Drama Artist
-
యాభైఏళ్ల రాజీనామా
కొణిదెల శివ శంకర వరప్రసాద్.... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరో చిరంజీవి అసలు పేరు ఇదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా శివ శంకర వరప్రసాద్‌గా రంగస్థలంపై ‘రాజీనామా’ అనే నాటకంతో మొదలైన ఆయన నట ప్రస్థానం యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘1974లో నర్సపూర్‌లోని వైఎన్ఎమ్ కళాశాలలో బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నప్పుడు రంగస్థలం మీద నేను వేసిన తొలి నాటకం ‘రాజీనామా’. కోన గోవిందరావుగారు రచించారు. నాకు నటుడిగా తొలి గుర్తింపు ఇచ్చింది ‘రాజీనామా’. అది కూడా బెస్ట్ యాక్టర్‌గా అవార్డు రావడం ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది. 1974–2024... యాభై సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది’’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్ళు’. ఈ సినిమాకి గూడ΄ాటి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ సినిమా మొదట రిలీజ్ అయింది. ప్రాణం ఖరీదు’ చిత్రం 1978 సెప్టెంబరు 22న విడుదల కాగా ‘పునాది రాళ్ళు’ 1979 జూన్ 21న రిలీజ్ అయింది. కాగా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. -
'నటి'విశ్వరూపం
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: కావ్యేషు నాటకం రమ్యం. ఆ నాటకాన్ని రసవత్తరంగా, సందర్భోచితంగా, హాస్యభరితంగా, విషాదభరితంగా, నాటకాని రక్తి కట్టించి సమాజానికి ఒక సందేశమివ్వడంలో మహిళా కళాకారులు ముందు వరుసలో నిలుస్తున్నారు. పౌరాణిక నాటకంలో పద్యాన్ని ఆలపించడంలో సిద్ధహస్తులు, మాట పంపకంలో ప్రతిభావంతులు. గత నాలుగు దశాబ్దాలుగా రంగస్థలంపై రాణిస్తున్న కళా రమణులు. సుమారు 50, 60 ఏళ్ల క్రితం రంగస్థలంపైకి వచ్చిన నాటకాలను నేటికీ బతికిస్తూ వారు బతుకుతూ కళారంగానికి సేవలందిస్తున్న ఉభయగోదావరి జిల్లాలకు చెందిన నటీమణులు ఎందరో ఉన్నారు. మన జిల్లాకు చెందిన భీమవరం లక్ష్మి, లలితకుమారి(నరసాపురం), రమణ(తణుకు), బాలా ప్రవీణ(తణుకు), నాగమణి(తణుకు), రజని(తణుకు), రమ్యకృష్ణ(ఏలూరు), నాగమణి (టీపీగూడెం), అంజలి (దూబచర్ల), లలితా చౌదరి(ఏలూరు)పలు నాటకాలు, నాటికల్లో నటిస్తూ జీవం పోస్తున్నారు. వీరితో పాటు శ్యామల(రాజమండ్రి), అడబాల రమ (అమలాపురం)వీరితో పాటు రాజమండ్రికి చెందిన లతాశ్రీ,, కడపకు చెందిన రత్నశ్రీ, వనజ(అనంతపురం), గుడివాడ లక్ష్మి తదితరులు సుమారు 50 మంది మహిళా కళాకారులు నాటకాలను రక్తి కట్టిస్తున్నారు. సత్య హరిశ్చంద్ర, బాలనాగమ్మ, మాయాబజార్, అల్లూరి సీతారామరాజు, మహిషాసురమర్దిని, శ్రీ కృష్ణ తులాభారం, బ్రహ్మంగారి జీవిత చరిత్ర, సాయిబాబా మహాత్మ్యం, భక్త ప్రహ్లాద, భక్త కన్నప్ప, యశోద కృష్ణ, రామ–రావణ యుద్ధం, గుళేబకావళి కథ, గయోపాక్యానం తదితర పౌరాణిక నాటకాలతో పాటు, చింతామణి, చిల్లరకొట్టు చిట్టమ్మ సాంఘిక నాటకాల ద్వారా వీరు పేరుపొందారు. నాటకం ఆడడం కోసం వీరు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ నాటకమే ఊపిరిగా జీవిస్తున్నారు. నరసాపురం పట్టణానికి చెందిన కడలి లలిత కుమారి తల్లిదండ్రులు ఉప్పులూరి సూర్యనారాయణ– పద్మప్రియలు ఆర్టిస్టులు. వారి నుంచి వారసత్వంగా కళారంగంలో ఆమె అడుగుపెట్టారు. నా తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు. అప్పటి ఆర్థిక పరిస్థితుల కారణంగా రంగస్థలంపై నాటకాలు వేయాల్సిన పరిస్థితి ఉండేదని, ఆ విధంగా రంగస్థలంపై స్థిరపడినట్టు చెప్పారు. ప్రస్తుతం అదే నాటకం తనను, తన ఇద్దరి ఆడపిల్లల్ని బతికిస్తోందని చెప్పారు. ఇప్పటికి 2 వేలకు పైగా ప్రదర్శనలిచ్చానని తెలిపారు. షార్ట్‌ఫిలింలు, సీరియల్స్లు పలు పాత్రలు పోషించిన ఈమెను అనేక అవార్డులు వరించాయి. బీఎస్సీ నర్సింగ్ చేసి.. రాజమండ్రికి కళాకారిణి మక్కెల శ్యామల బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేశారు. రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రిలో ఆమె 10 ఏళ్లు నర్స్‌గా పనిచేశా. ప్రస్తుతం రాజమండ్రి ఫైనాన్స్ కంపెనీలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈమె 15 ఏళ్లుగా రంగస్థల కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికి 1500లకు పైగా ప్రదర్శనలిచ్చానని తెలిపారు. 2015లో కర్నూలు నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో శ్రీ కృష్ణ తులాభారం పద్యనాటకం ప్రదర్శించినందుకు ప్రశంసాపత్రం లభించిందని తెలిపారు. 30 సంవత్సరాలుగా రంగస్థలంపై.. తణుకు పట్టణానికి చెందిన మంగిన నాగమణి ఏడాది క్రితం గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయినా నాటకం కోసం ఆరాట పడుతున్నారు. రంగస్థలంపై గత 30 ఏళ్ల నుంచి పౌరాణిక పాత్రలు పోషిస్తున్నారు. సత్య హరిశ్చంద్ర నాటకంలో తొలిసారిగా హరిశ్చంద్రుడు వేషం కట్టి మగ కళాకారులను మైమరిపించే విధంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఏడాది నుంచి గుండె ఆపరేషన్ చేయించుకున్న కారణంగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. నంది నాటకాత్సోవాల్లో ప్రతిభ ఏలూరుకు చెందిన తాళ్లూరి జయశ్రీ(రమ్యకృష్ణ) రంగస్థలంపై 25 ఏళ్ల నుంచి అనేక ప్రదర్శనలిస్తున్నారు. బెబ్బులి, నిప్పురవ్వలు, కథా నాయకుడు, ప్రేమ సంకెళ్లు, పూలరంగడు, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం తదితర నాటకాలతో ప్రసిద్ధిపొందారు. నెల్లూరులో నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో కాంస్య నంది వరించింది. ప్రభుత్వం కళాకారులను గుర్తించి ఏటా ఆర్థిక సత్కారాలు చేయాలి. -
యడ్ల గోపాలరావుకు పద్మశ్రీ అవార్డు
-
నాటిక వేసి.. ప్రాణం విడిచాడు
సాక్షి, అనకాపల్లి: నాటక రంగాన్ని ప్రవృత్తిగా మార్చుకున్న చిత్రం అంజి బాబు (71) అనే కళాకారుడు నాటికను ప్రదర్శించి.. తుది శ్వాస విడిచిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానపు నాటిక పోటీల్లో భాగంగా శనివారం రాత్రి అమ్మకో ముద్దు నాటిక ప్రదర్శించారు. ఇందులో గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలోని అల్లూరివారి పాలేనికి చెందిన అంజి బాబు ముస్లిం పాత్రలో నటించారు. ప్రదర్శన ముగిసిన కొంతసేపటికి గుండెపోటుతో కుప్పకూలిపోగా.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా అతడు ప్రాణాలు వదిలాడు. -
సత్యమే ఆయన మతం
సత్యం అనే గమ్యానికి దారి లేదు. ఎవరికి వారు బాట వేసుకుని సత్యాన్ని చేరుకోవలసిందే. ఏ మతం, ఏ మత గ్రంథం, ఏ మతాచార్యుడు, ఏ విశ్వాసం ఏ సిద్ధాంతం సత్యాన్ని మనకు అందించలేదు. సత్యం అంగడిలో దొరికే వస్తువు కాదు. సత్యం ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. ఒకరు సత్యాన్ని కనుగొంటే అది అతని సత్యం అవుతుంది. మనది కాదు. మన సత్యాన్ని అన్వేషించి కనుగొనవలసిందే. 1909, ఏప్రిల్ మాసంలో ఓ సాయంత్రం. మద్రాస్‌లోని అడయార్ సముద్రపు ఒడ్డున ఇసుకలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. తన కార్యదర్శి ప్రొఫెసర్ ఎర్నెస్ట్ ఉడ్‌తో కలసి ఇసుకలో నడుస్తున్న చాల్స్ వెబ్‌స్టర్ లెడ్‌బీటర్ ఆ పిల్లల గుంపులో ఒక బాలుడిని గమనించాడు. ఆయన దివ్యజ్ఙాన సమాజంలో ప్రముఖుడు. అతీంద్రీయ శక్తులు లేదా మానవాతీత శక్తులు కలిగి ఉండేవాడని ప్రతీతి. ఇంతకీ ఆ పిల్లవాడిని లెడ్‌బీటర్ అంత నిశితంగా గమనించడానికి కారణం – అతడు భావి జగద్గురువు –వరల్డ్ టీచర్– అని ప్రగాఢంగా నమ్మడమే. ఆ జగద్గురువు ఆగమనం కోసమే దివ్యజ్ఞాన సమాజం వేచిచూస్తోంది కూడా.అంతమంది బాలల్లో తను చూసిన ఆ అబ్బాయిని, నిరంతరం ఇతడినే వెన్నంటే ఉంటున్న ఇంకొక అబ్బాయిని గురించి తెలుసుకున్నాడు లెడ్‌బీటర్. ఆ ఇద్దరు నారాయణయ్య అనే రిటైర్డ్ తహసీల్దార్ కుమారులని తెలిసింది. ఇంతకీ నారాయణయ్య తమ సంస్థలోనే ఉద్యోగి. అడయార్‌లో ఉన్న వారి ఆశ్రమానికి సమీపంలోనే శిథిలావస్థలో ఉన్న ఒక భవనంలో ఉన్నదా కుటుంబం. లెడ్‌బీటర్ ఆ బాలుడిని చూడగానే ఇలాంటి దివ్యత్వం ఉన్న బాలుడిని ఎక్కడా చూడలేదు అన్నాడట. పక్కనే ఉన్నాడు, ప్రొఫెసర్ ఎర్నెస్ట్ ఉడ్. ఆయన ఎప్పుడూ చూడలేదు మరి. పైగా ఆ ఇద్దరు పిల్లలు ఆయన దగ్గరకి వచ్చి పాఠాలు చెప్పించుకుని వెళుతూ ఉండేవారు. మొదట లెడ్‌బీటర్ తన అభిప్రాయాన్ని దివ్యజ్ఞాన సమాజంలో మరొక ప్రముఖురాలు, ప్రముఖ భారత స్వాతంత్య్ర సమరయోధురాలు అనిబీసెంట్‌కు చెప్పి నమ్మకం కలిగించాడు. తరువాత నారాయణయ్యను ఒప్పించి, అనిబీసెంట్ ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. అందులో లెడ్‌బీటర్ భావి జగద్గురువును చూసిన పిల్లవాడే జిడ్డు కృష్ణమూర్తి. రెండో పిల్లవాడు కృష్ణమూర్తి తమ్ముడు నిత్యానంద. కానీ లెడ్‌బీటర్ మానవాతీతశక్తులు నిజం కాదని కృష్ణమూర్తి జీవితం నిరూపించింది. నీవు జగద్గురువు అని లెడ్‌బీటర్, అనిబీసెంట్ తదితరులు ఆయనను పిలుచుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆ రోజుల్లోనే కుప్పలుతెప్పలుగా విరాళాలు వచ్చి పడ్డాయి. తీరా జగద్గురువు పీఠం ఎక్కించడానికి కొంచెం ముందు తాను జగద్గురువును కాదు అని నిష్కర్షగా ప్రకటించారు కృష్ణమూర్తి. అసలు గురువు అనే, నేర్పేవాడు అనే వ్యవస్థకే తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఆ పీఠం, ఆ కోట్లాది రూపాయల విరాళాలు అన్నీ త్యజించి, దివ్యజ్ఞాన సమాజం వీడి బయటకు వెళ్లిపోయారాయన.అసలు కృష్ణమూర్తి (మే 12, 1895–ఫిబ్రవరి 17,1986) జీవితమే ఒక అద్భుతం. ఆయనది గొప్ప రూపం. ఇంత అందగాడిని నేను చూడలేదు అన్నాడట, కృష్ణమూర్తిగారిని చూడగానే, ప్రపంచ ప్రఖ్యాత నాటక కర్త జార్జ్ బెర్నార్డ్ షా. ఒక హాలీవుడ్ సంస్థ అయితే ఆయన కథానాయకునిగా గౌతమ బుద్ధ ఇతివృత్తంతో సినిమా నిర్మించాలని కూడా తలపెట్టింది. అందుకు కృష్ణమూర్తి అంగీకరించలేదు. అలాగే ఆయన ఉపన్యాసాలకు విశ్వవిఖ్యాతి ఉంది. అసాధారణంగా అధ్యయనం చేశారు కాబట్టి ఉపన్యాసం కొంత మార్మికంగా, ఎంతో కవితాత్మకంగా సాగేదని (ఆ ఉపన్యాసాలు చదివినప్పటికి) తెలుస్తుంది. జేకే, కృష్ణజీ, కృష్ణాజీగా విశ్వవిఖ్యాతి చెందిన కృష్ణమూర్తి స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి. నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు అష్టమగర్భంలో పుట్టారు. అందుకే కృష్ణుడి పేరు పెట్టారు. మొత్తం పదకొండుమంది సంతానం. ఆయన తమ్ముడు నిత్యానంద. యౌవనంలోనే వక్తగా అసాధారణ ప్రతిభ కనపరిచిన కృష్ణమూర్తి ప్రాథమిక విద్య దశలో సర్వ సాధారణమైన విద్యార్థే. పాఠాలు అప్పచెప్పడంలో, వినడంలో ఎప్పుడూ వెనకపడి ఉండేవాడు. దిక్కులు చూస్తూ ఉండేవాడు. తరచూ తండ్రి బదిలీ కావడం వల్ల, మలేరియా వల్ల కూడా కృష్ణమూర్తి చదువు బాగా వెనుకపడింది. దీనితో ఉపాధ్యాయులు చండామార్కులవారయ్యేవారు. ఇలాంటి విద్య వల్లనే ఆయన సంప్రదాయ విద్యను తీవ్రంగా ద్వేషించేవాడని చెబుతారు. పైగా పదేళ్లు వచ్చేసరికి తల్లి మరణించింది. బాల్యానికి అదొక వెలితి. తండ్రి పదవీ విరమణ చేసిన తరువాత అడయారులోనే ఉన్న దివ్యజ్ఞాన సమాజంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. శని, ఆదివారాలలో కృష్ణమూర్తిని తన బంగ్లాకు తీసుకురావలసిందని లెడ్‌బీటర్ నిత్యానందకు చెప్పేవాడు. అక్కడ మొదట చదువు చెప్పేవారు. తరువాత లెడ్‌బీటర్ కృష్ణమూర్తిని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుని తల మీద చేయి వేసి, పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పేవారట. అలా అన్వేషించగా అన్వేషించగా ఆయన మహావక్త అవుతాడని తెలిసిందట. తరువాత తాము వేచి చూస్తున్న ‘లార్డ్ మైత్రేయ’ కృష్ణమూర్తిలో ఉన్నాడని క్లెయిర్వాయింట్ ద్వారా తెలిసిందట. ఆ లార్ మైత్రేయే దివ్యజ్ఞాన సమాజం ఎదురు చూస్తున్న జగద్గురువు. ఆయన ఆధునిక ఆధ్యాత్మిక అస్థిత్వమని దివ్యజ్ఞాన సమాజం నమ్మింది. నిజానికి బౌద్ధం నుంచి, కొంత క్రైస్తవం నుంచి ఈ సిద్ధాంతాన్ని మేడమ్ బ్లావట్స్కీ స్వీకరించింది. ఆమె దివ్యజ్ఞాన సమాజ స్థాపకురాలు. ఆమె శిష్యుడు లెడ్‌బీటర్. మైత్రేయ బోధిసత్వుడు మానవాళిని దుఃఖాల నుంచి రక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్మగా, బుద్ధునిగా,క్రీస్తుగా జన్మిస్తాడని దివ్యజ్ఞాన పథకుల నమ్మకం. ఆ మైత్రేయుడు ఈ యుగంలో తన సరైన వాహకంగా కృష్ణమూర్తిని ఎంచుకున్నాడన్నదే ఆ నమ్మకంలో కనిపిస్తుంది. అనిబీసెంట్ పర్యవేక్షణలో లెడ్‌బీటర్ సంరక్షణలో పద్నాలుగేళ్ల బాలుడు కృష్ణమూర్తి చదువుకున్నాడు. కానీ పెంపకం అంతా పాశ్చాత్య పద్ధతిలోనే. ఆ సమయంలోనే లెడ్‌బీటర్ మీద అనుమానంతో నారాయణయ్య తన పిల్లలను తనకు అప్పగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు నారాయణయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ అనిబీసెంట్ ప్రీవీకౌన్సిల్‌కు వెళ్లారు. అక్కడ మాత్రం పిల్లల ఇష్టం మేరకు అని తీర్పు వచ్చింది. ఆ ఇద్దరు పిల్లలు బిసెంట్ వద్ద ఉండడానికి మొగ్గుచూపారు. తరువాత బీసెంట్ ఆ ఇద్దరిని లండన్ తీసుకుపోయి అక్కడ ఎమిలీ ల్యూటెన్కు అప్పగించింది. ఆమె న్యూఢిల్లీని నిర్మించిన ల్యూటన్ సతీమణి. ఫ్రాన్స్ పంపి ఫ్రెంచ్ చదివించారు. పిల్లలు ఇద్దరు తెలుగు మరచిపోయారు. శిక్షణ పూర్తయిందని భావించిన దివ్యజ్ఞాన సమాజ నాయకత్వం 1923లో హాలెండ్లోని ఓమెన్ పట్టణంలో జగద్గురువుగా ప్రకటించారు కూడా. ఆయన అధినేతగా ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకే ధనరాశులు విరాళాలుగా వచ్చి పడ్డాయి. 1925లో మొదటిసారి ఆయన అడయార్‌లో ప్రసంగించారు. ఒక ప్రవక్త మాట్లాడినట్టే ఉందని చెబుతారు. కానీ ఆ పదవి పట్ల ఏదో ఇబ్బందిగానే ఉండేవారు. అప్పుడు పండిట్ ఎ. మహదేవశాస్త్రి వద్ద వేదంలో కొన్ని భాగాలు నేర్చుకున్నారు. మరొక పరిణామం కూడా చోటు చేసుకుంది. దివ్యజ్ఞాన సమాజం స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు డిసెంబర్ 21, 1925న భారత సమాజ పూజ జరిపారు. అందులో కృష్ణమూర్తి కూడా పాల్గొన్నారు. అలాంటి ఒక క్రతువులో ఆయన పాల్గొనడం అదే మొదటిసారి. ఇలాంటి పరిస్థితులలో తమ్ముడు నిత్యానంద 1925 నవంబర్‌లో కన్నుమూశాడు. అప్పటికి కాలిఫోర్నియాలోని ఓహై స్థిర నివాసం చేసుకున్నారాయన. అక్కడే నిత్య కన్నుమూశాడు. ఇదొక వెలితి.ఆగస్టు 3, 1929న కృష్ణమూర్తి ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ గురు పీఠాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు. తనను ఎక్కడ ఆ పదవిలో పట్టాభిషిక్తుడిని చేశారో, అదే ఓమెన్ పట్టణంలో స్టార్ వార్షిక సమావేశంలో 3,000 మంది ఎదుట తన నిర్ణయం ప్రకటించారాయన. విరాళాలను ఎవరివి వారికి తిప్పి పంపేశారు. కృష్ణమూర్తి ఫౌండేషన్‌ను స్థాపించారు. దానితోనే ఓహై కేంద్రంగా ప్రపంచం అంతా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చారు. గురుపీఠాన్ని వదులుకుంటున్న చేసిన ప్రకటనను డిజల్యూషన్ స్పీచ్‌గా చెబుతారు. అందులో, ‘సత్యం అనే గమ్యానికి దారి లేదు. ఎవరికి వారు బాట వేసుకుని సత్యాన్ని చేరుకోవలసిందే. ఏ మతం, ఏ మత గ్రంథం, ఏ మతాచార్యుడు, ఏ విశ్వాసం ఏ సిద్ధాంతం సత్యాన్ని మనకు అందించలేదు. సత్యం అంగడిలో దొరికే వస్తువు కాదు. సత్యం ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. ఒకరు సత్యాన్ని కనుగొంటే అది అతని సత్యం అవుతుంది. మనది కాదు. మన సత్యాన్ని అన్వేషించి కనుగొనవలసిందే’. అన్నారాయన. ఇంకా, సత్యం అనేది దారీతెన్నూ లేని దేశం. ఏ దారిన మీరు నడిచినా ఏ మతాన్ని ఏ ఉప మతాన్ని ఆశ్రయించినా మీరు సత్యాన్ని చేరలేరు. అదీ నా దృక్పథం’ అన్నారాయన. అందుకే ఆర్డర్ ఆఫ్‌ది స్టార్‌ను రద్దు చేయవలసిన అవసరం ఉందని కూడా చెప్పారాయన. జిడ్డు కృష్ణమూర్తి అంతశ్శోధన గురించి చెప్పారు. మనిషి దుఃఖానికి అలాంటి శోధనే దివ్యౌషధమని కూడా ఆయన చెప్పారు. అయితే తాను గురువును కాదన్నాడు. అలాంది ఆయన బోధనలు మాత్రం గురుబోధలు ఎందుకవుతాయి. కావనే ఆయన కూడా ఘంటాపథంగా చెప్పారు. కానీ ఆయన గురువును కాదని చెబుతున్నా లక్షలాది మంది ఆయన అనుయాయులుగా ఈ ప్రపంచంలో కనిపిస్తారు. అయితే వారితో మాట్లాడినప్పుడు కూడా కృష్ణమూర్తి తాను ఏమీ బోధించడం లేదనీ, వీరెవరూ శిష్యులు కారని, నాకు మిత్రులని చెప్పేవారు. తనను ఎవరూ అనుసరించరాదనే ఆయన చెప్పారు. ఆయనను విశ్వగురువును చేయాలని దివ్యజ్ఞాన సమాజం భావించింది. డా. గోపరాజు నారాయణరావు -
కళామతల్లి ముద్దుబిడ్డ కన్నుమూత
బరంపురం : కళామతల్లి ముద్దుబిడ్డ కరుణశ్రీ కళా కోవెలకొండ వేంకటరావు పరమపదించడం కళాకారులకు తీరని లోటు అని ఉత్కళ కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన స్వర్గస్తులయ్యారు. దీంతో ఒడిస్సాలోని ఉత్కళ కళాకారులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాటక రంగ కళాకారులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒడిశాలోని బరంపురం తెలుగు నాటకరంగంలో ఆయన నటన మరిచిపోరానిదని కీర్తించారు. సుమారు 40 ఏళ్లకు ముందు సీహెచ్. నరసింహరావు, వైకుంఠాచారి, కె.వరదరాజులు, బండి రాజు వంటి స్నేహితులతో కలిసి 1968వ సంవత్సరంలో బరంపురంలో ‘కరుణశ్రీ’కళాసమితి పేరుతో సాంస్కృతిక సంస్థను స్థాపించి కళామతల్లికి సేవలందించారు. రెవెన్యూ ఉద్యోగి నుంచి నటుడిగా ప్రస్థానం వృత్తి రీత్యా వెంకటరావు ఒడిశా రాష్ట్రంలో ప్రభుత్వ రెవెన్యూ విభాగంలో పనిచేశారని, పదవీ విరమణానంతరం పూర్తిగా నాటక రంగానికి అంకితమయ్యారని తెలిపారు. తనతో పాటు సహధర్మచారణి కె.వనజా కూడా నాటకాల్లో నటించి ఒడిస్సాలోను, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన నారీభేరి, నిశ్శబ్ధ వంటి సుమారు 100 నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారని ప్రశంసించారు. 1945లో బరంపురం నగరంలోని స్థానిక చిన్నకాళికా అమ్మవారి కోవెల వీధిలో ఆయన జన్మించారు. కోవెలకొండ వెంకటరావు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలు పూర్తిచేసి ఉద్యోగిగా స్థిరపడి నాటక రంగానికి ఎనలేని సేవలు చేశారని కీర్తించారు.1960లో మొట్టమొదటి సారిగా తన ముఖానికి రంగు వేసుకుని కళామతల్లికి సేవలు చేసేందుకు ఆరంగేట్రం చేశారు. నాటకరంగంలో వందకి పైగా నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. నటుడుగా తన కీర్తి హిమవత్ శిఖరమైతే, దర్శకుడిగా ఆయన కీర్తి ఒడిస్సా, ఆంధ్రా, పశ్చిమబెంగాల్, మహరాష్ట్ర వరకు వ్యాపించింది. ‘బక్క బ్రహ్మచారులు’నాటిక 35 సార్లు ప్రదర్శించి, మహిళల హక్కుల ఉద్యమంపై ‘నారిభేరి’, భ్రూణహత్యలపై ‘నిశ్శబ్ద’నాటికలను 100కి పైగా ప్రదర్శనలు ఇవ్వడంలో ఆయనకే చెల్లిందన్నారు. హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ రంగస్థల నటుడు వంటి బిరుదులు ఎన్నో సొంతం చేసుకున్నాడని తెలిపారు మరెన్నో గౌరవ సన్మానాలు, పురస్కారాలు అందుకుని కరుణశ్రీగా, ఉత్కళ తెలుగు వెలుగుగా కొవలెకొండ వెంకటరావు పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. స్థానిక ఫ్రెండ్స్ హెల్పింగ్ క్లబ్‌కు సలహాదారుగా వ్యవహరించి ఎన్నో సేవలు అందించారు. కళాకారుల్లో విషాదం కరుణశ్రీ, ప్రముఖ కళామతల్లి ముద్దుబిడ్డ కోవెలకొండ వెంకటరావు అదివారం రాత్రి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం వెంకటరావు భౌతికాయానికి కళాకారులు, స్నేహితులు, బంధువులు కన్నీరు మున్నీరుగా వీడ్కోలు పలికారు. -
నటులు లేని ‘రంగస్థలం’
సందర్భం కళ ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను ఆలోచింపజేసే ప్రయత్నం, ప్రక్రియ. కళ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అలాంటి కళను ప్రోత్సహించే నాటక రంగ స్థల శాఖకు పూర్వ శోభను తీసుకు రావలసిన బాధ్యత విశ్వ విద్యాలయాలపై ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల జీవనాడి ఆంధ్ర కళా పరిషత్తు. భాషా ప్రాతిపది కపై ఏర్పడిన మొదటి విశ్వ విద్యాలయం. విద్యావేత్త సర్ కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక కులపతిగా ప్రారంభించిన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు దేశ విదేశాలలో పేరు ప్రతిష్టలను మూటగట్టుకుంది. విశాలమైన ప్రదే శంలో ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న విశ్వ విద్యా లయం ఇప్పుడు అధ్యాపకుల కొరతతో సతమతమౌ తుంది. సుమారు 9 జిల్లాలకు విస్తరించిన వర్సిటీ ఇప్పుడు విజయనగరం జిల్లాకే కుదించుకుపోయింది. దీంతో రెవెన్యూ రాబడి తగ్గి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూంది. తక్కువ పర్మనెంటు, ఎక్కువ కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తోంది. సుమారు 63 విభా గాలు, 115 కోర్సులతో విరాజిల్లుతున్న వర్సిటీ తన చిహ్నంలోని 64 కళలకు అద్దం పడుతోంది. ప్రదర్శన కళలు (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్)కు చెందిన నాటక రంగ విభాగం (థియేటర్ ఆఫ్ ఆర్ట్స్) సరిౖయెన ఆదరణకు నోచుకోక విలవిల్లాడుతోంది. నేడు ప్రపంచ నాటక రంగం 70వ వార్షికోత్సవం వేళ ఆ శాఖ గురించి, దాని పుట్టుక, ప్రగతి, ఎదుగుదల, తరుగుదల గురించి తెలుసుకోవడం ప్రతీ తెలుగువాడి విధి. ఉభయ రాష్ట్రాలలో ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మా నియా యూనివర్సిటీ, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలలో నాటకరంగ విభాగాలు పనిచేస్తు న్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే ఆంధ్రా యూని వర్సిటీలోని విభాగం చాలా వెనుకబడి ఉందనే చెప్పాలి. పూర్తి స్థాయిలో పనిచేసే విభాగాధిపతిగానీ, అధ్యాపకులుగానీ లేరు. పనిచేస్తున్న అధ్యాపకులం దరూ కాంట్రాక్టు విధానంలోనే పనిచేస్తున్నారు. జాతి, సంస్కృతి, వారసత్వాలను తరతరాలకందించే వాహి నిగా పనిచేసేదిగా నాటక రంగ విభాగం ఉండాలి. నాటకరంగ విభాగం లక్ష్యాలలో ముఖ్యమైనవి జాతి, సంస్కృతి, వారసత్వాలను సంరక్షించడం, సామాజిక సమస్యలను కళ ద్వారా వ్యక్తీకరించడం, సామాజిక రుగ్మతలపై కళారూపాల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడం. వీటితోపాటు నటన, దర్శ కత్వాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా ఔత్సాహిక, వృత్తి కళాకారులను తయారుచేయడం. పై లక్ష్యాల సాధనకు దృఢమైన నాటకరంగ విభాగం అవశ్యం. అధ్యాప కులు ఏ విభాగానికైనా వెన్నుముకలాంటి వారు. ప్రస్తుతం ఈ విభాగంలో నలుగురు అధ్యాపకులు 2002 సంవత్సరం నుంచి కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. ఈ నలుగురులో ఒకరు వచ్చే సెప్టెంబర్‌లో కాంట్రాక్టు అధ్యాపకునిగానే పదవీ విరమణ చేయబోతున్నారు. 2005వ సంవత్సరంలో వీరిని టీచింగ్ అసోసియేట్లుగా నామకరణం చేసారు. శాశ్వత అధ్యాపకుడికి ఉండే అన్ని విద్యార్హతలు ఉండటం చేత చేసే పని కూడా శాశ్వత అధ్యాపకుడి గానే ఉంటుంది. కానీ ‘కాంట్రాక్టు కత్తి’ మెడమీద వేలా డుతూ ఉంటుంది. ఆ భ్రమను తొలగించడానికి అన్ని విభాగాలలో పనిచేసే అధ్యాపకులతోపాటు వీరిని ‘అసిస్టెంట్ ప్రొఫెసర్’ (కాంట్రాక్టు)లుగా మార్చారు. జీతం కొంచెం పెంచారు. జీతమైతే పెరిగింది కానీ వారి గీత మారలేదు. పదేళ్ల సర్వీసు నిండటంతో తమని శాశ్వత స్థానాలలో నియమించమని అనేక విజ్ఞప్తులు చేసినా ఫలితం కనిపించక ఆ నలుగురిలో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి సర్వీ సును పరిగణనలోకి తీసుకొని ‘భారీ’గా ఉండే శాశ్వత పోస్టులలో వారిని నియమించాలని ఆర్డర్ వేసింది. (wp. No. 27706 of 2011) అయినా యూనివర్సిటీ అధికారులు ఏ చర్యలు తీసుకోలేరు సరికదా రిట్ అప్పీలు వెళ్లారు. ఇది ఇలా ఉండగా యూనివర్సిటీకి ఉన్నత విద్యాశాఖ నుంచి ఒక లేఖ చేరింది. దాని సారాంశం ఆ ముగ్గురిని రెగ్యులర్ పోస్టుల ఖాళీలలో శాశ్వత పద్ధతిపై నియమించాలని.. దాన్ని కూడా యూనివర్సిటీ పెడచెవిన పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలలో సమానత్వాన్ని పాటించ మని 16వ అధికరణ చెబుతోంది. ఖాళీగా ఉన్న పోస్టు లలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తరగతులను నింపడానికి రాష్ట్ర ప్రభుత్వానికిగానీ దాని అంగానికి గానీ అధికారముండి కోర్టుకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు షెడ్యూల్డు కులానికి చెందినవారు కాగా మరొకరు వెనుకబడిన తరగతికి చెందినవారు. సమన్యాయం అటుంచి సామాజిక న్యాయం కూడా అందడం లేదని అధ్యాపకులు వాపోతున్నారు. ఇందులో ఏ ఒక్కరైనా అగ్రవర్ణానికి చెందిన వారుంటే ఇప్పటికే న్యాయం జరిగి ఉండేదని కొందరి అభిప్రాయం. యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసు కొని సమస్యను పరిష్కరించకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండేదనే సామెతలా అధ్యాపకుల కష్టాలు కష్టాలుగానే మిగిలిపోతాయి. అటు ఉద్యోగ భద్రత లేదు. ఇటు వృత్తి సంతృప్తి లేకుండా పోయింది. కొసమెరుపు: ఈ సంవత్సరం ప్రపంచ రంగస్థల దినోత్సవం ఇచ్చే సందేశం ‘‘ఎవరైతే కళను, దాని ప్రాముఖ్యతను, విలువను గుర్తిస్తారో వారు ప్రభు త్వాలకు, రాజకీయవేత్తలకు, సంస్థలకు ఈ సంబ రాలు ఒక పొలికేక’ అని గుర్తింప చేయాలి. – ఏసియా పసిఫిక్ గ్రూపు (UNESCU) (నేడు ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా) వ్యాసకర్త రిటైర్డ్ ఏయూ ప్రొఫెసర్, కేపీ సుబ్బారావు -
కళారంగ కనకం మల్లేష్..
- 22 ఏళ్లుగా కళాప్రదర్శనలు - పతకాలు, ప్రశంసాపత్రాలే ఆస్తులు - అందని గుర్తింపు.. కరువైన ప్రొత్సాహం చిట్యాల(భూపాలపల్లి): పేదరికం వెంటాడుతున్నా.. పరిస్థితులు వెక్కిరిస్తున్నా.. పోత్సహం కరువైనా..పట్టువిడవకుండా గత 22 ఏళ్లుగా కళామాతల్లిని నమ్ముకుని జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. గ్రామీణ ప్రాంతాలలో కనుమరుగవుతున్న కళారంగానికి జీవం పోస్తూ..ఎన్నో నాటకాలు ప్రదర్శించి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు భూపాలపల్లి జల్లా చిట్యాల మండలంలోని నైన్పాక గ్రామానికి చెందిన మోతె మల్లేష్. నిరుపేద బుడిగజంగం కులంలో పుట్టిన మల్లేష్ చిన్నప్పటి నుంచి నాటికల పట్ల మక్కువ పెంచుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పలు జిల్లాలో ధూంధాం సభలలో పాల్గొని పాటలు, మిమిక్రీ, ఏకపాత్రాభినేయంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. రాజు,రాణిపాత్రలకు కేరాఫ్ మల్లేష్.. నాటకాలలో రాజు, రాణి పాత్రలు నటించడంలో మల్లేష్‌కు ఎవరూ సాటి రారు. పాత్రలో లీనమై రక్తికట్టిస్తాడు. రామాయణం, సత్యహరిచ్చంద్ర, మార్కండేయ, వాలీసుగ్రీవుల వధ, శ్రీకృష్ణార్జునుల యుద్ధం, పాండవుల ఆరణ్య వాసం, సారంగధర, మాయల ఫకీరు లాంటి నాటకాలు ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందుకున్నాడు. కరువైన ప్రోత్సాహం కళారంగమే ప్రాణంగా భావిస్తున్న మల్లేష్‌కు ప్రభుత్వం, అధికారుల ప్రోత్సాహం కరువు అవుతోంది. దీంతో కుటుంబపోషణ భారమై ఇటు కళాప్రదర్శనలు నిర్వహిస్తూ సమయం దొరికినప్పుడల్లా గ్రామంలోనే ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. కాగా, ప్రభుత్వాస్పత్రులలో మెరుగైన వైద్యం అందడంతో రోగులు తమ వద్దకు రావడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారమైందని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 22 ఏళ్లుగా కళాకారుడిగా రాణిస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం ఆదరించి సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారిలను వేడుకుంటున్నాడు. -
గోవిందుడు అందరివాడిలే
ప్రముఖ నర్తకి వాణీగణపతి.. ఆత్మగౌరవానికి అభినయం నేర్పిన కళాకారిణి. తనకొచ్చిన నాట్యంతో నలుగురికి తెలిసే కన్నా తనతో నాట్యం తెలిసేలా చేసిన సెల్ఫ్ప్రైడ్ ఉమన్. ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్ నిర్వహించిన ‘విమెన్ ఇన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్‌కి శనివారం వచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ‘సిటీ ప్లస్’కి స్పెషల్ అతిథి అయ్యారు. నాట్యకృష్ణుడితో, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు! నా వరకు నాకైతే కృష్ణుడు భగవంతుడిగా కాక ఓ హ్యూమన్ బీయింగ్గానే కనిపిస్తాడు. గోవిందుడు అందరివాడు. కొడుకుగా.. మంచి స్నేహితుడిగా.. రొమాంటిక్ లవర్‌గా.. ఇన్ని రూపాల్లో కనిపిస్తాడు. ద్రౌపది వస్త్రాపహరణం, కురుక్షేత్రయుద్ధం లాంటి సమయాల్లోనే.. ఆపద్బాంధవుడిగా, లోకరక్షకుడిగా దర్శనమిస్తాడు..కానీ మిగిలిన అన్ని సమయాల్లో సామాన్యుడిలా, ఆత్మీయుడిలా ఉంటాడు. కాబట్టి ఆయన దేవుడి కన్నా మనలాంటి మనిషిగానే అనిపిస్తాడు. నాకు తెలిసినంత వరకు చాలామంది తల్లులు తమ కొడుకులను చిన్నప్పుడు కన్నా, కృష్ణా అనే పిలుచుకుంటారు. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లో కృష్ణుడితో నాదీ అదే అనుబంధం. నా పూజగదిలో సాయిబాబాతో పాటు కృష్ణుడి ప్రతిమా ఉంటుంది. ఆ విగ్రహంతో ఓ స్నేహితుడితో మాట్లాడినట్లు అన్నీ షేర్ చేసుకుంటాను. ఎందుకిలా చేశావ్? నా ప్రాబ్లం సాల్వ్చేయడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నావ్.. అంటూ నిలదీస్తాను. ఇదే క్లోజ్‌నెస్ నా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లోనూ ఉంటుంది. కృష్ణుడి రోల్‌తో చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాను. ‘జగదోద్ధారణ’లో నేను యశోదగా వేస్తే నట్కట్ నంద్లాల్ నిజంగా నా కొడుకుగానే కనిపిస్తాడు. జయదేవుడి అష్టపదిలో రాధగా అభినయించినప్పుడు అద్భుతమైన ప్రేమికుడి చెంతనున్నట్టు ఫీలవుతాను. ఇవన్నీ కాక నేనే కృష్ణుడిగా అభినయించినప్పుడు ఆ సమయంలో నిజంగానే కృష్ణుడిగా మారిపోతాను. అదో అలౌకిక ఆనందం! ఒకసారి నా ఫ్రెండ్ ‘ఇలా ప్రతి ప్రోగ్రామ్‌లో కృష్ణుడికి సంబంధించి ఒక్క డ్యాన్స్ చేసే బదులు కృష్ణుడి డిఫరెంట్ యాస్పెక్ట్స్, డిఫరెంట్ రోల్స్ అన్నిటినీ ఒక్కచోట కూర్చి ఓ బాలే చేయొచ్చు కదా’ అంది. అప్పుడు ‘కలర్స్ ఆఫ్ కృష్ణ’ అని ఓ నృత్యరూపకం చేశాను. హైదరాబాద్‌తో కళాత్మకబంధం హైదరాబాద్‌తో నాది కళాత్మకబంధం. నా పెళ్లయిన కొత్తలో షూటింగ్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసమే ఎక్కువగా ఇక్కడికి వస్తుండేదాన్ని. ఎప్పుడైతే నాకు ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్‌తో పరిచయం ఏర్పడిందో, అప్పటినుంచి పెర్ఫార్మెన్సెస్ కోసం రావడం మొదలుపెట్టాను. ఈ ఊళ్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడి భోజనం ఇష్టపడని వాళ్లుండరేమో! షాపింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. చార్మినార్ వెళ్లి రకరకాల గాజులు, ముత్యాలు కొనుక్కోవడం.. ఓహ్..బ్యూటిఫుల్! ఉస్మానియా యూనివర్శిటీ.. హైకోర్ట్, సాలార్జంగ్ మ్యూజియంలాంటి కట్టాడాలు.. చౌమొహల్లా , ఫలక్‌నుమా లాంటి ప్యాలెస్‌లు..హైదరాబాద్ గొప్పతనమేమంటే.. ఇది ఇప్పటికీ ఆ పాత ఆర్కిటెక్చర్.. యాంటిక్విటీని కాపాడుకుంటుండటం. ఐ ఆల్వేస్ ఎంజాయ్ హైదరాబాద్. ఐ లవ్ వెరీమచ్ దిస్ సిటీ! .:: శరాది -
తమిళనాట డ్రామా అర్టిస్టుల ప్రచారం