![Chiranjeevi Celebrates 50 Glorious Years in Cinema with a Nostalgic Throwback](/styles/webp/s3/article_images/2024/10/27/chiranjeevi.jpg.webp?itok=q6_JjQOG)
కొణిదెల శివ శంకర వరప్రసాద్.... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరో చిరంజీవి అసలు పేరు ఇదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా శివ శంకర వరప్రసాద్‌గా రంగస్థలంపై ‘రాజీనామా’ అనే నాటకంతో మొదలైన ఆయన నట ప్రస్థానం యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘1974లో నర్సపూర్‌లోని వైఎన్‌ఎమ్ కళాశాలలో బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నప్పుడు రంగస్థలం మీద నేను వేసిన తొలి నాటకం ‘రాజీనామా’. కోన గోవిందరావుగారు రచించారు. నాకు నటుడిగా తొలి గుర్తింపు ఇచ్చింది ‘రాజీనామా’.
అది కూడా బెస్ట్ యాక్టర్‌గా అవార్డు రావడం ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది. 1974–2024... యాభై సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది’’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్ళు’. ఈ సినిమాకి గూడ΄ాటి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ సినిమా మొదట రిలీజ్ అయింది. ప్రాణం ఖరీదు’ చిత్రం 1978 సెప్టెంబరు 22న విడుదల కాగా ‘పునాది రాళ్ళు’ 1979 జూన్ 21న రిలీజ్ అయింది. కాగా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment