టాలీవుడ్‌లో వరుస హిట్ సినిమాలతో డైరెక్టర్ బాబీ కొల్లి స్పీడ్ పెంచాడు.. తాజాగా డాకు మహారాజ్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించాడు. 2023 సంక్రాంతి సమయంలో మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) వాల్తేరు వీరయ్య చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇలా భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన మరోసారి చిరంజీవితో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన కథను కూడా బాబీ రెడీ చేస్తున్నాడట. ఈ సారి మరింత బలమైన కథతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస సినిమాలతో వేగం పెంచుతున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ ముగింపు దశకు చేరుకుంది. 2025 సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఆ వెంటనే దర్శకులు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో మెగా సినిమాలను చిరు ప్లాన్ చేశారు. అయితే, వీరిలో మొదట అనిల్ సినిమానే ప్రారంభం అవుతుందని సమాచారం. ఇలా రెండు ప్రాజెక్ట్‌లు తన చేతిలో ఉండగానే బాబీ కొల్లికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశముంది. కమర్షియల్ చిత్రాల్ని తనదైన పంథాలో తెరకెక్కిస్తూ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా బాబీ పేరు తెచ్చుకున్నారు. చిరుతో వాల్తేరు వీరయ్యను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి వస్తున్నారనే వార్తలు రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment