
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఇంకా సెట్‌పైకి వెల్లలేదు కానీ.. అనిల్ మాత్రం అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టేశాడు. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్‌లోనే చిరు సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఈ కథ కూడా కామెడీ పంథాలోనే సాగుతుందని హింట్ ఇచ్చేశాడు.
అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్‌ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారట.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంద్ర తర్వాత చిరంజీవి రాయలసీమ నేపథ్యంలో సినిమా చేయలేదు. ఇంద్రలో కూడా సీమ యాసను పూర్తిగా వాడలేదు. కానీ ఈచిత్రంలో చిరంజీవి పూర్తిగా రాయలసీమ యాసలోనే మాట్లాడతారట. డైలాగుల విషయంలోనూ అనిల్ జాగ్రత్త పడుతున్నారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలకు భూమిక, మృణాల్ ఠాకుర్‌లను ఎంపిక చేసినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment