అండ్ డీ)కి ‘యంగ్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’, ఉమ కాసోజి(ది స్టార్ ఇన్మి)కి ‘ఉమెన్ అచీవర్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్’, ప్రొఫెసర్ రామచంద్ర(జేఎన్టీయూ)కు ‘అకడమీషియన్ ఎక్సలెన్స్’పి.కృష్ణ చైతన్య(మోటివేషనల్ స్పీకర్)కు ‘మెంబర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను ప్రదానం చేశారు. -
124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి?
‘‘ఇండియా తేరే తుకడే తుకడే కరేంగే’’ అని ఊరేగింపులలో బహిరంగంగా అరవడం దేశద్రోహం కాకపోతే, మరేమిటి? భారత పార్లమెంటుపై హంతక దాడికి పాల్పడిన ఉగ్ర వాదులనూ, వారిని ప్రేరేపించిన వారినీ, వారికి శిక్షణ ఇచ్చిన వారినీ హీరోలుగా కీర్తించడం దేశద్రోహం అవ్వక మరే మౌతుంది? ప్రభుత్వాన్ని పడగొట్టి శ్రామికవర్గ నియంతృత్వాన్ని స్థాపించే లక్ష్యంతో సొంత బలగాలను పెంచుకోవడం, సైన్యం దేశరక్షణ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పుడు వారిపై దొంగ దాడులకు పాల్పడటం దేశద్రోహం కాకపోతే మరింకేమిటి? ముస్లింలు సురక్షితంగా ఉండేందుకూ, వారికి స్వయం పాలన ఒనగూడేందుకూ భారతదేశాన్ని మరోసారి విభజించి మొఘలి స్థాన్‌ను సృష్టించాలని ఒక ప్రొఫెసర్ రాస్తే అది దేశద్రోహం కాకుండా ఎలా ఉంటుంది? హత్య, అత్యాచారం, దోపిడీ అనేవి 150 ఏళ్లకు పైగా ఉన్న భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేటికీ శిక్షార్హమే అయినప్పుడు ఆ కాలం నాటిదే అయిన 124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి? (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) వలస పాలకుల కాలంలో 150 ఏళ్ల క్రితం నేరాలుగా పరి గణన పొందినవి నేడెలా నేరం కాకుండా పోతాయి? భారతదేశంలో దేశ వ్యతిరేక, సమాజ వ్యతిరేక, విదేశీ ప్రేరక... వ్యక్తులూ, సిద్ధాంత కర్తలూ, కార్యకర్తలూ ఉన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛా భారతాన్ని వారి నుంచి రక్షించడానికి దేశద్రోహ ప్రసంగాలను, రచనలను, ప్రచారాలను, చర్యలను గుర్తించాలి, గమనించాలి, శిక్షించాలి. అందుకోసం రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 124–ఏను కొనసాగించాలి. న్యాయబద్ధంగా నిందితులను విచారించాలి. దోషులకు శిక్షలు విధించాలి. ఈ విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజుజు దృఢ వైఖరి సరైనది, ప్రశంసనీయమైనది. (క్లిక్: దేశద్రోహం కేసు నిందితుడిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా) – డాక్టర్ టి. హనుమాన్ చౌదరి; చైర్మన్, ప్రజ్ఞాభారతి -
వివేకంతో వ్యవహరించాల్సిన క్షణం
గతవారం రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న బహుముఖ సైనికదాడికి చారిత్రక కారణాలు అనేకం తోడయ్యాయి. ఏయే దేశాలు గడచిన కొన్ని దశాబ్దా లుగా ఇతర దేశాలపై దురాక్రమణకు దిగాయో పరిశీలిస్తే ఆసక్తికరమైన వాస్తవాలు బయటపడతాయి. సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు దేశాలైన చెకొస్లొ వేకియా, హంగరీ, పోలండ్, తూర్పు జర్మనీలను దాదాపుగా ఆక్రమించి తన గుప్పిట్లో పెట్టుకుంది. కమ్యూనిస్టు చైనా కమ్యూనిస్టు వియత్నాంపై దురాక్ర మణ దాడికి దిగింది. కమ్యూనిస్టు వియత్నాం తోటి కమ్యూనిస్టు దేశమైన లావోస్‌పై దాడిచేసి అవమానకరమైన ఓటమితో వెనుదిరిగింది. రష్యా, చైనా, వియత్నాం చేస్తూవచ్చిన దురాక్రమణ దాడులు సామ్రాజ్యవాద స్వభావంతో కూడుకుని ఉన్నాయి. సోషలిజం, కమ్యూనిజం అనేవి ముసుగులు మాత్రమే. ఈ దాడుల వెనుక కీలకాంశం ఆధిపత్యం, అధికారం తెచ్చిపెట్టిన అహంకారం. మరోవైపు చూద్దాం. వియత్నాంపై దాడి చేసిన అమెరికా కార్పెట్ బాంబింగ్ ద్వారా చరిత్ర మర్చిపోలేనంత విధ్వంసాన్ని సృష్టించింది. కానీ దివంగత వియత్నాం నేత హోచిమిన్, జనరల్ జాప్ నాయకత్వంలో వియత్నాం ప్రజలు తలపెట్టిన జాతీయవాద ప్రతిఘటనను అమెరికా అడ్డు కోలేకపోయింది. అమెరికా అధికార అహంకారంపై వియత్నాం జాతీయవాదం ఘన విజయం సాధించింది. అఫ్గానిస్తాన్‌ను అమెరికా ఆక్రమించింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు అఫ్గాన్లు అమెరికా సైన్యాన్ని ప్రతిఘటిస్తూ వచ్చారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ బేషరతుగా తన సైన్యాలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించు కున్నారు. విదేశీ దురాక్రమణపై జాతీయ ప్రతిఘటన ముందు అమెరికా అగ్రరాజ్యం తలవంచింది. అలాగే, పూర్వ సోవియట్ యూనియన్ కూడా అఫ్గానిస్తాన్‌ను దురాక్రమించింది. అక్కడి స్థానిక ప్రభుత్వాన్ని దింపి తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పర్చింది. ఏడేళ్ల పాటు సాగిన ప్రజాపోరాటంలో చివరకు అంత పెద్ద కమ్యూనిస్టు అగ్రరాజ్యం కూడా అఫ్గాన్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. పూర్వ సోవియట్ యూనియన్ ఒక కమ్యూనిస్టు సామ్రాజ్యవాద శక్తి. ముస్లిం సెంట్రల్ ఆసియన్ రిపబ్లిక్కులతోపాటు ఆర్మేనియా, బెలారుస్, ఉక్రె యిన్ కూడా రష్యన్ సామ్రాజ్యవాద పాలనకు లోబడి కమ్యూనిస్టు ప్రభుత్వా లను ఏర్పర్చాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే ఉక్రెయిన్‌కు భద్రతా మండలిలో స్థానం కావాలని యూఎస్ఎస్ఆర్ డిమాండ్ చేసింది. దీనికి ఐక్యరాజ్యసమితి అంగీకరించలేదు. అదే ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. రష్యా, దాని అధీన దేశాలు, కమ్యూనిస్టు చైనా ఒకవైపు... అమెరికా దాని మిత్రదేశాలు ఒకవైపు నిలబడి తలపడ్డాయి. సోషలిజం, కమ్యూనిజం పేరిట కమ్యూనిస్టు శక్తులు... ప్రజాస్వామ్యం పేరిట అమెరికా, పాశ్చాత్య యూరోపియన్ దేశాలు సామ్రాజ్యవాద ఆధిపత్య ఆకాంక్షలతోటే పలుమార్లు దురాక్రమణ యుద్ధాలకు తలపడ్డాయని చరిత్ర మనకు సూచిస్తోంది. భారతదేశం తొలినుంచి సందిగ్ధావస్థలో ఉండిపోయింది. అప్పటి సోవి యట్ యూనియన్, తర్వాత రష్యా 1950ల నుంచి భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కూటమిలో చేర కుండా ఇండియాను నిలవరించడమే దీని ఉద్దేశం కావచ్చు. అనేక సందర్బాల్లో పాకిస్తాన్, చైనాలు ఐరాస భద్రతా సమితిలో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలకు వ్యతిరేకంగా యూఎస్ఎస్ఆర్, రష్యా వీటో పవర్ ఉపయోగించి ఆదుకున్న మాట వాస్తవం. తనను ఎన్నోసార్లు ఆదుకున్న రష్యాను దురాక్రమణదారుగా ఆరోపించి తప్పుపట్టడం మనదేశానికి బాధ కలిగించేదే అవుతుంది. కానీ ప్రస్తుతం చిన్న దేశమైన ఉక్రెయిన్‌పై శక్తిమంతమైన రష్యా దురాక్రమణ దాడికి వ్యతిరేకంగా భారత ప్రజలు ఉద్వేగంతో ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్నారు. అమెరికా, నాటో సభ్యదేశాలు శక్తిమంతమైన రష్యాపై విధించే ఆంక్షలు పెద్దగా పనిచేయకపోవచ్చు. అవసరమైతే ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా పుతిన్ వెనుకాడడు. మనందరం సంక్షోభ కాలంలోనే జీవిస్తున్నాం. బలమైన చైనాతో భారత్ తలపడుతోంది. అయితే ఉక్రెయిన్, ఫిన్లాండ్లు అంత చిన్న దేశం కాదు. మన మిత్రదేశం, మనకు ప్రయోజనకరంగా ఉండే దేశం ఇప్పుడు దురాక్రమణ దారుగా ముద్ర పడుతున్నప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితిలో జాగ్రత్తగా వ్యవహరించడానికి ఎంతో వివేకం, జ్ఞానం అవసరమవుతాయి. వాస్తవానికి ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించడానికి మూల కారణం నాటో. పొరుగు దేశం నాటో కూటమిలో చేరితే తన భద్రతను కాపాడుకోవలసిన అవసరం రష్యాది. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో భారత్ జాగ్రత్తగా అడుగులు వేయ వలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: డా. త్రిపురనేని హనుమాన్ చౌదరి ఛైర్మన్, ప్రజ్ఞా భారతి -
ఆభరణాల తనిఖీ ఆగమశాస్త్ర బద్ధమేనా?
తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల టీటీడీ బోర్డు నిర్వాకంపై, చంద్రబాబు ప్రభుత్వ ధార్మిక వ్యతిరేక పాలనపై, తిరుమల ఆలయంలో అవినీతిపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. కృష్ణదేవరాయల కాలం నాటి స్వామివారికి అర్పించిన అమూల్య ఆభరణాలు మాయమైపోయాయని, అత్యంత విలువైన ఆభరణాలను అంతర్జాతీయ వేలం పాటల్లో అమ్మకానికి పెడుతున్నారని సాక్షాత్తూ ఆలయ ప్రధాన అర్చకులే ఆరోపించడం తీవ్రమైన విషయం. దానికి తక్షణ చర్యగా ఆయనను ప్రధాన అర్చకత్వ బాధ్యతలనుంచి తొలగించి ఆలయ మండలి సభ్యత్వంనుంచి కూడా తీసివేసిన టీడీపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు ఇప్పుడు ఈ తీవ్ర ఆరోపణలపై విచారణను పక్కనబెట్టడానికి ఆగమ శాస్త్రాన్ని సాకుగా తీసుకోవడం దారుణం. శ్రీవేంకటేశ్వరుడి అమూల్య మైన ఆభరణాలను సామాన్య ప్రజానీకానికి చూపిం చడానికి ఆగమ శాస్త్రం అంగీకరించదని టీటీడీ అధికారులూ, సంబంధిత ప్రభుత్వాధికారులు, మంత్రులు కలిసి కట్టుగా చెబుతున్నారు. బోర్డు సభ్యులు ఆభరణాలను నిశితంగా పరిశీలించారని, ఆభరణాలు ఏవీ పోలేదని, అన్నీ ఉన్నాయని నిర్ధారించేశారు. కాబట్టే శ్రీవారి ఆభరణాల చౌర్యంపై ఏ విచారణా అవసరం లేదని చెబుతున్నారు. ఇంతకన్నా ముఖ్యవిషయం ఏమిటంటే టీటీడీ సభ్యుల అర్హతలు ఏమిటన్నదే. తిరుమల తిరుపతి దేవస్థాన మండలి సభ్యులుగా తమ పార్టీకి సహాయ సహకారాలు అందించిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నియమిస్తున్నారు. వీరిలో కొంతమంది నల్లధనం దాచుకుని, పట్టుబడ్డవారు, కొంతమంది కల్లు, సారాయి దుకాణాలను పెట్టుకున్నవారు, కొంతమంది లారీ వ్యాపారాలు చేసేవారు. ఇలాంటి తరహా సభ్యులు వేంకటేశ్వరస్వామి ఆభరణాలను పరిశీలించడానికి ఆగమశాస్త్రం ఒప్పుకుంటుందా? ఈ వ్యాపారులేమైనా విశిష్టమైన దైవభక్తులా? ప్రజలను తప్పుదారి పట్టించకుండా, అన్ని అనుమానాలను నివారించడం కోసం హైకోర్టు న్యాయమూర్తులచే కాకుండా, సీబీఐ ద్వారానే విచారణ చేయడం సముచితంగా ఉంటుంది. త్రిపురనేని హనుమాన్ చౌదరి కార్ఖానా, సికింద్రాబాద్ మొబైల్ : 98490 67359 -
బాబు దొరికిపోవడం ఖాయం
కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రజ్ఞాభారతి చైర్మన్ త్రిపురనేని హనుమాన్ చౌదరి ఓటమి భయంవల్లో తనపై ఉన్న కేసులపై దాడులు జరుగుతాయన్న భీతి వల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విపరీత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని ప్రజ్ఞాభారతి చైర్మన్ త్రిపురనేని హనుమాన్ చౌదరి స్పష్టం చేశారు. కేంద్రాన్ని, మోదీని టార్గెట్ చేసుకుని మరీ బాబు విమర్శిస్తున్నప్పుడు చంద్రబాబును కూడా కేంద్రం టార్గెట్ చేయవచ్చని, అలా జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఫిరాయింపులకు ప్రస్తుతం ఎవరూ అతీతులు కాదని, వైఎస్సార్సీపీ మాత్రం ఇతర పార్టీల నేతలను తమ పదవులకు రాజీనామా చేయించిన తర్వాతే తనలోకి చేర్చుకుంటోందంటే వైఎస్ జగన్‌ని శ్లాఘించాల్సి ఉంటుందన్నారు. జనం తనను విశ్వసించడం లేదని తేలిపోయింది కనుకే చంద్రబాబులో అభద్రతా భావం పెరిగిపోయిందంటున్న త్రిపురనేని హనుమాన్ చౌదరి అభిప్రాయం ఆయన మాటల్లోనే... ఈమధ్య మీరు చాలా ఆవేదనతో ఉన్నట్లున్నారు? చెప్పలేనంత ఆవేదన ఉంది. 21 రోజులు పార్లమెంటును స్తంభింపజేసి పారేసిన తర్వాత అయినా ప్రధాని నరేంద్రమోదీ తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఒప్పించుకుని వారందరితో మాట్లాడిన తర్వాత తనను వ్యతిరేకించినవారినే ఎండగట్టవచ్చుగదా. అదేమీ చేయకుండా, విదేశీ యాత్రలకు వెళ్లిపోయారంటేనే చాలా బాధగా ఉంది. మీరు చేసే గొడవ తప్పు. అందులో వాస్తవాలు లేవు అని చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి లేదా? ప్రధాని ఎందుకలా చేశారంటారు? ఎందుకంటే.. ఇంట్లో ఈగల మోత. బయట పల్లకీల మోత. ప్రపంచమంతా నీకు మంచి నాయకుడని సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ స్థాయిని సంపాదించుకుంటున్నప్పుడు పార్లమెంటరీ విధానాన్ని బలపర్చకుండా అలా వెళ్లిపోయారే అని మోదీపై బాధ. చంద్రబాబు ఇప్పుడెలా ఉన్నాడని మీ భావన? చెప్పరాని, వర్ణించడానికి వీలులేని పద్ధతిలో ఉన్నాడు. నాలుగేళ్లు బీజేపీతో బంధం పెట్టుకున్న తర్వాత ఎందుకీ స్టెప్ తీసుకున్నాడు? నాకు బాబుపై ఒకటే సందేహం. కాంగ్రెస్‌తో కలిశారు. బీజేపీతో కలిశారు. కమ్యూనిస్టులతో కలిశారు. టీఆర్ఎస్తో కలిశారు. ఇన్నిపార్టీలతో, ఇంతమందితో కలిశారు కదా. వీళ్లను దేనికి ఉపయోగించుకున్నారు అని ఆలోచించగా.. బాబు తన గొప్పతనం కోసం ఉపయోగిం చుకుంటున్నారేమో అనిపిస్తుంది. తన అభద్రతా భావమే దీనంతటికీ కారణమనిపిస్తుంది. బాబులో ఆ భయం, ఆ అభద్రత పునాది ఏమిటి? గతంలో ఒకటికి రెండుసార్లు పార్టీపరంగా. ఎన్నికల్లో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారని బాబును అప్పట్లోనే అడిగితే మీబోటి వాళ్లు చెప్పడం వల్లే ఓడిపోయాను అన్నారు. అభివృద్ధికోసం ఇలా చెయ్యండి, ఇలా చెయ్యకండి, జిమ్మిక్కులు, ప్రజాకర్షణ పథకాల జోలికి పోవద్దని సలహా చెప్పాం. దాంతో అభివృద్ధి అని పదే పదే చెప్పి ఓడిపోయాను. ప్రజలకు కావలసింది లల్లూ ప్రసాద్ కానీ డెవలప్మెంట్ కాదు. ఇక నుంచి డెవలప్మెంట్ను ఎజెండా కింద చెప్పను. గెలవడమే నాకు ఇక ముఖ్యం అని అప్పట్లోనే చాలా కచ్చితంగా చెప్పారు చంద్రబాబు. చంద్రబాబులో ఆ అభద్రత ఎక్కడినుంచి వచ్చింది? బీజేపీతో, మోదీతో, పవన్ కల్యాణ్‌తో కలిసి వైఎస్సార్సీపీపై పోటీ చేస్తేనే కేవలం 5 లక్షల ఓట్లు మెజారిటీ వచ్చింది టీడీపీకి. అలాంటిది ఇప్పుడు బీజేపీ వద్దనుకుంటే, పవన్ కల్యాణ్ వేరేచోటికి వెళితే చంద్రబాబు గెలుస్తాడా? అదే అభద్రతా భావం పుట్టుకొచ్చినట్లుంది. మోదీని బాగా వెనుకేసుకొచ్చిన బాబు ఇప్పుడు దాడి చేస్తున్నారే? దాన్నే భయోత్పాతం అంటారు. ఎప్పుడైతే భయం ఉంటుందో ఇలాం టివన్నీ వస్తాయి. ఓటమి భయమేనా, లేక కేసులపై దాడి జరుగుతుందనే భయం కూడానా? అది కూడా జరుగుతుంది మరి. జరగవచ్చు కూడా. సీబీఐ అంటే, ఈడీ అంటే ప్రభుత్వ కీలుబొమ్మలవుతున్నాయని తెలుసుకదా. ఎంపిక చేసుకుని మరీ వాళ్లు దాడి చేస్తున్నారు కదా. మరి ఇప్పటివ్యవస్థలో తప్పులు చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? నాతోసహా పన్నులు ఎగవేయకుండా ఎవడైనా నిజాయితీగా ఉన్నాడా? అదే భయకారణమవుతుంది కదా. బాబు ఏ కేసులో ఎక్కడ దొరికే అవకాశం ఉంది? సరైన సమయంలో, సరైన వ్యూహంతో మేం బయటకు వస్తాం అని మీరనుకుంటున్నప్పుడు ఇతరులకు కూడా అలాంటి సమయాలు, అలాంటి వ్యూహాలు ఉంటాయి కదా. అలాగే సమయం చూసుకుని వారు కూడా రావచ్చు. అది ఎప్పుడు ఉపయోగించాలో వాళ్లకూ తెలుసు కదా? అందుకే ఆ భయం. ఏపీలో అవినీతిపై బీజేపీ దాడి చేస్తోంది కదా? ఒక ఎమ్మెల్యేకి కృష్ణాజిల్లాలో గెలవాలంటే 50 కోట్లు అవసరం పడుతోందిప్పుడు. అంత డబ్బు ఎక్కడినుంచి వస్తోంది? అందుకనే పోలవరం ఖర్చు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా 7 వేలకోట్ల నుంచి 17 వేల కోట్ల నుంచి 85 వేల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇదంతా అవినీతి కాదా? కేవలం పునరావాసం కోసమే రూ. 20 వేల కోట్లు పెడతారా? ఫిరాయింపులను వ్యతిరేకిస్తారా, ప్రోత్సహిస్తారా? ఫిరాయింపులు చేయడం మంచిది కాదు. నిజమే కానీ ఫిరాయింపులు చేయని వారున్నారా? చంద్రబాబు ఎన్నిసార్లు ఫిరాయించారో తెలుసు కదా. కంచే చేసు మేస్తున్నప్పుడు దాన్ని ఏవరాపగలరు? ఎవరైనా పార్టీలో చేరాలంటే తమ పదవులకు రాజీనామా చేసి మరీ చేరవచ్చు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరాలని ఎవరైనా అనుకుంటే వారంతా రాజీనామా చేసి మళ్లీ గెలిచి వెళితే బాగుండేది. వైఎస్ జగన్ ఫిరాయింపులకు వ్యతిరేకం కదా? అందరూ ఫిరాయింపులు చేస్తున్నారు కదా. దానికి భిన్నంగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోందని అంటున్నారు. దానికి వైఎస్ జగన్‌కి నిజంగా అభినందనలు తెలుపుతాను. ఇతర పార్టీల నుంచి తనవద్దకు వచ్చినవారి చేత రాజీనామాలు ఇప్పించిన తర్వాతే చేర్చుకున్నారంటే, అది చాలా సరైన పద్ధతి. అందుకే నేను ఆయనను శ్లాఘిస్తున్నాను. ఐ రియల్లీ కంగ్రాచ్యులేట్ జగన్. ఆయన నిజాయితీని మనం ఖచ్చితంగా శ్లాఘించాల్సిందే. చంద్రబాబును జనం విశ్వసిస్తున్నారా? జనంలో తనకు విశ్వసనీయత ఉందని ఆయన అనుకుంటున్నారు. కాని అది ఆయనకు లేదనే నా భావన. ఆ నమ్మకమే ఆయనకు ఉంటే ఆ అభద్రత ఎందుకొచ్చింది? జనం విశ్వసించే ఉంటే రెండుసార్లు ఎందుకు పార్టీ ఓడిపోయింది? -
త్రిపురనేని హనుమాన్ చౌదరితో 'మనసులో మాట'
-
తెలుగు 'పద్మాలు' వీరే..
హైదరాబాద్/ న్యూఢిల్లీ: 2017 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్రం బుధవారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణకు ఆరు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. చింతకింది మల్లేశం (చేనేత రంగం), మహ్మద్ అబ్దుల్ వాహిద్ (వైద్య రంగం), చంద్రకాంత్ పితావా (సైన్స్ అండ్ టెక్నాలజీ), వనజీవి రామయ్య (సామాజిక సేవ), మోహన్ రెడ్డి వెంకట్రామ బోదనపు (పారిశ్రామిక రంగం) లకు పద్మశ్రీ వచ్చింది. ఏపీ నుంచి త్రిపురనేని హనుమాన్ చౌదరి, వి. కోటేశ్వరమ్మ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 1. ప్రొఫెసర్ డా. ఎక్కా యాదగిరి రావు (శిల్పకళ), తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్కులో ఉన్న 1969నాటి తెలంగాణ అమర వీరుల తాగ్యాలకు గుర్తుగా ఉన్న స్థూపాన్ని ఈయన రూపొందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ‘బంగారు తెలంగాణ సాధిద్దాం’ నినాదంతో వీణను వాయుస్తున్న సంగీత కళాకారిణి శిల్పాన్ని రూపొందించారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో శిల్పకళల డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించి రిటైరయ్యారు. 2. దరిపల్లి రామయ్య(సామాజిక సేవ), తెలంగాణ కోటి మొక్కలు నాటిన వనజీవి దరిపల్లి రామయ్యను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య(వనజీవి రామయ్య) ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి. 1995లో కేంద్రం నుంచి వనసేవా అవార్డు అందుకున్నారు. 3. చింతకింది మల్లేశం(సైన్స్ అండ్ ఇంజినీరింగ్), తెలంగాణ చేనేతకు సంబంధించిన యంత్రాన్ని కనుగొన్నందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన చింతకింది మల్లేశం ఓ చేనేత కార్మికుడు. 2000ల సంవత్సరంలో కేవలం గంటల్లోనే చీర నేసే యంత్రం కనిపెట్టారు. 2011లో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. 2011లో ఈ యంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు రావడం విశేషం. 4. త్రిపురనేని హనుమాన్ చౌదరి (సివిల్ సర్వీస్), ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా ఈయన వ్యవహరించారు. 5. వి. కోటేశ్వరమ్మ (సాహిత్యం మరియు విద్య), ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మాంటిసోరి మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. మహిళల విద్యకు ఎన్నో ఎళ్ల నుంచి ఎంతో విశేష సేవ చేశారు. 6. డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వహీద్(మెడిసిన్), తెలంగాణ 7. చంద్రకాంత్ పితావ(సైన్స్ అండ్ ఇంజినీరింగ్), తెలంగాణ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్‌గా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి రిటైరయ్యారు. బార్క్ ట్రాంబే, ముంబై, ఈసీఐఎల్ హైదరాబాద్‌లో సేవలు అందించారు. 8. మోహన్‌రెడ్డి వెంకటరామ బోదనపు(వాణిజ్యం, పరిశ్రమలు), తెలంగాణ -
ఉసూరుమంటున్న ఉపాధి రంగం
జనాభా పెరుగుదల, వారిలో పట్టభద్రుల సంఖ్య పెరిగిపోతోంది. కానీ ఉపాధి కల్పన అంతంత మాత్రమే. ఏ ఒక్క రాజకీయ నేత గానీ, పార్టీ గానీ ఈ అంశం గురించి ఆలోచిస్తోందా? పంచవర్ష ప్రణాళికలతో దేశ సమగ్రాభివృద్ధి కార్యక్రమాన్ని 1951లో చేపట్టారు. 11 పంచ వర్ష ప్రణాళికలు పూర్తయ్యి, 12వ ప్రణాళిక అమలులో ఉంది. ఉత్పత్తులకు, సేవలకు, పరిశ్రమలకు, ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్ప నకు లక్ష్యాలు నిర్ణయించారు. కానీ, జనాభా పరిమితికి నిర్ణయించలేదు. కుటుంబ నియం త్రణను ప్రోత్సహించాలన్న ఆకాంక్ష ఉన్నా ఏ పధకం ద్వారా దానిని అమలుపరచాలి, పెరుగుదలను ఏ పరిమితలో ఉంచాలి అనే దానిపై స్పష్టత లేదు. ప్రతి దశకంలో జనాభా 0 నుంచి 17 కోట్లు పెరుగుతోంది. 2013లో మన జనాభా 123 కోట్లు. సంవత్సరానికి 1.5 శాతం పెరు గుతోంది. అంటే ప్రతియేటా 1,84,50,000 మంది పెరుగుతున్నారు. 2021 నాటికి మన జనాభా 140 కోట్లు కావచ్చు. అంటే చైనాను మించిపోతాం. వీరందరికీ ఉపాధి కల్పించగలమా? 10, 11 పంచవర్ష ప్రణాళికల లక్ష్యం- ప్రతి ఏటా అదనంగా ఒక కోటి మందికి ఉపాధి కల్పించాలి. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) సాలీనా 8 నుంచి 9 శాతం పెరిగిన ఏ సంవ త్సరంలోనూ కోటి మందికి అదనపు ఉపాధు లను కల్పించలేకపోయాం. అత్యధికంగా ఎన్డీఏ హయాంలో, ఒక ఏడాదిలో 80 లక్షల మందికి ఉపాధి లభించింది. గత ఐదేళ్లలో సాలీనా నికర అదనపు ఉపాధి కల్పన ఐదు లక్షలకు మించలేదు. జనాభా పెరుగుదల 170/180 లక్షలు. ఉపాధి పెరుగుదల 5 లక్ష లు. ఈ విధంగా కోట్ల సంఖ్యలో ఉపాధి రహితులు తయారైతే పర్యవసానం ఏమిటి? గతంలో చాలా మంది విద్య, నైపుణ్యం లేని వారే. ఇటీవల తరాల వారు బీటెక్, ఎం సీఏ, ఎంబీఏ, ఎంకాం, ఎంఏ, బీఈడీ, బీఏ, సీఏ వగైరా పట్టాలు తీసుకుంటున్నారు. ఇటు వంటి వారికి ఉపాధి అవకాశాలు లేకపోతే, వారు ఏ దారి పడతారు? కిలో బియ్యం, ఎన్ఆర్ఈజీఏ, ఇందిరమ్మ గృహాలు, అమ్మ హస్తం, విద్యాహక్కు, ఆహారభద్రత చట్టాలు, రీ-యింబర్స్‌మెంట్ పథకాలు వీరిని భవిష్య త్తులో తృప్తిపరచగలవా? ప్రస్తుతం ఒక్క మన రాష్ట్రంలోనే 10 లక్ష ల మంది బీటెక్ ఇంజనీర్లు నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో ఏడాదికి, 3,600 ఇంజనీ రింగ్ కళాశాలల్లో, 13 లక్షల మంది యువతీ యువకులు చేరుతున్నారు. వీరిలో 10 లక్షల మంది మాత్రమే పట్టా పొందుతున్నారు. కానీ వీరంతా ఉద్యోగార్హులు కారని ప్రతి సర్వే చెబు తోంది. అంటే విద్యా ప్రమాణాలు ఘోరంగా దిగజారిపోయాయి. ఏటా 3 లక్షలకు పైగా ఐటీ/ఐటీఈఎస్ రంగంలో ఉద్యోగాలు లభిం చేవి. అవి ఈ సంవత్సరం 1,80,000కు కుదిం చుకుపోయాయి. ఇతర రంగాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జనాభాతో పాటు, వారిలో పట్టభద్రుల సంఖ్య పెరిగిపోతోంది. కానీ ఉపాధి కల్పన అంతంతమాత్రమే. ఏ ఒక్క రాజకీయ నేతను గాని, పార్టీని గాని ఈ అంశం ఆలోచింప చేస్తోందా? నేతల ఘోషలన్నీ సంక్షేమం, అన్నీ ఉచితంగా తినిపిస్తామనడం, అన్నిటికీ హక్కులు ఇచ్చే చట్టాలు చేస్తామనడానికి పరిమితమవుతోంది. కోట్ల మంది విద్యావం తులైన యువ జనాభాను పెంచుతున్నాం. దీని పర్యవసానాలు దారుణంగా ఉన్నాయి. విద్యావంతులైన నేరగాళ్లు పెరుగుతున్నారు. అందరూ సంపదను పంచి పెడతామనే వారే గాని, శ్రమ ద్వారా, పొదుపు ద్వారా, జనాభా నియంత్రణ ద్వారా, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ద్వారా, ప్రకృతి ప్రసాదించిన వన రులను ఉపయోగించుకుని, బృహత్ పధకాల అమలు ద్వారా ఉపాధి కల్పిస్తూ, సంపదను సృష్టిస్తూ, పేదరికాన్ని నిర్మూలన చేద్దామనే ఆలోచన నాయకులు లేదు. దేశంలోని నదులన్నింటినీ అనుసంధా నించి, జలాశయాలు కట్టి అన్ని రాష్ట్రాలకు, జాతీయ కాలువల ద్వారా రాష్ట్ర జలాశయా లను నింపడం, 75 వేల కిలోమీటర్ల విశాల రాష్ట్రీయ రహదార్ల నిర్మాణం, మరో 25 వేల కిలోమీటర్ల రైల్వేలను దేశ సరిహద్దుల వరకు విస్తరిచడం, వచ్చే 25 సంవత్సరాల్లో గ్రామాల నుంచి పనికోసం పట్నాలకు వచ్చే 70 కోట్ల ప్రజల కోసం 6,000 కొత్త పట్టణాలను నిర్మించడం, 7,500 కిలోమీటర్ల సముద్ర తీరంలో మరో 200 నౌకాశ్రయాలను, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న భారతావనిలో కనీసం మరో 300 విమానాశ్ర యాలను కట్టడం, ప్రస్తుతమున్న 36,000 కళాశాలను లక్ష వరకు పెంచడం, దేశంలో 650 జిల్లా కేంద్రాల్లో అధునాతన బహుశా ఖీయ వైద్యశాలల స్థాపనను ప్రోత్సహించి, సహభాగస్వామ్యంలో నిర్వహించడం వంటి బృహత్ కార్యక్రమాలను చేపడితే పెరుగుతు న్న జనాభాను సంపదను సృష్టించే వారిగా తయారు చేయవచ్చు. ప్రస్తుతం ఈ దేశాన్ని పాలించే వారిలో సుపరిపాలన, స్వజాతీయ పరిపాలనా దృష్టి క్షీణిస్తోంది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభకు రాబో యే ఎన్నికలు, ధర్మాధర్మాల మధ్య, దేశీయ విదేశీయతల మధ్య, శ్రమ-సోమరితనం మధ్య, సంపద సృష్టి- సంపద క్షయం మధ్య జరిగే కురుక్షేత్ర సంగ్రామం అవుతుందని భావించడం వాస్తవ దూరం కాదు. త్రిపురనేని హనుమాన్ చౌదరి