Subba Rao
-
'బిగ్ బ్రదర్'’ మూవీ రివ్యూ
శివ కంఠంనేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘బిగ్ బ్రదర్’. భోజ్‌పురిలో వరుస విజయాలతో ‘రాజమౌళి ఆఫ్ భోజ్‌పురి’గా నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు గోసంగి సుబ్బారావు చాలా విరామం అనంతరం తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ రూపొందించిన చిత్రమిది. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా హెగ్డే హీరోయిన్గా నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా కీలక పాత్రలు పోషించారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ‘బిగ్ బ్రదర్’ చిత్రాన్ని నిర్మించారు.కథ‘బిగ్ బ్రదర్’ సినిమా అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో ఉంటుంది. శివ (శివ కంఠమనేని), గౌరి (ప్రియ హెగ్డే) పాత్రలతో కథ ప్రారంభమౌతుంది. వారిద్దరికీ నిశ్చతార్ధం జరిగి పదేళ్లు అయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో ఉంటారు. అలా వారి జీవితం సాగుతుండగా హైదరబాద్ నుంచి శివ సోదరుడు సూర్య (శ్రీ సూర్య) కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా అటాక్ జరుగుతుంది. అయితే, ఆ సమయంలో తమ్ముడిని కాపాడుతాడు శివ.. అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల తనకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లవద్దని తమ్ముడికి చెబుతాడు శివ. కానీ, ఈ విషయంలో అన్న మాటలను లెక్క చేయకుండా తన వదినకు ఏవో నాలుగు మాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లూ ఉంటాడు. ఆ సమయంలో పూజ (ప్రీతి) సూర్యకు పరిచయం అవుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడుతారు. ఒకసారి వారిద్దరిపైనా ఎటాక్ చేసేందుకు కొందరు రంగంలోకి దిగుతారు. వారిని ఆ ఇద్దరు బ్రదర్స్ తిప్పికొడతారు. కానీ, ఆ దాడి సూర్య మీద జరిగిందని శివ అనుకుంటాడు. వాస్తవానికి ఆ ఎటాక్ జరిగింది పూజ కోసం అని తర్వాత తెలుస్తోంది. ఇంతకీ పూజ ఎవరు..? ఆమెపై దాడి చేసేందుకు వచ్చిన వారు ఎవరు..? సూర్య, పూజల గతం ఏంటి..? నిశ్చితార్థం అయినా కూడా శివ ఎందుకు పెళ్లి చేసుకోలేదు. పూజ కుటుంబ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అనేది తెలియాలంటే ‘బిగ్ బ్రదర్’ సినిమా రన్ అవుతున్న థియేటర్‌కు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటేచిన్న సినిమా అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను టార్గెట్ చేస్తూ కథను చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమా మొదటి భాగం అంతా కూడా కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇద్దరి బ్రదర్స్ మధ్య ఉన్న రిలేషన్‌తో పాటు వదినపై మరిది చూపించే గౌరవప్రదమైన ప్రేమ, నానమ్మతో మనుమడి అల్లరి ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాడు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సినిమాలో కామెడీ, ఫైట్స్ పాటలు కూడా మెప్పించేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసేలా ఉన్నా ఇంటర్వెల్ సీన్ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఎంతో సరదగా సాగిన కథ సెకండాఫ్‌లోకి వెళ్తే.. అదే రేంజ్లో మెప్పించేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు.అక్కడి నుంచి సినిమా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. కాలేజ్ ఏపిసోడ్స్ రావడంతో యూత్‌ను బాగా మెప్పిస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు మంచి ఎంటర్టైన్ చేస్తాయి.కాలేజ్ ఫ్లాష్ బ్యాక్‌తో పాటుగా ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ కూడా మరోవైపు జరుగుతూ ఉంటుంది. శివ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సి వచ్చిందనే పాయింట్‌ను చాలా చక్కగా చూపించాడు. ఆ సమయంలో ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవుతారు. సినిమాలో తమ్ముడి ప్రేమను గెలిపించేందుకు అన్న చేసే పోరాటం చాలా చక్కగా ఉంటుంది.ఎవరెలా చేశారంటేశివ పాత్రలో శివ కంఠమనేని మెప్పించాడు. తనదైన స్టైల్లో ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కథకు తగ్గట్లు ప్రేమ, కోపం,సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పండించాడు. శివ పాత్ర తరువాత ఈ చిత్రంలో సూర్య పాత్రే ప్రధానంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఒకరకంగా కనిపించిన సూర్య.. సెకండాఫ్ వచ్చేసరికి మరోలా మెప్పిస్తాడు. పూజ పాత్రలో ప్రీతి గ్లామరస్‌గా మెప్పిస్తే.. గౌరి పాత్రలో ప్రియ హెగ్డే కథకు తగ్గట్లు నటించింది. ఇందులోని సంగీతం పర్వాలేదనిపిస్తుంది. పాటలు చూడటానికి బాగున్నప్పటికీ త్వరగా గుర్తిండిపోయేలా లేవు. కెమెరామెన్ స్థాయికి తగ్గట్లు పర్వాలేదనిపిస్తుంది. ఫైనల్‌గా బిగ్ బ్రదర్ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. -
‘బిగ్ బ్రదర్’తో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్న భోజ్‌పురి డైరెక్టర్
శివ కంఠంనేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘బిగ్ బ్రదర్’. భోజ్‌పురిలో వరుస విజయాలతో ‘రాజమౌళి ఆఫ్ భోజ్‌పురి’గా నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు గోసంగి సుబ్బారావు చాలా విరామం అనంతరం తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ రూపొందించిన చిత్రమిది. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా హెగ్డే హీరోయిన్గా నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. మే 24న భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ... "అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో... ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ దట్టించి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం "బిగ్ బ్రదర్". శివ కంఠంనేని మరోసారి ఇందులో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. ఈ చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై తెలుగులో వరసగా సినిమాలు చేస్తాను’ అన్నారు. -
పల్నాడు జిల్లాలో పట్టపగలే రెచ్చిపోయిన పచ్చపార్టీ రౌడీగ్యాంగ్
-
దేవినేని ఉమకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న బొమ్మసాని
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దేవినేని లేకుండానే బొమ్మసాని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే దేవినేని నాయకత్వాన్ని బొమ్మసాని, అతని వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉంటే, మైలవరంలో లోకల్ నినాదం కూడా రోజురోజుకి బలపడుతోంది. రాబోయే ఎన్నికల్లో ఈసారి స్థానికుడే టికెట్ ఇవ్వాలంటూ బొమ్మసాని వర్గం డిమాండ్ చేస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో బొమ్మసాని నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు ఆ వర్గం ప్రకటించింది. దీంతో మైలవరం టీడీపీలో కలవరం మొదలైంది. చదవండి: (సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడుతున్న బాబు.. కంటి మీద కునుకు కరువే!) -
కథ: డార్క్ ఫాంటసీ.. అతడి మాటల మాయలో పడ్డ ఆమె.. చివరికి!
‘దిక్కుమాలిన వాన.. ఇప్పుడే తగులుకోవాలా? కాసేపు ఆగాక రాకూడదూ’ ఆకాశం వైపు చూస్తూ తనలో తనే అనుకుంది యామిని. కడుపునిండా నీళ్లు తాగిన ఏనుగుల గుంపు హడావిడిగా తిరుగుతున్నట్లుగా దట్టమైన మేఘాలతో నిండిపోయింది ఆకాశం. ఎక్కడెక్కడికో ఎగిరెళ్ళిన పక్షలన్నీ గూళ్లకు చేరుకోవడానికి ఆరాటపడి గుంపులు గుంపులుగా ఆకాశాన్ని కమ్మేశాయి. చూస్తుండగానే సాయంకాల పగటి గీతలన్నీ కాటుక పూసినట్లుగా నల్లగా మారిపోసాగాయి. చెట్లన్నీ సామూహిక బృందగానం చేస్తున్నట్లుగా పెద్దగా చప్పుడు చేస్తూ ఊగసాగాయి. యామిని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఇంట్లోనుంచి వాకిట్లోకి, వాకిట్లో నుంచి ఇంట్లోకి తిరుగుతూ లోలోపలే గొణుక్కోసాగింది. ఆలోచనలు అదుపుతప్పిన గుర్రంలా పరుగులు తీయసాగాయి. ‘ఏమయిందే.. కాలుగాలిన పిల్లిలాగా లోపలికీ బయటికీ తిరుగుతున్నావ్. దండెం మీద బట్టలన్నీ ఇంట్లోకి తెస్తావా? లేక తడిసిపోతున్న వాటిని చూస్తూ బయటే నుంచుంటావా? ఏమిటో నీ వాలకం అర్థం కాకుండా ఉంది’ అత్తగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చిన యామిని అదిరిపడి ఆమెవైపు చూసి ఒక్కసారిగా గతుక్కుమంది. తనను, తన ఆలోచనలను చదివేస్తున్నట్లుగా మాట్లాడుతున్న అత్తవంక అయోమయంగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా నిల్చున్న యామినిని చూస్తూ ‘పెద్దదాన్ని.. నా మాటంటే ఎలాగూ లెక్కలేదు. కనీసం కడుపున పుట్టిన కాయలమీదైనా కాసింత ప్రేముండొద్దూ’ అంది. వసారాలోని అరుగుమీద ఆడుకుంటున్న పిల్లలవంక చూసింది యామిని. మెరుస్తున్న మెరుపులు, కురుస్తున్న చినుకులు తమకోసమే అన్నట్లుగా చూపుల్లో స్వచ్ఛతను, ముఖంలో అమాయకత్వాన్ని నింపుకుని ఎవర్నీ పట్టించుకోకుండా ఆడుతున్నారు పిల్లలు. ఐదేళ్లు నిండిన పెద్దపాప పెద్ద ఆరిందలా మారిపోయి మూడేళ్ల చిన్నపాపకి ఆకాశాన్ని చూపిస్తూ ఏదో చెప్పసాగింది. చిన్నపాపకి ఏదో అర్థమైనట్లుగా తలాడిస్తూ మధ్యమధ్యలో నవ్వులు చిందిస్తోంది. చూపు పిల్లల మీద నుంచి వానచినుకుల మీదకు మళ్ళించింది. వానంటే పెద్ద వానా కాదు.. అలాగని బయటికి వెళ్తే తడవకుండా రావడం కూడా సాధ్యం కాదు. కానీ వెళ్లాలి! ఎలాగైనా వెళ్లాలి. భర్త అనుమానపు చూపుల ముళ్లనుంచి, అత్తగారి ఆంక్షల నుంచి, కాళ్లకు చుట్టుకునే పిల్లల బంధనాలను విడిపించుకుని కాసేపైనా వెళ్లిరావాలి. అతని చూపుల సుడిగుండంలో కొట్టుకుపోవాలి. మాటల ప్రవాహంలో మైమరచిపోవాలి. ఏదో స్థిరనిశ్చయానికి వచ్చినట్లుగా వసారాలోకి నడిచింది. నేలమీద కూర్చున్న అత్తగారి వీపుమీద పెద్దది, ఒడిలో చిన్నది కూర్చుని ఆడుకుంటూ కనిపించారు. ఆమెను సమీపించి ‘అత్తయ్యా.. ఒకసారి బయటికి వెళ్ళొస్తాను’ అంది యామిని. అత్తగారి కళ్లల్లో ఉరుములు కనిపించాయి. ‘తొందరగా వచ్చేస్తాను’ అంది యామిని. ‘ఎందుకు?’ ‘రజనిని కలవాలి. ఈ సాయంత్రం వస్తానని చెప్పాను. తీరాచూస్తే వాన మొదలయింది’ . ‘వాన మొదలయిందని నువ్వే అంటున్నావు. ఎలా వెళ్తావు మరి?’ ‘గొడుగేసుకుని..’ అత్తగారు పళ్లకొరుకుతూ కొరకొరా చూస్తూ ‘వాడొస్తాడుగా.. తీసుకుని వెళ్లు’ అంది. ‘అలసిపోయి వస్తారుగా మళ్ళీ ఇబ్బంది పెట్టడమెందుకు? నేను వెళ్లొస్తాను. పర్లేదు ’ అంది యామిని. ‘మరి పిల్లలు..’ ‘అన్నం తినిపించి..’ యామిని వాక్యం పూర్తి కాకుండానే ‘జోల కూడా పాడి నిద్రపుచ్చుతాను. నువ్వు మాత్రం చక్కగా గొడుగులేసుకుని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అడ్డమైన వాళ్లని కలిసిరా’ అత్తగారి స్వరంలో తీవ్రత పెరగడం యామిని దృష్టిని దాటిపోలేదు. ‘వానవల్ల చీకటి పడిందిగానీ టైం ఇంకా ఆరు కూడా దాటలేదు’ అంది యామిని. ‘ఆరుదాటిందో ఏడుదాటిందో అరవై దాటినదాన్ని నాకెలా తెలుస్తుంది? నీకులాగా చదువుకున్నానా ఏమన్నానా? నువ్వంటే అన్ని కాలాలనూ చదివేశావు. నాదంతా వానాకాలం చదువు. నీకెలా తోస్తే అలా చెయ్’ ఉరిమినట్లు చూస్తున్న అత్తగారి చూపుల నుంచి తప్పించుకుని ఉరికినట్లుగా అక్కడినుంచి కదిలింది యామిని. గోడమేకుకి వేళాడుతున్న నల్లటి గొడుగును తీసుకుని బెడ్రూములోకి వెళ్లి నిలువుటద్దం ముందు నుంచుని చెదిరిన తలను, నలిగిన బట్టల్ని సరిచేసుకుంది యామిని. గదిలోనుంచి వసారాలోకి, అక్కడినుంచి వాకిట్లోకి నడిచింది. అత్తగారిని చూడడానికి ధైర్యం సరిపోలేదు. ఆవిడ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక లేదు. ముందు అక్కడినుంచి బయటపడాలనే తపన ఆమెను తొందర పెట్టింది. నేలంతా చిత్తడి చిత్తడిగా ఉంది. ప్రహరీ మెట్లు దిగి రోడ్డుమీద నడవసాగింది. ఇళ్లకుపోతున్న కార్లు, స్కూటర్ల హడావిడి తప్ప దాదాపు రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. తలమీద చున్నీలను, చీరకొంగులను కప్పుకుని వేగంగా నడుస్తున్న కొందరు ఆడవాళ్లు కనిపించారు. అంతవానలో అతన్ని కలవడం అవసరమో కాదో తేల్చుకోలేక పోతోంది యామిని. వెళ్లకపోతే ఏదో పోగొట్టుకున్న ట్లుగా మనసంతా వెలితిగా అనిపించసాగింది. అలాగని పిల్లల్ని విడిచిపెట్టి రావడానికి మనసు అంగీకరించకుండా ఉంది. ఆగడానికి, సాగడానికి మధ్య ఊగిసలాట కొద్దిరోజుల క్రితం అతనితో జరిగిన పరిచయాన్ని గుర్తుకు తెచ్చింది యామినికి. ∙∙∙ ‘మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?’ అని వినిపించడంతో ఉలిక్కిపడి పక్కకి చూసింది యామిని. సన్నగా, పొడుగ్గా, ఆకర్షణీయంగా ఉన్న ముఖంతో, నిర్లక్ష్యంగా గాలికి ఎగురుతున్న జుట్టుతో ఓ వ్యక్తి కనిపించాడు. పిల్చింది తనను కాదేమోనని కూరగాయలు తీసుకోవడంలో నిమగ్నమైంది యామిని. ‘ఏమండీ.. మిమ్మల్నే.. ఏ కాలేజీలో చదువుతున్నారు?’ మళ్ళీ అడిగాడు. అతనివంక ఆశ్చర్యంగానూ, కోపంగానూ చూస్తూ ‘కళ్లుపోయాయా? కాళ్లకున్న మట్టెలు, మెడలో తాళి కనబడట్లేదా?’ అంది. ‘మెడలో తాళీ, కాళ్లకు మెట్టెలా? ఏవీ ఎక్కడా కనబడవే? ఇష్టం లేకపోతే చెప్పడం మానెయ్యాలి గానీ అబద్ధాలు చెప్పకూడదు’అన్నాడు పెద్దగా నవ్వుతూ. యామినిలో అయోమయం తొంగిచూసింది. వెన్నులో ఎక్కడలేని భయం మొదలైంది. తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టూ చూసింది. మార్కెట్టులోని జనాలంతా హడావిడిగా కూరగాయల దుకాణాలతో కుస్తీపడుతూ కనిపించారు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న యామిని తన కాళ్లవైపు చూసుకుని అదిరిపడింది. కాళ్లకు ఉండాల్సిన మెట్టెలు కనిపించలేదు. కంగారుగా మెడ తడుముకుంది. బోసిగా కనబడి వెక్కిరించినట్లుగా అనిపించింది. కంగారును కనబడనీయకుండా కూరగాయలు తీసుకుంటున్న యామినికి ‘నాకు తెలిసి మీరు ఏ డిగ్రీ ఫస్టియరో చదువుతూ ఉండాలి’ అన్న మాటలు వినిపించాయి. చేస్తున్న పనిని ఆపి అతని వైపు చూస్తూ ‘ఇద్దరు పిల్లలు నాకు’ అంది కోపంగా. ఆమెవైపు చూసి పెద్దగా నవ్వుతూ ‘ మీకు ఇద్దరు పిల్లలేంటండీ బాబూ! అయితే సంతూర్ సబ్బు యాడ్ మీతో కూడా ఇప్పించాల్సిందే’ అన్నాడు చిలిపిగా ఆమె కళ్లల్లోకి చూస్తూ. ఆమెలో కోపానికి బదులుగా ఎక్కడలేని సిగ్గూ ముంచుకొచ్చింది. ఎంత చక్కగా తయారైనా ‘బాగున్నావు’ అని ఒక్క మాట కూడా మాట్లాడని భర్త గుర్తొచ్చాడు. పైనుంచి కిందకీ, కిందనుంచి పైకీ గుచ్చి గుచ్చి చూసే అత్త గుర్తొచ్చింది. అందాన్ని కూడా అరకేజీలుగానో, కేజీలుగానో మార్చి అంగళ్లలో అమ్మేస్తే బాగుండు. మగాళ్లకి అర్రులు చాచే పనుండదు, ఆడవాళ్ళకి అద్దాలతో పనుండదు. తన అందం అప్పటివరకూ భర్త అవసరాలు తీర్చడానికి, బలవంతపు అనుభవాల్ని బహుమానంగా అందించడానికి పనికొచ్చింది. ఇప్పుడు మాత్రం పొగడ్త ద్వారా అంతర్లీనంగా అణచిపెట్టిన సంతృప్తికి దగ్గరచేసింది. ముఖం చిట్లించి మనసుని ముక్కలు చేసే భర్త దగ్గర లభించని సాంత్వనేదో యామిని మనసును మెలితిప్పసాగింది. ‘అయితే ఇక్కడికి రోజూ వస్తారా’ అన్న మాటతో ఆలోచనలలో నుంచి బయటికి వచ్చింది. ‘వారానికోసారి..’ మనసు ఆపుతున్నా నోరు సమాధానం చెప్తూనే ఉంది. ‘ఈరోజు బుధవారం. అంటే మళ్ళీ వచ్చే బుధవారం దాకా వెన్నెల కనిపించదన్నమాట’ ‘వెన్నెల రాత్రి మాత్రమే కనిపిస్తుంది. తల్చుకోగానే మార్చుకోవడానికి అదేమీ తలగడ కాదు’ అంది. ‘వచ్చే బుధవారం పగలే వెన్నెల్ని చూడాలని ఆశపడుతున్నాను. మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తాను’ చెప్పి యామిని వైపు తిరిగి ఆమె కళ్లలోకి చూశాడు. ఆమె అతనివైపు బేలగా చూసింది. ‘వద్ద’ని చెప్పడానికి మనసు అంగీకరించట్లేదు, ‘కుదరద’ని చెప్పడానికి మాట పెగలట్లేదు. ఏమీ మాట్లాడకుండా కావలసినవి తీసుకుని అక్కడినుంచి బయటపడింది. ‘వచ్చే బుధవారం.. ఇక్కడే.. ఇదే టైమ్..’ వెనక నుంచి వినిపిస్తున్న మాటలు యామిని చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. విసురుగా వచ్చిన ఎదురుగాలికి గొడుగు వెనక్కి ముడుచుకుపోయి వానజల్లు ముఖం మీద పడేసరికి తుళ్ళిపడింది. ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చి చుట్టూ చూసింది. రోడ్డుపక్కనున్న చెట్లన్నీ గాలికి పూనకం వచ్చినట్లుగా భయంకరంగా ఊగుతున్నాయి. తారుడబ్బాల్ని కుమ్మరించినట్లుగా కళ్లముందు చీకటి కదలాడుతోంది. గొడుగు సరిచేసుకుని ముందుకు నడుస్తున్న యామినికి ఒకే కర్రను రెండు చివర్లా పట్టుకుని నడుస్తున్న ముసలి జంట కనిపించారు. వయసులో ఉన్నప్పుడు వందమంది దొరకొచ్చుగానీ వయసుడిగాక మాత్రం భార్యాభర్తలే ఒకరికొకరు ఊతకర్రలేమో అనిపించింది. మనసులో ఆలోచనలేవో సుడులు తిరగసాగాయి. వేగంగా నడవడం వల్ల ఆయాసం ఎక్కువవసాగింది. మెడలో వేలాడుతున్న నల్లపూసల గొలుసు బరువుగా కదలాడుతోంది. తొందరగా వెళ్లాలని గబగబా ముందుకు నడిచి ఏదో అడ్డంపడినట్లుగా ముందుకు తూలిన యామిని అటువైపు చూసింది. వానను కూడా లెక్కచేయకుండా కోర్కెలు తీరని దెయ్యాల్లా చెట్టుచాటున కౌగిలించుకుంటున్న పడుచుజంట కనిపించారు. శృంగారానికి, బంగారానికి ఇష్టమే కొలమానమేమో! కొనాలనే ధ్యాస, కావాలనే ఆశ ఎలాంటి వారినైనా ఊరించి ఊరించి ఊబిలో ముంచేస్తుందేమో! కోరిక కూడా చీకటికంటే చిక్కగా ఉంటుందేమో...! తన ఆలోచనలకు తనలో తానే నవ్వుకుంది యామిని. ‘ఏమీ తెలియని వాడు ఒక్కసారి బోర్లాపడితే అన్నీ తెలిసిన వాడు మూడుసార్లు బోర్లా పడ్డట్టుగా’ అయిపోయింది తన పరిస్థితి. ‘ఏ కాలేజ్’ అని అడిగినప్పుడు వచ్చిన కోపం ‘యాడ్’ ప్రస్తావన వచ్చేసరికి సంతూరు సబ్బులా జారిపోయింది. ‘మళ్ళీ కలుద్దాం’ అని అతనన్నప్పుడు వచ్చిన చిరాకు ‘పగలే వెన్నెల్ని చూడాలనుంది’ అన్నప్పుడు మబ్బుల్లో తేలిపోయింది. పొగడ్త ఎంత పని చేస్తుంది? సాధ్యం కాదనుకున్న పనిని కూడా సావధానంగా అయ్యేలా చేస్తుంది. దేహానికి మెరుపునీ, మైమరుపునీ ఇస్తుంది! గొడుగును కొద్దిగా వంచి మార్కెట్టు వైపు చూసింది. మిణుగురు పురుగుల్లా అక్కడక్కడా వెలుగుతున్న వీథి దీపాల కాంతితప్ప అంతా చీకటిగా కనిపించింది. చినుకులు నిలువుగా కురుస్తున్నాయి. ఎక్కడో సగం వెలుతురు, సగం చీకటి కలిసిన మూలలో ఉన్న షెడ్డు కింద కనిపించాడతను. అడుగంటిన బావినీటిని ఆబగా తోడుకుని దాహం తీర్చుకున్నట్లుగా ఆమె ప్రాణం తెప్పరిల్లింది. గబగబా అక్కడికి నడిచి అతని పక్కన నిలబడింది. ఆమెకు అంతా కొత్తగా ఉంది. చుట్టూ పరచుకున్న చిమ్మచీకటి ఆమెను సాగనంపడానికి వచ్చిన స్నేహితురాల్లా అనిపించింది. అక్కడక్కడా కనిపిస్తున్న గుడ్డి వెలుతురు ఆమె చేస్తున్న పనిని చూడటానికి లోకం పంపించిన భూతద్దంలా కనిపించింది. తనది కాని ‘సగభాగం’ పక్కన సజీవంగా నిలబడిందో లేక జీవచ్ఛవంలా నిలబడిందో అర్థం కాకుండా ఉంది. వదిలేసి వచ్చిన బాధ్యతలన్నీ ఆమె వేడి వేడి నిట్టూర్పుల్లో పడి కాలిపోసాగాయి. ‘కొంచెం దగ్గరగా జరుగు’ అన్న మాటతో అతనివైపు చూసింది. పొగలు కక్కుతున్న ఫ్యాక్టరీ గొట్టంలా ఆమె కళ్లకు కనిపించాడతను. ఆమె అతనికి దగ్గరగా జరిగింది. అతను తన రెండుచేతులతో ఆమెను మరింత దగ్గరగా తీసుకుని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకోబోయాడు. యామిని అరచేతుల్ని అడ్డంపెట్టి ‘ఇది నీకు తొలిముద్దా?’అంది. అతను ఆమె వైపు విస్మయంగా చూస్తూ ‘నీకూ కాదుగా’ అన్నాడు. యామిని అతన్ని తోసేసి దూరంగా నిలబడింది. ఆమె ఆలోచనలు సముద్ర తరంగాల్లా ఎగసిపడుతున్నాయి. పశ్చాత్తాపంతో ఆమె హృదయం దహించుకుపోసాగింది. ఒక్కసారిగా భర్త, అత్త, పిల్లలు గుర్తొచ్చి ఆమె కళ్లు తడిబారాయి. ఇన్నాళ్ళూ ఇల్లంటే బందిఖానా అనుకుంది తను. కానీ మనిషికైనా, మనసుకైనా ఆంక్షలు అవసరమని, బంధాలను బరువుగా భావించడం కంటే బాధ్యతగా స్వీకరిస్తే బతుకు భద్రంగా ఉంటుందని ఆమెకు అర్థమైంది. యామిని అతని వైపు ఒకసారి చూసి అక్కడినుంచి బయల్దేరింది. ‘ఇందుకేనా వచ్చింది’ వెనక నుంచి వినబడిన మాటతో ఒక్క నిముషం ఆగిపోయింది. అతని వైపు చిర్నవ్వుతో చూస్తూ ‘ఇన్నాళ్లూ ఏదో భ్రమలోనూ, భ్రాంతిలోనూ ఉన్నాను. ఈ చీకటి నా కళ్ళు తెరిపించింది. నల్లని మబ్బులతో నిండిన ఆకాశం, వేసుకొచ్చిన నల్లని గొడుగు, ఈ నల్లపూసల గొలుసు.. అన్నిటినీ మించి అంధకారంతో నిండిన నా మనసు నన్నింతదూరం నడిపించాయి. దారిలో ఎదురైన జంటలు నాకు పాఠాన్ని నేర్పించాయి. నాలో పరివర్తన కలిగించాయి. నా ఇంట్లో దీపాన్ని వెలిగించాల్సిన బాధ్యత నామీద ఉంది. ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. మనం ఏర్పరచుకునే సంబంధాలు హత్యల్నో, ఆత్మహత్యల్నో కానుకగా ఇవ్వకూడదు. పీడకలల్లా వెంటాడకూడదు. గుర్తుంచుకునే ఙ్ఞాపకాల్లా మిగలాలి..’ చెప్పి ముందుకు కదిలింది యామిని. చేతికి చిక్కన చేప కళ్లముందే క్షణాల్లో చేజారిపోవడంతో అతనిలో నిరాశ తొంగిచూసింది. గట్టిగా నిట్టూర్పులు విడుస్తూ అక్కడి నుండి కదిలి చీకట్లో కలిసిపోయాడు. -డా. జడా సుబ్బారావు -
బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె
ఆధునికాంధ్ర కవుల్లో నిత్యనూతన మూర్తి డాక్టర్ సి. నారాయణరెడ్డి సంప్రదాయాన్ని జీర్ణించుకున్న అభ్యుదయ కవి, సినీ అభిమాన ప్రేక్షకుల గుండె తెర కవి సినారె. పద్యాన్ని హృదయంగా, గేయాన్ని శ్రవణపేయంగా, వచన కవిత్వంలో కూడా అంత్యప్రాసలను అలవోకగా ప్రయోగించి, పాఠకుల మన్ననలు అందుకున్న మేటి కవి. దాదాపు 70 కావ్యాలను, వేలాది సినీ గీతాలను రాశారు. ప్రామాణికమైన ‘ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయము–ప్రయోగములు’ అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. వేలాది సాహితీ ప్రసంగాలతో శ్రోత లను అలరించారు. సింగిరెడ్డి నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల తాలూకా హను మాజిపేటలో 1931 జూలై 29వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదం డ్రులు బుచ్చమ్మ, మల్లారెడ్డి. సిరిసిల్ల, కరీంనగర్, హను మాజీపేటలో పాఠశాల విద్యాభ్యాసం సాగింది. 1963 నుండి ఉస్మానియా విశ్వవిద్యాల యంలో ఎంఏ, పీహెచ్డీ డిగ్రీలు పొంది రీడర్‌గా, ప్రొఫె సర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ సార్వ త్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా గణనీయమైన సేవలు అందించారు. సాహిత్యం ద్వారా గ్లామర్ గడించిన వ్యక్తి సినారె. 1952 నుండి 2017లో మరణించే వరకు నిరంతరం రచనలు చేశారు. పాతకొత్తల మేలు కలయికల కవిత్వానికి అవసరమైన గురజాడ తత్వాన్ని, శ్రీశ్రీ అభ్యుదయ వారసత్వాన్ని జీర్ణిం చుకున్న కవి. కవితా ఉద్యమాలన్నింటినీ సమ ర్థించారు. పగలే వెన్నెల (చలనచిత్ర గీతాల సంకలనం)‘పాటలో ఏముంది – నా మాటలో ఏముంది’ సినిమా పాటల విశ్లేషణ, సినారె ఛలో క్తులు తన గ్రంథాలలో ప్రసిద్ధాలు. ఆయన రచనలు ఎన్నో అవా ర్డులు గెలుచుకున్నాయి మంటలు– మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభిం చింది. రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, సోవియెట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, కుమారన్ ఆశాన్, భార తీయ భాషా పరిషత్తు, కలకత్తావారి భిల్వార అవార్డు మొదలైనవి ఆయన విశ్వంభర కావ్యానికి లభించాయి. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు 1988లో విశ్వంభరకు లభించడం ఆయన కవితా ప్రతిభకు శిఖర ప్రమాణం. తెలుగులో జ్ఞానపీఠ బహుమతిని అందుకున్న రెండోకవి సినారె. భారత ప్రభుత్వం 1992లో పద్మభూషణ్‌తో సత్క రించింది. భౌతికంగా దూరమైనా, తన రచనల ద్వారా సాహితీప్రియుల, సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవి. -డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు.. మొబైల్ : 98491 77594 (జూన్ 12న సినారె నాలుగో వర్ధంతి) చదవండి: చరిత్రగా మిగిలిపోనున్న వరంగల్ జైలు -
ఆ రంగస్థల నటుడికి ఏవీ సుబ్బారావు అవార్డు
సాక్షి, తెనాలి: ఆయన పద్య గానం పౌరాణిక నాటక రంగాన్ని ప్రకాశింపజేసింది. తెనాలి కళారంగ ఆణిముత్యాల్లో ఒకడిగా నిలిపింది. రంగస్థలంపై శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం అనిర్వచనీయం. అందుకే అర్ధశతాబ్దం పాటు నాటక ప్రియులను ఆయన రంజింపజేశారు. ప్రేక్షక మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయనే తెనాలికి చెందిన ‘గానకోకిల’ ఏవీ సుబ్బారావు. ఇంతటి కళా ప్రముఖుడి స్మారకార్థం ఏటా ఒక ప్రముఖ రంగస్థల నటుడికి ఏవీ సుబ్బారావు వర్ధంతి రోజైన డిసెంబరు 26న అవార్డును ప్రదానం చేస్తూ.. కళాకారుల పత్రిష్టను ఎలుగెత్తి చాటుతున్నారు. ఏవీ సబ్బారావు రంగస్థల సమాఖ్య వారి శ్రీపూర్ణశ్రీ నాట్యకళాసమితి ఆధ్వర్యంలో గురువారం తెనాలిలోని శివాజీచౌక్‌లో 9వ వార్షిక అవార్డును అనంతపురానికి చెందిన ప్రముఖ నటుడు ‘కళాతపస్వి’ ఆకులేటి నరసింహమూర్తికి ప్రదానం చేయనున్నారు. ఇదే వేదికపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 40 మంది కళామూర్తులను సత్కరించనున్నారు. సినీ సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా, పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, తెనాలి సబ్‌కలెక్టర్ కె.దినేష్‌కుమార్ తదితర ప్రముఖులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. నాటకాలపై ఆసక్తితో రంగస్థలం వైపు.. ఏబీ సుబ్బారావుగా రంగస్థల ఖ్యాతి పొందిన ఆరాధ్యుల వెంకట సుబ్బారావు స్వస్థలం తెనాలి సమీపంలోని అనంతవరం. పేద రైతు కుటుంబం. పెద్దగా చదువు లేదు. పొలం పనులతోనే జీవనం. నాటకాలపై ఆసక్తి ఆయన్ని కళాకారుడిని చేస్తే, నిరంతర శ్రమ, కఠోరదీక్ష ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేశాయి. గ్రామంలో పక్క బజారులో ఉండే రంగస్థల నటుడు కుప్పా సూర్యనారాయణ శిష్యరికంతో సుబ్బా రావు కళామతల్లి సేవకు అంకితమయ్యారు. పాత్రలో పరకాయ ప్రవేశం.. శ్రీరాముడు పాత్రకు పద్యాలు, పాటలు, సంభాషణలను సుబ్బారావు వంటపట్టించుకున్నారు. ‘బాలనాగమ్మ’ ఫేం వల్లూరి వెంకట్రామయ్య ఆహ్వానంపై రెండేళ్లు ఆ బృందంలో ‘కార్యవర్ధి రాజు’గా నటించారు. ఆక్రమంలో 1958లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీల్లో ‘పాండవోద్యోగ విజయం’లో ఏవీ సుబ్బారావు శ్రీకృష్ణుడిగా నటించారు. ఆ యన అద్భుత ప్రదర్శనతో మరోసారి అక్కడే నా టకం ఏర్పాటు చేసి, పూర్తయ్యాక ఆయన్ని 75 తులాల వెండి కిరీటంతో సత్కరించారు. ఇక అప్పటి నుంచి సుబ్బారావు వెనుదిరిగి చూడలేదు. పద్య గానం మధురం.. ఆంధ్ర రాష్ట్రమంతా సుబ్బారావు పద్య గానంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాధించింది. 1960లో శ్రీ పూర్ణశ్రీ నాట్య కళాసమితిని స్థాపించారు. ఈ సమాజంలోనే 30 ఏళ్లపాటు నాటక ప్రదర్శనలిచ్చారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఢిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో ఆయన ప్రదర్శనలు పేక్షక మన్ననలు పొందాయి. మూడు తరాల కళాకారులతో.. మూడు తరాల కళాకారులతో నటించిన మరో ఘనత కూడా సుబ్బారావుకు ఉంది. ఈల పాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు వంటి హేమాహేమీలతో కలిసి శ్రీకృష్ణుడి పాత్రను ఒకే వేదికపై పంచుకున్నారు. ఆంజనేయుడు పాత్రలో నరసింహమూర్తి ఆకులేటి నరసింహమూర్తి ఆరు వేల ప్రదర్శనలు.. మొత్తం మీద సుబ్బారావు ఆరు వేల ప్రదర్శనలిచ్చారు. ఆయన పద్యాలను హెచ్ఎంవీ, ఏవీఎం సంస్థలు గ్రామఫోన్, ఆడియో క్యాసెట్ల రూపంలో విడుదల చేశాయి. రెండు చిత్రాల్లో కాంతారావు, రావి కొండలరావుకు ప్లేబ్యాక్ పద్యాలు గానం చేశారు. 2010 డిసెంబర్ 26న సుబ్బారావు కన్నుమూశారు. ఆయన స్మారకార్థం కళారంగంలోనే స్థిరపడిన ఆయన ముగ్గురు కుమారులు ప్రతిఏటా పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆ రంగంలో నిష్ణాతులైన వారికి ‘ఆంధ్ర గానకోకిల ఏవీ సుబ్బారావు అవారు’ ను ప్రదానం చేస్తున్నారు. ఆంజనేయుడి పాత్రలో ఆకులేటి.. ఏవీ సుబ్బారావు అవార్డును స్వీకరించనున్న ఆకులేటి నరసింహమూర్తి అనంతపురం జిల్లా శింగనమల దగ్గర్లోని ఆకులేడు గ్రామ వాసి. 1950లో జన్మించారు. చిన్నతనం నుంచే రాగాలాపన చేసేవారు. గ్రామంలోని హార్మోనిస్టు సుబ్బరాజు దగ్గర ఆంజనేయుడి వేషం, పద్యాలు నేర్చారు. పది నాటకాల్లో నటించారు. తదుపరి అనంతపురంలో శ్రీవెంకటేశ్వర నాట్యమండలి సమాజంలో గురువు దగ్గర మూడేళ్ల పాటు పద్యనాటక సాధన తర్వాత వసంతోత్సవాల్లో ఏవీ సుబ్బారావు శ్రీరాముడిగా, నరసింహమూర్తి ఆంజనేయుడిగా పలు గ్రామాల్లో ఇచ్చిన ప్రదర్శనలు సూపర్ హిట్ అయ్యాయి. నరసింహమూర్తి కాస్తా.. ఆకులేటి ఆంజనేయుడయ్యారు. ప్రఖ్యాత నటులు షణ్ముఖి ఆంజనేయరాజు, ఈలపాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, ధూళిపాళ్ల, ఆచంటి వెంకటరత్నం నాయుడు, అమరపు సత్యనారాయణ, ఏవీ సుబ్బారావు కుమారులు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, గుమ్మడి విమలకుమారితో వేదికను పంచుకున్నారు. కర్నూలు జిల్లాలో ఇచ్చిన ఓ ప్రదర్శనలో 50 కిలోల వెండిగదను బహుమతిగా అందుకున్నారు. ఇప్పుడు కూడా ఏమాత్రం గాత్రం తగ్గకుండా ప్రదర్శనలిస్తుండటం విశేషం. -
నరుడా...వోనరుడా
అద్దెకు ఉండడం అంటే ఫస్ట్ తారీఖు వోనరంకుల్ చేతిలో డబ్బు పెట్టడం మాత్రమే కాదు... నెలలోని 30రోజుల్లో ప్రతిరోజు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష గట్టెక్కితేనే... ఇంట్లో అద్దెకుండే అర్హత కంటిన్యూ అవుతుంది. లేనిచో...ఏ క్షణమైనా ఇల్లు ఖాళీ చేయాల్సిందే. మరో ఇల్లు చచ్చినట్లు వెదుక్కోవాల్సిందే...‘వెధవ జీవితం’ అని తిట్టుకోవాల్సిందే.అది ఒక పట్టణం. ఆ పట్టణంలోని ఒక ఇంటిలో సుబ్బారావు–ఆమని అనే దంపతులు అద్దెకుంటున్నారు. వారు ఫేస్ చేస్తున్న పరీక్షలు మచ్చుకు కొన్ని... నా పేరే కాంచనమాల....రగిలిస్తా అగ్నిజ్వాలా: ‘‘ఏమ్మా ఆమని ఇంట్లో ఉన్నావా!’’ అంటూ సరాసరి ఇంట్లోకి దూసుకు వచ్చింది వోనరాంటీ కాంచనమాల (ఇంటి యజమాని భార్య)‘‘రండీ ఆంటీ’’ అంటూ భయంభయంగా ఇంట్లోకి స్వాగతం పలికింది ఆమని.‘‘ఏమ్మా...రాత్రి నువ్వూ మీ ఆయన తెగ వాదులాడుకుంటున్నారు. ఏంటీ విషయం?’’ అని అడిగింది వోనరాంటీ.ఆమె చెవుల నిండా పరమ ఆసక్తి.‘‘ఏదో లెండి. భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా...’’ అంటే సరిపోయేది.కానీ ఆమని కళ్ల కన్నీళ్ల ఆనకట్ట తెగిపోయింది.‘‘ఏం చెప్పమంటారు ఆంటీ...ఈయనకు కట్టబెట్టి నా గొంతు కోశారు. పెళ్లయినప్పుడు ఈయన జీతం ఎంతో...ఇప్పుడూ అంతే. గొర్రె తోకైనా పెరుగుతుందేమోగానీ ఈయన జీతం పెరగడం లేదు...ఎప్పుడూ డబ్బులకు కటకటే’’ అని ఏడుస్తూ ముక్కు చీదింది ఆమని.‘‘పెళ్లయిన కొత్తలో మా ఆయన కూడా ఇంతేనమ్మా...’’ అంటూ ఆ ఏడుపు జ్వాలల్లో వోనరాంటీ లీటర్ పెట్రోలు పోసింది.సుమారు రెండు గంటల తరువాత...‘‘అత్తా ఒకింటి కోడలే సీరియల్ టైమవుతుంది.... నేను వెళ్తొస్తానమ్మా...’’ అంటూ లేచింది వోనరాంటీ.‘‘కాఫీ తాగి వెళ్లండి ఆంటీ’’ మాటవరసకు అంది ఆమని.‘‘ఎందుకే లేమ్మా’’ అంటూనే కుర్చీలో మళ్లీ కూర్చుంది వోనరాంటీ. :ఎక్కడికీ పోతావు చిన్నవాడా: ‘‘ఏమిటోయ్ సుబ్బారావు హడావుడిగా వెళుతున్నావు?’’ దారిలో తనకు ఎదురైనా సుబ్బారావును అడిగాడు వోనరంకుల్ అప్పారావు.‘‘ఆఫీసులో అర్జంటుగా పని ఉంది అంకుల్’’ అన్నాడు సుబ్బారావు.(పనా పాడా! వోనరంకుల్ ఎదురొస్తున్నాడని, దొరికితే అతడి సుత్తి కత్తికి బలికావాల్సి వస్తుందనే భయంతో వేగంగా నడుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడుగానీ...వీధిరాత వల్ల ఇలా దొరికిపోయాడు)‘‘పద టీ తాగి వెల్దువుగానీ’’ అని సుబ్బారావును ఇరానీ కేఫ్‌లోకి తీసుకెళ్లాడు వోనరంకుల్.‘‘రెండు గరం గరం టీ’’ అని ఆర్డర్ ఇచ్చాడు.వోనరంకుల్ జేబులో నుంచి చిల్లిగవ్వ కూడా తీయడు. పొరపాటున ఎక్కడ తీయాల్సివస్తుందేమోనని చొక్కకు, ప్యాంటుకు జేబులు కుట్టించుకోడు. మరి అలాంటి అంకుల్ నోరారా రెండు టీలకు ఆర్డర్ ఇచ్చాడంటే? వామ్మో! సుబ్బారావు గుండెల్లో ఖాళీ కప్పులు పడ్డాయి.‘‘ఇంతకీ పెద్దనోట్ల రద్దు సక్సెస్ అయినట్లేనంటావా...మోదీ మళ్లీ వస్తాడంటావా?’’ టీ గట్టిగా జుర్రుతూ అడిగాడు వోనరంకుల్.ఏమాత్రం ‘తెలివి’ ప్రదర్శించిన సునామి ఒడిలో తలదాచుకోవడమే అనే విషయం తెలిసిన సుబ్బారావు...‘‘నాకు పాలిటిక్స్ మీద పెద్దగా ఐడియా లేదండీ’’ అన్నాడు.‘ఐడియా’ అనే మాట వినగానే వోనరంకుల్ ఫేస్ వేయి బల్బులతో వెలిగిపోయింది.‘‘ఏది ఏమైనా వొడాఫోన్ ఇండియా, ఐడియా మెర్జ్ కావడం అనేది ఒక చారిత్రక పరిణామమేనని చెప్పుకోవాలి. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అంటే...’’ దంచుకుపోతున్నాడు వోనరంకుల్.వరదకు అడ్డుకట్ట వేయాలని...‘‘మీకు సెల్ఫోన్లపై మంచి పట్టు ఉంది అంకుల్’’ అన్నాడు సుబ్బారావు దీనంగా.‘‘సెల్ఫోన్లేమి ఖర్మ, హ్యూమన్ సెల్స్ట్రక్చర్ మీద కూడా మనకు బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ది హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. దే ప్రొవైడ్ స్ట్రక్చర్ ఫర్ ది బాడీ...’’ నాన్‌స్టాప్‌గా దూసుకుపోతున్నాడు వోనరంకుల్.‘‘ఆపవయ్యా నీ సుత్తి’’ అంటే ఎక్కడ అద్దె పెంచుతాడో అనే భయం చేత ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వింటూనే ఉన్నాడు సుబ్బారావు. ఆహా ఏమి రుచి తినవోయ్ మై మరచి: ఆమె వోనరంకుల్ కోడలు. పేరు రుచిత.ఎప్పుడు చూసిన యూ ట్యూబ్‌లో వంటల వీడియోలు చూస్తుంటుంది. అప్పుడప్పుడు వంటింట్లోకి దూరుతుంది. అప్పుడే ప్రాబ్లం. మచ్చుకు ఒకటి: ‘‘ఆమనిగారు...ఆమనిగారు...ఇంట్లో ఉన్నారా?’’‘‘ వచ్చేయమ్మా. అలా కూర్చోమ్మా.....ఏంటీ విశేషాలు..’’‘‘జంపక్ జంపక్ జపాక్...అని కొత్తరకం మైసూరుపాక్ తయారుచేశాను. మీకిచ్చి వెళ్దామని వచ్చాను. బాగా కుదిరింది. మీకు బాగా నచ్చుతుంది...’’‘‘థ్యాంక్యూ తల్లీ...ఇలా ఇవ్వు’’‘‘వెళ్తొస్తాను ఆమనిగారు’’రుచిత అలా బయటికి వెళ్లిందో లేదో ‘జంపక్ జంపక్ జపాక్’ను వేడివేడిగా చెత్త బుట్టలో వేస్తుంది ఆమని. సాయంత్రం మాత్రం...‘‘నీ చేతులు ఇంత అద్భుతం చేస్తాయనుకోలేదు తల్లీ. జంపక్ జంపక్ జపాక్ ఎంత బాగుందో. మళ్లీ మళ్లీ తినాలనిపించిదనుకో...’’ అంటుంది.ఈ పొగడ్తల పుణ్యమా అని రెండో రోజు మరో కొత్త రకం వంటకంతో ఇంట్లోకి దూరుతుంది రుచిత.‘‘ఆమనిగారు...ఇంట్లో ఉన్నారా...ఏమీలేదండీ...కందగడ్డ బొందగడ్డ అని కొత్తరకం పులుసు చేశాను. బాగా కుదిరిందండీ...ఎలా ఉందో చెప్పరా’’ అని గోముగా అడుగుతుంది. ‘‘ఏమిటి చెప్పేది నీ బొంద. నీ యెంకమ్మ....నీ ప్రయోగాలకు నేనేమన్నా ఎలుకలాగా కనిపిస్తున్నానా....నోర్ముసుకొని ఇక్కడి నుంచి వెళ్లు’’ అని ఆమనికి అనాలనే ఉంటుంది....కానీ అనలేదు. అలా అంటే అద్దె పెరగవచ్చు. ఏదో సాకుతో ఇంటి నుంచి ఖాళీ చేయించవచ్చు. ఈ రెండు కాకపోతే ‘కరెంటు ఎక్కువ కాలుస్తున్నారు’ ‘నీళ్లు ఎక్కువ వాడుతున్నారు’లాంటి సాకులతో పొద్దస్తమానం తిట్టనూ వచ్చు. ఎందుకొచ్చిన లొల్లి! అని అడ్జెస్టై ‘నీ వెరైటీ వంటలు మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది తల్లీ’ అంటూ ఎప్పటికప్పుడు కృత్రిమ లొట్టలు వేస్తుంటుంది ఆమని. – యాకుబ్ పాషా -
‘ఐరన్ లెగ్’ అంటూ గేలి చేశారు..
ఇక్కడ నిరాదరణకు గురైన ఆయన ఇప్పుడు భోజ్పురిలోప్రముఖ దర్శకుడిగా రాణిస్తున్నాడు.సొంత గడ్డపై మమకారంతో తాను దర్శకత్వం వహించే సినిమాలు ఎక్కువగా నగరంలోనే షూటింగ్ చేస్తున్నాడు. ఇక్కడి సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పిస్తున్నాడు. ప్రస్తుతం భోజ్‌పురి అగ్ర నటుడు దినేశ్‌లాల్ యాదవ్ హీరోగా సుబ్బారావు తెరకెక్కిస్తున్న ‘జై వీర్’ చిత్రీకరణ సిటీలోని సారథి స్టూడియోలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీని‘సాక్షి’తో పంచుకున్నారిలా... బంజారాహిల్స్ : నాది కడప జిల్లాలోని ప్రొద్దుటూరు. తిరుపతిలో టైలరింగ్ చేస్తూ బీఏ పూర్తి చేశాక, సినిమాలపై ఆసక్తితో 1996లో హైదరాబాద్ వచ్చాను. కృష్ణానగర్‌లో సినిమా ఓనమాలు నేర్చుకున్నాను. అక్కడో గది అద్దెకు తీసుకొని, దర్శకుడు విక్టరీ మధుసూదనరావు దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. మౌళి దగ్గర ఎక్కువ సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేశాను. తర్వాత తెలుగులో ‘కామెడీ కింగ్స్’, ‘రామ్మా చిలకమ్మా’ అనే సినిమాలకు దర్శకత్వం వహించాను. అయితే అవి విడుదలకు నోచుకోలేదు. అనంతరం కుట్టి పద్మిని నిర్మించిన ‘మనసే మందిరం’ అనే టీవీ సీరియల్‌కు దర్శకుడు వై.నాగేశ్వరరావు దగ్గర పని చేయగా... ఆ సీరియల్ దర్శకత్వ బాధ్యతలు నాకే అప్పగించారు. సినీ తారలు భానుప్రియ, రంజిత, సురేష్‌లతో కలిసి ఈ సీరియల్ తీశాం. సినిమా తారలతో తీసిన మొట్టమొదటి సీరియల్ కూడా అదే. నా ప్రతిభను గుర్తించిన హీరో సురేష్.. ‘శివుడు’, ‘మనమిద్దరం’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎన్నో కథలు రాసుకొని దర్శక నిర్మాతలు, హీరోల దగ్గరికి వెళ్లాను. అయితే అందరూ నన్ను ‘ఐరన్ లెగ్’ అంటూ గేలి చేశారు. ఆ సమయంలో భోజ్‌పురి నిర్మాత నాసిర్ జమాల్ పరిచయం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. నాసిర్ జమాల్ కూడా తెలుగువాడే. నగరంలోని పాతబస్తీకి చెందినవాడు. ఫస్ట్తోనే బెస్ట్... అప్పుడప్పుడే భోజ్‌పురి సింగర్‌గా రాణిస్తున్న దినేశ్‌లాల్ యాదవ్ అనే యువకుడితో నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాసిర్ జమాల్ ‘కైసే కహీ తాహరాసే ప్యార్ హోగయిల్’ (నా మనసులో ఉన్నది నీతో ఎలా చెప్పను) అనే సినిమా తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. నాకు ఎనలేని పేరొచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే హిందీ, భోజ్‌పురి నేర్చుకున్నాను. ఆ సినిమాతో దినేశ్‌లాల్ భోజ్‌పురిలో సూపర్ స్టార్ అయ్యారు. ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ఆయనతో 12 సినిమాలు తీసి హిట్ కొట్టాను. 75 థియేటర్లలో... ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, నేపాల్, పంజాబ్, ముంబై, గుజరాత్, అసోం, ఒడిశా, రాజస్థాన్, మారిషస్, దుబాయ్‌లలో భోజ్‌పురి సినిమాలకు బాగా ఆదరణ ఉంటుంది. సౌత్ నుంచి నార్త్‌కు ఎంతోమంది తెలుగు దర్శకులు వెళ్లినా నిలదొక్కుకోలేదు. నేను మాత్రం భోజ్‌పురి సినిమాలను ఒక మలుపు తిప్పాను. ఓ సినిమా ఏకంగా 75 థియేటర్లలో ఆడింది. నా కొడుకు పేరు మీద శ్రీసాయి ప్రొడక్షన్స్ బ్యానర్‌ను ఏర్పాటు చేసి రెండు సినిమాలు తీసి హిట్ కొట్టాను. 35 రోజుల్లో తీసేస్తా... ఏడాదికి రెండు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహిస్తాను. నా సినిమా 35 రోజుల్లోనే పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకుంటాను. నేను నగరంలోని చింతల్ ప్రాంతం. అక్కడ చింత చెట్ల కింద కూర్చొని సినిమా కథలు, మాటలు రాసుకుంటాను. ఒక పద్ధతి ప్రకారం సినిమా తీయడమే కాకుండా భోజ్‌పురిలో ఉన్న కొన్ని సంప్రదాయాలను తిరగరాశాను. భోజ్‌పురి సినిమా అనగానే ఒకప్పుడు 30 పాటలుండేవి. ఇప్పుడు ఆరు పాటలకు తగ్గించి కథకు ప్రాధాన్యతనిస్తున్నాను. అదేనా బాధ... నేను తెలుగులో మూడు సినిమాలు తీసినా అంతగా పేరు తెచ్చుకోలేదు. రెండు సినిమాలు మంచి ఆదరణ పొందినా... ఎందుకో నన్ను ఫెయిల్యూర్ డైరెక్టర్ అంటూ ముద్ర వేశారు. ఆ కసితోనే భోజ్‌పురిలో అడుగుపెట్టాను. తెలుగు సినిమాలకు దూరమయ్యానన్న బాధ అప్పుడప్పుడు వేధిస్తుంటుంది. అయితే ఆ సినిమాలను ఎక్కువగా తెలుగు గడ్డ మీదే తీస్తుంటాను. ఇది నాకెంతో గర్వంగా ఉంది. ఇక్కడొస్తే చేస్తా... తెలుగులో అవకాశాలు వస్తే తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. నాకు ఫలానా దర్శకుడు ఇష్టమని చెప్పను. సినిమాలో కదిలించే సన్నివేశం, మనసును హత్తుకునే దృశ్యాలుంటే ఆ దర్శకుడు ఇష్టమవుతాడు. తెలుగు సినిమాలో ఫెయిల్యూర్ అయినవారు భోజ్‌పురికి వెళ్లొచ్చని అప్పట్లో కామెంట్ చేశారు. అది నన్ను ఉద్దేశించి చేసిందేనని నాకు తెలుసు. అందుకే భోజ్‌పురి కల్చర్ తెలుసుకొని, హిందీ నేర్చుకొని పక్కా కథ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నాను. ప్రస్తుతం అక్కడి ప్రముఖ దర్శకుల్లో ఒకడిగా నిలుస్తున్నాను. కష్టపడితే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తున్నాను. -
నటులు లేని ‘రంగస్థలం’
సందర్భం కళ ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను ఆలోచింపజేసే ప్రయత్నం, ప్రక్రియ. కళ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అలాంటి కళను ప్రోత్సహించే నాటక రంగ స్థల శాఖకు పూర్వ శోభను తీసుకు రావలసిన బాధ్యత విశ్వ విద్యాలయాలపై ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల జీవనాడి ఆంధ్ర కళా పరిషత్తు. భాషా ప్రాతిపది కపై ఏర్పడిన మొదటి విశ్వ విద్యాలయం. విద్యావేత్త సర్ కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక కులపతిగా ప్రారంభించిన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు దేశ విదేశాలలో పేరు ప్రతిష్టలను మూటగట్టుకుంది. విశాలమైన ప్రదే శంలో ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న విశ్వ విద్యా లయం ఇప్పుడు అధ్యాపకుల కొరతతో సతమతమౌ తుంది. సుమారు 9 జిల్లాలకు విస్తరించిన వర్సిటీ ఇప్పుడు విజయనగరం జిల్లాకే కుదించుకుపోయింది. దీంతో రెవెన్యూ రాబడి తగ్గి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూంది. తక్కువ పర్మనెంటు, ఎక్కువ కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తోంది. సుమారు 63 విభా గాలు, 115 కోర్సులతో విరాజిల్లుతున్న వర్సిటీ తన చిహ్నంలోని 64 కళలకు అద్దం పడుతోంది. ప్రదర్శన కళలు (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్)కు చెందిన నాటక రంగ విభాగం (థియేటర్ ఆఫ్ ఆర్ట్స్) సరిౖయెన ఆదరణకు నోచుకోక విలవిల్లాడుతోంది. నేడు ప్రపంచ నాటక రంగం 70వ వార్షికోత్సవం వేళ ఆ శాఖ గురించి, దాని పుట్టుక, ప్రగతి, ఎదుగుదల, తరుగుదల గురించి తెలుసుకోవడం ప్రతీ తెలుగువాడి విధి. ఉభయ రాష్ట్రాలలో ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మా నియా యూనివర్సిటీ, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలలో నాటకరంగ విభాగాలు పనిచేస్తు న్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే ఆంధ్రా యూని వర్సిటీలోని విభాగం చాలా వెనుకబడి ఉందనే చెప్పాలి. పూర్తి స్థాయిలో పనిచేసే విభాగాధిపతిగానీ, అధ్యాపకులుగానీ లేరు. పనిచేస్తున్న అధ్యాపకులం దరూ కాంట్రాక్టు విధానంలోనే పనిచేస్తున్నారు. జాతి, సంస్కృతి, వారసత్వాలను తరతరాలకందించే వాహి నిగా పనిచేసేదిగా నాటక రంగ విభాగం ఉండాలి. నాటకరంగ విభాగం లక్ష్యాలలో ముఖ్యమైనవి జాతి, సంస్కృతి, వారసత్వాలను సంరక్షించడం, సామాజిక సమస్యలను కళ ద్వారా వ్యక్తీకరించడం, సామాజిక రుగ్మతలపై కళారూపాల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడం. వీటితోపాటు నటన, దర్శ కత్వాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా ఔత్సాహిక, వృత్తి కళాకారులను తయారుచేయడం. పై లక్ష్యాల సాధనకు దృఢమైన నాటకరంగ విభాగం అవశ్యం. అధ్యాప కులు ఏ విభాగానికైనా వెన్నుముకలాంటి వారు. ప్రస్తుతం ఈ విభాగంలో నలుగురు అధ్యాపకులు 2002 సంవత్సరం నుంచి కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. ఈ నలుగురులో ఒకరు వచ్చే సెప్టెంబర్‌లో కాంట్రాక్టు అధ్యాపకునిగానే పదవీ విరమణ చేయబోతున్నారు. 2005వ సంవత్సరంలో వీరిని టీచింగ్ అసోసియేట్లుగా నామకరణం చేసారు. శాశ్వత అధ్యాపకుడికి ఉండే అన్ని విద్యార్హతలు ఉండటం చేత చేసే పని కూడా శాశ్వత అధ్యాపకుడి గానే ఉంటుంది. కానీ ‘కాంట్రాక్టు కత్తి’ మెడమీద వేలా డుతూ ఉంటుంది. ఆ భ్రమను తొలగించడానికి అన్ని విభాగాలలో పనిచేసే అధ్యాపకులతోపాటు వీరిని ‘అసిస్టెంట్ ప్రొఫెసర్’ (కాంట్రాక్టు)లుగా మార్చారు. జీతం కొంచెం పెంచారు. జీతమైతే పెరిగింది కానీ వారి గీత మారలేదు. పదేళ్ల సర్వీసు నిండటంతో తమని శాశ్వత స్థానాలలో నియమించమని అనేక విజ్ఞప్తులు చేసినా ఫలితం కనిపించక ఆ నలుగురిలో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి సర్వీ సును పరిగణనలోకి తీసుకొని ‘భారీ’గా ఉండే శాశ్వత పోస్టులలో వారిని నియమించాలని ఆర్డర్ వేసింది. (wp. No. 27706 of 2011) అయినా యూనివర్సిటీ అధికారులు ఏ చర్యలు తీసుకోలేరు సరికదా రిట్ అప్పీలు వెళ్లారు. ఇది ఇలా ఉండగా యూనివర్సిటీకి ఉన్నత విద్యాశాఖ నుంచి ఒక లేఖ చేరింది. దాని సారాంశం ఆ ముగ్గురిని రెగ్యులర్ పోస్టుల ఖాళీలలో శాశ్వత పద్ధతిపై నియమించాలని.. దాన్ని కూడా యూనివర్సిటీ పెడచెవిన పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలలో సమానత్వాన్ని పాటించ మని 16వ అధికరణ చెబుతోంది. ఖాళీగా ఉన్న పోస్టు లలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తరగతులను నింపడానికి రాష్ట్ర ప్రభుత్వానికిగానీ దాని అంగానికి గానీ అధికారముండి కోర్టుకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు షెడ్యూల్డు కులానికి చెందినవారు కాగా మరొకరు వెనుకబడిన తరగతికి చెందినవారు. సమన్యాయం అటుంచి సామాజిక న్యాయం కూడా అందడం లేదని అధ్యాపకులు వాపోతున్నారు. ఇందులో ఏ ఒక్కరైనా అగ్రవర్ణానికి చెందిన వారుంటే ఇప్పటికే న్యాయం జరిగి ఉండేదని కొందరి అభిప్రాయం. యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసు కొని సమస్యను పరిష్కరించకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండేదనే సామెతలా అధ్యాపకుల కష్టాలు కష్టాలుగానే మిగిలిపోతాయి. అటు ఉద్యోగ భద్రత లేదు. ఇటు వృత్తి సంతృప్తి లేకుండా పోయింది. కొసమెరుపు: ఈ సంవత్సరం ప్రపంచ రంగస్థల దినోత్సవం ఇచ్చే సందేశం ‘‘ఎవరైతే కళను, దాని ప్రాముఖ్యతను, విలువను గుర్తిస్తారో వారు ప్రభు త్వాలకు, రాజకీయవేత్తలకు, సంస్థలకు ఈ సంబ రాలు ఒక పొలికేక’ అని గుర్తింప చేయాలి. – ఏసియా పసిఫిక్ గ్రూపు (UNESCU) (నేడు ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా) వ్యాసకర్త రిటైర్డ్ ఏయూ ప్రొఫెసర్, కేపీ సుబ్బారావు -
మరవనేనిని మరిచిపోరు!
వృత్తి పట్ల నిబద్ధత.. కేసులు ఛేదించడంలో ముందంజ.. చురుకుదనంతో నెరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించడంలో తనకు తానే సాటి.. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మేటి.. కనిగిరి సీఐ మరవనేని సుబ్బారావు. క్లిష్టమైన కేసులను సైతం సవాల్‌కు స్వీకరించి నిందితులను కటకటాల వెనక్కి నెడుతూ డీజీపీ వంటి ఉన్నత స్థాయి పోలీసు అధికారి నుంచి ఆయన శెభాష్ అనిపించుకుంటున్నారు. కనిగిరి: సీఐ మరవనేని సుబ్బారావు విధి నిర్వహణలో అటు ఉన్నతాధికారుల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. 2004లో గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఐగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు మంచి పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు. పదోన్నతి తర్వాత 2013లో సీఐడీ సీఐగా నెల్లూరులో పనిచేశారు. సీఐగా పిడుగురాళ్లలో రెండేళ్లు పనిచేశారు. గురుజాలలో ఎస్ఐగా పనిచేసినప్పుడు ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం మోపి మంచి పేరు గడించారు. ప్రసుత్తం 12 నెలల నుంచి కనిగిరి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. చిరిగిన టికెట్ ముక్కే ఆధారం 2017 ఫిబ్రవరిలో హెచ్‌ఎంపాడు మండలం వేములపాడు ఘాట్ వద్ద కారు దహనమైంది. పక్కనే ఓ మహిళ మృతదేహం ఉండటం అప్పట్లో సంచలనం రేపింది. కారు దహనం సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు సాయంత్రానికి అక్కడికి 100 మీటర్ల దూరంలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు. మహిళను పెట్రోల్ పోసి దారుణంగా శరీరం మొత్తం కాల్చేశారు. కేవలం పాదాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదట్లో ఆ రెండు ఘటనలు ఒకే నేరానికి సంబంధించినవిగా భావించారు. కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన సీఐ సుబ్బారావు.. సంఘటన స్థలంలో దూరంగా పడి ఉన్న చిరిగిన బస్సు టికెట్ ముక్కను గుర్తించారు. దాని ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించి రెండు వేర్వేరు ఘటనలుగా నిర్ధారించారు. వారం రోజుల్లో రెండు కేసులనూ చేధించారు. వివాహేతర సంబంధ నేపథ్యంలో గుంటూరుకు చెందిన మహిళను నిందితుడు వేములపాడు ఘాట్ వద్దకు తీసుకొచ్చి పెట్రోలు పోసి కాల్చి దారుణంగా హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడికి సైతం సంకెళ్లు వేశారు. దహనమై ఉన్న కారు దొంగతనం చేసి తీసుకొచ్చిందిగా గుర్తించారు. ఆ కేసులో నిందితులను పట్టుకుని ఉప్పగుండూరు, గన్నవరం, విజయవాడ ప్రాంతాల నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన మూడు కార్లను రికవరీ చేశారు. ఈ కేసులో రాష్ట్ర స్థాయిలో పోలీసు శాఖ ఇచ్చే ఏబీసీడీ అవార్డుల్లో ఆయన నాలుగో స్థానంలో గుర్తింపు పొందారు. కేసును ఛాలెంజ్‌గా తీసుకోవడం ఆయన ప్రత్యేకం సంక్లిష్టమైన కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుంటారు. పీసీపల్లి మండలం ఇర్లపాడులో చిన్నారి సియోని (5) లైంగికదాడి, హత్య కేసును సీఐ సుబ్బారావు అత్యంత ఛాలెంజ్‌గా తీసుకుని ఛేదించారు. నిందితుడికి కనీసం అధార్‌కార్డు, రేషన్ కార్డులేదు. ఫోన్ సైతం ఉపయోగించడు. నిందితుడు పేరయ్య చిన్నారిని కిడ్నాప్ చేసిన రోజు (జూన్ 20)న తొలుత చిన్నారి సియోని తండ్రితో జరిపిన సంభాషణ విషయాలు, ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 40 రోజులు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జల్లెడపట్టి కేసును ఒక కొలిక్కి తెచ్చారు. ఆగస్టు 29న గుంటూరు జిల్లా పొన్నూరులో నిందితుడిని సీఐ బృందం పట్టుకుంది. ఈ కేసులో ఎస్పీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. పోలీస్ శాఖ అందించే స్మార్ట్ కాప్ అవార్డును సైతం ఎస్పీ చేతుల మీదుగా తీసుకున్నారు. పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2017 ఏబీసీడీ అవార్డుకు (జూన్, జూలై, అగస్టు)కు సీఐ సుబ్బారావును ఎంపిక చేశారు. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 13న విజయవాడలో అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు చేతులమీదుగా ఏబీసీడీ (అవార్డ్ ఆఫ్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డును సీఐ అందుకున్నారు. అంతేనా.. రాష్ట్రంలోనే సంచలనం రేపిన రాజమండ్రిలో మసీద్ మౌజన్ హత్య కేసును సీఐ రెండు రోజుల్లో ఛేదించారు. కనిగిరి సీఐతో కూడిన బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడు సంఘటన స్థలంలో వదిలిన రాజఖైనీపై గల వేలిముద్రల ఆధారంగా.. సాంకేతికతను వినియోగించుకున్నారు. డిసెంబర్ 30న దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో సాంకేతికతతో పాటు ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన చోరీ ఘటనలు.. కీలకంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించి రెండు రోజుల్లో అనంతపురం జిల్లా ఉరవకొండలో నిందితుడు మణిరత్నం అలియాస్ మణిని పట్టుకున్నారు. దీంతో సీఐ సుబ్బారావుకు రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందాయి. ఇటీవల కనిగిరి వచ్చిన ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా సీఐ మరవనేనిని అభినందించారు. -
మధ్యాహ్నం హత్య
పట్టుకోండి చూద్దాం అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. చివరకు... సుబ్బారావుకు అతి సన్నిహితులైన మిత్రులు కూడా. అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న సుబ్బారావు... పాతికేళ్ల అమ్మాయి రాధను పెళ్లి చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సుబ్బారావు భార్య చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆ సమయంలో రెండో పెళ్లి చేసుకోమని బంధువులు, మిత్రులు ఒత్తిడి తెచ్చారు. ‘‘నా పెళ్లి సరే... ఆమె నా బిడ్డల్ని బాగా చూసుకుంటుందనే నమ్మకం నాకు లేదు. అందుకే... పెళ్లి చేసుకోవద్దనుకుంటున్నాను’’ అంటూ పెళ్లి చేసుకోకుండా... తానే తల్లై ఇద్దరు కొడుకులను కంటికి రెప్పలా చూసుకున్నాడు సుబ్బారావు. ఏరోజూ ‘పెళ్లి’ అనే ఆలోచన చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా? సుబ్బారావు పెళ్లిపై రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. కష్టాల్లో ఉన్న రాధను పెళ్లి చేసుకోవడానికే సుబ్బారావు పెళ్లి చేసుకున్నాడు అంటారు కొందరు. కాదు... ఆరోగ్యం బాగ లేకపోవడం వల్ల... తనను చూసుకునేవారు ఎవరూ లేకపోవడం వల్ల... గత్యంతరం లేని పరిస్థితుల్లో రాధను పెళ్లి చేసుకున్నాడు అంటారు కొందరు. పేద అమ్మాయికి డబ్బు ఆశ చూపి... కేవలం తన స్వార్థం కోసం పెళ్లి చేసుకున్నాడు అంటారు కొందరు. లేదు... ఆస్తి మొత్తం కాజేయడానికి రాధ... ప్లాన్ ప్రకారమే సుబ్బారావుని పెళ్లిచేసుకుంది అంటారు కొందరు. ఎవరి అభిప్రాయం వారిది. ఏ అభిప్రాయంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు. అయితే వారి ఇంటికి వెళ్లిన వాళ్లు మాత్రం... సుబ్బారావుని రాధ పువ్వుల్లో పెట్టి చూసుకుంటుందని మెచ్చుకునేవాళ్లు. ఈరోజుల్లో... రాధలాంటి అమ్మాయిని చూడలేదని కూడా అనేవాళ్లు. సుబ్బారావు ఇద్దరు కొడుకులు మొదట్లో రాధతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. ‘‘ఒకవేళ మీ అమ్మ బతికి ఉన్నా... రాధలా చూసుకొని ఉండేది కాదేమో’’ అని కూడా చాలా మంది చెప్పడంతో వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇక అప్పటి నుంచి... రాధను సొంతింటి మనిషిలా చూసుకునేవారు. రాధ కోసం... ఆమె మేనమామ మంగపతి తరచుగా వచ్చిపోతుండేవాడు. ‘‘అమ్మా, నాన్న లేని రాధను చిన్నప్పటి నుంచి నేనే పెంచి పెద్ద చేశాను’’ అని అందరికీ చెబుతుంటాడు మంగపతి. ‘మంగపతి మోసగాడు. తాగుబోతు. డబ్బు కోసం రాధను వేధిస్తాడు’ అని ఎక్కువమంది చెప్పుకుంటారు. ఇదే విషయాన్ని రాధ దగ్గర ఎవరో ప్రస్తావించినప్పుడు.. ఆమె ఏడ్చినంత పనిచేసింది. ‘‘మామయ్య అలాంటి వాడు కాదు... దేవుడు’’ అంది. ఒకసారి సుబ్బారావుకు యాక్సిడెంట్ జరిగి కాలు విరిగింది. కొద్ది నెలల తరువాత మాత్రం...క్రచ్ సహాయంతో నడవడం ప్రారంభించాడు. ఉన్నట్టుండి ఒకరోజు మధ్యాహ్నం... ‘సుబ్బారావు చనిపోయాడు’ అనే వార్త అగ్గిలా వ్యాపించింది. ‘ఎలా చనిపోయాడటా?’ ‘మెట్లపై నుంచి జారి పడి’ సంఘటన స్థలికి హుటాహుటిన వచ్చాడు ఇన్స్పెక్టర్ నరసింహ. రాధ ఏడుస్తుంది... ఇన్స్పెక్టర్ను చూస్తూ... ‘‘మీకేదైనా పని ఉంటే పిలిచి నాకు చెప్పండి. మెట్లు దిగి వెళ్లొద్దు... అని తరచు చెప్పేదాన్ని. ఆయన నా మాట వినిపించుకునేవారు కాదు. ఈరోజు కూడా క్రచ్ సహాయంతో మెట్లు దిగి బ్యాలెన్స్ తప్పి మెట్ల మీది నుంచి దొర్లుతూ కింద పడిపోయారు. శబ్దం విని... నేను పరుగెత్తుకుంటూ వచ్చాను. నేను వచ్చేలోపే ఆయన ప్రాణం పోయింది’’ అని చెప్పింది. ‘‘ఇది ప్రమాదం కాదు... హత్య!’’ అని గట్టిగా అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ చెప్పింది అక్షరాలా నిజమైంది. అది ప్రమాదం కాదు... హత్య! సుబ్బారావు ప్రమాదవశాత్తు చనిపోలేదని ఇన్స్పెక్టర్ ఎలా చెప్పగలిగాడు? క్లూ: స్టెయిర్స్ జ్చిఛీ ట్చజీ సుబ్బారావు కుడి చేతి వైపు ఉంది. ఎడమ చేయిని మాత్రం ‘క్రచ్’ పట్టుకోవడానికి ఉపయోగించేవాడు. Ans : స్టెయిర్స్ కింద ఉన్న ఫ్లోర్‌పై బొక్కబోర్ల పడి ఉన్నాడు సుబ్బారావు. అయితే... ‘క్రచ్’ మాత్రం కుడి చేయి పక్కన పడి ఉంది. కుడిచేతికి ఆసరగా జ్చిఛీ ట్చజీ ఉండగా ‘క్రచ్’ వాడాల్సిన అవసరమే ఉండదు కదా! ఇంతకంటే అనుమానించాల్సిన విషయం ఏముంటుంది! -
మునకే సుఖమనుకోవోయ్!
హ్యూమర్ ప్లస్ సుబ్బారావుకి గాలిలో తేలుతున్నట్టు కలొచ్చింది. కలవరంలో వుండగా చల్లగా తగిలింది. కళ్ళు తెరిస్తే మంచం నీళ్లలో తేలుతూ వుంది. అపార్ట్మెంట్ చెరువులా కనిపించింది. గబాలున లేస్తే కిటికీలోంచి వెంకట్రావ్ విష్ చేశాడు. ఒక ప్లాస్టిక్ కవర్లో లాప్టాప్ చుట్టుకుని ఈదుతూ వెళుతున్నాడు. ‘‘ఏంటిది ప్రళయమా?’’ అడిగాడు సుబ్బారావు. ‘‘చెరువుల్లో వూళ్లు కడితే, వూళ్లు చెరువులవుతాయి’’ వెంకట్రావ్ సాఫ్ట్‌వేరే కానీ తల్లి వేరు కవిత్వం. ‘‘చెరువుని ఈదడం సులభం, జీవితాన్ని ఈదడమే కష్టం’’ అన్నాడు వెంకట్రావు. ‘‘నాకు ఈత రాదు’’ అన్నాడు సుబ్బారావు. ‘‘లైఫ్ జాకెట్ వేసుకో’’ ‘‘జాకెట్ లేడీస్ వేసుకుంటారు. లైఫ్ షర్ట్ వుంటే చెప్పు’’ సుబ్బారావు పురుషవాది. పురుషులందు పురుషవాదులు వేరు. స్త్రీవాదులతో ఓడిపోవడం వల్లే పురుషులు రుషులుగా మారుతున్నారనేది అతని ఫిలాసఫీ. ‘‘తుపాన్లో జర్దా పాను గురించి చర్చ అవసరమా?’’ ‘‘పురుషుల్ని ఉతికి ఇస్త్రీ చేయడానికే స్త్రీలు పుట్టారని ఇంతకాలం వాదించాను. అందువల్ల జాకెట్ వేసుకోను.’’ ‘‘అయితే సెల్ఫీ తీసుకుని ఎఫ్‌బిలో పోస్ట్ చెయ్. అదే నీ ఆఖరి పోస్టింగ్ అని అందరికీ గుర్తుంటుంది’’లాహిరి లాహిరి పాడుకుంటూ వెంకట్రావ్ వెళ్లిపోయాడు. సుబ్బారావుకి బాస్ గుర్తొచ్చాడు. ప్రపంచమంతా మునిగిపోయినా ఆఫీసులు మునిగిపోవు, అదో ట్రాజెడీ. ఇంతలో కూకట్పల్లి అని అరుస్తూ ఒక పడవ వచ్చింది. దాన్నిండా జనం. ఎవరు ఎవరి మీద కూచున్నారో తెలియడం లేదు. తెడ్డుకి కూడా ఇద్దరు వేలాడుతున్నారు. కిటికీలోంచే సుబ్బారావు దాంట్లోకి దూకాడు. పడవ అటూఇటూ కదిలి హాహాకారాలు వినిపించాయి. ‘‘ఏంటిది?’’ పడవవాడ్ని అడిగాడు. ‘‘సర్వీస్ ఆటోలుగా, సర్వీస్ బోట్’’ ‘‘ఇంతమంది ఎక్కితే మునిగిపోదా?’’ ‘‘మునిగిపోతే రక్షించడానికి ఇద్దరు గజ ఈతగాళ్లున్నారు. వాళ్ల చార్జి ఎగస్ట్రా’’ హైలెస్సా హైలెస్సా అంటూ తెడ్డువేశాడు. పడుతూ లేస్తూ నిజాంపేట నుంచి కూకట్పల్లి చేరింది పడవ. ఒడ్డున సర్వీస్ ఆటో ఎక్కాడు. జనాల్ని ఆటోలో కుక్కి ఒక తాడుతో అందర్నీ కలిపి కట్టేశాడు ఆటోడ్రైవర్. ‘‘ఈ బంధనం ఎందుకు?’’ ‘‘ఇది సీట్ బెల్ట్ లాంటిది సార్. మనకు ముందర రోడ్డంటూ ఏమీ లేదు. ఒక గోతిలోంచి ఇంకో గోతిలోకి జంప్చేస్తూ వెళ్లడమే’’ అని డ్రైవర్ స్టార్ట్ చేశాడు. పిండిమరలాగా అది గుడగుడ సౌండ్ చేస్తూ కదిలింది. సర్వాంగాలు గజగజ వణికాయి. దబేల్దుబేల్మంటూ ఆటో అటూ ఇటూ ఒరుగుతూ వెళ్లింది. ఒక మాన్హోల్లోకి డైవ్ చేయడానికి ఆటో ప్రయత్నించింది కానీ సమయస్ఫూర్తితో డ్రైవర్ హ్యాండిల్‌కి వేళాడుతూ హ్యాండిల్ చేశాడు. ఈ కీలకమైన ఘట్టంలో పలువురు బాధితులు గోవిందనామస్మరణ చేస్తూ కాస్త పుణ్యం గడించారు. సామూహిక పగ్గం నుంచి ఆటోవాడు విముక్తి చేసిన తరువాత ఆఫీస్ దగ్గరికి వెళితే గుండె చెరువైంది. అక్కడ గడకర్ర సాము జరుగుతూ వుంది. యాభై రూపాయల ఫీజు ఇస్తే గడకర్రని ఇస్తున్నారు. దాన్ని వూతంగా గాల్లోకి ఎగిరితే సెకండ్‌ఫ్లోర్‌లో ల్యాండ్ అవుతాం. నీటిలో ఆఫీస్ వుండడం వల్ల ఇంకో దారిలేదు. ఆఫీస్‌కి వెళ్లాలంటే గడకర్ర, వెళ్లకపోతే బాస్ దుడ్డుకర్ర తీసుకుంటాడు. ‘‘జీవితంలో ఇలా ఎత్తుకు ఎదిగే అవకాశం పదేపదే రాదు సార్’’ అన్నాడు గడకర్రవాడు. ‘‘నాకు భయం’’ అన్నాడు సుబ్బారావు. ‘‘భయానికి విరుగుడు అభయం’’ అంటూ ఆంజనేయుడిలా భుజాల మీద ఎక్కించుకుని యాహూ అంటూ గడకర్రవాడు ఎగిరాడు. గూగుల్ అంటూ దూకాడు సుబ్బారావు. ఐరిస్ మిషన్‌కు కళ్లు చూపించాడు. ఆఫీస్‌లోకి తగలడిచావు అని మూలిగింది. ‘‘ప్రకృతితో వికృతిగా వ్యవహరిస్తే భవిష్యత్ ఆకృతి ఇదే. నాలుగు చినుకులకే చిరిగి చాటంతవుతుంది’’ అంటున్నారెవరో. - జి.ఆర్. మహర్షి -
సింహ‘బలుడు’
హ్యూమర్‌ప్లస్ భార్యకంటే సింహమే మేలని తలంచిన సుబ్బారావు ఒకరోజు జూకి వెళ్లి సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకాడు. హఠాత్తుగా తమ ముందు దూకిన ప్రాణిని చూసి సింహం జడుసుకుని ఒక అడుగు వెనక్కి వేసింది. జీవితాన్ని ఈదడం కంటే నీటి గుంతను ఈదడం సులువని భావించిన సుబ్బారావు ఎన్‌క్లోజర్ చుట్టూ వున్న కందకం లోంచి ఈదుకుంటూ వెళ్లి సింహం ముందు నిలబడ్డాడు. ‘‘చూపులు కలిసిన శుభవేళ...’’ అని పాడుకుంటూ సింహానికి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అది వెనక్కి తగ్గి ఆలోచనలో పడింది. ‘‘నేను సింహమని తెలిసే వచ్చాడా? తెలియక వచ్చాడా? తెలిసే వస్తే వీడు మహా ధైర్యవంతుడు, వీడ్నేం చేయలేం. తెలియక వచ్చినా ఏమీ చేయలేం. ఎందుకంటే సింహమంటే తెలియనివాడ్ని సింహం ఎలా భయపెట్టగలదు?’’ అని పరిపరి విధాల యోచించింది. అది జూ సింహం. టైంసెన్స్ ఎక్కువ. సమయానికి భోజనం దొరుకుతుంటే మెదడు వేగంగా పనిచేస్తుంది. ఇదంతా దూరం నుంచి మగసింహం చూసింది. తన భార్య ఎదురుగా ఒక మనిషి నిలబడడమా? వీడెవడో సింహస్వప్నంలా ఉన్నాడే అనుకుంటూ సింహావలోకనం చేసుకుంది. పురుషుడు, పౌరుషం ఈ రెండూ వేర్వేరు విషయాలని తెలిసినా, భార్య ముందు నోరు తెరవక చాలాకాలమైనందువల్ల, అవకాశం వచ్చింది కదా అని గర్జించడానికి ప్రయత్నించింది. ఆడసింహం గుర్రున చూసేసరికి ‘మియ్యావ్’ అని సౌండ్ చేసింది. ‘‘వేట గురించి వినడమే తప్ప, ఇంతవరకూ ఆడలేదు... అందుకని..’’ అని నసిగింది మగసింహం. ‘‘మీ తాత ముత్తాతలు కూటికి గతిలేనివాళ్ళు కాబట్టి వేటాడారు. మనకేం ఖర్మ. మూడుపూట్ల తిండి మన దగ్గరకే వచ్చేస్తూ వుంది. కాకపోతే ప్రతిరోజూ నానా చెత్తవెధవల్ని మనకు తెచ్చి చూపిస్తారు. వాళ్లలో వీడొకడు’’ ‘‘సుబ్బారావు ఉత్సాహంగా సింహాలతో ఒక సెల్ఫీ తీసుకుని, ఆ సింహం జూలుతో జడ వేయబోయాడు. మరో సింహం దువ్వెన కూడా తెచ్చి ఇచ్చింది. ‘‘సింహాలు దువ్వెన కూడా వాడతాయా?’’ అడిగాడు. ‘‘కయ్యానికి కాలు దువ్వడం ఎప్పుడో మానేశాం. ఇలా పేలు చూసుకుంటూ జుత్తు దువ్వుకుంటున్నాం...’’ ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆడసింహం ఒక చూపు చూసింది. మగసింహం మియ్యావ్ అంది. ‘‘అదేంటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు. ‘‘పెళ్లి తరువాత ఎవడైనా పిల్లే’’ ఇంతలో బయట జనం గట్టిగా కేకలు పెట్టసాగారు. ‘‘బాబ్బాబూ, ట్రేలో తెస్తే తప్ప ఏదీ తినం మేము. మా పరువు తీయకుండా వళ్లిపో’’ అని బతిమలాడితే సుబ్బారావు మళ్లీ ఈదుకుంటూ బయటికి వచ్చాడు. టీవీల వాళ్ళంతా సుబ్బారావు పైకి సింహాల్లా దూకారు. ‘‘ఎందుకు చనిపోవాలనుకున్నావ్?’’ ‘‘పెళ్ళాం వేధిస్తూ వుంది’’ ‘‘ఎలాంటి వేధింపులు’’ ‘‘కుడివైపు తిరిగితే ఎడమ అంటుంది. లెఫ్ట్ తిరిగితే ముందుకి, ముందుకు తిరిగితే వెనక్కి నడవమంటుంది. వెనక్కి నడిస్తే గాల్లో ఎగరమంటుంది’’ ‘‘ఎడ్డెమంటే తెడ్డెమన్నమాట’’. ‘‘తెడ్డెం కాదు, తెడ్డు కట్టెతో బాదుతుంది’’ ‘‘తిరగబడకపోయావా?’’ ‘‘బడ్డాను. రెండుసార్లు ఎమర్జెన్సీ వార్డులో చేరాల్సి వచ్చింది.’’ ఇంతలో బడితెపూజ మహిళా సంఘం వాళ్ళు వచ్చారు. ‘‘దుర్మార్గుడా? భార్యల్ని భర్తలు వేధించడమే హిస్టరీ, భర్తల్ని భార్యలు వేధించడం మిస్టరీ. నువ్వే వేధిస్తున్నావని మీ ఆవిడ కంప్లయింట్ ఇచ్చింది. ఈ అవమానం భరించలేక తాను కూడా సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకుతానని పరిగెత్తుకుంటూ జూకి వెళ్ళింది’’ అన్నారు.సుబ్బారావు ఉలిక్కిపడి ‘‘రక్షించండి’’ అని అరిచాడు. ‘‘భార్యపైన అంత ప్రేమ ఉన్నవాడివి, ఎన్‌క్లోజర్‌లో ఎందుకు దూకావు’’ ‘‘నేను రక్షించమంటున్నది సింహాల్ని’’ - జి.ఆర్. మహర్షి -
ఘటికుని జ్ఞానోదయం
హ్యూమర్ ఫ్లస్ సుబ్బారావు ఒక వేదాంతి. జ్ఞానం ఉంటే డబ్బు అక్కర్లేదని ఆయన నమ్మకం. డబ్బుంటే జ్ఞానంతో పని లేదని వాళ్లావిడ నమ్మకం. పరస్పర విరుద్ధ నమ్మకాల సంఘర్షణల సమ్మేళనమే దాంపత్యం. ప్రకృతి సహజంగా ఆమె వేధించేసరికి సుబ్బారావు వేదాంతిగా మారాల్సి వచ్చింది. వేదాంతం యొక్క ప్రత్యేకత ఏమంటే అది మనల్ని అర్థం చేసుకోదు. మనకి అర్థం కాదు. ఒకరోజు డిక్షనరీలు అమ్మే కుర్రాడు సుబ్బారావు దగ్గరికి వచ్చాడు. దిండు కంటే దిట్టంగా ఉన్న డిక్షనరీని చూపించాడు. అన్ని పదాలకి అర్థాలు, అర్థవంతమైన అన్ని పదాలూ ఇందులో ఉన్నాయని చెప్పాడు. ‘‘ఈ ప్రపంచంలో దేనికీ అర్థం లేదు. మనం ఏదైతే అర్థమైందని అనుకుంటామో, దాని అర్థం అది కాకపోవచ్చు. అర్థం కానిదంతా అర్థశాస్త్రం. అర్థమైతే అది పరమార్థం. పురుషులు అర్థమవుతారు కాబట్టి పురుషార్థం అన్నారు. స్త్రీలు అర్థం కారు కాబట్టి స్త్రీ అర్థం లేకుండా పోయింది’’ అన్నాడు సుబ్బారావు తాపీగా. డిక్షనరీల కుర్రాడు బుర్ర గోక్కుని ‘‘సార్.. ఇందులో ప్రతి వర్డ్కీ..’’ అంటూ ఏదో చెప్పబోయాడు. ‘‘వర్డ్స్‌వర్త్ అనే కవి ఉన్నాడు కానీ, వర్డ్స్కి వర్త్ లేదు. అయినా పెళ్లయిన తర్వాత డిక్షనరీలతో పని లేదు. అంతా రియాక్షనీరినే’’ ‘‘దీనికి డిస్కౌంట్ కూడా ఉంది’’. ‘‘కౌంట్, డిస్కౌంట్, ఎకౌంట్, రీకౌంట్ అన్నీ ఒక్కలా కనిపించినా ఒక్కటి కావు. జాయింట్ ఎకౌంట్ ఉంటే జాయింట్స్ సేఫ్‌గా ఉంటాయి. మోకాళ్ల రీప్లేస్మెంట్ ఉండదు. మోకాళ్ల చిప్పల మార్పిడి ఎంత ఎక్కువగా జరిగితే సొసైటీకి అంత ఎక్కువ డేంజర్. ఎందుకంటే చాలామందికి మెదడు మోకాళ్లలో ఉంటుంది కాబట్టి’’. డిక్షనరీల కుర్రాడు ఘటికుడు. డిక్షనరీలు మోసి మోసి వాడు ఎక్స్ట్రార్డినరీగా మారాడు. ఎబిసిడిలు రాని వాళ్లకు కూడా డిక్షనరీలు అమ్మిన ఘనుడు. ‘‘డిక్షనరీల వల్ల జ్ఞానమొస్తుంది సార్’’ అని నోరు జారాడు. జ్ఞానం అనే పదం వింటే సుబ్బారావుకి పూనకం వస్తుంది. ‘‘డిక్షనరీల వల్ల డిసెంట్రీ, డిఫ్తీరియా, ధనుర్వాతం రావచ్చునేమో కానీ జ్ఞానం రాదు నాయనా. జ్ఞానమనేది దురద కాదు, హఠాత్తుగా వచ్చి గోక్కుంటే పోడానికి. మన శరీరంలో రక్తంలా అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మనం గాయపడితే కనిపిస్తుంది. జ్ఞానాన్ని కళ్ల చూడాలంటే ప్రతివాడూ గాయపడాలి. ఎర్రగా కనిపించేదంతా రక్తం కానట్టే, జ్ఞానంలా కనిపించేదంతా జ్ఞానం కాదు. అజ్ఞానానికి మారువేషాలెక్కువ’’. ‘‘మీరు జ్ఞానులని ఒప్పుకుంటాను సార్, కానీ ఎంత జ్ఞానికైనా అర్థం తెలియని పదాలుంటాయి. అందుకే ఈ డిక్షనరీ’’. ‘‘అయితే అభిటృక్యనేక్సియాన్టక్స్ అనే పదానికి అర్థం చెప్పు’’. ‘‘అరబ్ పదానికి అర్థం అడిగితే ఎలా?’’అన్నాడా కుర్రాడు జడుసుకుంటూ. ‘‘అది అరబిక్ అని నీకెలా తెలుసు?’’ ‘‘సౌండ్‌ని బట్టి ఊహించా’’. ‘‘అది అరబిక్ కాదు, మక్యావో భాష’’. ‘‘ఏ దేశంలో మాట్లాడుతారు సార్’’. ‘‘ఎక్కడా మాట్లాడరు. మాటలు రానివాళ్లు మాట్లాడతారు. మనకు తెలిసిందే భాష కాదు. చూసిందే వేషం కాదు’’. డిక్షనరీలు అమ్మకుండా వెళ్లడం ఆ కుర్రాడి డిక్షనరీలోనే లేదు. ఎన్నో జిడ్డు గిరాకీలను చూశాడు కానీ, ఆముదంలో ఈదడం ఇదే మొదటిసారి. ‘‘మీరు ఫిలాసఫరా సార్’’ అని పొగడ్డానికి ప్రయత్నించాడు. ‘‘ప్రతి సఫరర్ ఫిలాసఫర్ కాకపోవచు కానీ, ప్రతి ఫిలాసఫర్ సఫరరే’’. ‘‘మీలాంటి వాళ్ల కోసమే ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సార్’’. ‘‘ఆక్స్ అంటే ఎద్దు. ఎద్దు.. చాకిరీ చేసే జంతువు. బానిస. స్లేవరీ పేరుతో ఉండే డిక్షనరీలు నేను కొనను’’ ‘‘మీకు కొనడం ఇష్టం లేదు. అందుకే ఈ జ్ఞానబోధ’’ ‘‘కొనుగోళ్లు, అమ్మకాలు మన ఇష్టాల ప్రకారం జరగవు. మనల్ని మనం అమ్ముకుంటేనే, మనకు కావాల్సినవి కొనగలం. వ్యాపారమైనా, కోళ్ల ఫారమైనా కంపు లేకుండా నడవదు. వాదం, వేదం, నిర్వేదం చివరికంతా జూదం. వెళ్లకపోతే నీకు ప్రమాదం’’. కుర్రాడు పారిపోతూ సుబ్బారావు ఇంటికి ‘నో ఎంట్రీ’ బోర్డు తగిలించి వెళ్లాడు. - జి.ఆర్.మహర్షి -
బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరి పరిస్థితి విషమం
గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ వద్ద సోమవారం మధ్యాహ్నం బైక్‌పైకి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నడిగడ్డ గ్రామానికి చెందిన పాలడుగు వెంకట సుబ్బారావు (47), పావుల కాశయ్య (35)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చామవరంలో సోమవారం ఉదయం కుటుంబ కలహాలతో దంపతులు ప్రాణాలు తీసింది. గ్రామానికి చెందిన మేడిశెట్టి సుబ్బారావు(40), వెంకటలక్ష్మి(35) సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటలక్ష్మి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకోగా, సుబ్బారావు పురుగుల మందు తాగి సమీపంలోని పంట కాలువ వద్ద మృతిచెందాడు. సుబాఆబరావు తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇరుగుపొరుగువారి ఫిర్యాదు మేరకు తుని పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
బాలికపై టీనేజర్ అత్యాచారం
ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఓ టీనేజర్ అత్యాచారం చేశాడు. నెల్లూరు నగరంలోని వెంగళరావు నగర్లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి మందుల షాపు దగ్గరకు వెళ్లగా... ఐదో తరగతి చదువుతున్న బాలిక ఒక్కతే ఇంట్లో ఉంది. అది గమనించిన అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం జరిపాడు. ఇంటికి తిరిగొచ్చిన తల్లి విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు సీఐ పి.సుబ్బారావు తెలిపారు. -
పోలీస్‌స్టేషన్ ఎదుట ఉద్రిక్తత
ఓ చోరీ కేసులో అనుమానితుడిగా ఉన్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేయడంతో.. అతని పరిస్థితి విషమంగా ఉంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు మర్మాంగాలపై బూటు కాళ్లతో తన్నడంతో.. యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతన్ని జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాదితుని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అమాయకుడిని పట్టకొని చితక బాదిన సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చే శారు. ఓ సందర్భంలో పోలీసులకు బాధితులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం పట్టణంలోని ఓ డాక్టర్ ఇంట్లో జరిగిన దొంగతనం విషయంలో సైదా అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో నలుగురు కానిస్టేబుల్స్‌తో కలిసి సైదాను తీవ్రంగా హింసించడంతో పాటు మర్మాంగం పై బూటు కాళ్లతో తన్నడంతో.. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గుర్తించిన అతని కుంటుంబ సభ్యులు గుంటూరు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. -
షార్ట్‌సర్క్యూట్ - నాలుగు ఇళ్లు దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణ శివారులోని ఈదరపల్లిలో శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు ఇళ్లు దగ్ధమయ్యాయి. బండి సత్యనారాయణ, బండారు సుబ్బారావు, మాసగిరి కుమారి, కళింగరాజు విశ్వనాథంకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. యితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు చెలరేగిన వెంటనే ఇళ్లలో నిద్రిస్తున్న వారంద రూ సురక్షితంగా బయటికి వచ్చారు. ఇళ్లలో ఉన్న వస్తువులు, తిండిగింజలు, దుస్తులు అన్నీ కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అమలాపురం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సర్వం కోస్పోయిన తమను ప్రభుత్వం తమను ఆదికోవాలని బాధితులు కోరుతున్నారు. -
ధైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్నా
సుబ్బారావు తండ్రిని ఫోన్లో పరామర్శించిన జగన్ ధైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్నా.. రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు యత్నించిన చావలి సుబ్బారావు తండ్రి సత్యవర్థనరావును వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం ఫోన్లో పరామర్శించారు. బొప్పన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును చూడటానికి వచ్చిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఫోన్లో వైఎస్ జగన్‌కు సుబ్బారావు విషయం తెలియపర్చగా వెంటనే స్పందించి సుబ్బారావు తండ్రితో మాట్లాడి ఓదార్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. హోదా వచ్చే వరకు తన పోరాటం ఆగదన్నారు. రాష్ట్ర ప్రజలు ధైర్యాన్ని కోల్పోయి తొందరపాటు చర్యలకు దిగవద్దన్నారు. త్వరలో తాను వచ్చి సుబ్బారావును చూస్తానని ఓదార్చారు. ప్రాణత్యాగానికి సిద్ధపడిన సుబ్బారావు కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
పెన్నూ, గన్నయి పేలిన సుబ్బారావు పాణిగ్రాహి
‘దిక్కుమొక్కు లేని జనం ఒక్కొ క్కరు అగ్నికణం.. సింహకంఠ నాదంతో వస్తారిక కాచుకోండి’ అంటూ తన పాటల్ని విప్లవ రాజ కీయాలతో జోడించిన ప్రజా కవి సుబ్బారావు పాణిగ్రాహి. 1934 సెప్టెంబర్ 8న శ్రీకా కుళం జిల్లా బారువాలో ఒక పూజారి కుటుం బంలో జన్మించాడు. బొడ్డపాడు గ్రామానికి పూజారిగా వచ్చాడు. తామాడ గణపతి, పంచాది క్రిష్ణమూర్తితో కలసి యువకులను ఉద్యమాల్లోకి తెచ్చాడు. తెగింపు సంఘాన్ని పెట్టి ఎందరో యువకులను శ్రీకాకుళ పోరాటంలోకి తీసుకొచ్చాడు. ప్రజల కష్టాలపై ఎన్నో పాటలను, గేయాలను, నాటికలను రాశాడు. ‘ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం’, ‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’ వంటి ఆయన రాసిన పాటలు శాశ్వతంగా నిలిచి పోయాయి. తామాడ చినబాబుతో కలిసి ఆయన చెప్పిన జముకుల కథ ప్రజలను ఉర్రూతలూపింది. ఆయన రాసిన ‘ఓ అరుణ పతాకమా, చేగొనుమా రెడ్ శాల్యూట్’ అనే పాట విప్లవకారులు నిత్యం జెండా వందన వేళ పాడుకునే విప్లవగీతం అయింది. శ్రీకాకుళ గిరిజనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొ న్నాడు. చాగంటి భాస్కరరావు, తామాడ గణపతి అమరత్వం తర్వాత సోంపేట ఏరియా పార్టీ కార్యద ర్శిగా పాణిగ్రాహిని ఎన్నుకున్నారు. అనతి కాలంలో నే అంటే, 1969 డిసెంబర్ 22న పాణిగ్రాహిని రంగమటియ కొండల్లో కాల్చి చంపారు. ఆయన జీవించింది 36 ఏళ్లు మాత్రమే. ప్రజాకళలకు జీవం పోసి వాటిని రాజకీయాలతో జోడించి ఉద్యమ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. గిరిజనులను నిర్వాసితుల ను చేస్తూ, ప్రజాకళల పోషణ పేరుతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ సంస్థల ద్విముఖ దాడిపై కళాకా రులు నేడు ఉద్యమించాలి.. పాణిగ్రాహి లాగా వారి విముక్తి కోసం పనిచేయాల్సిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది. అందుకే పాణిగ్రాహిని స్మరించుకుందాం. (నేడు సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతి) సి.వెంకటేశ్వర్లు సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ -
వీఐపీ రిపోర్టర్ : రామ చంద్రాపురం ఆర్డీఓ సుబ్బారావు
-
మాసూళ్లయినా..మోపెడు కష్టాలే
పంటను అమ్ముదామంటే.. మద్దతు, గిట్టుబాటు ధరల మాటటుంచి కొనే దిక్కే లేదు. సర్కారీ కొనుగోలు కేంద్రాలున్నా ఉపయోగం శూన్యం. ఖరీఫ్ మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ అన్నదాతల అవస్థలను ‘వీఐపీ రిపోర్టర్’ ద్వారా వెలుగులోకి తేవాలన్న ‘సాక్షి’ ఆలోచనను రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు ఆమోదించారు. శనివారం కె.గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన చేసిన ‘వీఐపీ రిపోర్టింగ్’ విశేషాలివి.. రైతుల మేలు, మేలుకొలుపులకు కృషి చేస్తా...రైతులతో ముఖాముఖి మాట్లాడటం వల్ల క్షేత్రస్థాయిలో మద్దతు ధర, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో సాధకబాధకాల వంటి సమస్యలు తెలుసుకున్నాను. వారికి వ్యవసాయశాఖాధికారులు సరైన అవగాహన కల్పించడం లేదని తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, చేస్తున్న సూచనలు ైరె తుల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. పొలంబడిలో రైతులను చైతన్యం చేయాల్సి ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ప్రతి పథకాన్నీ రైతులుసద్వినియోగం చేసుకునేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులువినియోగించుకుని మంచి ధర పొందేలా అన్ని స్థాయిల్లో అధికారులకు స్వయంగా తెలియచేస్తాను రిపోర్టర్ కె. సుబ్బారావు,ఆర్టీఓ,రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు : బాబూ నీ పేరేంటయ్యా...? రైతు : పర్వతిని సత్యన్నారాయణండీ.... ఆర్డీఓ : ఏంటీ వ్యవసాయం ఎలా ఉంది? ఎన్ని ఎకరాలు చేస్తున్నావు? తొలకరికి ఎంత పండించావు? రైతు : ఏటా బాడి పిసుక్కుని పంట పండిస్తున్నా తగిన డబ్బులు రావటంలేదు. ఈసారి 11 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఆర్డీఓ : 75 కేజీల బస్తా రేటు ఎంత ఉంది? రైతు : నెమ్ము 18 శాతం దాకా వస్తంటే మిల్లోళ్లు 15 శాతం ఉంటే గానీ కొనమంటున్నారు. ఇప్పటి దాకా ఊళ్లో గింజ కూడా కొనలేదండీ. ఆర్డీఓ : కూలీ డబ్బులు ఎలా ఇస్తున్నారు? రైతు: కుప్ప నూరుత్తున్నానాండీ.. సందేలకి కూలీలకి రూ.15 వేలు దాకా ఇయ్యాల. అక్కడో పదేలు, ఇక్కడో పదేలు తెత్తాను. ఆనక దాన్యం అమ్మాక సావుకారికి తీర్చాలంతే... ఆర్డీఓ : నీపేరేంటయ్యా? రైతు : తాడాల ఏడుకొండలండి. మూడెకరాలు ఏసి, పుత్తు పూస తాకట్టెట్టి పెట్టుబడి ఎట్టానండి. ఆ డబ్బులొత్తాయో లేదో తెలత్తాలేదండీ...? ఆర్డీఓ : తాతా నీ పేరేంటి? కూలి రేట్లు ఎలా ఉన్నాయి? రైతు : కొరమాటి సుబ్బారావండీ. వుప్పుడు సీజన్ కదాండీ మగాళ్లకు రూ.600 నుంచి రూ.700వరకు ఉంది బాబూ. ఆర్డీఓ : నీ పేరేంటి బాబూ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల గురించి తెలుసా? రైతు : దంగేటి సుర్యనారాయణండీ. మాకు పెబుత్వం పెట్టిన వాటి కాడికి దాన్యాన్ని పట్టికెళ్లటం చేనా కట్టం బాబూ. ఆర్డీఓ : నీ పేరేంటయ్యా? ప్రభుత్వ సహకారం అందుతోందా? రైతు : అల్లూరి వీరవెంకట సత్యన్నారాయణండీ. ఏం పెబుత్వమండీ బాబూ.. సీజన్ అయిపోయినాక అప్పులు ఇత్తే ఏటి లాభం? ఆర్డీఓ : నీ పేరేంటి పెద్దయ్యా? నీవెంత చేను పండిస్తున్నావు? కీ ఇబ్బందులేంటి? రైతు : బోడపాటి అర్జునరావయ్యా. గింజలకు సరైన ధర అందటంలేదు. ఆర్డీఓ : కొనుగోలు కేంద్రాలున్నాయిగా? రైతు : ఆళ్లేమో 15 నెమ్ముండాలంటారు బాబూ. ఇయ్యేమో 18 నెమ్ముంటున్నాయి. ఆర్డీఓ : నీ పేరేంటయ్యా? వెదజల్లే విధానం పాటిస్తున్నారా? రైతు : పర్వతిని సత్యన్నారాయణ సార్! 20 ఏళ్ల క్రితమే ఎదజల్లేనండీ. ఎద సాగు బానే ఉంటంది. ఈ ప్రాంతంలో రైతులు ఈ పద్దతే ఎక్కువగా రెండో పంటలో వేత్తున్నారు. ఆర్డీఓ : శ్రీవరి సాగు మీకు తెలుసా? వ్యవసాయాధికారులు ఏమైనా సూచనలిస్తున్నారా? రైతు : శ్రీవరి సాగు బానే ఉంటుంది గాని సారూ.. పెట్టుబడి ఎక్కువ. వ్యవసాయాధికారులు మా దగ్గరకు రారు సారూ! ఆర్డీఓ : నీ పేరేంటి? మీకు రుణాలు ఏమైనా ఇస్తున్నారా? పెట్టుబడులు ఎలా పెడుతున్నారు? రైతు : సత్యసాయి వెంకటరమణండీ. డిగ్రీ చదివి వ్యవసాయం చేస్తున్నా..అంత లాభసాటిగా లేదండి. ఆర్డీఓ : చదువుకున్నావు కదా.. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తున్నావా? రైతు : వ్యవసాయాధికారులు ఎప్పుడు మీటింగులు పెడుతున్నారో తెలియటం లేదు. ఆర్డీఓ : సేంద్రియ పద్ధతుల్ని ఎందుకు ఎంచుకోవటంలేదు? పొలంబడికి వెళుతున్నారా? రైతు: ఈ ప్రాంత రైతులకు దీనిపై ఇంకా అవగాహన లేదు. పొలంబడి ఎక్కడో ఒక చోట పెట్టి, అధికారులు వచ్చి వెళుతున్నారు తప్ప ఉపయోగంలేదు. ఆర్డీఓ : మీపేరేంటండీ? మీరెంత వ్యవసాయం చేస్తున్నారు? మీ ఇబ్బందులేంటి? రైతు : జానకిరామయ్యండీ. మూడెకరాలు చేస్తున్నాను. 80 బస్తాల వరకు పండినా కూలీలకే రూ.54 వేలు ఖర్చయ్యింది. ఆర్డీఓ : ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ఎందుకు వినియోగించుకోవటం లేదు? రైతు : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు మాకు ఖర్చవుతుంది. అదే మిల్లర్లయితే ఆ ఖర్చు వారే భరించి తీసుకెళతారండీ. ఆర్డీఓ : నీ పేరేమిటయ్యా? మద్దతు ధర లభిస్తోందా? రూ.1020, రూ.1060 వస్తున్నాయా? రైతు : నరసింహ మూర్తి అండీ. పెట్టుబడులు వస్తే చాలు.. గిట్టుబాటు ఎక్కడ వస్తుంది సారూ. అమ్ముదామంటే కొనేవాడే కనిపించడం లేదండీ. రూ.980, రూ.990 అంటున్నారు. అదీ 17 శాతం నెమ్ములున్నాయంటే ప్రతి ఒక్కశాతానికి కేజీ కటింగ్ పెడుతున్నారండీ. ఆర్డీఓ : నేనూ రైతు బిడ్డనే. మీ ఇబ్బందులన్నీ అర్థమయ్యాయి. అధికారులకు చెప్పి కొనుగోలు కేంద్రాలపై మీకు తెలియచేసే ఏర్పాటుచేస్తా. వ్యవసాయాధికారులు మీ దగ్గరకు వచ్చేలా ఆదేశాలు జారీచేస్తాను. సరే వెళ్లి రమ్మంటారా. రైతులు : మంచిది సారూ.. ప్రజెంటర్స్: - లక్కింశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన శ్రీనివాస్ ఫోటోలు : గరగ ప్రసాద్ -
కార్పొరేట్‌కు దీటుగా ‘ఆదర్శ’ విద్య
కర్నూలు(ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామని రాష్ట్రీయ మాధ్యమిక, శిక్షాభియాన్ డీఓ సుబ్బారావు అన్నారు. మంగళవారం 16 మండలాల్లోని మోడల్ స్కూల్‌కు ఎంపిక నిర్వహించగా బుధవారం మరో 16 మండ లాల్లో విద్యార్థుల ఎంపిక పూర్తి చేశారు. పెద్దపాడు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగింది. ఉదయం డోన్, గోస్పాడు, కొలిమిగుండ్ల, కృష్ణగిరి, అవుకు, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, బండి ఆత్మకూరు, జూపాడుబంగ్లా, శ్రీశైలం మండలాలకు లాటరీ నిర్వహించారు. ప్రతి మండలానికి 80 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేశారు. మధ్యాహ్నం గడివేముల, పాములపాడు, పాణ్యం, రుద్రవరం, శిరివెళ్ల, వెలుగోడు మండలాలకు ఎంపిక ప్రక్రియ జరిగింది. కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం ఆర్‌ఎంఎస్‌ఏ డీఓ సుబ్బారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మోడల్ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లలో పోటీ పడతాయని తెలిపారు. మోడల్ స్కూళ్లలో సమస్యలు తీర్చని అధికారులు మోడల్ స్కూళ్లకు విద్యార్థులను ఎంపిక చేస్తున్న అధికార యంత్రాంగం వాటిలో వసతులు, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఆదర్శ స్కూళ్లపై విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో మొత్తం 32 స్కూళ్లుండగా ఒక్క స్కూలుకు కూడా హాస్టల్ సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు నిత్యం ఇంటి నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంది. అయితే ఏ పాటశాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ స్కూలుకు ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో భద్రత కొరవడింది. కార్పొరేట్ విద్యను అందిస్తామని చెబుతన్న అధికారులు ఏ స్కూల్లో కూడా కంప్యూటర్లను ఏర్పాటు చేయలేదు. తాగునీటి వసతిని కల్పించలేదు. -
ఏజెన్సీ దేశం అథోగతి!
నిలువునా చీలిపోయిన శ్రేణులు పోటాపోటీగా సమావేశాలు సోమ బుజ్జగింపులకు ససేమిరా అధిష్టానం నిర్ణయంపై రగిలిపోతున్న తమ్ముళ్లు హుకుంపేట, న్యూస్‌లైన్: ఏజెన్సీలో తెలుగుదేశంపార్టీ పరిస్థితి బాగోలేదు. అరకు నియోజక వర్గంలో శ్రేణులు నిట్టనిలువునా చీలిపోయాయి. పాడేరును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఎన్నడూ లేనివిధంగా శివాలెత్తిపోతున్నారు. ఇక్కడ టీడీపీ నేతలు ప్రసాద్,సుబ్బారావుల్లో ఒకరు దారికివచ్చినా సుబ్బారావు తిరుగుబాటుదారుడిగానే మిగిలిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి లోకులగాంధీకి ముచ్చెమటలు పడుతున్నాయి. అరకులోయలో ఒకే పార్టీలో ఇద్దరికి బి-ఫారాలు ఇవ్వడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ రెబల్‌గా నామినేషన్ వేసిన కుంబా రవిబాబును బరిలో కొనసాగించి తాడోపేడో తేల్చుకోవడానికి సి ద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలతో హుకుంపేట మండలం కొంతలిలో మంగళవారం భారీ సమావేశం ఏర్పాటు చేశా రు. అంతకు ముందు ఆయా మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులతో భవిష్యత్ కార్యక్రమంపై రవిబా బు చర్చించారు. పోటీలో నిలిచి అధిష్టానానికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సమావేశంలో వివిధ నాయకుల ప్రసంగాలూ దీనినే ప్రస్పుటం చేశాయి. ఆ సమావేశానికి పోటీగా అదే సమయంలో హు కుంపేటలో టీడీపీ అభ్యర్థి సీవేరి సోమ మరో సమావేశం నిర్వహించారు. దీంతో నియోజవర్గంలోని ఆ పార్టీ కార్యకర్తలు చెరిసగంగా చీలిపోయినట్టయింది. ఇంతకాలం అం తర్గతంగా ఉన్న పార్టీలోని విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. రవిబాబును బుజ్జగించేందుకు అధిష్టానం సోమవారం చేపట్టిన ప్రయత్నమూ విఫలమైంది. ఆయనను కలిసేందుకు వచ్చిన జిల్లా నాయకుడు లాలం భాస్కరరావుకు చేదు అనుభవం ఎదురయింది. రవిబాబు మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది జరిగి న మరునాడే నియోజకవర్గం టీడీపీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. సగానికిపైగా టీడీపీ నాయకులు రవిబా బు వద్దకు వెళ్లిపోయారు. హుకుంపేట మండలానికి చెంది న బాకూరు వెంకటరమణరాజు, కంబిడి రాంబాబు, మజ్జిరత్నాలమ్మ, సూర్యకాంతం, మామిడి కాంతమ్మ, సుమన్, దొరలతో పాటు పలువురు నాయకులు రవిబాబుకు మద్ద తు పలుకుతూ ఆయన వెంట వెళ్లగా శెట్టి లక్ష్మణుడు, పాడి బాలన్న, పొండోయి లక్ష్మయ్య, సుర్రా వెంకటరావు, బురి డి సాంబ, గాసన్నలు టీడీపీ అభ్యర్థి సీవేరి సోమ వెంట నడిచేందుకు సిద్ధపడ్డారు. కాగా రవిబాబు వర్గం నాయకులను బుజ్జగించేందుకు మంగళవారం అభ్యర్థి సోమ మం డల కేంద్రం డుంబ్రిగుడ వచ్చారు. ఇరు వర్గాల మధ్య సు మారు గంటపాటు ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకొంది. అధిష్టానం సస్పెండ్ చేసినా పార్టీ అభ్యర్థికి సహకరించేది లేదంటూ పలువురు తెగేసి చెప్పడంతో సోమ నిరాశతో వెనుతిరిగారు. ఈ పరిణామం నియోజకవర్గంలో పార్టీకి తీరని లోటని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రేస్ ఖాళీ అరకు రూరల్ : అరకు అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రేస్ పార్టీ ఖాళీ అయిపోతోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు నామమాత్రం. అలాగే ఆ పార్టీలో ఉంటే భవిష్యత్ లేదనో ఆ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అరకులోయ మండల కాంగ్రేస్ అధ్యక్షునిగా పనిచేసిన శెట్టి వెంకటరావు, రెండుసార్లు ఎంపీటీసీగా వ్యవహరించిన బూర్జ సుందర్రావు,పెదలబుడు ఒకటో సెగ్మెంట్ మాజీ ఎంపీటీసీ శెట్టి బుట్టి ఇటీవల కిడారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కొత్తూరు సర్పంచ్‌గా గెలిచిన దుడ్డు సోములు, డుంబ్రిగుడ జెడ్పీటీసీగా పోటీ చేసిన చినబాబు కిడారి వర్గంలో చేరారు. -
అధికారులకు బదిలీల ఫోబియా...
అనివార్యమే... అయినా అనువైన చోటుకోసం యత్నం ఎన్నికలయ్యాక మళ్లీ వచ్చేందుకు ముందస్తు ఒప్పందం! మూణాళ్ల ముచ్చటగా జెడ్పీ సీఈవో పోస్టు సాక్షి, మచిలీపట్నం : ఎన్నికల నేపథ్యంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ అనివార్యమైంది. ఇదే సమయంలో జిల్లాను వదిలి వెళ్లలేక.. నిబంధనలను కాదని ఇక్కడే ఉండలేక వారు మధనపడుతున్నారు. గత్యంతరంలేని స్థితిలో ఎన్నికల తంతు ముగిశాక మళ్లీ జిల్లాకు వద్దామనుకునే లోపాయికారీ ఒప్పందాలతో వారు బదిలీకి సిద్ధపడుతున్నారు. ఇదే సమయంలో తమకు పొరుగు జిల్లాల్లోనూ పదిలమైన చోటు కోసం అన్వేషణ మొదలెట్టారు. ఎన్నికల బదిలీని తమకు అనుకూలమైన ప్రాంతానికి చేసుకునేలా రాజధాని స్థాయిలో కొందరు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఏఎస్వో పద్మ బదిలీని నిలుపుదల చేసేందుకు ఒక కీలక అధికారి పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అనేక వివాదాల నడుమ జెడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు పరిస్థితి మూణ్ణాళ్ల ముచ్చటగానే మారిపోవడం గమనార్హం. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలో మూడేళ్లు నిండిన ఉద్యోగులు, సొంత జిల్లా ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో, తహ శీల్దార్, పోలీసుల బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తిచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో ఎన్నికల బదిలీలకు తెరలేచింది. కాగా, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తున్న కీలక అధికారులకు బదిలీ తప్పనిసరి అయ్యింది. దీంతో నందిగామ, మైలవరం, అవనిగడ్డ, తిరువూరు, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తున్న డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్, జడ్పీ సీఈవో బి.సుబ్బారావు, ఉడా భూసేకరణ విభాగాధికారిణి మనోరమా, పోలవరం ప్రొజెక్టు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఝాన్సీలక్ష్మి, డీఆర్డీఏ ఏపీడీ విజయకుమారిని బదిలీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వీరంతా మూడున్నరేళ్లకుపైగా ఇక్కడే ఉండటం, అందులోనూ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిండంతో బదిలీ అనివార్యమైంది. దీంతో పొరుగున్న ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తమకు అనుకూలమైన చోటు కోసం వారి స్థాయిల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కుర్చీలాటలో సుబ్బారావు గెలిచినా.... జెడ్పీలో జరిగిన కూర్చీలాటలో గెలిచి సీఈవో కుర్చీని అధిరోహించిన బి.సుబ్బారావు మూడు నెలలు తిరగకుండానే బదిలీకావడం చర్చనీయాంశమైంది. అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో నూజివీడు ఆర్డీవోగా పనిచేసిన సుబ్బారావు గత ఏడాది నవంబర్ 19న జెడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే జెడ్పీ సీఈవో, డెప్యూటీ సీఈవో పోస్టుల భర్తీ నిబందనలకు విరుద్దంగా జరిగిందని ఇద్దరు ఉద్యోగులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించిన సంగతి తెల్సిందే. సుబ్బారావు నియామకం చెల్లదని ట్రిబ్యూనల్ తీర్పు వస్తుందని ప్రతివాదులు ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన ఇలా బదిలీ అయ్యారు. సీఈవోగా మూడు నెలల వ్యవధిలోనే ఆయనపై ఇలా బదిలీవేటు పడటంతో కుర్చీలాటలో గెలిచినా ఓడినట్టే అయ్యింది. పద్మ బదిలీ కాకుండా కీలక అధికారి ప్రయత్నాలు... జిల్లాలోని సివిల్ సప్లైస్ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారిణి బదిలీ చర్చనీయాంశమైంది. విజయవాడలో ఏఎస్వో-1(రూరల్)గా పనిచేస్తున్న కోమలి పద్మ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. దీంతో ఆమెకు బదిలీ అనివార్యమని అధికారులు నిర్ధారించారు. ఇదే సమయంలో ఆమె బదిలీని నిలుపుదల చేసేందుకు కుటుంబ సన్నిహితుడు, కీలక అధికారి ఉన్నతస్థాయిలో వత్తిడి తెచ్చినట్టు సమాచారం. కోమలి పద్మకు శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయినట్టు చెబుతున్నారు. ఆ బదిలీని నిలుపుదల చేసేలా ఉన్నతస్థాయి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
మరిచిపోలేని ప్రయత్నం...పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
బీఆర్ పంతులు అంటే లబ్ద ప్రతిష్టుడైన దర్శక నిర్మాత. పద్మినీ పిక్చర్స్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున సినిమాలు తీశారు. ఆయన తెలుగువాడే. పూర్తి పేరు రామకృష్ణయ్య పంతులు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తీసిన బాలల చిత్రం ‘పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం’. 1960 జూన్ 25న విడుదలైన ఈ చిత్రానికి డీవీ నరసరాజు (సంభాషణలు), దాదా మిరాసి (కథ), సముద్రాల, కొసరాజు (పాటలు), టీజీ లింగప్ప (సంగీతం), డబ్ల్యు.ఆర్. సుబ్బారావు (ఛాయాగ్రహణం)లాంటి హేమాహేమీలు పనిచేశారు. సినిమాకు టైటిల్ పెట్టింది కొసరాజు. తమిళ అగ్రనటుడు శివాజీ గణేశన్ ఇందులో అతిథిగా కనిపిస్తారు. మిక్కిలినేని, రాజనాల, రమణారెడ్డి, బి.ఆర్. పంతులు, బేబీ లక్ష్మి, బేబీ సుమ, బేబీ విమల, మాస్టర్ గోపి, మాస్టర్ వెంకటేశం తదితరులు నటించారు. అంజిబాబు (పాతాళభైరవి) ప్రధానపాత్ర పోషించారు. ఓ చిన్న పాత్రలో చిడతల అప్పారావు తళుక్కున మెరుస్తారు. అలాగే బాపు సినిమాలో ఎక్కువగా కనిపించే ఝాన్సీ కూడా చిన్న పాత్ర చేశారు.సినిమా కథ విషయానికొస్తే... గుణసేనుడనే రాజు రాచరిక వ్యవస్థను అంతం చేసి ప్రజారాజ్యాన్ని స్థాపించాలనుకుంటాడు. ఇది నచ్చక మహామంత్రి, సేనాధిపతి తదితరులు కుట్రపన్ని రాజు ఉన్న వేదికను పేల్చేస్తారు. దాంతో మహామంత్రి ఆ రాజ్యానికి రాజవుతాడు. కానీ గుణసేనుడు ఆ ప్రమాదం నుంచి బయటపడి భార్యతో సహా పాతాళానికి చేరతాడు. ముని శాపం వల్ల రాజు మామిడి చెట్టు అయిపోతాడు. రాణి, విజయసేనుడికి జన్మనిస్తుంది. చిన్నతనం నుంచే అతను విప్లవ నాయకుడుగా ఎదుగుతాడు. ఎక్కడ అన్యాయం జరిగినా పిల్లలందర్నీ కూడగట్టుకుని ఎదిరిస్తాడు. విజయసేనుడికి యువరాణితో స్నేహం ఏర్పడుతుంది. వీరంతా కలిసి రాజుపై తిరుగుబాటు చేస్తారు. అందరిలో మార్పు తీసుకువచ్చి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ చిత్రంలోని తారల నటన, మేకప్ చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. రాజనాల నటన చాలా వింతగా తోస్తుంది. హాస్యం చాలా సుకుమారంగా ఉంటుంది. కొరియోగ్రఫీ అత్యద్భుతంగా చేశారు. ముఖ్యంగా బాలతారల నటన అద్భుతం. అక్షరాలను స్పష్టంగా పలకడం, ఐదు నిముషాల పాటు సింగిల్ టేక్‌లో డైలాగులు చెప్పడం ఈ బాలల ప్రతిభకు నిదర్శనం. సుమారు వందమందికి పైగా పిల్లలు ఇందులో నటించారు. మళ్లీ మళ్లీ ఇటువంటి చిత్రాన్ని తీయలేరేమోనన్నంత చక్కటి ప్రయత్నమిది. ఇటువంటి చిత్రాలు మరిన్ని వస్తే బాగుండుననిపిస్తుంది. కానీ మళ్లీ మళ్లీ రావు. - డా.వైజయంతి -
కుర్చీలాటలో పై‘చేయి’ ఎవరిదో?
=జిల్లా పరిషత్ సీఈవో పోస్టుకోసం పైరవీలు =సీఈవో, డిప్యూటీ సీఈవోలుగా ఇద్దరి నియామకం =వేరే ఇద్దరికి అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు =సుబ్బారావుకు మంత్రి అండ ! సాక్షి, మచిలీపట్నం : నిత్యం ప్రజాసమస్యల పరిష్కారంలో తలమునకలయ్యే జిల్లాప్రజాపరిషత్ కార్యాలయం ఇప్పుడు వివాదాలకు వేదికైంది. కార్యాలయ పరిపాలనాపరమైన అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈవో), డిప్యూటీ సీఈవో పోస్టుల నియామకం వివాదాస్పదంగా మారింది. కీలకమైన ఈ పోస్టుల్లో ఇద్దరిని నియమించిన ఉన్నతాధికారులు తమ పని అయిందనిపించారు. ఇంతలోనే వేరే ఇద్దరికి ట్రిబ్యునల్ అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ వివాదం ముదురుపాకాన పడింది. వీరితో నిమిత్తం లేకుండా ఇదే జిల్లాలో ఆర్డీవోగా పనిచేసిన ఉద్యోగి ఒకరు రాజకీయ అండతో తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వెరసి జెడ్పీ సీఈవో పోస్టు కోసం సాగుతున్న పైరవీలపై కొద్ది రోజులుగా రసవత్తర చర్చ జరుగుతోంది. జెడ్పీ సీఈవోగా పనిచేస్తున్న సీఎస్.కొండయ్యశాస్త్రికి బదిలీ రావడంతో సెప్టెంబర్ 1న రిలీవ్ అయ్యారు. దీంతో జెడ్పీ సీఈవోగా జిల్లా రెవెన్యూ ఆధికారి (డీఆర్వో) ఎల్.విజయ్‌చందర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అదే సమయంలో నందివాడ ఎంపీడీవోగా పనిచేసిన చింతా కళావతికి డిప్యూటీ సీఈవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే జిల్లాలోని సీనియర్ ఎంపీడీవోలకే సీఈవోగా బాధ్యతలు అప్పగించాలని, ఇతర శాఖలకు చెందిన వారికి ఆ బాధ్యతలు ఇవ్వడం సరికాదంటూ జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీవోలు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి బి.నాగిరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. పూర్తికాలపు సీఈవో లేకపోతే అర్హులైన ఎంపీడీవోలకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని వారు కోరారు. వారి వాదనతో ఏకీభవించిన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అవసరమైన చర్యలు చేపట్టారు. దీంతో డిప్యూటీ సీఈవోగా ఉన్న కళావతికి సీఈవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నం ఎంపీడీవో జి.వి.సూర్యనారాయణను డిప్యూటీ సీఈవోగా, ఎ.కొండూరు ఎంపీడీవో అనురాధకు జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 7న ఉత్తర్వులు జారీ చేశారు. అంత వరకు బాగానే ఉన్నా.. అదే సమయంలో తనకు సీఈవో పోస్టు ఇవ్వాలంటూ గతంలో నూజివీడు ఆర్డీవోగా పనిచేసి బదిలీ అయిన సుబ్బారావు తనకు అనుకూలంగా జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ప్రజాప్రతినిధులు ఉన్నారని సిఫారసు లేఖలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసుల నేపథ్యంలో సుబ్బారావును జిల్లాలో సీఈవోగా నియమించుకోవాలంటూ రెవెన్యూ శాఖ సూచిం చింది. దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి స్పందిస్తూ ఇతర శాఖలకు చెందిన వారికి జెడ్పీ సీఈవో ఇచ్చే అవకాశం లేదని, తమ శాఖకు చెందిన వారికే పదోన్నతి ఇచ్చి సీఈవోగా నియమించుకుంటామంటూ తేల్చి చెప్పారు. దీంతో సుబ్బారావు నియామకం నిలిచిపోయింది. ఇదే సమయంలో తాము సీనియర్లమని, జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు తమకే ఇవ్వాలంటూ 1999 బ్యాచ్ డెరైక్ట్ రిక్రూట్ ఎంపీడీవో క్యాడర్‌కు చెందిన ఇద్దరు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. గతంలో ఇన్చార్జి సీఈవో, డెప్యూటీ సీఈవోలుగా నియమించిన కళావతి, సూర్యనారాయణ కంటే తామే సీనియర్లమంటూ రాజీవ్ విద్యామిషన్ ఏవోగా పనిచేస్తున్న వి.జ్యోతిబసు, ఉయ్యూరు ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎం.కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో జ్యోతిబసు, కృష్ణమోహన్‌లకు సీఈవో, డెప్యూటీ సీఈవోలుగా ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలంటూ అక్టోబర్ 24న ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. ఆ ఆదేశాలను అమలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టుల కోసం కుర్చీలాట మరింత రసకందాయంలో పడింది. ముందు నియమించిన కళావతి, సూర్యనారాయణ ఇద్దరు తామే ఇన్చార్జులుగా కొనసాగేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇన్చార్జి బాధ్యతలు దక్కించుకునేందుకు జ్యోతిబసు, కృష్ణమోహన్ ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు సుబ్బారావు మరోమారు జెడ్పీ సీఈవో పోస్టు దక్కించుకునేందుకు ప్రయత్నాలు వేగిరం చేశారు. వీరిలో జెడ్పీ సీఈవో కుర్చీ ఎవరిని వరిస్తుందో కాలమే నిర్ణయించాలి. -
అంతే లేని కథ!
సుబ్బమ్మ, సుబ్బారావు దంపతులిద్దరికీ మతిమరుపు సమస్య. ఇద్దరూ కలిసి ఒక రోజు డాక్టర్ దగ్గరికి వెళ్లారు. తమ సమస్య గురించి చెప్పుకున్నారు. ‘‘ఏమీ లేదండీ సింపుల్. ఒక చిన్న నోట్ పాడ్ మీద చేయబోయే పనులు రాసుకోండి. ఇక మరచిపోవడం అనేది ఉండదు’’ అన్నారు డాక్టర్. ‘‘అలాగే’’ అన్నారు దంపతులు. మరుసటి రోజు... ‘‘సుబ్బు...వంటగదిలోకి వెళ్లి కాఫీ చేసి తీసుకురా. అలాగే బిస్కట్లు ఒక పళ్లెంలో తీసుకురా...మరిచిపోతావేమో’’ అన్నది సుబ్బమ్మ. ‘‘చిన్న చిన్న వాటికి కూడా రాసుకోవడం సిల్లీగా ఉంటుంది. ఆ మాత్రం జ్ఞాపకం పెట్టుకోలేనా’’ అంటూ వంటగదిలోకి వెళ్లాడు సుబ్బారావు. పది నిమిషాల తరువాత- ‘‘ఇదిగో నువ్వడిగిన పోపుల పెట్ట్టె. చీపురుకట్ట కూడా అడిగావు కదా... ఇదిగో తీసుకో’’ అంటూ ఇవ్వబోయాడు సుబ్బారావు. ‘‘నేను అడిగింది ఏమిటి? నువ్వు తెచ్చింది ఏమిటి? అందుకే నోట్ పాడ్ మీద రాసుకోమన్నాను’’ అన్నది సుబ్బమ్మ. ‘‘ఇంతకీ నువ్వు అడిగింది ఏమిటి?’’ ఆశ్చర్యపోయాడు సుబ్బారావు. ‘‘వేడి వేడిగా ఆమ్లెట్ వేసుకురమ్మన్నాను కదా’’ అన్నది సుబ్బమ్మ. ‘‘అవును కదా...’’ అంటూ వడివడిగా వెళుతున్న సుబ్బారావుతో- ‘‘నోట్పాడ్ మీద రాసుకో’’ అని సలహా ఇచ్చింది సుబ్బమ్మ. ‘‘ఈ మాత్రం దానికి కూడా రాయాలా?’’ అంటూ రాసుకోకుండానే వంటగదిలో అడుగుపెట్డాడు సుబ్బారావు. అయిదారు నిమిషాల తరువాత- ‘‘ఇదిగో నువ్వు అడిగిన చల్లటి మజ్జిగ’’ అన్నాడు. ‘‘నేనడిగింది ఏమిటి, నువ్వు తెచ్చింది ఏమిటి?’’ అన్నాడు సుబ్బారావు. ‘‘ఆవకాయ జాడీ తీసుకురమ్మంటే మజ్జిగ తీసుకువచ్చావేమిటి?’’ అని గద్దించింది సుబ్బమ్మ. ‘‘సారీ’’ అంటూ వంటగదిలోకి వెళ్లాడు సుబ్బారావు. గమనిక: సారీ... ఈసారి కూడా సుబ్బారావు నోట్పాడ్ మీద రాసుకోలేదు! -
లక్ష్యం ముందు ఓడిన పేదరికం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : వెంటాడుతున్న పేదరికాన్ని చూసి ఆ విద్యార్థి వెరవలేదు. తండ్రి లేని లోటును తెలియకుండా కష్టం తెలియకుండా పెంచి, పెద్దచేసిన చేసిన తల్లి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో సీఏ ఫైనల్స్‌కు సిద్ధమవుతున్నాడు. పేదరికం కారణంగా ఓ విద్యార్థి ప్రతిభ మరుగున పడిపోకూడదనే సదుద్దేశంతో ఉచిత విద్యను అందించి ప్రోత్సహించిన విద్యాసంస్థ నమ్మకాన్ని వమ్ముచేయకుండా జాతీయస్థాయిలో ప్రతిభను నిరూపించుకున్నాడు. నగరంలోని ఏటీ అగ్రహారం శివారు రామిరెడ్డినగర్‌కు చెందిన కోట సుబ్బారావు, సుభాషిణి దంపతులకు లీలా నాగకుమార్, అనూష ఇద్దరు సంతానం. ఇద్దరూ పదోతరగతి వరకు వేణుగోపాల్‌నగర్‌లోని నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలలో చదివారు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే భర్త సుబ్బారావు అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితం కావడంతో, తల్లి సుభాషిణి కష్టం చేసి పిల్లలను పెంచి, పెద్ద చేసింది. లీలానాగకుమార్ టెన్త్‌లో 535 మార్కులతో ఉత్థీర్ణత చెందాడు. టెన్త్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా మాస్టర్‌మైండ్స్‌లో సీటు సంపాదించాడు. విద్యార్థి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ అండగా నిలిచి ప్రోత్సహించారు. అహర్నిశలూ శ్రమించి సీనియర్ ఇంటర్లో వెయ్యికి 954 మార్కులతో ఉత్తీర్ణత చెందాడు. 2008-09 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి టాప్‌టెన్‌లో నిలిచాడు. ప్రతిభను గుర్తించిన మాస్టర్‌మైండ్స్ యాజమాన్యం సీఏ వరకూ ఉచిత విద్యను అందించేందుకు నిర్ణయించింది. అదే ఏడాది సీఏ-సీపీటీ రాసి అందులో అఖిల భారతస్థాయిలో 200 మార్కులకు 183 సంపాదించిన నాగకుమార్ ఒక్కమార్కు తేడాతో అఖిల భారతస్థాయి టాప్‌టెన్‌లో స్థానం పొందలేకపోయాడు. 2010లో ఐపీసీసీ పూర్తి చేసి, సీఏ ఇంటర్న్‌షిప్‌కు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో చెల్లెలు అనూష ఓ ఎయిడెడ్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేయగా, కుటుంబ పరిస్థితులు తెలిసిన మాస్టర్‌మైండ్స్ తమ సంస్థలోనే ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. కుటుంబ భారం మోస్తున్న తల్లికి చేదుడు వాదోడుగా నిలిచేందుకు నాగకుమార్ సైతం మూడేళ్ల ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వచ్చే ఆదాయాన్ని తల్లికి ఇచ్చి, మరోవైపు సీఏ ఫైనల్స్, ఐసీడబ్ల్యూఏకు సన్నద్ధమయ్యాడు. ఐసీడబ్ల్యుఏ విద్యలో భాగంగా 2012లో విడుదలైన సీఎంఏ (కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ) ఇంటర్, 2013 ఆగస్టులో విడుదలైన ఫైనల్ ఫలితాల్లో వరుసగా రెండు సార్లు అఖిలభారతస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. నవంబర్‌లో జరిగే సీఏ ఫైనల్స్‌కు సన్నద్ధమవుతున్నాడు. సీఏలో మూడేళ్ల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి సీఏ ఫైనల్స్‌కు సన్నద్ధం అవుతున్న సమయంలో 2011 నవంబర్‌లో తండ్రి చనిపోయారు. తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన సమయంలో సంస్థ యాజమాన్యం తనకు ఎంతో ధైర్యం చెప్పిందని విద్యార్థి చెబుతున్నాడు. వారి ప్రోత్సాహంతో సీఏగా ఎదగాలనే లక్ష్యంతో రోజుకు 14 గంటలు కష్టపడి చదువుతూ సీఏ, సీఎంఏ రెండింటి ఆధారంగా మంచి ఉద్యోగంలో చేరి కుటుంబానికి అండగా నిలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మానవతా ధృక్పదంతో సీటు ఇచ్చాం విద్యారిథ కుటుంబ పరిస్థితి తెలుసుకుని మానవతా ధృక్పదంతో సీటు ఇచ్చి, ఉచిత విద్యను అందిస్తున్నాం. ఇంటర్లో చేరిన సమయంలో అతనొక్కడినే అదుకుంటున్నామనుకున్నాం. కానీ తాము అతనితో పాటు కుటుంబాన్ని ఆదుకుంటున్నామని తెలిసింది. - మట్టుపల్లి మోహన్, డెరైక్టర్