కర్నూలు(ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామని రాష్ట్రీయ మాధ్యమిక, శిక్షాభియాన్ డీఓ సుబ్బారావు అన్నారు. మంగళవారం 16 మండలాల్లోని మోడల్ స్కూల్‌కు ఎంపిక నిర్వహించగా బుధవారం మరో 16 మండ లాల్లో విద్యార్థుల ఎంపిక పూర్తి చేశారు. పెద్దపాడు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఎంపిక ప్రక్రియ కొనసాగింది. ఉదయం డోన్, గోస్పాడు, కొలిమిగుండ్ల, కృష్ణగిరి, అవుకు, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, బండి ఆత్మకూరు, జూపాడుబంగ్లా, శ్రీశైలం మండలాలకు లాటరీ నిర్వహించారు. ప్రతి మండలానికి 80 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేశారు. మధ్యాహ్నం గడివేముల, పాములపాడు, పాణ్యం, రుద్రవరం, శిరివెళ్ల, వెలుగోడు మండలాలకు ఎంపిక ప్రక్రియ జరిగింది. కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం ఆర్‌ఎంఎస్‌ఏ డీఓ సుబ్బారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మోడల్ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లలో పోటీ పడతాయని తెలిపారు.
మోడల్ స్కూళ్లలో సమస్యలు తీర్చని అధికారులు
మోడల్ స్కూళ్లకు విద్యార్థులను ఎంపిక చేస్తున్న అధికార యంత్రాంగం వాటిలో వసతులు, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఆదర్శ స్కూళ్లపై విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో మొత్తం 32 స్కూళ్లుండగా ఒక్క స్కూలుకు కూడా హాస్టల్ సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు నిత్యం ఇంటి నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంది. అయితే ఏ పాటశాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ స్కూలుకు ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో భద్రత కొరవడింది. కార్పొరేట్ విద్యను అందిస్తామని చెబుతన్న అధికారులు ఏ స్కూల్లో కూడా కంప్యూటర్లను ఏర్పాటు చేయలేదు. తాగునీటి వసతిని
కల్పించలేదు.
కార్పొరేట్‌కు దీటుగా ‘ఆదర్శ’ విద్య
Published Thu, May 29 2014 1:04 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement