ఆధునికాంధ్ర కవుల్లో నిత్యనూతన మూర్తి డాక్టర్ సి. నారాయణరెడ్డి సంప్రదాయాన్ని జీర్ణించుకున్న అభ్యుదయ కవి, సినీ అభిమాన ప్రేక్షకుల గుండె తెర కవి సినారె. పద్యాన్ని హృదయంగా, గేయాన్ని శ్రవణపేయంగా, వచన కవిత్వంలో కూడా అంత్యప్రాసలను అలవోకగా ప్రయోగించి, పాఠకుల మన్ననలు అందుకున్న మేటి కవి. దాదాపు 70 కావ్యాలను, వేలాది సినీ గీతాలను రాశారు. ప్రామాణికమైన ‘ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయము–ప్రయోగములు’ అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. వేలాది సాహితీ ప్రసంగాలతో శ్రోత లను అలరించారు.
సింగిరెడ్డి నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల తాలూకా హను మాజిపేటలో 1931 జూలై 29వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదం డ్రులు బుచ్చమ్మ, మల్లారెడ్డి. సిరిసిల్ల, కరీంనగర్, హను మాజీపేటలో పాఠశాల విద్యాభ్యాసం సాగింది. 1963 నుండి ఉస్మానియా విశ్వవిద్యాల యంలో ఎంఏ, పీహెచ్‌డీ డిగ్రీలు పొంది రీడర్‌గా, ప్రొఫె సర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ సార్వ త్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా గణనీయమైన సేవలు అందించారు.
సాహిత్యం ద్వారా గ్లామర్ గడించిన వ్యక్తి సినారె. 1952 నుండి 2017లో మరణించే వరకు నిరంతరం రచనలు చేశారు. పాతకొత్తల మేలు కలయికల కవిత్వానికి అవసరమైన గురజాడ తత్వాన్ని, శ్రీశ్రీ అభ్యుదయ వారసత్వాన్ని జీర్ణిం చుకున్న కవి. కవితా ఉద్యమాలన్నింటినీ సమ ర్థించారు. పగలే వెన్నెల (చలనచిత్ర గీతాల సంకలనం)‘పాటలో ఏముంది – నా మాటలో ఏముంది’ సినిమా పాటల విశ్లేషణ, సినారె ఛలో క్తులు తన గ్రంథాలలో ప్రసిద్ధాలు.
ఆయన రచనలు ఎన్నో అవా ర్డులు గెలుచుకున్నాయి మంటలు– మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభిం చింది. రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, సోవియెట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, కుమారన్ ఆశాన్, భార తీయ భాషా పరిషత్తు, కలకత్తావారి భిల్వార అవార్డు మొదలైనవి ఆయన విశ్వంభర కావ్యానికి లభించాయి. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు 1988లో విశ్వంభరకు లభించడం ఆయన కవితా ప్రతిభకు శిఖర ప్రమాణం. తెలుగులో జ్ఞానపీఠ బహుమతిని అందుకున్న రెండోకవి సినారె. భారత ప్రభుత్వం 1992లో పద్మభూషణ్‌తో సత్క రించింది. భౌతికంగా దూరమైనా, తన రచనల ద్వారా సాహితీప్రియుల, సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవి.
-డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు.. మొబైల్ : 98491 77594
(జూన్ 12న సినారె నాలుగో వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment