
యాంకర్ రవి (Anchor Ravi), సుడిగాలి సుధీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో వీరు సరదాగా చేసిన స్కిట్ బయట సీరియస్‌గా మారింది. అందులో రవి.. నందీశ్వరుడిపై నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడు చూడు అని చెప్పగా.. తనకు మాత్రం అమ్మాయి కనిపిస్తుంది అన్నాడు సుధీర్ (Sudigali Sudheer). ఈ స్కిట్‌పై జనాలు భగ్గుమన్నారు. ఓ వర్గాన్ని తక్కువ చేశారని మండిపడ్డారు. స్కిట్‌పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూట్యూబ్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశారు.
ఆడియో వైరల్
అయినప్పటికీ ఈ వివాదం సమసిపోలేదు. ఓ హిందూ ఆర్గనైజేషన్‌కు చెందిన ఓ వ్యక్తి యాంకర్ రవితో మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మీ స్కిట్ హిందువులను కించపరిచేలా ఉంది. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని సదరు వ్యక్తి యాంకర్ రవిని డిమాండ్ చేశాడు. అందుకు రవి స్పందిస్తూ.. చిరంజీవి గారు బావగారు బాగున్నారా? సినిమాలో ఇదే సన్నివేశం ఉంటుంది. ఆయన చేసినదాన్ని తప్పు అని ఎందుకు చెప్పలేదు?
అది తప్పనలేదే?
దాన్ని ఎవరూ తప్పనలేదు కాబట్టి మేమూ అదే తీసుకొచ్చి స్కిట్‌గా చేశాం. బావగారు బాగున్నారా? మూవీలోని ఆ సీన్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. అది ఎవరైనా తప్పని చెప్పుంటే మాకు తెలిసేది. అయినా మేము ఏ దేవుడినీ కించపరచలేదు. పైగా నందీశ్వరుడిని స్టేజీపైకి తెచ్చినప్పుడు అందరం షూలు కింద విడిచేసి ఈ స్కిట్ చేశాం. అయినప్పటికీ మా స్కిట్‌పై కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆ వీడియోను యూట్యూబ్‌లో నుంచి తీసేశాం. మేము ఎవరినీ కించపరచలేదని ధైర్యంగా చెప్తున్నాను. మేము ఏ తప్పూ చేయలేదు అని యాంకర్ రవి వివరణ ఇచ్చాడు.
చదవండి: సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్ ఆన్సరిదే!