![TDP internal Clashes Bursted out in Mylavaram Constituency - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/1/Bommasani-Subbarao.jpg.webp?itok=M4fK2hWG)
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దేవినేని లేకుండానే బొమ్మసాని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే దేవినేని నాయకత్వాన్ని బొమ్మసాని, అతని వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇదిలా ఉంటే, మైలవరంలో లోకల్ నినాదం కూడా రోజురోజుకి బలపడుతోంది. రాబోయే ఎన్నికల్లో ఈసారి స్థానికుడే టికెట్ ఇవ్వాలంటూ బొమ్మసాని వర్గం డిమాండ్ చేస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో బొమ్మసాని నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు ఆ వర్గం ప్రకటించింది. దీంతో మైలవరం టీడీపీలో కలవరం మొదలైంది.
చదవండి: (సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడుతున్న బాబు.. కంటి మీద కునుకు కరువే!)
Comments
Please login to add a commentAdd a comment