సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అపాయింట్‌మెంట్ తీసుకున్న సినీ పెద్దలు గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఈ భేటీకి టాలీవుడ్ తరఫున ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, హీరో వెంకటేశ్ కుడా హాజరు కానున్నారు.
గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దిల్‌రాజుతో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా హాజరవుతారని సమాచారం. సంధ్య థియేటర్ ఘటనతో పాటు సినిమా పరిశ్రమ సమస్యలపై కూడా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment