సందర్భం
కళ ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను ఆలోచింపజేసే ప్రయత్నం, ప్రక్రియ. కళ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అలాంటి కళను ప్రోత్సహించే నాటక రంగ స్థల శాఖకు పూర్వ శోభను తీసుకు రావలసిన బాధ్యత విశ్వ విద్యాలయాలపై ఉంది.
ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల జీవనాడి ఆంధ్ర కళా పరిషత్తు. భాషా ప్రాతిపది కపై ఏర్పడిన మొదటి విశ్వ విద్యాలయం. విద్యావేత్త సర్ కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక కులపతిగా ప్రారంభించిన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు దేశ విదేశాలలో పేరు ప్రతిష్టలను మూటగట్టుకుంది. విశాలమైన ప్రదే శంలో ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న విశ్వ విద్యా లయం ఇప్పుడు అధ్యాపకుల కొరతతో సతమతమౌ తుంది. సుమారు 9 జిల్లాలకు విస్తరించిన వర్సిటీ ఇప్పుడు విజయనగరం జిల్లాకే కుదించుకుపోయింది. దీంతో రెవెన్యూ రాబడి తగ్గి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూంది. తక్కువ పర్మనెంటు, ఎక్కువ కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తోంది. సుమారు 63 విభా గాలు, 115 కోర్సులతో విరాజిల్లుతున్న వర్సిటీ తన చిహ్నంలోని 64 కళలకు అద్దం పడుతోంది. ప్రదర్శన కళలు (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్)కు చెందిన నాటక రంగ విభాగం (థియేటర్ ఆఫ్ ఆర్ట్స్) సరిౖయెన ఆదరణకు నోచుకోక విలవిల్లాడుతోంది. నేడు ప్రపంచ నాటక రంగం 70వ వార్షికోత్సవం వేళ ఆ శాఖ గురించి, దాని పుట్టుక, ప్రగతి, ఎదుగుదల, తరుగుదల గురించి తెలుసుకోవడం ప్రతీ తెలుగువాడి విధి.
ఉభయ రాష్ట్రాలలో ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మా నియా యూనివర్సిటీ, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలలో నాటకరంగ విభాగాలు పనిచేస్తు న్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే ఆంధ్రా యూని వర్సిటీలోని విభాగం చాలా వెనుకబడి ఉందనే చెప్పాలి. పూర్తి స్థాయిలో పనిచేసే విభాగాధిపతిగానీ, అధ్యాపకులుగానీ లేరు. పనిచేస్తున్న అధ్యాపకులం దరూ కాంట్రాక్టు విధానంలోనే పనిచేస్తున్నారు. జాతి, సంస్కృతి, వారసత్వాలను తరతరాలకందించే వాహి నిగా పనిచేసేదిగా నాటక రంగ విభాగం ఉండాలి.
నాటకరంగ విభాగం లక్ష్యాలలో ముఖ్యమైనవి జాతి, సంస్కృతి, వారసత్వాలను సంరక్షించడం, సామాజిక సమస్యలను కళ ద్వారా వ్యక్తీకరించడం, సామాజిక రుగ్మతలపై కళారూపాల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడం. వీటితోపాటు నటన, దర్శ కత్వాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా ఔత్సాహిక, వృత్తి కళాకారులను తయారుచేయడం. పై లక్ష్యాల సాధనకు దృఢమైన నాటకరంగ విభాగం అవశ్యం. అధ్యాప కులు ఏ విభాగానికైనా వెన్నుముకలాంటి వారు. ప్రస్తుతం ఈ విభాగంలో నలుగురు అధ్యాపకులు 2002 సంవత్సరం నుంచి కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. ఈ నలుగురులో ఒకరు వచ్చే సెప్టెంబర్‌లో కాంట్రాక్టు అధ్యాపకునిగానే పదవీ విరమణ చేయబోతున్నారు. 2005వ సంవత్సరంలో వీరిని టీచింగ్ అసోసియేట్‌లుగా నామకరణం చేసారు.
శాశ్వత అధ్యాపకుడికి ఉండే అన్ని విద్యార్హతలు ఉండటం చేత చేసే పని కూడా శాశ్వత అధ్యాపకుడి గానే ఉంటుంది. కానీ ‘కాంట్రాక్టు కత్తి’ మెడమీద వేలా డుతూ ఉంటుంది. ఆ భ్రమను తొలగించడానికి అన్ని విభాగాలలో పనిచేసే అధ్యాపకులతోపాటు వీరిని ‘అసిస్టెంట్ ప్రొఫెసర్’ (కాంట్రాక్టు)లుగా మార్చారు. జీతం కొంచెం పెంచారు. జీతమైతే పెరిగింది కానీ వారి గీత మారలేదు. పదేళ్ల సర్వీసు నిండటంతో తమని శాశ్వత స్థానాలలో నియమించమని అనేక విజ్ఞప్తులు చేసినా ఫలితం కనిపించక ఆ నలుగురిలో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి సర్వీ సును పరిగణనలోకి తీసుకొని ‘భారీ’గా ఉండే శాశ్వత పోస్టులలో వారిని నియమించాలని ఆర్డర్ వేసింది. (wp. No. 27706 of 2011) అయినా యూనివర్సిటీ అధికారులు ఏ చర్యలు తీసుకోలేరు సరికదా రిట్ అప్పీలు వెళ్లారు. ఇది ఇలా ఉండగా యూనివర్సిటీకి ఉన్నత విద్యాశాఖ నుంచి ఒక లేఖ చేరింది. దాని సారాంశం ఆ ముగ్గురిని రెగ్యులర్ పోస్టుల ఖాళీలలో శాశ్వత పద్ధతిపై నియమించాలని.. దాన్ని కూడా యూనివర్సిటీ పెడచెవిన పెట్టింది.
ప్రభుత్వ ఉద్యోగాలలో సమానత్వాన్ని పాటించ మని 16వ అధికరణ చెబుతోంది. ఖాళీగా ఉన్న పోస్టు లలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తరగతులను నింపడానికి రాష్ట్ర ప్రభుత్వానికిగానీ దాని అంగానికి గానీ అధికారముండి కోర్టుకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు షెడ్యూల్డు కులానికి చెందినవారు కాగా మరొకరు వెనుకబడిన తరగతికి చెందినవారు. సమన్యాయం అటుంచి సామాజిక న్యాయం కూడా అందడం లేదని అధ్యాపకులు వాపోతున్నారు. ఇందులో ఏ ఒక్కరైనా అగ్రవర్ణానికి చెందిన వారుంటే ఇప్పటికే న్యాయం జరిగి ఉండేదని కొందరి అభిప్రాయం.
యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసు కొని సమస్యను పరిష్కరించకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండేదనే సామెతలా అధ్యాపకుల కష్టాలు కష్టాలుగానే మిగిలిపోతాయి. అటు ఉద్యోగ భద్రత లేదు. ఇటు వృత్తి సంతృప్తి లేకుండా పోయింది.
కొసమెరుపు: ఈ సంవత్సరం ప్రపంచ రంగస్థల దినోత్సవం ఇచ్చే సందేశం ‘‘ఎవరైతే కళను, దాని ప్రాముఖ్యతను, విలువను గుర్తిస్తారో వారు ప్రభు త్వాలకు, రాజకీయవేత్తలకు, సంస్థలకు ఈ సంబ రాలు ఒక పొలికేక’ అని గుర్తింప చేయాలి. – ఏసియా పసిఫిక్ గ్రూపు (UNESCU) (నేడు ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా)
వ్యాసకర్త
రిటైర్డ్ ఏయూ ప్రొఫెసర్,
కేపీ సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment