
దసరా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది

ఈ మూవీతో మరింత క్రేజ్ దక్కించుకున్న శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది. అంతా ఊహించినట్లుగానే వీరి కాంబోలో మూవీ ఖరారైంది.

ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న చిత్రానికి దసరా హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు

ఈ విషయాన్ని హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు

దీంతో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా షేర్ చేశారు

చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది



