
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వన్ సెంటర్‌లో టీడీపీ నేతలు హైడ్రామా సృష్టించారు. దేవినేని ఉమా కార్యకర్తలతో కలిసి డ్రామా పాలిటిక్స్ నడిపారు. ప్రస్తుతం టీడీపీ ఆఫీస్ ఉన్న స్థలాన్ని చిన్నాకు అతని తల్లి శేషారత్నం గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చింది.
అయితే కుమారుడు తల్లిని పట్టించుకోవడంతో ఇప్పుడు కలెక్టర్ ద్వారా శేషారత్నం గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ స్థలంలో ఉన్న టీడీపీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని కోరింది. అయితే ఖాళీ చేసేదిలేదంటూ దేవినేని ఉమా ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
చదవండి: (ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!)
Comments
Please login to add a commentAdd a comment