c narayana reddy
-
నాతో ఆ పాట దగ్గరుండి రాయించుకున్నారు ఎన్టీఆర్ గారు
-
నన్ను ఎంతో ప్రేమగా పిలిచేవాడు..!
-
ప్రేమించాలని ఉన్నా ఆ యోగం నాకు దక్కలేదు
-
సత్వరం పోలవరం పూర్తిచేయడమే అజెండా
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు పోలవరం ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తి చేయడమే అజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని పీపీఏ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొంటారు. పీపీఏ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఏడాదికి రెండుసార్లు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలి. ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించి, సమస్యలను పరిష్కరించడం ద్వారా సత్వరమే పూర్తి చేయడానికి ఈ సమావేశాలు దోహదపడాలనేది కేంద్రం ఉద్దేశం. కానీ, ఏడాదిగా సర్వసభ్య సమావేశం నిర్వహించాలని కోరుతున్నా పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ స్పందించడం లేదు. ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ రాసిన లేఖకు ఎట్టకేలకు స్పందించిన అయ్యర్... పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తి చేయడం కోసం 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు సకాలంలో నిధులు విడుదల చేయాలని ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పనుంది. నిర్వాసితులకు పునరావాసం కింద చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో వారి ఖాతాల్లో జమ చేయాలని తాము చేసిన ప్రతిపాదనను అమల్లోకి తేవాలని కోరనుంది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, పనుల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ భవితవ్యం, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను పూడ్చే విధానాలను తక్షణమే తేల్చి... ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులపై చర్చించనుంది. ఈ సీజన్లో దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేయడంతోపాటు వరద ప్రారంభమయ్యేలోగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణాన్ని ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని అనుమతులు సత్వరమే వచ్చేలా చేయాలని డిమాండ్ చేయనుంది. -
ఎన్టీఆర్- ఏఎన్నార్ మధ్య విబేధాలు.. సీఎం చెప్పినా వినలేదట
ఎన్టీఆర్ - ఏఎన్నార్ తెలుగు సినిమాకి రెండు కళ్ల లాంటివారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.పౌరాణిక పాత్రలకి ఎన్టీఆర్ చెరగనా ముద్ర వేసుకుంటేప్రేమకథా చిత్రాల్లో తనకెవరూ సాటిలేరని ఏఎన్ఆర్ నిరూపించుకున్నారు.ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది.అంతేకాకుండా పోటీపడి మరీ ఒకేసారి సినిమాలను రిలీజ్ చేయించుకునేవారు. కలెక్షన్ల విషయంలోనూ వీరు ఎన్నో రికార్డులు తిరగరాశారు. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ ఎన్టీఆర్ - ఏఎన్నార్ మాత్రం 15 సినిమాల్లో కలిసి నటించారు. ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా అప్పట్లో మనస్పర్థలు వచ్చాయి. ఓసారి తన సినిమాలో కృష్ణుడి వేషాన్ని వేయాల్సిందిగా ఏఎన్నార్‌ను ఎన్టీఆర్ కోరారట. దీనికి ఆ ఒక్కమాట మాత్రం అడగకండి మహానుభావా అంటూ ఏఎన్నార్ సున్నితంగా తిరస్కరించారట. అప్పటి సీఎం జలగం వెంగళరావుతోనూ ఎన్టీఆర్ రికమెండ్ చేయించినా ఏఎన్నార్ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని చెబుతుంటారు. దీంతో వీళ్లిద్దరు అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారట. ఇక ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య అభిప్రాయబేధాలపై ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఎన్టీఆర్ గులేబకావళి అనే సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. అయితే తన మొదటి సినిమా కావడంతో మొత్తం అన్ని పాటలకు రాసే అవకాశం ఇస్తేనే రాస్తాను అని కండీషన్ పెట్టాను. దీంతో ఎన్టీఆర్ ఒప్పుకొని మొత్తం 10 పాటలకు అవకాశం కల్పించారు. ఇదే క్రమంలో ఏఎన్నార్ హీరోగా 'ఇద్దరు మిత్రులు' సినిమాలో ఓ పాట రాసేందుకు అవకాశం వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ దిక్కుపాటి మధుసూదన్ రావు ఓసారి ఫోన్ చేసి అడగ్గా.. నేను సున్నితంగా తిరస్కరించాను. ఒకవేళ మీకు రాసిన మొదట విడుదలైతే, ఆ ప్రత్యేకత, క్రెడిట్ మీకే దక్కుతుంది. అప్పుడు నా మొదటి సినిమాకే మొత్తం పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు ఆ క్రెడిట్ రాదు అని చెప్పి సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. కానీ తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్-ఏఎన్నార్‌కి మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సమయంలోనూ ఇద్దరికీ పాటలు రాశాను' అంటూ చెప్పుకొచ్చారు. -
విశ్వసాహితీ మూర్తి సినారె
సాక్షి, హైదరాబాద్: తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తుంచుకునే మహాకవి, తెలుగు కీర్తి, విశ్వ సాహితీమూర్తి సి.నారాయణరెడ్డి చిరస్మరణీయుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, సినిమా సాహిత్యానికి సైతం గౌరవం తెచ్చి పెట్టారన్నారు. సుశీల నారాయణరెడ్డి ట్రస్టు రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించిన సి.నారాయణరెడ్డి 91వ జయంత్యుత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పుర స్కారాన్ని ప్రముఖ ఒడియా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్‌కు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సినారె కవిత్వం, సాహిత్యం ఎప్పుడూ మానవ జీవనం, తత్వం, ప్రకృతిని ప్రేమించడం వంటి అంశాల చుట్టూనే సాగిందన్నారు. ఆలోచనాత్మక కావ్యం విశ్వంభర ఆయనను విశ్వసాహితీ పీఠంపై నిలబెట్టిందని అభినందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలు గు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా, ప్రభుత్వ భాషా సంస్కృతుల సలహాదారుగా.. ఆయన తన ప్రతి పదవికీ వన్నె తీసు కొచ్చారని గుర్తుచేశారు. సినారె తెలుగుదనానికి నిలువెత్తు సంతకమన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ప్రవేశపెట్టిన బిల్లుల్లో మాతృభాష బిల్లు ప్రధానమైందన్నారు. ఉన్నత విద్యవరకు మాతృభాష ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయాలని పట్టుబట్టారని, నూత న జాతీయ విద్యావిధానం మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యం ఆయన ఆకాంక్షించిందేనని చెప్పారు. ప్రతిభారాయ్ మాట్లాడుతూ, సినారె పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమ ప్రారంభంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి బృందం ప్రదర్శించిన నృత్య రూపకాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ కార్యదర్శి జె.చెన్నయ్య, రచయిత్రి ఓల్గా, సినారె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం!
‘‘ఆమె పతివ్రత, పవిత్రమైనది. ఆమె చెడిపోయింది... ఇలా చెప్పే శాస్త్రాలు పవిత్రులైన, అపవిత్రులైన పురుషుల గురించి ఎందుకు మాట్లాడవు? పురుషుల మనసులు బంగారంతో తయారయ్యాయా? పాపం వారిని తాకదా? శాస్త్రాలు స్త్రీల పాపాల్నే చిత్రించాయా?’’ అని మహాభారతంలో ద్రౌపది ప్రశ్నించినట్లు రచించిన ప్రతిభా రాయ్ తన ప్రశ్న ద్వారా ఆధునిక సమాజంలో కూడా స్త్రీ, పురుషులు అవలంబించాల్సిన విలువలపై కొనసాగుతున్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించారు. ఒడియాలో ఆధునిక సాహిత్యానికి రూపురేఖలు దిద్దిన ప్రతిభా రాయ్ రచనల్లో ‘యాజ్ఞసేని’ పురుషాధిక్య సమాజం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన గొప్ప నవల. ఈ నవలలో ద్రౌపది శ్రీకృష్ణుడికి రాసిన లేఖల్లో తన బాధలు, వేదనలు, పడిన హింస, త్యాగాలు, విశ్వాసాలు, ఆకాంక్షలు, నిస్పృహలను పంచుకుంటుంది. 1944 జనవరి 15న జగత్ సింగ్ పూర్ జిల్లాలోని అలబేలా కుగ్రామంలో జన్మించిన ప్రతిభా రాయ్ ఉన్నత విద్యాధికురాలు. ఒడిషాలోని బోండో జాతిపై పోస్ట్ డాక్టొరల్ పరిశోధన చేశారు. ఒక స్కూలు టీచర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఒడిషాలోని వివిధ ప్రభుత్వ కళా శాలల్లో 30 ఏళ్ల పాటు బోధన చేశారు. తన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ, మూర్తి దేవి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు. సాహిత్యంలో అత్యుత్తమమైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న ఘనత అమెది. ఆధునికానంతర ఒడియా సాహిత్యంలో కథా కథన శిల్పంలో చేయితిరిగిన రచయిత్రి ఆమె. సమానత్వం, ప్రేమ, శాంతి, సమైక్యత అడుగడుగునా ఆమె రచనల్లో గోచరిస్తాయి. కుల, మత, లింగ వివక్షలు ఎక్కడా కన పడవు. సామాజిక న్యాయం కోసం పోరాడుతూ సమ కాలీన సామాజిక సమస్యలపై ఆమె చేసిన రచనలు అనేక సామాజిక సంస్కరణలకు దారితీశాయి. బర్సా బసంత బైశాఖ, పరిచయ, పుణ్యతోయ, అసబరి, నీలా తృష్ణ, శిలాపద్మ, ఉత్తర మార్గ, ఆదిభూమి, మహా మోహ, మగ్నమతి, మహారాణి పుత్ర వంటి నవలలతో ఆమె జన హృదయాల చేరువలోకి వెళ్లారు. అంతేగాక ఆమె దాదాపు 260 కథల్ని రచించారు. అవి 20 సంకలనాలుగా వెలువడ్డాయి. మధ్యతరగతి జీవితాలు, దాని సమస్యలు, వ్యక్తుల మనస్తత్వాలు, సామాజిక, రాజకీయ వ్యవస్థల స్థితిగతులు ఆమె కథల్లో ప్రతిబింబిస్తాయి. ప్రజల నమ్మకాలు, ఆచారాలు, వారి యాసలు, భాషలు, ప్రేమలు, పరిణయాలు, గ్రామీణ జీవన సౌందర్యం ఆమె రచనల్లో మనకు గోచరిస్తాయి. వీటన్నిటి మధ్యా ప్రతిభా రాయ్ తాత్విక దృక్పథం, బలమైన స్త్రీవాద చిత్తశుద్ధి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సానుభూతితో అర్థం చేసుకోవడం కనిపిస్తుంది. ‘బర్సా బసంత బైశాఖ’ ఆమె తొలి నవల. శృంగా రాన్ని, ప్రేమను మార్కెట్లో వాణిజ్య వస్తువులుగా చూసే సమాజం పట్ల నిరసన వ్యక్తం చేసిన కళాత్మక రచన ఇది. రెండో నవల ‘పరిచయ’లో గ్రామీణ, పట్టణ జీవన శైలుల మధ్య సంఘర్షణను చిత్రించారు. యాజ్ఞసేని, శిలా పద్మ, ఉత్తర మార్గ, ఆదిభూమి నవలల్లో మానవ జాతి పరిణామం; స్త్రీలు, వారి సామాజిక అంశాలను స్పృశిం చారు. పురుష పాత్రల కంటే మహిళా పాత్రలు ఈ నవల్లో ఆధిపత్య పాత్రలుగా వ్యవహరిస్తాయి. ‘ఉత్తర మార్గ’ ఒక జాతీయవాద చారిత్రక నవల. ఆదిభూమి, మహామోహ, మగ్నమతి, మహారాణి పుత్ర అన్న నాలుగు నవలలను ఒడియా సాహిత్యంలో మహా నవలలుగా పరిగణిస్తారు. వచనంలో కావ్యాలు రాయడంలో ఆమెను మించిన వారు లేరని రాయ్ ఈ నవలల ద్వారా నిరూపించుకున్నారు. చారిత్రక వాస్తవాలను ఈ నవలలు మనముందుంచుతాయి. ‘ఆది భూమి’ కొద్దిగా భిన్నమైన నవల. ఆదిమ జాతి గిరిజనులైన బోండా జీవన శైలిని, కర్మకాండను ఈ నవలలో చిత్రించారు. ‘మహామోహ’ భారతీయ సాహిత్యంలోనే ఒక చెప్పు కోదగ్గ తాత్విక, కళాత్మక నవల. ఆధునికానంతర స్త్రీవాద ధోరణికి ఈ నవల అద్దంపడుతుంది. ఒక స్త్రీమూర్తి పూర్తి రూపాన్ని ఈ నవల బహిర్గతం చేస్తుంది. ‘మహారాణి పుత్ర’ ఒక ఆసక్తికరమైన చారిత్రక నవల. చరిత్రలోని ఘటనలను ఆమె నాటకీయంగా, మానవ సంఘర్షణలో భాగంగా చిత్రించారు. కియోంజార్ వలసవాద చరిత్రలో ప్రజా విప్లవం ఈ నవలలో మనకు ఆవిష్కృతమవుతుంది. 1979లో ఒడిషాలో బీభత్సం సృష్టించిన తుఫానుపై ఆమె ‘మగ్నమతి’ రాశారు. ఒక ప్రకృతి వైపరీత్యం బీభత్సం మాత్రమే కాదు, భూమాత ఆవేదన, సర్వ మానవ సౌభ్రాతృత్వం ఈ నవల ద్వారా చిత్రించారు. స్వతంత్ర భారతంలో జరిగిన పరిణామాలు, ప్రపంచీ కరణ ఫలితాలు కళాత్మకంగా ప్రదర్శించారు. సామాజిక, రాజకీయ అంశాలపై రచించిన ‘ఉత్తర మార్గ’ కూడా ఒక జాతీయవాద నవలే. సి. నారాయణ రెడ్డి ఆధునిక తెలుగు కవిత్వాన్ని కొన్ని దశాబ్దాల పాటు నిర్దేశించారు. సినారె, ప్రతిభా రాయ్ ఇద్దరూ అధ్యాపక రంగం నుంచి వచ్చిన వారే. ఇద్దరి సాహిత్య ప్రక్రియలు వేరైనా, తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని తెచ్చేందుకు ప్రయత్నించిన వారే. సినారెకు పద్మశ్రీ పురస్కారం 1972లోనూ, పద్మభూషణ్ 1992లోను లభించగా, ప్రతిభా రాయ్‌కి పద్మశ్రీ 2007 లోనూ, పద్మభూషణ్ 2022లోనూ లభించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అటువంటి రచయిత్రికి మహా రచయితా, కవీ, విద్యాధికుడూ, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతా అయిన డాక్టర్ సి. నారాయణరెడ్డి (సినారె) జన్మదినం నాడు... ఆయన పేర నెలకొల్పిన జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయడం తెలుగు జాతికి గర్వకారణం. - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు (జూలై 29న ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్‌కు సినారె జాతీయ పురస్కార ప్రదానం) -
సమాంతర కాలువతోనే ప్రయోజనం
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 30 నుంచి 50 టీఎంసీల సామర్థ్యంతో కర్ణాటక ప్రతిపాదించిన నవలి రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకరించే ప్రశ్నేలేదని ఏపీ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు మరోసారి తేల్చిచెప్పింది. హెచ్చెల్సీ (ఎగువ కాలువ)కి సమాంతరంగా రోజుకు 2 టీఎంసీలు తరలించేలా కాలువ తవ్వి.. వరద రోజుల్లో నీటిని తరలిస్తే.. తుంగభద్ర డ్యామ్‌లో నిల్వచేసిన నీటితో మిగతా ఆయకట్టుకు నీళ్లందించవచ్చునని సూచించింది. సమాంతర కాలువతో ఏపీతోపాటు కర్ణాటక, తెలంగాణకూ ప్రయోజనం ఉంటుందని వివరించింది. దీంతో.. సమాంతర కాలువ, నవలి రిజర్వాయర్‌పై సమగ్ర అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుందామని తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే చెప్పారు. ఈయన అధ్యక్షతన గురువారం తుంగభద్ర బోర్డు సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఏపీ తరఫున ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ తరఫున ఈఎన్సీ మురళీధర్, కర్ణాటక తరఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి కృష్ణమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నవలితో ప్రయోజనాలకు విఘాతం తుంగభద్ర డ్యామ్‌లో పూడిక పేరుకుపోయిన నేపథ్యంలో నీటినిల్వ సామర్థ్యం 100 టీఎంసీలకు తగ్గిందని.. దాంతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీలను వాడుకోలేకపోతున్నామని కర్ణాటక అధికారులు చెప్పారు. నీటినిల్వ సామర్థ్యం తగ్గిన మేరకు నవలి వద్ద కొత్త రిజర్వాయర్‌ను నిర్మించి.. నిల్వ చేద్దామని.. దీనివల్ల ఆయకట్టుకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చునని ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికయ్యే రూ.పది వేల కోట్ల వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా మూడు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో భరించాలని కోరారు. దీనిపై ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నవలి రిజర్వాయర్వల్ల తమ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. నవలికి బదులుగా హెచ్చెల్సీకి సమాంతర కాలువ తవ్వడానికి అనుమతివ్వాలని నారాయణరెడ్డి కోరారు. డిస్ట్రిబ్యూటరీల ద్వారానే తాగునీరు హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ప్రధాన కాలువలపై తాగునీటి పథకాలను ఏర్పాటుచేయడానికి అనుమతివ్వాలని కర్ణాటక అధికారులు చేసిన ప్రతిపాదనపై ఏపీ ఈఎన్సీ సి. నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందన్నారు. డిస్ట్రిబ్యూటరీలపై తాగునీటి పథకాలు ఏర్పాటుచేసుకుని.. వాడుకున్న నీటిని కర్ణాటక కోటాలో కలపాలని సూచించారు. ఇందుకు తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే సానుకూలంగా స్పందించారు. మరోవైపు.. తుంగభద్ర బోర్డు నిర్వహణ వ్యయాన్ని భరించకుండా.. సిబ్బందిని సమకూర్చని తెలంగాణకు బోర్డులో ఎలా సభ్యత్వం ఇస్తారని నారాయణరెడ్డి బోర్డు చైర్మన్‌ను నిలదీశారు. నిర్వహణ వ్యయం, సిబ్బందిని సమకూర్చడంపై తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలంగాణ ఈఎన్సీ చెప్పారు. ఇక హోస్పేట్ పరిసరాల్లో బోర్డుకు చెందిన 70 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని కర్ణాటక అధికారులు కోరడంపై ఏపీ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. బోర్డు భూములు మూడు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులని.. వాటిని కర్ణాటకకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై బోర్డు చైర్మన్ రాయ్‌పురే స్పందిస్తూ.. ఉమ్మడి ఆస్తులను ఏ రాష్ట్రానికీ ఇచ్చే ప్రశ్నేలేదని స్పష్టంచేశారు. -
పులిచింతల: బ్యారెజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు: నారాయణ రెడ్డి
సాక్షి, విజయవాడ: పులిచింతల ప్రాజెక్టు16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యలు తలెత్తి విరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ చీఫ్ నారాయణ రెడ్డ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాత్రి 3:30 సమయంలో గేట్లు ఎత్తుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మెయిన్ గడ్డర్ విరిగిపోవడంతో.. సపోర్ట్ రోప్ థ్రెడ్లు తెగిపోయి గేటు నదిలో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది’’ అని తెలిపారు. ‘‘పైనుంచి వరద నీటిని కిందికి వదిలెందుకు రాత్రి గేట్లను ఎత్తారు. ఒకే గేటు గుండా నీరు వెళ్తుండడంతో ఒత్తిడిని తగ్గించేందుకు క్రమక్రమంగా మొత్తం గేట్లను ఎత్తడం జరిగింది. ప్రభుత్వం, ఏజన్సీలు బ్యారేజ్ నిర్వహణను పట్టించుకోవట్లేదనేది అవాస్తవం. మిగిలిన గడ్డర్లు, గేట్ల పరిస్థితిని చెక్ చేస్తున్నాం. బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు. రేపటిలోగా సమస్య పరిష్కారం అవుతుంది’’ అన్నారు. -
తెలుగు సాహిత్య శిఖరం సినారె
సుల్తాన్‌బజార్: జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలుగు సాహిత్య శిఖరమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన డాక్టర్ సి.నారాయణరెడ్డి 90వ జయంతి ఉత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభలో మామూలుగా సభ్యులెవరైనా 100 ప్రశ్నలు వేస్తే గొప్ప అని, కానీ సినారె నామినేటెడ్ సభ్యులుగా ఉన్న సమయంలో తమ పదవీ కాలంలో 624 ప్రశ్నలు వేశారని వెల్లడించారు. ఈరోజు రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినందుకు ఎక్కువగా చర్చిస్తున్నారని, కానీ సినారె 1960లోనే రామప్ప పేరుతో అద్భుతమైన రూపకం రాశారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. పరిషత్తులోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి సినీగీత సర్వస్వం 7వ సంపుటిని మంత్రి నిరంజన్‌రెడ్డి, మొత్తం 7 పాటల వివరాలతో కూడిన అనుక్రమణికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. పరిషత్తులో నెలకొల్పడానికి రూపొందించిన సినారె నిలువెత్తు తైలవర్ణ చిత్రాన్ని శాంతా బయోటెక్స్ అధినేత డాక్టర్ ఐ.వరప్రసాదరెడ్డి ఆవిష్కరించి, చిత్రకారుడు జె.వి.ని సత్కరించారు. పరిషత్తు ఏటా అందజేస్తున్న సి.నారాయణరెడ్డి సాహితీ పురస్కారాన్ని ఈసారి సిరిసిల్లకు చెందిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథంకు ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.25 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ సినారె పరిషత్తుకు 25 సంవత్సరాలు అధ్యక్షులుగా వ్యవహరించి సర్వాంగీణ వికాసానికి కృషి చేశారన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ, సినారె, తాను అశోక్‌నగర్‌లో ఉన్నప్పుడు కలిసి ఇందిరాపార్కులో నడకకు వెళ్లేవారమని, వారు రాసిన అనేక కవితలకు తొలి శ్రోతగా ఉండే అవకాశం కలిగిందన్నారు. సీఎంవో ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ సినారె కవితలను, సినీగీతాలను ఆలపించారు. కోశాధికారి మంత్రి రామారావు, సినారె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
తెలంగాణ.. 24 అక్రమ ప్రాజెక్టులు !
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన 24 ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. ఇందులో 15 మధ్య, భారీ తరహా ప్రాజెక్టులని, తొమ్మిది చిన్నతరహా ప్రాజెక్టులని వివరించింది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోకుండా.. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే ఆరింటిని పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందిస్తోందని, మరో రెండు ప్రాజెక్టుల పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నదని ఎత్తి చూపింది. కాగా, మరో ఏడు ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని, ఇంకో తొమ్మిది ప్రాజెక్టులను త్వరలోనే చేపడుతున్నట్లు తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను తక్షణమే ఆపేసేలా తెలంగాణను ఆదేశించాలని బోర్డును కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి మంగళవారం లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా బేసిన్లో ఇరు రాష్ట్రాలు కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం)కు పంపాలని గుర్తు చేశారు. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చాక.. వాటిని అపెక్స్ కౌన్సిల్ ముందు పెట్టాలని వివరించారు. ఇందుకు విరుద్ధంగా తెలంగాణ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించకుండానే.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 24 ప్రాజెక్టులు చేపట్టిందని.. ఇది ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమ ప్రాజెక్టులను ఆపేసేలా తెలంగాణను ఆదేశించి.. దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలను పరిరక్షించాలని కృష్ణా బోర్డును కోరారు. అక్రమ నీటి వినియోగాన్ని అడ్డుకోండి కృష్ణా నదీ జలాలను చిన్న నీటివనరుల విభాగంలో కేటాయింపుల కంటే అదనంగా 86.39 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటున్న తెలంగాణ సర్కార్‌పై చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. అక్రమంగా నీటిని వాడుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి మంగళవారం లేఖ రాశారు. ► కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో చిన్న నీటివనరుల విభాగంలో 5,57,104 ఎకరాల ఆయకట్టుకు 89.15 టీఎంసీలను మాత్రమే తెలంగాణకు కేటాయించింది. ► 2014 నుంచి 2021 మధ్య కృష్ణా బేసిన్లో 16,163 చెరువులను పునరుద్ధరించడం తోపాటు కొత్తగా 24 చెరువులు, చెక్ డ్యామ్‌లు నిర్మించి తద్వారా చిన్న నీటివనరుల విభాగంలో 10,77,034 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.6,243 కోట్లతో చేపటినట్లు తెలంగాణ సర్కార్ జారీ చేసిన 474 జీవోలో పేర్కొంది. ఈ ఆయకట్టుకు నీళ్లందించడానికి 175.54 టీఎంసీలను తెలంగాణ వాడుకుంటోంది. ► అంటే.. కేటాయించిన నీటి కంటే అదనంగా 86.39 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకోకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి. -
బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె
ఆధునికాంధ్ర కవుల్లో నిత్యనూతన మూర్తి డాక్టర్ సి. నారాయణరెడ్డి సంప్రదాయాన్ని జీర్ణించుకున్న అభ్యుదయ కవి, సినీ అభిమాన ప్రేక్షకుల గుండె తెర కవి సినారె. పద్యాన్ని హృదయంగా, గేయాన్ని శ్రవణపేయంగా, వచన కవిత్వంలో కూడా అంత్యప్రాసలను అలవోకగా ప్రయోగించి, పాఠకుల మన్ననలు అందుకున్న మేటి కవి. దాదాపు 70 కావ్యాలను, వేలాది సినీ గీతాలను రాశారు. ప్రామాణికమైన ‘ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయము–ప్రయోగములు’ అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. వేలాది సాహితీ ప్రసంగాలతో శ్రోత లను అలరించారు. సింగిరెడ్డి నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల తాలూకా హను మాజిపేటలో 1931 జూలై 29వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదం డ్రులు బుచ్చమ్మ, మల్లారెడ్డి. సిరిసిల్ల, కరీంనగర్, హను మాజీపేటలో పాఠశాల విద్యాభ్యాసం సాగింది. 1963 నుండి ఉస్మానియా విశ్వవిద్యాల యంలో ఎంఏ, పీహెచ్డీ డిగ్రీలు పొంది రీడర్‌గా, ప్రొఫె సర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ సార్వ త్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా గణనీయమైన సేవలు అందించారు. సాహిత్యం ద్వారా గ్లామర్ గడించిన వ్యక్తి సినారె. 1952 నుండి 2017లో మరణించే వరకు నిరంతరం రచనలు చేశారు. పాతకొత్తల మేలు కలయికల కవిత్వానికి అవసరమైన గురజాడ తత్వాన్ని, శ్రీశ్రీ అభ్యుదయ వారసత్వాన్ని జీర్ణిం చుకున్న కవి. కవితా ఉద్యమాలన్నింటినీ సమ ర్థించారు. పగలే వెన్నెల (చలనచిత్ర గీతాల సంకలనం)‘పాటలో ఏముంది – నా మాటలో ఏముంది’ సినిమా పాటల విశ్లేషణ, సినారె ఛలో క్తులు తన గ్రంథాలలో ప్రసిద్ధాలు. ఆయన రచనలు ఎన్నో అవా ర్డులు గెలుచుకున్నాయి మంటలు– మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభిం చింది. రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, సోవియెట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, కుమారన్ ఆశాన్, భార తీయ భాషా పరిషత్తు, కలకత్తావారి భిల్వార అవార్డు మొదలైనవి ఆయన విశ్వంభర కావ్యానికి లభించాయి. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు 1988లో విశ్వంభరకు లభించడం ఆయన కవితా ప్రతిభకు శిఖర ప్రమాణం. తెలుగులో జ్ఞానపీఠ బహుమతిని అందుకున్న రెండోకవి సినారె. భారత ప్రభుత్వం 1992లో పద్మభూషణ్‌తో సత్క రించింది. భౌతికంగా దూరమైనా, తన రచనల ద్వారా సాహితీప్రియుల, సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవి. -డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు.. మొబైల్ : 98491 77594 (జూన్ 12న సినారె నాలుగో వర్ధంతి) చదవండి: చరిత్రగా మిగిలిపోనున్న వరంగల్ జైలు -
మనసు పలికే మౌనగీతం
మహోదయా! ‘ప్రణవ నాదమే ప్రాణము కాగా’, ‘శివరంజని పల్లవి శింజనీ రవళిని’ పద కవితా ప్రబంధాలుగా జాలువార్చిన కలం మీది. ప్రతి పాటలో ‘రాజహంస అడుగులున్న’ట్లు, ప్రస్ఫుటించిన మీ కవితా రూపానికి మాతృక ఏదో ‘అదే అదే నాకు అంతు తెలియకున్నది’. ‘వేల తారకల బృందములో వెలిగే చందురుడొకడే’ యన్నట్టు, ‘వలపుల సాంబ్రాణి’ని దట్టించిన మీ పదగుంఫన, తెలుగు సినిమా సాహిత్యపు నిలువెత్తు యవనికపై ‘సినారె’ యన్న మూడక్షరాలు ‘పదము – పల్లవి – పాట’ ఈ మూడింటి జీవనాడిగా మెరుస్తున్నాయి నేటికీ. మీ పల్లవుల జల్లులు మా తెలుగు లోగిళ్ళ ముంగిట వేసిన ‘ముత్యాల ముగ్గులై’ గలగలా నవ్వుతున్నాయి. ఇంకా ‘ఏదో ఏదో చెప్పాలనీ మనసంతా విప్పాలనీ’ గుండె కొట్టుకొంటున్నది. రెండు పద్యాలతో మీకు నివాళి. ప్రాసల రాయుడేగె, రసబంధుర భావ మహత్వ కావ్య సంభాసిత మొప్ప; నాకమున భాగ్య మహోదయ దివ్య దీధితుల్ వాసిల, నాంధ్ర భోజుడయి వందితుడౌగద; దేవభాషకున్ శ్వాసయు నాసగాగ , నిజ శాసన కర్తగ వన్నె దిద్దగన్ మరణమ? కాదుకాదు, రసమాతృక లన్నియు భాగ్య మూర్తులై; తరణము సేయుచున్నవిట, తారల పంక్తుల దాపుజేరి, యా వరణము వోలె నిల్చినవి; వాక్య కవిత్వ మహత్వ రాశియౌ కరణము సింగిరెడ్డి; నవకావ్యము గూర్చగ నింద్ర సన్నిధిన్ -ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి -
సకలావనికే కల్పవల్లి...
మాతృదేవత చిత్రంలోని ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ/త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ ’ అనే పాట అంటే చాలా ఇష్టం. ఈ చిత్రానికి అమ్మ (సావిత్రి) దర్శకత్వం వహించింది. ఈ పాటలో స్త్రీశక్తి ప్రతిబింబింబిస్తుంది. మహిళ గొప్పదనాన్ని డా. సి. నారాయణరెడ్డి ఎంతో ఉదాత్తమై పదాలతో ఈ పాటలో చూపారు. అందమైన పదాలు ఉపయోగించారు. పాటలోని పదాలు వింటుంటేనే నాట్యం చేయాలనిపించేలా లయబద్ధంగా ఉంటాయి. పాటలో ‘మాత్రల’ (సిలబుల్స్) ను అలా పరుగులు పెట్టించారు ఆయన. నా చిన్నప్పుడు ఈ పాటకు డాన్స్ చేసేదాన్ని. అమ్మ మురిసిపోయేది. అనురాగాన్ని పంచడంలోను, అవసరమైతే త్యాగం చేయడంలోనూ మహిళలే ముందు ఉంటారు... అని స్త్రీ ఔన్నత్యాన్ని చూపారు పల్లవిలో. మొదటి చరణంలో స్త్రీ గురించి చాలా సామాన్యంగా చెప్పారు. అంటే ఆమె ఒక సామాన్యురాలిగా ఎలా ఉంటుందో వివరించారు. ‘ఒక అన్నకు ముద్దుల చెల్లి/ ఒక ప్రియునికి వలపుల మల్లి/ఒక రామయ్యనే కన్నతల్లి/ సకలావనికే కల్పవల్లి’ అంటూ స్త్రీ అంటే చెల్లి, చెలి అంటూనే, ఒక తల్లి అని సామాన్యంగా చెప్పకుండా ‘రామయ్యనే కన్న తల్లి’ అన్నారు. సకల భూప్రపంచానికే కల్పవృక్షం వంటిది అని స్త్రీ ఔన్నత్యాన్ని శిఖరాయమానంగా చూపారుు సినారె. ‘దేశానికి ప్రధాని అయినా ఒక కన్నతల్లి బిడ్డే’ అనే మాట వాడుకలో ఉంది. ఇక్కడ ఆ మాట గుర్తుకు వస్తుంది. రెండవ చరణంలో... సీతగా ధరణి జాతగా సహన శీలం చాటినది/రాధగా మధురబాధగా ప్రణయగాథల మీటినది/మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది/లక్ష్మిగా ఝాన్సిలక్ష్మిగా సమర రంగాన దూకినది’ అంటూ స్త్రీ ఏయే రంగాలలో, ఏయే సందర్భాలలో ఎంత నిబ్బరంగా, ఎంత సహనంగా, ఎంత ప్రణయంగా, ఎంత వీరత్వంతో పోరాడిందో.. అంతా కళ్లకు బొమ్మ కట్టినట్లు చూపారు. ఆమె సహనం గురించి, ఆమె ప్రణయం గురించి మధురంగా వివరించారు. సహనానికి మారుపేరు సీత. అనురాగానికి మారు పేరు రాధ, తెలుగులో రామాయణం రాసిన మహిళ మొల్ల. కదన రంగంలో కత్తి దూసింది ఝాన్సీరాణి. ఇంతమంది మహిళలను గమనిస్తే, ఎవరి కోణం వారిదే. ఒక పక్క కవిత్వం రాయగలదు, మరోపక్క కదనరంగంలోకి ఉరకగలదు... అని స్త్రీలోని వివిధ పార్శా్వలు చూపారు. మూడవ చరణంలోకి ప్రవేశించేసరికి మహిళను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లారు. ముందు రెండు చరణాలకి మూడో చరణానికి ఎంతో తేడా ఉంటుంది. ‘తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాల సరులు/కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు’ అంటూ స్త్రీ గొప్పతనాన్ని వివరించిన ఒక్కో పదం వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఈ చరణంలో ఆడవారి అనురాగాన్ని హృదయానికి హత్తుకునేలా వర్ణించారు. స్త్రీలో సహనంతో పాటు శక్తి కూడా సమానంగా ఉంటుంది. బలం ఉండటం స్త్రీకి చాలా అవసరం. అవసరం ఏర్పడినప్పుడు తనకు తానుగా శారీరక బలం తెచ్చుకోగలదు స్త్రీ. ఆవిడ అబల కాదు సబల అని నిరూపించగలదు. సమస్యలను తట్టుకునే శక్తి కూడా మహిళలకే ఉంటుంది.... అనే అర్థం ఈ పాటలో చెప్పారు. ‘కన్న కడుపున చిచ్చు రగిలెనా కరవులపాలౌను దేశం / తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం’ ... తల్లి మనసుకి కష్టం కలిగించితే దేశమే సర్వనాశనమవుతుంది, ఆవిడను మించిన దైవమే లేదంటూ ఈ పాటను ముగించారు సినారె. మొదటి చరణం చాలా సింపుల్‌గా ప్రారంభమై, రెండవ చరణంలో జనరలైజ్ చేసి, క్రమేపీ మూడవ చరణంలోకి వచ్చేసరికి స్త్రీశక్తిని చూపారు. మహిళా శక్తిని ఈ పాటలో చూపినంతగా మరే పాటలోనూ వేరే ఏ రచయితా చూపలేదేమో అనిపిస్తుంది నాకు.ఈ పాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్త్రీ ఔన్నత్యాన్ని పాట రూపంలో చెప్పడం చాలా బావుంది. ఈ పాటను పాఠ్యాంశంగా పెడితే బాగుంటుందనిపిస్తుంది. కవిత్వ పరంగా ఈ పాట మనసుకి హత్తుకుంటుంది. అమ్మ సినిమాలో ఈ పాట ఉండటం నాకు చాలా సంతోషం. ఈ పాట విన్నప్పుడల్లా ఆమ్మ అంతరంగం ఇదేనేమో అనిపిస్తుంది. చిత్రం : మాతృదేవత రచన : సి. నారాయణరెడ్డి సంగీతం : కె.వి.మహదేవన్ గానం : పి. సుశీల, వసంత సంభాషణ : వైజయంతి పురాణపండ -
నేడు మహాకవి 88వ జయంతి
మాత్రా సాహిత్యాన్ని స్పర్శించి, మానవ అభ్యుదయాన్ని కాంక్షించి, తెలుగు సాహితీ సుక్షేత్రం కావ్య కన్య స్వాభిమాన పరిరక్షణ కోసం ఏడు దశాబ్ధాల పాటు కలంమూయని కారణజన్ముడు. అఖిల ఆంధ్రావని కవి కోటి పారాయణరెడ్డి, ఆచార్య సి.నారాయణరెడ్డి. తన పాండిత్యం, సాహిత్యంతో పండిత పామరులందరికీ నిత్య స్మరణీయుడయ్యాడు. సమకాలీన సంఘటనలపై మానవీక స్పందనతో కవిత్వాన్ని అందించిన సినారె శబ్ధం మీద సాధికారతను సాధించి అర్థస్ఫూర్తితో నిరంతరం అభ్యుదయం, మానవీయ చింతన చేసిన మహాకవి సినారె. మహావక్తగా, మహాకవిగా సాహిత్యాభిమానుల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా.. సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్) : సినారెగా సుప్రసిద్ధుడైన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిది రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని హనుమాజీపేట. బుచ్చమ్మ, మల్లారెడ్డి తల్లిదండ్రులు. 1931 జూలై 29న జన్మించారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంతో పాటు సిరిసిల్ల,కరీంనగర్లో పూర్తి చేశారు. ఉన్నత విద్యాభ్యాసానికి హైదరాబాద్ వెళ్లారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసి అక్కడే అధ్యాపకుడిగా పనిచేశారు. కళాశాల విద్యార్థిగా ఉన్నపుడే శోభ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. పసి వయసులో విన్న హరికథలు, జానపదాలు, జంగం కథల స్ఫూర్తితో ఉన్నత స్థాయి సాహితీవేత్తగా ప్రఖ్యాతి చెందారు. 1953లో నవ్వనిపువ్వుతో ప్రారంభమైన సినారె సాహిత్య ప్రస్థానం అలుపెరగక సాగిపోయింది. పద్య కవితలు, గేయకావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సంగీత నృత్య రూపకాలు, ముక్తకాలు, బుర్ర కథలు, గజళ్లు, వ్యాసాలు విమర్శలు, అనువాదాలు వంటి అనేక సాహితీ ప్రక్రికయల్లో అనితర సాధ్యమైన ప్రతిభను చాటుకున్నారు. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి ఆకాశం, విశ్వంభర, మంటలు మానవుడు, మధ్య తరగతి మందహాసం, నడక నా తల్లి, తెలుగు గజళ్లు, భూమిక, ముఖాముఖి, ఆరోహణ, అక్షర గవాక్షాలు, ఇంటి పేరు చైతన్యం తదితర రచనలు చేశారు. సినారె రాసిని రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడింది. దీంతో పాటు ఆయన గ్రంథాలు ఇంగ్లిష్, ఫ్రెంచ్ సంస్కృతం, మలయాళం, హిందీ, ఉర్దూ కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో సందర్శించారు. అంతర్జాతీయ కవి సమ్మేళనాల్లో భారతీయ ప్రతినిధిగా హాజరై తెలుగు సాహిత్య వైభవాన్ని విశ్వయవనికపై చాటారు. ఆధునిక ఆంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు పేరిట సినారె పరిశోధన ఆయను పీహెచ్డీ ప్రామాణిక విమర్శన గ్రంథంగా మిగిలింది. అత్యున్నత పురస్కారాలు.. కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ ల్యాండ్ నెహ్రు పురస్కారంతో పాటు విశ్వంభర దీర్ఘ కావ్యానికి 1988లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారం వరించింది.భారతీయ భాషా పరిషత్, రాజలక్ష్మి, అసాన్, ఉమ్మడి రాష్ట్రంలో సాంస్కృతిక వ్యవహారాలు సలహాదారునిగా, సాంస్కృతిక మండలి, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట సాహిత్య పురస్కారం అందుకున్నారు. డాక్టర్ బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం స్వీకరించారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్నతమైన బాధ్యతలను నిర్వహించారు. భారత ప్రభుత్వం సినారె సేవలను గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలిచ్చింది. పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌తో గౌరవించాయి. సినిమా పాటలు కైకట్టి.. వందలాది సినిమాలకు వేల సంఖ్యలో సినీ గీతాలు రాశారు. స్వర్గీయ ఎన్టీఆర్ కథానాయకుడిగా విడుదలైన గులేబకావళి కథ సినిమాలో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాటతో సినీ రంగ ప్రవేశం చేసిన సినారె ఆపైన సుమారు మూడు వేలకు పైగా పాటలు రచించి సినిమా ప్రేక్షకులకు సైతం చేరువయ్యారు. చిలిపి కనుల తీయని చెలికాడా..అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి, నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు, జాతిని నీతిని నిలిపిన మహనీయులనే మరవొద్దు. అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అద్దమున్నదా.. కంటేనే అమ్మ అని అంటే ఎలా.. ఓ ముత్యాల కొమ్మా...ఓ రాములమ్మా.. తదితర తెలుగు సినిమా పాటలు సినారె ప్రతిభకు తార్కాణాలు. సినిమా పాటల్లో సైతం సాహిత్య విలువలకు పట్టం కట్టి తెలుగు సినీ సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు. రెండేళ్ల క్రితం జూన్ 17 హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్ను మూశారు. సాహిత్యంపై సమాలోచన సినారె జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఈ నెల 30న సాహిత్య సమాలోచన జరుపుతోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సినారె కేంద్ర గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, జూకంటి జగన్నాథం, కందేపి రాణీప్రసాద్, పెద్దింటి అశోక్ కుమార్, దూడం సంపత్ తదితరులు హాజరు అవుతున్నారు. సాహితీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని రచయితల సంఘం ప్రతినిదులు డాక్టర్ జనపాల శంకరయ్య, ఎలగొండ రవి తెలిపారు. -
సుబ్బారెడ్డి అంటే తెలంగాణవాడు కాదు!
సాహిత్య మరమరాలు ముప్పయ్యేళ్ల కిందటి మాట. మిత్రుడు కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవితాసంపుటి ‘గుండె కింద తడి’ (ఏప్రిల్ 1987) ఆవిష్కరణ సభ మహబూబ్‌నగర్‌లో జరిగింది. ఆవిష్కర్త డాక్టర్ సి.నారాయణరెడ్డి. వక్తలు కె.శివారెడ్డి, ఎం.కె.సుగమ్ బాబు. నిర్వాహకులు కాతోజు, వేణు సంకోజు. ఆ రోజు హైదరాబాదు నుంచి నారాయణరెడ్డిగారి కారులో ఆయనతో పాటు శివారెడ్డి, సుగమ్ బాబు, వెంకటేశ్వరరెడ్డి, నేనూ మహబూబ్‌నగర్ వెళ్లాం. ఆ రెండు గంటల ప్రయాణంలో సినారె ఎంత సరదాగా, ఎన్ని కబుర్లు చెప్పారో! ఆయన మిమిక్రీ కూడా చేస్తారని అప్పుడే నాకు తెలిసింది. వెంకటేశ్వరరెడ్డి తన పుస్తకాన్ని ఆ ఊరిలోని నటరాజ్ థియేటర్ యజమాని ఎన్.పి.సుబ్బారెడ్డికి అంకితమిచ్చాడు. సభానంతరం సుబ్బారెడ్డి తన థియేటర్ లోని ఒక గదిలో సినారె, శివారెడ్డి, సుగమ్ బాబులకు ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. మా భోజనాలయ్యాక వెంకటేశ్వరరెడ్డీ, నేనూ ఆ గది బయటే నిరీక్షిస్తూ నిలబడ్డాం. అప్పుడప్పుడు సుగమ్ బాబు సిగరెట్ తాగడానికి బయటికి వచ్చి, లోపలి విశేషాలు చెప్పి వెళ్లేవాడు. ‘మీరు ఈ ప్రాంతంవారు కావడానికి వీల్లేదే‘ అన్నారట నారాయణరెడ్డిగారు ఆ థియేటర్ యజమానితో. ‘ఎందుకు?’ అన్నాడట ఆయన. ‘సుబ్బారెడ్డి అనే పేరు తెలంగాణలో ఉండదు’ అన్నారట సినారె. అప్పుడాయన తను ఎక్కడి నుంచి వచ్చి మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డాడో చెప్పాడట. సుబ్బారెడ్డి, సుబ్బారావు, సుబ్బయ్య వంటి పేర్లు తెలంగాణలో ఉండవనే విషయం అప్పటిదాకా నాకు తెలీదు. రాత్రి దాదాపు పదకొండింటికి హైదరాబాదుకు తిరుగుప్రయాణం. వెంకటేశ్వరరెడ్డి నన్ను ఆ రాత్రికి అక్కడే ఉండిపొమ్మన్నాడు కాని నారాయణరెడ్డిగారు రమ్మనడంతో నేను కూడా బయలుదేరాను. (జూన్ 12న సినారె వర్ధంతి.) - గాలి నాసరరెడ్డి -
జడలోనా మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా
ఎంత సున్నితమైన గమనింపు చెప్పారన్నదాన్ని బట్టి కదా కవి గొప్పతనం తెలిసేది! సున్నితమైన సంవేదనలు కవిత్వానికి ప్రాణం పోస్తాయి. ఈ పాటకు సి.నారాయణరెడ్డి పోసినట్టు. ‘అక్బర్ సలీం అనార్కలి’ చిత్రం కోసం ఆయన రాసిన ‘సిపాయీ సిపాయీ హసీనా హసీనా’ పాట చూడండి. ‘నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ’ అని ఆమె అంటోంది. ‘నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా’ అని అతడు పాడుతున్నాడు. ఇంకా ముందుకు పోయి– ‘జడలోనా మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా చిరుగాలిలో కురులూగితే నీ చేయి సోకెనని అనుకున్నా’ అని ఆమె చెబుతోంది. దానికి అతడు ఎలా బదులిస్తున్నాడు? ‘ఆ మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే ఆ గాలిలో చెలరేగినవి నా నిట్టూరుపులే’ అంటున్నాడు. ‘తడి ఇసుకను గీసిన గీతలు అల తాకితే మాసి పోతాయి ఎదలోన వ్రాసిన లేఖలు బ్రతుకంతా వుండి పోతాయి’ అని కవి అన్నట్టుగానే శ్రోతల హృదయాల్లో నింపుకున్న ఈ పాట అలా ఉండిపోతుంది. దీనికి సంగీతం సి.రామచంద్ర. పాడినవారు మహమ్మద్ రఫీ, పి.సుశీల. 1979లో వచ్చిన చిత్రానికి దర్శకుడు ఎన్టీ రామారావు. సినారె దీనికి మాటలు కూడా రాయడం విశేషం. ఈ పాటలోని నటీనటులు దీప, బాలకృష్ణ. -
ఈ తేరు ఈతేరున బడి...
ప్రాస మాటలు పొదగడంలో సి.నారాయణరెడ్డిది అలవోక శైలి. వాటివల్ల ఆయన పాటలకు ప్రత్యేకమైన అందం వస్తుంది. అయితే అలాంటి ప్రాస ఆయన ఎవరి నుంచి వచ్చినా ఆనందించేవారని చెప్పడానికి ఈ సంఘటన సాక్ష్యం. బాపట్లలో ఒక కళాశాల సాహిత్య కార్యక్రమం కోసం సినారె వెళ్లాలి. ఆయన హైదరాబాద్‌లో బయలుదేరి విజయవాడలో దిగారు. అక్కడ ఆయనను బాపట్ల విద్యార్థి సంఘ నాయకుడు పికప్ చేసుకుని, కారులో తీసుకెళ్తున్నాడు. ప్రయాణంలోనే సినారెకు అట్లా కునుకు పట్టింది. మధ్యలో ఒక చోట కళ్లు తెరిచి, సినారె తనదైన పద్ధతిలో ‘ఈ తేరు(రథం) ఎక్కడ నడుచుచున్నది?’ అన్నారు. ఆ సమయంలో కారు ఈతేరు అనే గ్రామం మీదుగా వెళ్తోంది. అది బాపట్లకు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది. విద్యార్థి వెంటనే, ‘ఈ తేరు ఈతేరున బడి పోవుచున్నది’ అని జవాబిచ్చాడు. సినారె విద్యార్థి సమయస్ఫూర్తికి సంతోషించి, తన జేబులోంచి పెన్ను తీసి బహుమతిగా ఇచ్చారు. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
విశ్వనాథ–సినారె–భరద్వాజ తెలుగు సాహిత్యంలో శిఖర సమానులు
తెనాలి: జ్ఞానపీఠ అవార్డులు స్వీకరించిన ముగ్గురు తెలుగు ప్రముఖులు ఆధునిక సాహిత్యంలో శిఖర సమానులని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. గడిచిన అయిదారు దశాబ్దాల్లో తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం కేవలం ముగ్గురినే వరించడం ఆశ్చర్యకరమన్నారు. తెలుగు సాహితీ ప్రముఖుల రచనలు ఇతర భాషల్లోకి అనువదించి, ఆ రచనలకు విస్తృత ప్రచారం కల్పించి ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు విశ్వనాథ–సినారె–భరద్వాజ సాహితీ వాహిని పేరిట శనివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. రాజకీయంగా చొరవ, ప్రోత్సాహం ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉంటే గానీ సాహిత్యంలో అవార్డులు రావని అభిప్రాయపడ్డారు. బెజవాడ గోపాలరెడ్డి సహకారంతో విశ్వనాథ సత్యనారాయణకు, పీవీ నరసింహారావు ప్రోత్సాహంతో సి.నారాయణరెడ్డికి, చిన్ననాటి తమిళ స్నేహితుడు పట్టుబట్టడం వల్లే రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ వచ్చిందని చెప్పుకుంటారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సాహితీవేత్త ఆరుద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతోనే ఆగిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. విశ్వనాథ వంటి కవిలేరు.. ‘విశ్వనాథ సాహిత్య ప్రాభవం’పై ప్రముఖ సాహితీవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, అజోవిభోకందాళం ఫౌండేషన్ (అమెరికా) వ్యవస్థాపకుడు డాక్టర్ అప్పాజోస్యుల సత్యనారాయణ మాట్లాడారు. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ ఆనాడే సమకాలీయతను చొప్పించారని చెప్పారు. వెయ్యేళ్ల తెలుగు కవిత్వంలో విశ్వనాథ వంటి కవి లేరని అభిప్రాయపడ్డారు. ‘డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్య వైభవం’పై సాహితీ ప్రముఖులు పత్తిపాక మోహన్, ఎన్ఆర్ తపస్వి ప్రసంగించారు. తెలుగు సాహిత్యాన్ని సినారె సుసంపన్నం చేశారని అన్నారు. ‘భరద్వాజ సాహిత్య మార్దవం’పై ప్రముఖ రచయితలు జీఎస్ నాగేశ్వరరావు, రెంటాల జయదేవ మాట్లాడారు. భరద్వాజ రచనల్లో ‘జీవన సమరం’ గొప్పదన్నారు. మానవతావాదిగా కొనసాగిన రచయితగా భరద్వాజ చిరస్మరణీయుడన్నారు. అనంతరం సంజీవదేవ్ రచించిన ‘జన్ బౌద్ధం’, ఎన్ఆర్ తపస్వి ఇంగ్లిష్ అనువాదంతో సహా ద్విభాషా పుస్తకాన్ని రచయిత పన్నాల సుబ్రహ్మణ్యభట్టు ఆవిష్కరించారు. మరో రచయిత శ్రీరమణకు ఆ పుస్తకాన్ని అంకితమిచ్చారు. సదస్సులో సాహితీవేత్త వెనిగళ్ల వెంకటరత్నం, మిసిమి సంపాదకులు వల్లభనేని అశ్వనీకుమార్ అతిథులుగా పాల్గొన్నారు. చిలువూరు సురేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
స్త్రీశక్తిని చూపిన పాట...
అమ్మ (సావిత్రి) దర్శకత్వంలో వచ్చిన ‘మాతృదేవత’ చిత్రంలో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ’ అనే పాట అంటే నాకు చాలా ఇష్టం. స్త్రీశక్తిని ప్రతిబింబించే పాట ఇది. ఈ పాటను డా. సి. నారాయణరెడ్డి ఎంతో అందంగా రాశారు. పదాలు వింటుంటేనే నాట్యం చేయాలనిపించేలా ఉంటాయి. పాటలో ‘మాత్రలు’ (సిలబుల్స్) అలా పరుగులు పెడుతుంటాయి. చిన్నప్పుడు ఈ పాటకు నేను డాన్స్ చేసేదాన్ని. ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ...’ అంటూ పాట ఎత్తుగడలోనే మహిళ ఎంత శక్తివంతమైనదో వివరించారు సినారె. అనురాగాన్ని పంచడంలోను, అవసరమైతే త్యాగం చేయడంలోనూ మహిళలే ముందు ఉంటారు... అని స్త్రీ ఔన్నత్యాన్ని చూపారు పల్లవిలో.మొదటి చరణంలో స్త్రీ గురించి చాలా సింపుల్‌గా... స్త్రీ అంటే చెలి, చెల్లి అనేది అందరూ చెబుతారు. ‘తల్లి’ అని సాధారణంగా చెప్పకుండా ‘రామయ్యనే కన్న తల్లి’ అని చెబుతూనే, ఆమె సకల భూప్రపంచానికే కల్పవృక్షం వంటిది అని స్త్రీ స్థానాన్ని ఎంతో ఉన్నతంగా చూపారు సినారె. ‘దేశానికి ప్రధాని అయినా ఒక కన్నతల్లి బిడ్డే’ అనే మాట వాడుకలో ఉంది. ఇక్కడ ఆ మాట గుర్తుకు వస్తుంది.రెండవ చరణంలో... ఆమె సహనం గురించి, ఆమె ప్రణయం గురించి మధురంగా వివరించారు. సహనానికి మారుపేరు సీత. అనురాగానికి మారు పేరు రాధ, తెలుగులో రామాయణం రాసిన మహిళ మొల్ల. కదన రంగంలో కత్తి దూసింది ఝాన్సీరాణి. ఇంతమంది మహిళలను గమనిస్తే, ఎవరి కోణం వారిదే. ఒక పక్క కవిత్వం రాయగలదు, మరోపక్క కదనరంగంలోకి ఉరకగలదు... అని స్త్రీలోని వివిధ పార్శా్వలు చూపారు. మూడవ చరణంలోకి ప్రవేశించేసరికి మహిళను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లారు. ముందు రెండు చరణాలకి మూడో చరణానికి ఎంతో తేడా ఉంటుంది. ‘‘తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాల సరులు...’’ అంటూ స్త్రీ గొప్పతనాన్ని వివరించిన ఒక్కో పదం వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఈ చరణంలో ఆడవారి అనురాగాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు రచయిత. స్త్రీలో సహనంతో పాటు శక్తి కూడా సమానంగా ఉంటుంది. బలం ఉండటం స్త్రీకి చాలా అవసరం. అవసరం ఏర్పడినప్పుడు తనకు తానుగా శారీరక బలం తెచ్చుకోగలదు స్త్రీ. ఆవిడ అబల కాదు సబల అని నిరూపించగలదు. సమస్యలను తట్టుకునే శక్తి కూడా మహిళలకే ఉంటుంది.... అనే అర్థం ఈ పాటలో చెప్పారు. ‘కన్న కడుపున చిచ్చు రగిలెనా కరవులపాలౌను దేశం / తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం’ ... తల్లి మనసుకి కష్టం కలిగించితే దేశమే సర్వనాశనమవుతుంది, ఆవిడను మించిన దైవమే లేదంటూ ఈ పాటను ముగించారు సినారె. మొదటి చరణం చాలా సింపుల్‌గా ప్రారంభమై, రెండవ చరణంలో జనరలైజ్ చేసి, క్రమేపీ మూడవ చరణంలోకి వచ్చేసరికి స్త్రీశక్తిని చూపారు. మహిళా శక్తిని ఈ పాటలో చూపినంతగా మరే పాటలోనూ చూపలేదేమో అనిపిస్తుంది. ఈ పాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్త్రీ ఔన్నత్యాన్ని పాట రూపంలో చెప్పడం చాలా బావుంది. ఈ పాటను పాఠ్యాంశంగా పెడితే బాగుంటుందనిపిస్తుంది. కవిత్వ పరంగా ఈ పాట మనసుకి హత్తుకుంటుంది. – వైజయంతి -
అనగనగా ఒకరాజు.
-
సినారెకు చికాగో సాహితీ మిత్రుల ఘన నివాళి
జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, దివంగత డా.సి. నారాయణ రెడ్డికి చికాగో సాహితీ మిత్రులు సంఘం ఆదివారం ఘన నివాళులు అర్పించింది. సుమారు 60 మంది తెలుగు సాహితీ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్టుపల్లి జయదేవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి సినారె శిష్యురాలు డా.దామరాజు లక్ష్మీని వేదిక మీదకు ఆహ్వానించారు. సినారె గురించి దాదాపు మూడు గంటల పాటు లక్ష్మీ మాట్లాడారు. యస్వీ రామారావు, డా. శింఠి శారదాపూర్ణ, కందాళ రమానాథ్, డా.బొల్లవరం విశ్వనాథరెడ్డి, డా. పుప్పాల శ్యాంమోహన్, కానూరు జగదీష్, డా.రవీంద్రనాథ్ రెడ్డి, చిమట కమల, నందుల మురళి తదితరులు సినారెతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
సాహితీ లోకంలో అద్వితీయుడు... సినారె
బంజారాహిల్స్: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రపంచ తెలుగు సాహితీ లోకంలో అద్వితీయుడని పలువురు వక్తలు కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం మాజీ ఉప కులపతి సినారె సంస్మరణ సభ మంగళవారం వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సాహిత్యీ అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి, తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య కె.సీతారామారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పల్లెల్లో వాడే భాష, మాండలికాలను తన సినీ పాటల రచనల్లో వాడి తెలంగాణ భాషను విశ్వ వ్యాప్తం చేశారన్నారు. సినారె జీవితం నేటి తరాలకు ఆదర్శనీయమన్నారు. ప్రబంధ సాహిత్యం, కావ్యరచన, ప్రాచీన కవిత్వం, జానపదం, గజల్స్, ప్రజల యాస..ఇలా ఏం రాసినా అది గొప్ప ప్రాచుర్యాన్ని పొందిందని కీర్తించారు. అంబేద్కర్ వర్సిటీ వ్యాప్తి, మౌలిక వసతుల కల్పనలో ఆయన దూర దృష్టి మర్చిపోలేనిదన్నారు. -
సినారేకి సాహిత్య నివాళులు
► ఘనంగా ముగిసిన టాంటెక్స్ 119 వ సాహిత్య సదస్సు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు జూన్ 18న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి శారద సింగిరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు సబ్బని లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు . ప్రవాసంలో నిరాటకంగా 119 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు చేయటం ఈ సంస్థ యొక్క విశేషం. సినీ వినీలాకాశంలో ఒక ధృవతారగా నిలిచిన ప్రపంచ ప్రఖ్యాత కవి రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి గారికి టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక సభ్యులు, డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహిత్య ప్రియులు అత్యంత ఆసక్తితో పాల్లొని పుష్ప నివాళులు సమర్పించారు. శ్రీమతి స్వాతి బృందం పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య రచించిన ‘చక్కని తల్లికి చాంగు భళా’, ‘నారాయణతే నమో నమో’ వంటి కీర్తనలు ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. సి. నారాయణ రెడ్డి రచించిన ‘ కర్పూర వసంతరాయలు’ గ్రంధాన్ని విశ్లేషిస్తూ శ్రీ రమణ జువ్వాడి ప్రసంగించారు. ఆనాటి రాజు కుమార వీరా రెడ్డి రాజ నర్తకి ‘లకుమా దేవి’ని చూసి ఆమె పై కవితలల్లిన తీరును చాలా చక్కగా వివరించారు. సినారే ‘కర్పూర వసంతారాయలు’ లో కేవలం సాహిత్యమే కాక వారి నాట్య శాస్త్ర పరిజ్ఞానాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. శ్రీ పూదూరు జగదీస్వరన్ ‘యవని పద్యాలు ముత్యాలు రాలంగ అనీ ‘సినారే భళి భళరే విశ్వంభర కీర్తితో’ అనీ తమ స్వీయ రచనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారి మిత్రులు శ్రీ నక్తా రాజు దాన వీర శూర కర్ణ చలన చిత్రంలో సినారే రాసిన ధుర్యోధనుని సంభాషణలను పోగిడారు. ఈ కార్యక్రమంలో తమ స్వీయ రచనలతో శ్రీ. టి. వరదయ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి సినారే కవితా సంపుటి ‘ నా రణం మరణం పైనే’ మొదటి ప్రతిని సినారే చేతులు మీదుగా అందుకున్న ఆ క్షణాలను, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అంతేకాక సినారే రచించిన ఎన్నో పాటలను స్వయంగా పాడి వినిపించారు. శ్రీ చంద్రహాస్ మద్దుకూరి, ‘పాటలో ఏముంది నామాటలో ఏముంది’ అనే సినారే రచించిన పుస్తకాన్ని పరిచయం చేసి ‘పాటో బయోగ్రఫి’ అనే పదాన్ని చక్కగా విశ్లేషించారు. శ్రీమతి కిరణ్మయి వేముల సినారే రాసిన చలన చిత్ర గీతాలను కలిపి రాసిన స్వీయ కవిత ఆలపించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ ‘ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవితా ప్రక్రియలు’ అనే అంశం విశ్లేషిస్తూ ప్రసంగించారు. ఈయన వృతి రీత్యా ఉపాధ్యాయులు అయినా సమాజ సేవకుడిగా, పర్యావరణవేత్తగా, సంపాదకులుగా ‘శరత్ సాహితీ కళా స్రవంతి’ , ‘తెలంగాణ సాహిత్య వేధిక’ స్థాపకులుగా ప్రఖ్యాతి చెందారు. ఈయనకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, శేషేంద్ర స్మారక పురస్కారం వంటి పురస్కారాలు వీరి సొంతమయ్యాయి. తెలుగు భాషకి గణిత శాస్త్రానికి వున్న సంబంధాలను, ఒక కవిత ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు కలిగి ఉండాలి అలాగే హైకులు, నానోలు, వాటిలోని లక్షణాలను చాలా చక్కగా వివరించారు. కొత్తగా కవితలు రాయాలనుకునే వారికి కూడా ఇది ఒక చక్కటి శిక్షణగా అనిపించటం ఒక విశేషం. ఆయన అమోఘమైన పాండిత్య ప్రతిభకు ప్రేక్షకులు మంత్రముగ్దులు అయ్యారు. అతిథి ప్రసంగం తరువాత ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీకృష్ణారెడ్డి ఉప్పలపాటి, కార్యవర్గ సభ్యులు తదితరులు ముఖ్య అతిథి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ రచించిన ‘అక్షరాణువులు’ పుస్తక ఆవిష్కరణ చేశారు. తదనంతరం ఆయనను సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. -
శబ్దతపస్సులో సముద్రం
నిన్న సాయంత్రం సముద్రాన్ని దర్శించాను అదే సముద్రం, చిన్నప్పటినుంచి విన్నది, కన్నది, ఎంత దగ్గరగా చూసినా ఇంకా అపరిచితమైనది, ఎన్ని ధ్వని తరంగాల్ని çసృష్టించి, సంపుటీకరించినా ఇంకా శబ్దంలో తపస్సు చేస్తున్నది ఓ మాట అటూ ఇటైతే చాలు, కళ్లల్లోకి కళ్లుపెట్టి చూస్తున్నది కలవరపెడుతున్నది, కలల్ని పంచుతున్నది ఎన్ని పడుచు గుండెలకు పాట నేర్పిన సముద్రమో ఎన్ని జంటగీతాలకు కొత్త వరసలు కూర్చిన సంగీతమో ఎన్ని అనుప్రాసల హŸయలొలికిన లకుమ నృత్య నీరాజనమో ఎన్ని నల్లని రాళ్ల గుండె సడి వినిపించిన విశ్వంభర గీతమో ఎంత మానవాభ్యుదయాన్ని కీర్తించిన ఆధునికతా భాష్య ప్రస్థానమో తెలుగు పదసిరిని పలుకు పలుకులో రవళించింది తెలుగయ్యల విభవాన్ని మళ్లీ జ్ఞానపీఠినెక్కించింది భావగంగోత్రి ప్రవహించి ప్రవహించి కవితా సముద్రమై కళ్లెదుట నిలిచింది నిన్న సాయంత్రం అదే సముద్రాన్ని చూశాను అలల హోరు తగ్గిన శబ్దసముద్రాన్ని చూశాను ‘లోకజ్ఞత’ విశ్రమించిన భావసముద్రాన్ని చూశాను ఒకప్పుడు గళం వెంట ఉరకలెత్తిన శబ్దం ఇప్పుడు కనులలో రేకులు విప్పుతోంది అప్పుడు వడివడిగా ధ్వనించేది ఇప్పుడు తడితడిగా ధ్యానిస్తోంది ‘విస్మృతిలో స్మృతి’ వెన్నెల దర్శిస్తోంది పండిన దోసపండులా అదే పసిడివన్నె మోము కంటి చూపులో తళుక్కుమనే తడి దోసగింజ మెరుపు పెదాలపై అదే చల్లందనాల మందహాసం ఒక్కమాటయినా, అదే ఆర్ద్ర స్విన్న వాక్యం ‘వాక్యం రసాత్మకం కావ్యం’గా సాగిన వాక్ప్రవాహం ‘రమణీయార్థ ప్రతిపాదకశ్శబ్దం’ జల్లుల్ని చిందిస్తున్న వైనం అయినా అదేమి చిత్రమో, ఆగని కవితాగానం గొంతు విప్పితే అదే భారతీ దేవి వీణానిక్వణం మహాంధ్రభారతి ముంజేతి చిలుక తెలుగుపాట సినారె బహుళోక్తి మయ ప్రపంచంలో తెలుగు సిరుల వెలుగుతోట సినారె (ఈ ఫిబ్రవరి 28న ప్రపంచ కవితా దిన సందర్భంగా సినారెను దర్శించినప్పుడు పొందిన కలత అనుభూతిలో) - ప్రొ. గంగిశెట్టి లక్ష్మినారాయణ 9441809566 -
స్వప్నాలను పండించుకున్న సిద్ధుడు
యనభై ఆరేళ్ల జీవితంలో ఆయన అధిరోహించని పదవులు, వేదికలు లేవు. సృజనశీలి. సౌజన్యమూర్తి. కల్తీలేని తెలుగు సంభాషణతో ఠీవైన పంచెకట్టుతో అరవైఏళ్ల పాటు తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. తెలుగునాట ఏడుపదుల సందడి సద్దుమణిగింది. గలగల లాడే ఒక సెలయేరు నిర్జీవమై నిలిచిపోయింది. తెలుగు కవిత ఆయన కోసం వెతుక్కుంటుంది. ఆ సృజన శీలిపై బెంగపడుతుంది. ‘సి.నా.రె.’ మూడక్షరాల సంతకం మానస సరోవరంలో ఈదాడే రాయంచలా ఉండేది. ఆయన దస్తూరి తెలుగు లిపికి పట్టువస్త్రాలు కట్టినట్టుండేది. జీవితంలోనూ సాహిత్యంలోనూ మడత నలగని పొంది కైన మనిషి. గొప్ప స్వాప్నికుడు. ఊరికే కలలు కంటూ రికామీగా కూచోకుండా, నిరంతర సృజనతో స్వప్నాలను పండించుకున్న సిద్ధుడు. ఈ పోటీ లోకంలో ఆరు దశాబ్దాల పాటు ‘సెలెబ్రిటీ హోదా’ని చలాయించుకున్న అపురూప వ్యక్తి సింగిరెడ్డి నారాయణరెడ్డి. నవాబ్ పాలనలో ఉర్దూ మాధ్యమంలో డిగ్రీ దాకా చదివారు. ఆపై చదువులు తెలుగు మాధ్యమంలో చేశారు. నారాయణరెడ్డికి ఉర్దూ, పారశీ భాషలపై మంచి పట్టుంది. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడై, విద్యార్థులకు పాఠాలు చెప్పే పనిలో పడ్డారు. ప్రబంధ సాహిత్యం, కావ్యాలు నాటి డిగ్రీ, పై డిగ్రీలకు నిత్యం బోధించేవారు. నారాయణరెడ్డి పాఠం చెబుతుంటే ఆ తరగతికి సైన్స్, కామర్స్ శాఖల విద్యార్థులు సైతం వచ్చి కూర్చునేవారు. చక్కని కంఠంతో పద్యం విడమరిచి ఆయన చదువుతుంటే – అర్థం చేసుకుంటూ ఆస్వాదిస్తూ విద్యార్థులు ఆనందించేవారు. పాఠాలు చెప్పడం ఆయన తొలి ప్రేమ. జీవితంలో ఎన్ని వ్యాపకాలు పెట్టుకున్నా విద్యార్థులతో గడపడం ఆయనకు ఇష్టం. అందుకే సినారె నిత్యోత్సాహిగా, నిత్య యవ్వనుడిగా మిగిలారు. గంగ,యమున, సరస్వతి ముగ్గురాడపిల్లలు. వివేక్‌నగర్‌లో ఆ ఇంటిపేరు త్రివేణి. గురువుగారి లెక్క తేడా వచ్చింది. నాలుగో నది కృష్ణవేణి కదిలి వచ్చింది. సినారె రచించిన అద్భుతమైన గీత కావ్యాలు రామప్ప,∙కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం సర్వత్రా గుబాళించాయి. ఆ పరిమళాలే చిత్రసీమకు నడిపిం చాయి. స్వగ్రామం హనుమాజీపేటలో మూట కట్టుకున్న జానపద బాణీలు, అష్ట దిగ్గజాల పదగుంఫనలు తన స్వీయవాణికి జత చేసుకున్నారు. వేలాది పల్లవులు ఆశువుగా కువ్వలు పోశారు. సాహిత్య ప్రక్రియల్లో దేని పదాలు దానికి వాడితేనే అందం. పాటలకు కొన్ని మాటలే ఒదుగుతాయి. ఆ మాటలు సినారెకు బాగా తెలుసు. పైగా ఆయన ఖజానాలో అవి కావల్సినన్ని ఉన్నాయి. భావానికి అనువైన భాషని పొదగడంలో మహాశిల్పి. అవసరమైన చోట సమాసాలను సొగసుగా అల్లనూగలరు. జానపద శైలికి కావల్సిన సరుకూ సరంజామా ఆయన గోటి మీద ఉంటుంది. అందుకే సినారె గీతాలలో యమునా తరంగాలు, నందనవనాలు, నవపారిజాతాలు, తరిపి వెన్నెలలు, సైకత వేదికలు, వీణలు, వేణుగానాలు, పగలే వెన్నెలలు– ఇలా ఎన్నెన్నో పాత మాటలే ఈ కవి ప్రయోగంలో కొత్తగా ధ్వనిస్తాయి. అందుకే విశ్లేషకులు సినారె సినిమా పాటలకు కావ్య గౌరవం తెచ్చారని అభినందించారు. పాటలు, లలిత గేయాలు, పద్యాలు, తెలుగు గజళ్లు, ప్రపంచ పదులు, భావ కవిత్వాలు, దీర్ఘ కవితలు ఇంకా ఆయన పండించని ప్రక్రియ లేదు. యనభై ఆరేళ్ల జీవితంలో ఆయన అధిరోహించని పదవులు, వేదికలు లేవు. సృజనశీలి. సౌజన్యమూర్తి. కల్తీలేని తెలుగు సంభాషణతో ఠీవైన పంచెకట్టుతో అరవైఏళ్ల పాటు తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. పద్మభూషణ్, జ్ఞానపీuŠ‡ అవార్డ్‌ల గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యులు, ఆచార్య డాక్టర్ సి. నారాయణరెడ్డికి అశ్రుతర్పణం. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సినారె జ్ఞాపకాలు
సినారె గొప్ప వక్త. అనితర సాధ్యంగా సభా నిర్వహణ చేసేవారు. ఆయన ప్రసంగం కవితాపఠనంలాగ సాగేది. చివరి రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింది. కాని ప్రతి సాయంకాలం–సాహితీ ప్రసంగాల రుచిని వదులుకోలేకపోయేవారు. దాదాపు 47 సంవత్సరాల కిందటి మాట. మద్రాసు టి.నగర్లో సుధారా హోటల్లో సినారెది 12వ నెంబర్ గది. నాది పదకొండు. రోజంతా నేను కథా చర్చలు, సంభాషణల రచనా చూసుకుని గదికి చేరేవాడిని. ఆయనది పాటల పరిశ్రమ. నా గది తలుపు చప్పుడు కాగానే వచ్చేవారు. ఇద్దరం ఆనాటి కార్యకలాపాలను పంచుకుంటూ రాత్రి పన్నెండున్నర దాకా కాలక్షేపం చేసేవాళ్లం. ఆ రోజుల్లోనే –నేను రేడియోకు శలవు పెట్టి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలని రెచ్చగొట్టే మిత్రులలో సినారె ఒకరు–ఆయనా అటు విద్యారంగంలో ఉంటూ అలాంటి పని చేస్తున్నారు కనుక. కరీంనగర్ రోజుల్లో –అంటే ఆయన చిన్నతనంలో మా మామగారు ఆయనకి ఇంగ్లిష్ గ్రామరు నేర్పేవారు. మా ఆవిడని ’గురుపుత్రి’ అనే పిలిచేవారు ఎప్పుడు కలిసినా. చిన్నతనంలో మా రెండో అబ్బాయి రామకృష్ణ (మా మామగారి పేరు) ఆయనకి నమస్కారం పెట్టేవాడు కాడు– మా ఆవిడ ఎంత చెప్పినా. ఆయన నవ్వి: ఎందుకు పెడతాడు? నా గురువు కదా? అనేవారాయన. ఒకసారి కరీంనగర్ కాలేజీలో సాంస్కృతిక సభకి నాకూ ఆయనకీ ఆహ్వానం వచ్చింది. మూడు కారణాలకి అది నాకు ముచ్చట. మా ఆవిడ చదువుకున్న ఊరు. విశ్వనాథ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కాలేజీ. మా మామగారూ అక్కడ హైస్కూలు హెడ్ మాస్టరుగా చేశారు. ఇద్దరం వెళ్లాం. రాత్రి పదిగంటలకి భోజనం చేసి ఇద్దరం కారులో కూర్చున్నాం. డ్రైవరు ఈడిగిలపడుతూ కారు నడుపుతున్నాడు. కారణం అడిగాం. అది ఎన్నికల టైము. చెన్నారెడ్డిగారూ, వందేమాతరం రామచంద్రరావుగారూ పోటీ చేస్తున్న ఆ నియోజక వర్గంలో గత నాలుగు రోజులుగా నిద్ర లేకుండా కారు నడుపుతున్నాడట. మేమిద్దరం గతుక్కుమన్నాం. అక్కడి నుంచి హైదరాబాద్‌కి నాలుగు గంటల ప్రయాణం. డ్రైవర్ నిద్రని ఆపేదెలా? ఇద్దరం పాటలూ, పద్యాలూ లంకించుకు న్నాం. నోటికి వచ్చిన పాటలు, పద్యాలు–కేకల స్థాయి లో. హైదరాబాద్ 2 గంటలకు చేరాం. ఇద్దరం అలసటతో కూలిపోయాం. అదొక మరుపురాని సంఘటన. మా ఇద్దరి జీవితాలు ఆసాంతమూ పడుగు పేకల్లా సాగాయి. నేను రాసిన ఎన్నో చిత్రాలకు ఆయన పాటలు రాశారు. నేను నటుడినయ్యాక ఆయన రాసిన ఎన్నో పాటల్ని నటించాను. నా రెండో రోజు షూటింగులోనే ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో ‘స్వామి శరణం అయ్యప్పా’ పాట! నేను ఎప్పుడూ అనేవాడిని. ‘నేను పది సీన్లలో చెప్పిన విషయాన్ని మీరు పదిమాటల్లో లేపుకుపోతారు’ అని. అది పాటకి ఉన్న ఒడుపు. కర్నాటకలో హంపీ దగ్గర కమలాపురం గెస్టు హౌస్‌లో ఉంటూ పుండరీకాక్షయ్య గారి ‘మావారి మంచి తనం’ సినీమాకి ఆయన పాటలూ, నేను మాటలూ పూర్తి చేశాం. రోజూ ఉదయమే సినారె నిద్రలేపేవారు. అలాగే మారిషస్ ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లినప్పుడు. మా ఉదయపు నడకల్లో ఎన్నో పాటలు రూపుదిద్దుకోవడం నాకు తెలుసు. హేరంబ చిత్ర మందిర్ ‘మాంగల్యానికి మరోముడి’ పాటల కంపోజింగు. విశ్వనాథ్, సినారె నేనూ కూర్చున్నాం. ఉన్నట్టుండి సినారె అన్నారు: ‘వచ్చేసిం దయ్యా పల్లవి’ అని. ఇదీ ఆయన చెప్పిన పల్లవి: గొల్లపూడి చిన్నవాడి అల్లరి నవ్వు పట్టపగలు విరబూసే పున్నమి పువ్వు జీవితంలో ఎన్ని జ్ఞాపకాలు! ఆయన జ్ఞానపీఠ పురస్కారానికి అభినందన సభ మద్రాసు సవేరాలో. దేవులపల్లి, ఇచ్చాపురపు జగన్నాధరావు ప్రభృతులంతా ఉన్నారు. నేను వక్తని. 1988లో రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కార సభకి నేను ప్రధాన వక్తని. నా షష్టిపూర్తికి వచ్చిన నలుగురు ఆత్మీయులు– సినారె, అక్కినేని, గుమ్మడి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. అదొక మధురానుభూతి. ఆయన చేతుల మీదుగా వంగూరి ఫౌండేషన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాను. ఇలా రాస్తూ పోతే పెద్ద జాబితా. ఆయన ముందునుంచీ నా రచనలకు అభిమాని. 1969లో ఎమెస్కోవారు ప్రచురించిన నా ‘పిడికెడు ఆకాశం’ నవల చదివి ఉత్తరం రాశారు. ‘నవల పోను పోను గంభీరంగా ఉంది. గమకం ఆద్యంతమూ ఉందనుకోండి. ముగింపు అద్భుతం. వస్తువును స్వీకరించడంలో మీకున్న దమ్ము రుజువయింది’. ఆయన గొప్ప వక్త. అనితర సాధ్యంగా సభా నిర్వహణ చేసేవారు. ఆయన ప్రసంగం కవితాపఠనంలాగ సాగేది. చివరి రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింది. కాని ప్రతి సాయంకాలం– సాహితీ ప్రసంగాల రుచిని వదులుకోలేకపోయేవారు. ఇద్దరు మనుషులు, ఒక తలగడ, క్లుప్తంగా రెండు మాటలూ– ఒక మహావక్త గతాన్ని తలుచుకుని మనస్సులో కలతగా ఉండేది. అయితే ఆ కాస్త participation ఏ ఆయనకు ఆటవిడుపు. వయస్సు, ఆరోగ్యం ఎదురుతిరుగుతున్నా– కవితలు మానలేదు. ఎప్పడూ ఏవో పత్రికల్లో కనిపిస్తూండేవి. అది సినారె ‘ప్రాణవాయువు’గా అస్మదాదులం గుర్తుపట్టేవాళ్లం. సినారె ఒక ప్రభంజనం. ఈ తరం సంతకం. - గొల్లపూడి మారుతీరావు -
ప్రాసకు నడక నేర్పిన సాహితీ శిఖరం
► సినారెకు సీఎం కేసీఆర్ ఘన నివాళి ►నేడు అంత్యక్రియలు సినారెకు సీఎం కేసీఆర్ ఘన నివాళి ►తెలంగాణ తలెత్తుకుని గర్వపడే మహనీయుడు ►సినారెకు నాలాంటి అభిమానులు కోట్లాది మంది ►సినారె పేరిట స్మారక మ్యూజియం, సమావేశ మందిరం.. ►ట్యాంక్‌బండ్‌పై కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం ►నేడు ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో సినారె అంత్యక్రియలు ►జిల్లాల నుంచి తరలివచ్చే వారి కోసం ఉచిత బస్సులు ►అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం, పలువురు ప్రముఖులు సాక్షి, హైదరాబాద్ ‘‘కవులు, రచయితలు చాలా మంది ఉంటరు.. కానీ సినారె సభ అంటే, సినారె మాట అంటే ఓ గ్లామర్. కవులకు గ్లామర్ ఉంటుందని నిరూపించిన వ్యక్తి సినారె. ఆయన ఉపన్యాసం వినాలనే ఉత్సాహంతో వందలాదిగా సభలో పాల్గొనేవారు. పుట్టింది తెలంగాణ గడ్డ అయినప్పటికీ, మొత్తం తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోనేటువంటి వ్యక్తి ఆయన. ఆది ప్రాసలకు, అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పడంలో సినారెకు ఎవరూ పోటీ లేరు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మంగళవా రం హైదరాబాద్ లోని సినారె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. సినారె పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి.. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబా నికి అండగా ఉంటా మని హామీ ఇచ్చారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. భావితరాలు సినారెను గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎంత కీర్తించుకున్నా తక్కువే.. తెలంగాణ గర్వంగా తలెత్తుకుని చెప్పుకొనే టంతటి మహనీయుడు సినారె అని, తెలంగా ణ సాహితీ మకుటంలో ఆయనొక కలికితురా యి అని కేసీఆర్ కీర్తించారు. ఆయనను ఎంత కీర్తించుకున్నా, పొగుడుకున్నా, ఎంత స్మరిం చుకున్నా తక్కువేనని.. సాహిత్య రంగానికి సినారె అందించిన విశేష సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఈ మధ్యే తాను వరంగల్ వెళ్లినప్పుడు సినారె రాసిన మందార మకరం దాలు పుస్తకంలోని పద్యాలను బమ్మెర పోతన సమాధి వద్ద కోట్ చేశానని కేసీఆర్ చెప్పారు. అది సినారె విన్నారని వారి కుటుంబ సభ్యులు చెప్పారని.. తనలాంటి అభిమానులు కోటానుకోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. నేడు మహాభినిష్క్రమణం తెలుగు సాహితీ జగత్తు రారాజు సినారె అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో జరుగనున్నా యి. అధికార లాంఛనాలతో ఈ అంత్యక్రియ లు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. తొలుత ఉదయం 9 గంటల నుంచి గంటపాటు సినారె పార్థివదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో ఉంచుతారు. పది గంటలకు సారస్వత పరిషత్ నుంచి ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానానికి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. నివాళి అర్పించిన ప్రముఖులు సినారె పార్థివదేహం వద్ద మంగళవారం పెద్ద సంఖ్యలో పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, అభిమానులు నివాళు లు అర్పించారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, తలసాని, నాయిని, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, మర్రి జనార్దన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, గాయని జానకి తదితరులు సినారె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సినారె స్మారక మ్యూజియం సినారెకు ప్రభుత్వం తరఫున ఘనమైన నివాళులు అర్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఆయన పేరిట స్మారక మ్యూజియంతోపాటు సాహితీ సమాలోచనలు జరుపుకొనేలా సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు హైదరాబాద్ నడిబొడ్డున స్థలం కేటాయిస్తామన్నారు. ఓ ప్రముఖ సంస్థకు సినారె పేరు పెడతామని.. ట్యాంక్ బండ్‌తో పాటు కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో, సినారె స్వగ్రామం హన్మాజీపేటలో ప్రభుత్వపరంగా సినారె కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సినారె చాలా ప్రేమించిన సారస్వత పరిషత్తుకు ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తామన్నారు. ప్రత్యేక బస్సులు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ మహా ప్రస్థానంలో బుధవారం జరిగే అంత్య క్రియలకు అన్ని జిల్లాల నుంచి సినారె అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరఫున ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంçస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలకు అప్పగిం చారు. అంత్యక్రియల్లో తాను స్వయంగా పాల్గొంటానని, తెలంగాణ ప్రజల తరఫు న సినారెకు గొప్ప వీడ్కోలు పలకాలని సీఎం పిలుపునిచ్చారు. అంత్యక్రియలకు హాజరయ్యే వారికోసం బుధవారం రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాల నుండి 2 చొప్పున ఉచిత బస్సులు నడుపుతున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. వాటిలో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానానికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
ఆయన తెలంగాణ గర్వించతగ్గ బిడ్డ : హరీష్
హైదరాబాద్ : మహాకవి సి. నారాయణరెడ్డి తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం ఉదయం సినారె పార్థివదేహానికి హరీష్‌రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినారె మృతి చాలా బాధాకరమన్నారు. తెలంగాణ జాతికి, ప్రాంతానికి గౌరవం, వన్నె తెచ్చిన వ్యక్తి సినారె అని పేర్కొన్నారు. ఆయన కావ్యాలు, రచనలు, పాటలు తెలుగు రాష్ర్టాల ప్రజలకు చిరకాలం గుర్తుండి పోతాయన్నారు. సినారె గౌరవాన్ని, కీర్తిని నిలబెట్టేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. సినారె తెలుగు జాతికి చేసిన సేవలు అపారమని చెప్పారు. అదే విధంగా నటుడు తనికెళ్ల భరణి ఈరోజు నారాయణరెడ్డికి నివాళులు అర్పించారు. సినారే తెలుగు జాతికి సంపద అని కొనియాడారు. -
చిరస్మరణీయుడు
‘‘అరుణోదయం ఊరుకోదు/ కిరణాలను సారించనిదే/ వసంతోదయం ఊరు కోదు/పరిమళాలను పారించనిదే/ప్రసరించే నీరు ఊరుకోదు/పల్లం అంతు ముట్టనిదే’’ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూసిన సాహితీవేత్త, బహు ముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సి. నారాయణరెడ్డి విరచిత ఇతిహాసం ‘విశ్వంభర’ కావ్యంలోని కవితా పంక్తులివి. తన ఏడు పదుల నిరంతర సాహితీ ప్రస్థానం పొడవునా కిరణాలను సారించి, పరిమళాలను పారించి, జలపాతాలను తలపించి వెళ్లిపోయిన నారాయణరెడ్డి సినారెగా జగద్విఖ్యాతుడు. నిజాం ఏలుబడిలోని తెలంగాణ గడ్డపై కరీంనగర్ జిల్లా మారుమూల పల్లెటూళ్లో పుట్టి వీధి బడి మొదలుకొని డిగ్రీ వరకూ ఉర్దూ మాధ్యమంలోనే చదువుకున్న ఒక రైతు బిడ్డడు తెలుగు భాషకు ఇన్ని సొబగులద్దాడని, తెలుగు తల్లికి ఇంతటి కీర్తిప్రతిష్టలను సాధించిపెట్టాడని తెలిసినప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. తెలంగాణ పలుకుబడిని, సంస్కృతిని చిన్నప్పటినుంచీ ఒంటబట్టించుకోవడం, చెవులను తాకే జానపదాలను నిశితంగా అవలోకిస్తూ, వాటిని తనలో ఇముడ్చుకోవడం, హరికథలు, బుర్ర కథలు ఎక్కడ జరిగినా వెళ్లడం తదితరాల వల్లనే ఇదంతా సాధ్యమైంది. చదువంతా ఉర్దూ మాధ్యమంలో సాగుతున్నా ఛందస్సు అనేది ఒకటుంటుందని తెలియకపోయినా ఏడో తరగతిలోనే ఆయన చందోబద్ధంగా తొలి పద్యం రాయగలిగారు. గురువు చెప్పేవరకూ అది సీసపద్యమని కూడా తనకు తెలియదని ఒక సందర్భంలో సినారె అన్నారు. పదో తరగతి చదువు తున్నప్పుడే నైజాం రాష్ట్రానికి స్వాతంత్య్రం రావాలని కాంక్షిస్తూ కవిత రాశారు. విద్యావేత్తగా, కవిగా, వక్తగా, సినీ గేయ రచయితగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, సాంస్కృతిక సలహాదారుగా, సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా సినారె తెలుగు భాషకు అందించిన సేవలు అపారమైనవి. ఒక పదవిని చేపట్టి నప్పుడు దాన్ని సమర్ధవంతంగా, సమగ్రంగా నిర్వహించి చూపడం, అందులో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టడం ఆయనకు మాత్రమే సాధ్యం. విశ్వవిద్యా లయాల కులపతిగా, రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఉర్దూ, సంస్కృత భాషలను సైతం ఔపోసన పట్టారు. స్వరజ్ఞానం ఉండటంవల్లా, గాయకుడు కావడంవల్లా ఆయన కలం నుంచి అలవోకగా పాటలు జాలువారేవి. సినారె ప్రయోగశీలి. సాహిత్యంలో కథాగేయ కావ్యాలు మొదలుకొని ఎన్నో ప్రక్రియల్లో ఆయన రచనలు సాగాయి. ఆయన రాసిన తెలుగు గజళ్లలో మానవీయ దృక్పథమూ, మానవ స్వభావమూ, లోతైన తాత్వికత దర్శనమిస్తాయి. కవిత్వం పాఠకుల్లో చైతన్యాన్ని కల్గించాలని, ఆలోచిం పజేసి పరివర్తనకు దోహదపడాలని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. సాహి త్యంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను గమనిస్తూ యువ కవులతో పోటీపడి, వారికి దీటుగా కవిత్వం రాయడం చివరి వరకూ ఆయన కొనసాగించారు. ప్రతి పుట్టినరోజుకూ ఒక కవితా సంపుటిని తీసుకురావడం కొన్నేళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారు. కవిత్వంలో అద్భుత పదచిత్రాలతో సుమ సుగంధాలను వెదజల్లి సమ్మోహనపరిచినట్టే వక్తృత్వంలో సైతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడం ఆయనకు అలవోకగా అబ్బిన విద్య. కొన్నేళ్లక్రితం వరకు హైదరాబాద్ నగరం లోని రవీంద్ర భారతి, త్యాగరాయ గానసభల్లో జరిగే సభల్లో ఆయన వక్తగా ఉండటం రివాజు. రాష్ట్రంలో, దేశంలోని వివిధ ప్రాంతాల్లో, విదేశాల్లో ఏ మూల తెలుగు భాషా సంస్కృతులపై మహాసభలు, సదస్సులు జరిగినా పాల్గొనడం, విలువైన సందేశమివ్వడం తన కర్తవ్యంగా భావించారు. కవితాసేద్యం సాగిస్తూనే, కొత్త కొత్త ప్రక్రియల్లో ప్రయోగాలు చేస్తూనే ఈ పనులన్నీ ఆయన కొనసాగిం చారు. మంచి పదచిత్రం, మంచి అభివ్యక్తి ఎవరిలో కనిపించినా వారిని ప్రోత్స హించడం, చేయూతనందించడం సినారె అలవాటు. తన దగ్గర చదువుకునే విద్యార్థుల్లోని ప్రతిభాపాటవాలను గుర్తించి, వారికి సలహాలు, సూచనలిచ్చి మెరి కల్లా తీర్చిదిద్దిన ఘనుడాయన. వర్తమాన తెలుగు సాహిత్యంలో లబ్ధ ప్రతిష్టులుగా పేరొందిన ఎంతోమంది ఆయన శిష్యులే. నిజాం పాలన సమయంలో తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడటం కోసం సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రమాణాలను కొనసాగించ డంలో సినారె చేసిన కృషి అద్భుతమైనది. తనకు ముందు ఆ సంస్థకు అధ్యక్షులుగా పనిచేసిన దేవులపల్లి రామానుజరావు, గడియారం రామకృష్ణ శర్మ తర్వాత దాన్ని ఇరవై య్యేళ్లపాటు ఎంతో సమర్ధవంతంగా నడిపి దాని తరఫున ఎన్నో గ్రంథాలను పున ర్ముద్రించారు. సాహిత్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సినీ గీత రచయితగా సినారె చేసిన విన్యాసాలు ఆయన ప్రతిభాపాటవాలకు అద్దం పడతాయి. సన్నివేశాలనుబట్టి, సందర్భాలనుబట్టి దేన్నయినా పలికించగల దిట్ట ఆయన. అది శృంగారరసమా, కరుణరసమా, వీరరసమా, జానపదమా, వేదాంతమా... ఏదైనా సినారె అలవోకగా అల్లగలిగారు. అప్పటికే పింగళి, ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, కృష్ణశాస్త్రిలాంటి హేమాహేమీలున్నచోట నిలబడగలిగిన ప్రతిభాశాలి. సినీ పరిశ్రమలో తెలుగు సరే... ఉర్దూ భాషలో సైతం ఎవరికి ఏ సందేహం వచ్చినా తీర్చగలిగేది సినారెనే. చివరివరకూ నిరీశ్వరవాదిగా ఉన్నారు. తనది ప్రగతిశీల మానవతావాదమని చెప్పుకున్నారు. ఎందరో రాజకీయ నాయకులకు అత్యంత సన్నిహితంగా మెలిగినా, రాజకీయాల్లోకి అడు గుబెట్టి ఎన్నికల్లో పోటీ చేయమని వారిలో చాలామంది కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. కవిగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేస్తే ఆ పదవిలో సైతం తన విశిష్టతను చాటారు. ఆధునిక తెలుగు కవిత్వంపై ఆయన పరిశోధనా గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వము– సంప్ర దాయములు, ప్రయోగములు’ ఇప్పటికీ విద్యార్థులకు ఒక రిఫరెన్స్ గ్రంథం. తన నిరంతర కృషితో తెలుగు సాహితీలోకంపై తనదైన ముద్రవేసిన సినారె చిరస్మరణీయుడు. -
విను వీధిని తాకిన విశ్వంభర నాదం
అస్వస్థతతో సి. నారాయణరెడ్డి కన్నుమూత తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సారస్వతమూర్తి.. చిన్నతనం నుంచే కవితాసేద్యం.. మారుమూల పల్లె నుంచి ప్రస్థానం.. అలంకరించిన పదవులు ఎన్నో.. వరించిన పురస్కారాలు మరెన్నో.. సినారె కన్నుమూతపై సినీ, రాజకీయ, సాహితీవేత్తల దిగ్భ్రాంతి.. ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో రేపు అంత్యక్రియలు అవును... నీవు పుట్టకముందే నెత్తి మీద నీలి తెర కాళ్ల కింద ధూళి పొర... కానీ... నీవు పుట్టాకే.. ఆ నీలి తెర అక్షర పరిమళాలను అద్దుకుంది.. ఆ ధూళి పొర జ్ఞానపీఠాలను అందుకుంది.. ఇప్పుడు ఆ నింగీ నేలా ప్రశ్నిస్తున్నాయి.. విశ్వంభరుడు ఎక్కడని..? మళ్లీ వసంతరాయలుగా వస్తావా..? తరతరాల తెలుగు వెలుగై పల్లవిస్తావా..?? సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల: సాహితీ శిఖరం నేలకొరిగింది. విశ్వ కవనమూర్తి నిష్క్రమించారు. సెలయేరులా మొదలై జీవనదిలా పరుచుకున్న కవితాఝరి ఇక సెలవంటూ దిగంతాలకు పయనమైంది. తెలుగు మాటను, పాటను, పద్యాన్ని పండించి సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సారస్వతమూర్తి సింగిరెడ్డి నారాయణరెడ్డి(86) అస్తమించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఉదయం 6 గంటలకు వ్యక్తిగత సహాయకుడు ఆయన్ను నిద్రలేపేందుకు వెళ్లినా కదలిక లేకపోవటంతో కుటుంబీకులకు సమాచారమిచ్చాడు. వారు వెంటనే కేర్ హాస్పిటల్ వైద్యుడిని రప్పించి, 7.30 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సినారె మరణవార్త క్షణాల్లోనే తెలియడంతో అభిమానులు, సాహితీ ప్రియులు, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయం 9 గంటల నుంచే మణికొండలో సినారె ఇళ్లు డాలర్‌హిల్స్ ప్లాట్ నంబర్–61కి తరలి వచ్చి నివాళులు అర్పించారు. సినారెకు నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, క్రిష్ణవేణి ఉన్నారు. మనమళ్లు చైతన్య, కాంత్రి, లయచరణ్, అన్వేష్, మనమరాళ్లు మనస్వినీ, మౌతికతోపాటు మునిమనమళ్లు, మనమరాళ్లు ఉన్నారు. అమెరికాలో ఉంటున్న ఆయన మనవళ్లు క్రాంతి, అన్వేష్‌రెడ్డి హుటాహుటిన అక్కడ్నుంచి బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున వారు హైదరాబాద్ చేరుకోనున్నారు. అదేరోజు ఉదయం 11 గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య సినారె అంత్యక్రియలు జరగనున్నాయి. మారుమూల పల్లె నుంచి ప్రస్థానం.. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, సినీ గేయ రచయితగా, మహా వక్తగా, గజల్ కవిగా, గాయకుడిగా, సాహిత్య బోధకుడిగా, పరిశోధకుడిగా తనదైన ముద్రవేసుకున్న సినారె రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో జన్మించారు. 1931 జూలై 29న సింగిరెడ్డి మల్లారెడ్డి, బుచ్చమ్మ రైతు దంపతుల ఏకైక సంతానం ఆయన. అసలు పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి.ప్రాథమిక విద్య హన్మాజీపేటలో పూర్తి చేసిన ఆయన వేములవాడలో నాలుగు, ఐదు తరగతులు చదివారు. సిరిసిల్లలో ఆరు, ఏడు తరగతులు అభ్యసించారు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు కరీంనగర్లో చదువుకున్నారు. తెలుగు, ఇంగ్లిష్ ఐచ్ఛికాలుగా ఉర్దూ మీడియంలో చదివారు. హైదరాబాద్ చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఉర్దూ మీడియంలోనే తెలుగు, సోషియాలజీ, ఎకనామిక్స్‌లతో బీఏ పూర్తి చేశారు. 1952–54లో ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ఆ తరగతిలో అప్పట్లో సినారె ఒక్కరే విద్యార్థి కావడం విశేషం. సినారెది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. సాహితీ ప్రవాహాన్ని తలపింపజేస్తూ కాబోలు వారికి గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేర్లు పెట్టారు. సినారె సతీమణి సుశీల 30 ఏళ్ల క్రితమే ఆయన్ను వదిలి వెళ్లింది. ఆమె పేరిట ‘సుశీల నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించారు. తొలి రచన.. నవ్వని పువ్వు 1953లో ‘నవ్వని పువ్వు’సినారె తొలి రచన. పరమాణువుగా ప్రస్థానాన్ని ప్రారంభించి మహాపర్వతమై ఎదిగిన ఆయన.. కలం శక్తివంతం. గళం సమ్మోహనం. సుమధురమైన తెలుగు భాషలో ఆయన చేసే ప్రసంగాలు ఇట్టే ఆకట్టుకునేవి. భాషలో శబ్ద మాధుర్యం, భావ గాంభీర్యం, కవితా పరిమళం నిక్షిప్తమై ఉండేవి. చిన్నప్పట్నుంచే కవిత్వం పట్ల ఆసక్తిని, ఇష్టాన్ని ఏర్పర్చుకున్న సినారె ఆరేడు తరగతుల వయస్సులోనే కవితలు రాశారు. జానపదాలు, హరికథలు, బుర్రకథలు ఆలపించారు. మానవ పరిణామక్రమంపై ‘విశ్వంభర’ను సంధించారు. ‘నన్ను దోచుకుందువటే ’అంటూ గులేబకావళి కథతో ప్రారంభించి ‘అరుంధతి’వరకు పాటల పూదోటై విస్తరించారు. ‘సినారె గజల్స్’తో గానామృతం పంచారు. సామాజిక చైతన్య ప్రబోధాన్ని తన కవిత్వ ప్రధాన లక్ష్యంగా ప్రగతిశీల మానవతావాదాన్ని కవిత్వీకరించారు. అలా ‘సినారే’అయ్యారు.. చందస్సు అంటే ఏంటో తెలియని రోజుల్లోనే సినారే పద్యాలు రాశారు. ‘ఒకనాడు ఒక నక్క ఒక అడవి లోపల పొట్టకోసర మెటో పోవుచుండె...’అంటూ ఏడో తరగతిలోనే పద్య రచనకు పూనుకున్నారు. సినారె కంటే ముందు తల్లి బుచ్చమ్మకు ఒక పిల్లవాడు పుట్టి చనిపోయాడట. ఆ తర్వాత ఆరేళ్ల వరకు ఆమెకు కాన్పు కాలేదు. తనకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేయిస్తానని ఆమె మొక్కుకుందట. అలా సినారె పుట్టాక ఆయనకు ‘సత్యనారాయణరెడ్డి’అని పేరు పెట్టారు. కానీ స్కూల్లో చేర్పించేటప్పుడు వాళ్ల నాన్న ‘సి.నారాయణరెడ్డి’అని రిజిస్టర్లో రాయించారు. దీంతో ఆ పేరే స్థిరపడిపోయింది. 1948లో కరీంనగర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న రోజుల్లోనే నైజాం రాష్ట్రానికి స్వాతంత్య్రం రావాలని ఆకాంక్షిస్తూ కవిత్వం రాశారు. ‘మారాలి మారాలి మారాలిరా కరడుగట్టిన నేటి కరకు సంఘపు రంగు మారాలి మారాలి మారాలిరా..’అంటూ రాశారు. కవివరేణ్యుల బాటలో... ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న చాదర్‌ఘాట్ కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో జువ్వాడి గౌతమరావు సంపాదకత్వంలో వెలువడే ‘జనశక్తి’పత్రికలో ఆయన మొదటి కవిత ప్రచురితమైంది. ఇంటర్, డిగ్రీ కూడా ఆయన ఉర్దూ మీడియంలోనే చదివారు. ‘‘ఆ రోజుల్లోనే హైదరాబాద్‌ను చూడగానే ఒక మహానగరాన్ని సందర్శించిన గొప్ప అనుభూతి కలిగింది. సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషా నిలయంలో చేరాను. తొలిసారిగా ఆధునిక కవిత్వంలో శిఖరప్రాయులైన గురజాడ, రాయప్రోలు, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, జాషువా, శ్రీశ్రీ వంటి భావకవుల, అభ్యుదయ కవుల రచనలు చదివాను..’’అంటూ ఆయన అప్పుడప్పుడు తన అనుభూతులను పంచుకొనేవారు. ‘ప్రహ్లాద చరిత్ర’, ‘సీతాపహరణం’వంటి పద్యనాటికలు,‘భలేశిష్యులు’వంటి సాంఘిక నాటికను ఆ రోజుల్లోనే రాశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో బీఏ చదివే రోజుల్లో (1952) కాలేజీ నుంచి ‘శోభ’అనే సాహిత్య సంచిక వచ్చేది. దానికి కొంతకాలం సినారె సంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ‘రోచిస్’, ‘సింహేంద్ర’పేర్లతో ఆ పత్రికకు కవితలు రాశారు. ఎంఏ చదివే రోజుల్లో ‘సినీకవి’అనే నాటికను రాసి ప్రదర్శించారు. దాంట్లో ఆయన వేసిన ‘మకరందమూర్తి’పాత్రకు ఉత్తమ బహుమతి లభించింది. యూనివర్సిటీ తెలుగు విద్యార్థి సమితికి, ఆ తర్వాత తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పని చేశారు. ఆ రోజుల్లో ఆబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో జరిగిన ఓ కవి సమ్మేళనంలో విద్యార్థి కవిగా పాల్గొన్నారు. ‘‘ఆ సమ్మేళనంలోనే మహాకవి దాశరథి కృష్ణమాచార్య పరిచయ భాగ్యం లభించింది. ఆయన నాకు గొప్ప ఆదర్శప్రాయులు. ఆ రోజుల్లో మా ఇద్దరిని ‘తెలంగాణ నయన యుగళం’అని పిలిచేవారు. నేను రాసిన ‘జలపాతం’కావ్యాన్ని ఆ మహాకవికే అంకితం ఇచ్చాను’’అని సినారె తరచూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొనేవారు. పదవులకే వన్నె... ఎంఏ పూర్తయ్యాక కొంతకాలం సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా సినారె పనిచేశారు. అక్కడే 1955లో ఆంధ్రోపన్యాసకుడిగా ఉద్యోగ జీవితం ఆరంభమైంది. 1958లో నిజాం కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరారు. ఆ సమయంలోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి సూచన మేరకు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వం –సంప్రదాయములు, ప్రయోగములు’అంశంపై పరిశోధన చేశారు. 1962లో పీహెచ్డీ పట్టా పొందారు. ఆ మరుసటి ఏడాదే ఓయూ తెలుగు శాఖలో ‘రీడర్’గా చేరారు. 1976లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1981 వరకు అధ్యాపక వృత్తిలోనే కొనసాగారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా 1981 నుంచి 1985 వరకు పని చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985 నుంచి 1989 వరకు ఈ పదవిలో ఉన్నారు. అనంతరం తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా చేరి 1992 వరకు కొనసాగారు. పబ్లిక్‌గార్డెన్స్‌లో వర్సిటీ భవనం కట్టించడంతోపాటు, యూజీసీ గుర్తింపు తేవడం, కూచిపూడి కళాక్షేత్రాన్ని తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురావడంతోపాటు అనేక కార్యక్రమాలు చేపట్టారు. భాషా సాంస్కృతిక సలహాదారుడిగా కొంతకాలం, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా 1987 నుంచి 2004 వరకు విధులు నిర్వహించారు. ప్రతిష్టాత్మక ‘హంస’పురస్కారాలు సినారె హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఈ సమయంలోనే నవల, కథానిక, పద్యం, గేయం, వచన నాటకం, సాహిత్య విమర్శ, ప్రసారమాధ్యమ రచనా విధానాలపై అధ్యయన శిబిరాలు ఏర్పాటు చేశారు. ‘సమైక్య రాగాత్మ’పేరుతో కర్ణాటక, హిందుస్తానీ, అరబిక్, పాశ్చాత్య సంగీత సంప్రదాయ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే 1997లో రాజ్యసభ సభ్యుడిగా సినారెకు అవకాశం లభించింది. ఆరేళ్లు ఆ పదవిలో కొనసాగారు. రచనలు.. అనేక భాషల్లోకి సినారె రాసిన గ్రంథాలు, రచనలు ఇంగ్లిషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. మొత్తం 18 రకాల సాహిత్య ప్రక్రియల్లో 90కి పైగా గ్రంథాలు రాశారు. ‘కర్పూర వసంతరాయలు’, ‘నాగార్జున సాగరం’, ‘తెలుగు గజళ్లు’, ‘కావ్యగానాలు’ప్రముఖంగా చెప్పవచ్చు. ‘విశ్వనాథ నాయకుడు’, ‘రుతుచక్రం’పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. సినారె స్వయంగా హిందీ, ఉర్దూల్లో కవితలు, గజల్స్ కూడా రాశారు. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990లో యుగోస్లేవియాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు. ‘విశ్వంభర’వచన కావ్యానికి 1988లో జ్ఞానపీఠ అవార్డు వరించింది. దానితోపాటు కలకత్తా భారతీయ భాషా పరిషత్ అవార్డును, కేరళ కుమారన్ ఆసన్ పురస్కారాన్ని, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డునూ అందుకుంది. ‘ఋతుచక్రం’కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1977లో పద్మశ్రీ పురస్కారం లభించింది. 1992లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. సినారె గజల్స్‌ని బాగా ఇష్టపడేవారు. ఏ సభల్లో పాల్గొన్న తాను గజల్స్ పాడుతూ ఇతరులచే పాడించేవారు. పాటలతో మనసు దోచుకున్నారు.. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1962 నుంచి సినారె సినీ పాటలు రాయడం ప్రారంభించారు. ‘గులేబకావళి కథ’సినిమాలోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని.. కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి..’అనే పాటతోపాటు ఆ సినిమాలోని అన్ని పాటలు ఆయనే రాశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘అరుంధతి’, ‘మేస్త్రీ’సినిమాల వరకు మొత్తం 3 వేల వరకు పాటలు రాశారు. ‘ఏకవీర’‘అక్బర్ సలీమ్ అనార్కలీ’సినిమాలకు మాటలు రాశారు. ‘గున్న మామిడీ కొమ్మమీదా..గూళ్లు రెండున్నాయి..’‘పగలే వెన్నెలా.. జగమే ఊయలా..’, ‘వస్తాడు నా రాజు ఈ రోజు..’, ‘అమ్మను మించి దైవం ఉన్నదా..’, ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా...’, ‘ఓ ముత్యాల కొమ్మ.. ఓ.. మురిపాల రెమ్మా...’, అరుంధతిలో ‘జేజమ్మా.. మాయమ్మా...’అంటూ వచ్చిన పాటలన్నీ సినారె కలం నుంచి జాలువారిన ఆణిముత్యాలే. సినారె వారసత్వంలో ‘వరేణ్య’ సినారె కుటుంబమంతా కలసి 30 మందికి పైగానే ఉంటారు. అందరూ రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు. కానీ ఆయన ముని మనమరాలు (పెద్ద కూతురు గంగ మనుమరాలు) వరేణ్య మాత్రం తాత బాటలో పయనిస్తోంది. ఆమె ఇప్పుడు పన్నెండో తరగతి చదువుతోంది. ఆంగ్లంలో అద్భుతంగా రాస్తోంది. సినారెను ఆకట్టుకొనే ఎన్నో కవితలు రాశారు. ఆమె ‘త్రూ డెమన్ ఐ’అనే కథల సంపుటి రాశారు. అలాగే ‘టెండర్ రేస్’అనే కవిత్వం రాశారు. దీన్ని సినారె ‘లేత కిరణాలు’అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. శిఖరాలు అధిరోహించినా.. ఊరిపైనే ప్రేమ.. జీవితంలోనే ఎన్నో శిఖరాలను అధిరోహించినప్పటికీ సినారెకు తన ఊరిపై ఉన్న ప్రేమను మాత్రం ఏ రోజూ వీడలేదు. ఏటా స్వగ్రామానికి వచ్చి.. ఒకరోజంతా తన చిన్నతనంలో తిరిగిన ప్రదేశాలను, ఆటలాడిన మూలవాగును గుర్తుచేసుకునే వారు. గ్రామంలో ఆయనకంటే చిన్నవారిని ప్రేమతో పిలుస్తూ.. ఆ రోజంతా గ్రామంలో గడిపేవారు. తన చదువు కోసం పడిన కష్టాలు మరెవ్వరికీ ఎదురుకాకూడదని తన ఇంటిని గ్రంథాలయానికి అప్పగించారు. అందులోకి కావాల్సిన సామగ్రి, పుస్తకాలను ఏర్పాటు చేశారు. తాను రాసిన ప్రతీ రచన మొదటి సంచికను ముందుగా ఈ గ్రంథాలయానికి పంపించే వారని అక్కడి అభిమానులు చెబుతున్నారు. అలాగే తన సొంత స్థలంలో పాఠశాల భవనం నిర్మించడమే కాకుండా పిల్లలు ఆడుకునేందుకు రెండెకరాలు కేటాయించారు. వివిధ కులాలకు చెందిన 20 మంది కులస్తులకు దాదాపు కోటి రూపాయలకు పైగా వెచ్చించి సంఘ భవనాలు నిర్మించి ఇచ్చారు. గ్రామస్తులంతా శుభకార్యాలు చేసుకునేందుకు తల్లి బుచ్చమ్మ పేరిట కల్యాణ మండపాన్ని నిర్మించారు. హన్మాజీపేట–లింగంపల్లి గ్రామాల మధ్య మూలవాగుపై బ్రిడ్జి నిర్మించారు. కళాకారుల కోసం రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో సినారె కళాభవనాలను నిర్మించారు. ఇదీ ప్రస్థానం.. పేరు: సింగిరెడ్డి నారాయణరెడ్డి పుట్టిన తేదీ : 29 జూలై, 1931 సొంతూరు: హన్మాజీపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా తల్లిదండ్రులు: బుచ్చమ్మ, మల్లారెడ్డి భార్య: సుశీల కూతుళ్లు: గంగ, యుమున, సరస్వతి, కృష్ణవేణి అలంకరించిన పదవులు.. – ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు – డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు – రాజ్యసభ సభ్యులు – ఆంధ్ర(తర్వాత ‘తెలంగాణ’అయింది) సారస్వత పరిషత్తు అధ్యక్షులు వరించిన పురస్కారాలు – జ్ఞానపీఠ్ అవార్డు – పద్మశ్రీ, పద్మవిభూషణ్ – కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు – రాజాలక్ష్మీ పురస్కారం – సోవియట్–నెహ్రూ పురస్కారం – ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ – కళాప్రపూర్ణ – సినీకవిగా నంది పురస్కారాలు – పలు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు – 2014లో సాక్షి ‘జీవన సాఫల్య పురస్కారం’ రచనలు... నవ్వని పువ్వు (1953) జలపాతం (1953) విశ్వగీతి (1954) అజంతాసుందరి (1955) నారాయణరెడ్డి గేయాలు (1955) నాగార్జునసాగరం (1955) స్వప్నభంగం (1957) కర్పూర వసంతరాయలు (1957) వెన్నెలవాడ (1959) దివ్వెల మువ్వలు (1959) విశ్వనాథ నాయకుడు (1959) రామప్ప (1960) సమదర్శనం (1960) రుతుచక్రం (1964) అక్షరాల గవాక్షాలు (1965) వ్యాసవాహిని (1965) ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు (1967) జాతిరత్నం (1967) మధ్యతరగతి మందహాసం (1968) మరో హరివిల్లు (1969) గాంధీయం (1969) మంటలూ మానవులూ (1970) ముఖాముఖి (1971) మనిషిచిలక (1972) మీరాబాయ్(1972) మందార మకరందాలు(1973) ఉదయం నా హృదయం(1973) మార్పు నా తీర్పు(1974) శిఖరాలు లోయలు(1974) తేజస్సు నా తపస్సు (1975) తరతరాల తెలుగువెలుగు(1975) ముచ్చటగా మూడువారాలు మలేషియాలో తెలుగువాణి (1975) పగలే వెన్నెల(1976) ఇంటిపేరు చైతన్యం(1976) భూమిక(1977) నారాయణరెడ్డి నాటికలు (1978) మథనం(1978) ముత్యాల కోకిల(1979) విశ్వంభర(1980) సోవియట్ రష్యాలో పదిరోజులు (1980) మా ఊరు మాట్లాడింది(1980) సమీక్షణం(1981) పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు(1981) రెక్కలు(1982) అమరవీరుడు భగత్‌సింగ్(1982) సోవియట్ యూనియన్‌లో మరోసారి(1983) నడక నా తల్లి(1983) కాలం అంచుమీద(1985) తెలుగు గజళ్లు(1986) కవితా నా చిరునామా(1988) ఆరోహణ(1991) ప్ర‘పంచ’పదులు(1991) నిరంతరం(1991) తెలుగు కవితా లయాత్మకత(1992) జాతికి ఊపిరి స్వాతంత్య్రం(1993) దృక్పథం(1994) సినారె గజళ్లు(1995) కలం సాక్షిగా(1995) భూగోళమంత మనిషి బొమ్మ(1996) పాటలో ఏముంది.. నా మాటలో ఏముంది–1(1996) మట్టి..మనిషి..ఆకాశం(1997) పాటలో ఏముంది.. నామాటలో ఏముంది–2(1998) గదిలో సముద్రం(1998) వ్యక్తిత్వం(1999) సినారె గీతాలు(1999) దూలాలను దూసుకొచ్చి(2000) ముచ్చటగా మూడు వారాలు(2001) పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు(2001) సప్తతి ఒక లిప్తగా(2001) దట్ ఈజ్ వాట్ ఐ సెండ్(2002) రెక్కల సంతకాలు(2003) మూవింగ్ స్పిరిట్(2003) జ్వాలగా జీవించాలని(2004) కొనగోటిమీద జీవితం(2005) కలిసినడిచే కాలం(2006) ఏవీ ఆ జీవ నదులు(2007) సమూహం వైపు(2008) మనిషిగా ప్రవహించాలని(2009) విశ్వం నాలో ఉన్నప్పుడు(2010) నా చూపు రేపటి వైపు (2011) వాక్కుకు వయసులేదు(2012) -
సినారే మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
-
సినారే మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆకస్మిక మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ సినారే మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు రావడం తెలుగు జాతికి గర్వకారణం' అని అన్నారు. సినారె మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాహిత్య రంగంలో సినారె కృషి ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. అధ్యాపకుడు, సాహితీవేత్త, కవి, సినీ గేయ రచయితగా సినారె ఎనలేని కృషి చేశారన్నారు. సినారె సేవలు మరువలేనివి సి.నారాయణరెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహిత్య రంగానికి సినారె చేసిన ఎనలేనివన్నారు. ఎన్టీఆర్‌తో సినారె ఎంతో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా సినారె చేసిన సేవలు చరిత్రలో మిగిలిపోతాయన్నారు. సి.నారాయణరెడ్డి మృతిపట్ల ఏపీ మంత్రులు లోకేశ్, చినరాజప్ప, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
సినారె జ్ఞాపకాలు చెరిగిపోనివి: వైఎస్ జగన్
హైదరాబాద్: మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహిత డా.సి.నారాయణరెడ్డి మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తెలుగు సాహిత్యరంగంలో ఓ మహా ధ్రువతార నేలరాలిందని, సినారె మరణం తెలుగుజాతికి తీరనిలోటు అని వైఎస్ జగన్ అన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన సినారె తెలుగు సాహితీ రంగంలో రారాజుగా ఎదిగారని, కవిగా, మృదుభాషిగా, మానవతావాదిగా, సినీ గేయరచయితగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా.. ఆయన వదిలి వెళ్లిన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివని వైఎస్ జగన్ అన్నారు. సినారె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించిన వైఎస్ జగన్.. తన ప్రగాఢ సంతాపం తెలిపారు. -
అర్జీలకు ప్రాధాన్యం ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్ : పట్టణ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చే అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో సెప్టిక్ ట్యాంకులు లేకుండా ఉన్న మరుగుదొడ్లకు వాటిని నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మెప్మా సిబ్బందిని ఆదేశించారు. వివిధ పనుల కోసం కార్యాయానికి వచ్చే ప్రజలను తిప్పుకోకుండా పనులు వెంట వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో లైట్లు పోయిన ప్రాంతాలను గుర్తించాలని, అలాంటి చోట్ల వెంటనే కొత్త లైట్లు వేయాలన్నారు. ప్రకాశం బజార్లో ఒక్క లైట్ కూడా వెలగడం లేదని, అవన్ని వెలిగే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ సత్యనానాయణ, ఏసీపీ ప్రసాధరావు, డిఈలు వెంకటేశ్వర్లు, రాములు, పర్యావరణ ఇంజనీరు కొమ్ము ప్రసాద్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఇంత వరకూ తెలియని సినారె
వాషింగ్టన్ : తెలుగు వారికి పరిచయం అక్కరలేని పేరు ఆచార్య సి.నారాయణరెడ్డి (సినారె). ప్రముఖ కవిగా, సినీ గీత రచయితగా, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగానే కాక కేంద్రప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను సి.నారాయణరెడ్డి అందుకున్నారు. ఆయన జన్మదినం జులై 29వ తేదీ. ఈ సందర్భంగా సినారెతో తన 50 ఏళ్ల అనుబంధాన్ని మానవతావాది ఆచార్య నరిశెట్టి ఇన్నయ్య తన మనస్సులో నిక్షిప్తమైన జ్ఞాపకాల దొంతరలను ఇలా పంచుకున్నారు.. 1967 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సినారె తెలుగు శాఖలో పని చేస్తుంటే... తాను తత్వశాస్త్ర (ఫిలాసఫీ) శాఖలో ఆచార్యులుగా విధులు నిర్వహించేవాళ్లమని ఇన్నయ్య గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రతి రోజు తాము కలుసుకునే వాళ్లమని చెప్పారు. ఈ సందర్భంగా ఓ రోజు ఎం.ఎన్ రాయ్ రాసిన 'మారుతున్న భారతదేశం' పుస్తకం తెలుగులోకి అనువదించాను. దీనిని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించేందుకు ముందుకు వచ్చింది. ఆ సమయంలో సినారె ఎడిటర్‌గా ఉన్నారన్నారు. తన పుస్తకం చూసి... జనానికి అర్థమయ్యేలా అనువదించమని సినారె సూచించారని తెలిపారు. అలా నిష్కర్షగా చెప్పడం మా స్నేహానికి నిదర్శనమన్నారు. అంతే కాకుండా ఆయనలోని ఓ ముఖ్య లక్షణం కూడా అని ఇన్నయ్య పేర్కొన్నారు. అలాగే ఎమ్.ఎన్.రాయ్ రచించిన మరో గ్రంథాన్ని వివేచన -ఉద్వేగం - విప్లవం పేరుతో తెనుగులోకి అనువదించానని చెప్పారు. ఈ గ్రంథాన్ని సినారె తన ఉపన్యాసంలో చాలా విపులంగా సమీక్షించారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాత్రికేయుడు వి.సతీష్... సినారె ఉపన్యాసంపై స్పందించి.. నాలుగు పెగ్గులు సేవించినట్లుందని చమత్కరించారని ఇన్నయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ఉన్న సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుందని ఇన్నయ్య నెమరేసుకున్నారు. విశ్వవిద్యాలయంలో జోతిష్యం బోధనాంశంగా ఉండటాన్ని మానవవాద సంఘాలు అభ్యంతరం చెప్పాయి... దీనిపై శాస్త్రీయ పరిశీలన జరపాలని సదరు సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై సినారె స్పందించి... వైజ్ఞానికంగా జ్యోతిష్యం నిలబడుతోందా ? అనే అంశం పరిశీలించాలని.. అలాగే ఖగోళ శాస్త్రంతో పోల్చి చూడాలని ఆదేశించారు. అయితే ఈ విషయంపై గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న బెంగళూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు రామన్...సినారెపై కత్తులు నూరారు. ఆయన్ని వీసీ పదవి నుంచి తొలగించాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు రామన్ లేఖలు కూడా రాశారు. ఈ లోపు సినారె అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వీసీగా వెళ్లిపోయారన్నారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని సినారె ఇంట్లో కొంత కాలం మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆచార్య ఎన్ జి రంగా కొంత కాలం అద్దెకు ఉండేవారని తెలిపారు. అలానే 1948లో ఆలపాటి రవీంద్రనాథ్ సంపాదకత్వంలో వెలువడిన జ్యోతి పత్రికకు సినారె అనేక రచనలు చేశారు. ఈ సందర్భంగా తాను, సినారె, రవీంద్రనాథ్ ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేయడం అనవాయితీగా మరిందన్నారు. మరో మిత్రుడు, పాత్రికేయుడు డి ఆంజనేయులు తెలుగు కవులు, రచయితలను ఇతర రాష్ట్రాల వారికి తెలియజేస్తు అనేక సాహిత్య వ్యాసాలు రాసేవారు అలా రాసిన వాటిలో సినారెపై చాలా చక్కటి వ్యాసం రాశారన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగు భాష ప్రచారం కోసం కరీంనగర్ నుంచి శ్రీకాకుళంలోని కథానిలయం వరకు సాహిత్య యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో సినారెతోపాటు తాను పాల్గొన్నాని ఇన్నయ్య చెప్పారు. ఆ క్రమంలో విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఇద్దరం ప్రసంగించామని ఇన్నయ్య వెల్లడించారు. అలానే ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి సూర్యదేవర సంజీవదేవ్ హైదరాబాద్ విచ్చేసేవారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో సినారెను ఆహ్వానించగా... వచ్చి ప్రసంగించేవారని చెప్పారు. సినారెతో తన అనుబంధం గురించి చెప్పుకుంటే ఇంకా చాలా ఉందన్నారు. సినారెకు ప్రస్తుతం 87 ఏళ్లు. జ్ఞాపక శక్తి కించిత్ కూడా తగ్గలేదు. యూఎస్ నుంచి తాను పోను చేసి పలికరిస్తే.. ఆప్యాయంగా మాట్లాడతారని సినారెతో తనకు ఉన్న అనుబంధాలు మధురానుభూతులు చిరస్మరణీయాలని ఇన్నయ్య పేర్కొన్నారు.