ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఓ టీనేజర్ అత్యాచారం చేశాడు. నెల్లూరు నగరంలోని వెంగళరావు నగర్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఓ టీనేజర్ అత్యాచారం చేశాడు. నెల్లూరు నగరంలోని వెంగళరావు నగర్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి మందుల షాపు దగ్గరకు వెళ్లగా... ఐదో తరగతి చదువుతున్న బాలిక ఒక్కతే ఇంట్లో ఉంది. అది గమనించిన అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం జరిపాడు. ఇంటికి తిరిగొచ్చిన తల్లి విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు సీఐ పి.సుబ్బారావు తెలిపారు.