లండన్‌లో 'చిరు'కు సన్మానం.. తొలి అవార్డ్‌ మెగాస్టార్‌కే | Chiranjeevi Arrival In London, Receives Warm Welcome From Fans Ahead Of Lifetime Achievement Honour, Video Viral | Sakshi
Sakshi News home page

లండన్‌లో 'చిరు'కు సన్మానం.. ఎందుకంటే..?

Mar 18 2025 8:00 AM | Updated on Mar 18 2025 11:06 AM

Chiranjeevi Arrival In London Fans Welcome

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి లండన్‌ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. భారీగా ఆయన అభిమానులు అక్కడికి చేరుకుని స్వాగతం పలికారు. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలనుగానూ యుకె కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న స‌న్మానించ‌నున్నారు. ఈమేరకు ఆయన అక్కడికి చేరుకున్నారు.

సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ,  సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.

బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్ర‌భావం మ‌రింత విస్తృతం కావాల‌నే ఉద్దేశంతో  వారిని సత్కరిస్తుంతుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అంద‌జేస్తోంది. దాన్ని చిరంజీవి గారు అందుకోనుండ‌టం విశేషం. కానీ,  మెగాస్టార్‌ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందని వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement